సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన ఆరు అనుబంధ బ్యాంకుల చెక్‌బుక్‌లు ఇక నుంచి చెల్లవని ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవడానికి 31 డిసెంబరు 2017 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు 2017 సెప్టెంబరులో ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు తీరిపోవడంతో, ఇక వీటి చెక్ బుక్ చెల్లవని ప్రకటించేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లు 2017 ఏప్రిల్ 1న ఎస్‌బీఐలో విలీనమైన సంగతి తెలిసిందే. వీటి విలీనంతో ఎస్‌బీఐ గ్లోబల్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చేరింది. ఐఎన్‌బీ, ఎస్‌బీఐ ఎనీవేర్, ఎస్‌బీఐ మింగిల్(వెబ్ అప్లికేషన్) లేదా సమీపంలోని ఏటీఎం లేదా బ్రాంచు వద్ద కొత్త చెక్ బుక్‌లను కస్టమర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొంది. చెక్‌బుక్‌లు చెల్లవనే ఫైనల్ వార్నింగ్‌ను కూడా రెండు రోజుల క్రితమే ఎస్‌బీఐ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment