associate banks
-
అనుబంధ ఉద్యోగులకు ఎస్బీఐ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. నోట్ల రద్దు సమయంలో అదనపు పనిగంటలకు అందించిన పరిహారం వెనక్కి ఇవ్వాలని తాఖీదులు పంపడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిగంటలకు పరిహారం అందిస్తామని గతంలో బ్యాంకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2017న ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమవడం గమనార్హం. అయితే నోట్లరద్దు సమయంలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదని ఎస్బీఐ పేర్కొంటోంది. నోట్ల రద్దు సమయంలో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లకు చెందిన 70,000 మంది అధికారులు, సిబ్బంది అదనపు గంటలు పనిచేశారు. వీరికి ఓవర్‌టైమ్ చేసినందుకు ఎస్బీఐ హామీ ఇచ్చిన మేర పరిహారం చెల్లించింది. అయితే వీరు అదనంగా పనిచేసినందుకు అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎస్బీఐ కోరుతుండటంతో అనుబంధ బ్యాంకుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌టైమ్ చేసినందుకు ఇచ్చిన పరిహారం కేవలం తమ ఉద్యోగులకేనని, అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఇది వర్తించదని జోనల్ హెడ్క్వార్టర్లకు ఎస్బీఐ పంపిన సమాచారంతో ఆయా బ్యాంకుల సిబ్బంది మండిపడుతున్నారు. గతంలో తమ అనుబంధ బ్యాంకుల సిబ్బందికి చెల్లించిన పరిహారంను తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్బీఐ తన జోనల్ మేనేజర్లను కోరడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిహారం రికవరీ ఉత్తర్వులను బ్యాంకు యూనియన్లు తప్పుపడుతున్నాయి. పరిహారం వెనక్కితీసుకోవాలని చూడటం సరైంది కాదని హెచ్చరించాయి. -
ఇక ఆ చెక్‌బుక్‌లు చెల్లవు
సాక్షి, న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన ఆరు అనుబంధ బ్యాంకుల చెక్‌బుక్‌లు ఇక నుంచి చెల్లవని ఎస్బీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవడానికి 31 డిసెంబరు 2017 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు 2017 సెప్టెంబరులో ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గడువు తీరిపోవడంతో, ఇక వీటి చెక్ బుక్ చెల్లవని ప్రకటించేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లు 2017 ఏప్రిల్ 1న ఎస్బీఐలో విలీనమైన సంగతి తెలిసిందే. వీటి విలీనంతో ఎస్బీఐ గ్లోబల్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చేరింది. ఐఎన్‌బీ, ఎస్బీఐ ఎనీవేర్, ఎస్బీఐ మింగిల్(వెబ్ అప్లికేషన్) లేదా సమీపంలోని ఏటీఎం లేదా బ్రాంచు వద్ద కొత్త చెక్ బుక్‌లను కస్టమర్లు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. చెక్‌బుక్‌లు చెల్లవనే ఫైనల్ వార్నింగ్‌ను కూడా రెండు రోజుల క్రితమే ఎస్బీఐ ప్రకటించింది. -
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
-
బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల కల్పనపై ఉసూరు మనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18) లో ఉద్యోగులను తక్కువగా నియమించుకోనున్నట్టు దేశీయ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ప్రకటించింది. ఇటీవల అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. విలీనం తర్వాత అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో తమ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు . దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో నియామకాలు చేపటామని తాము భావించడం లేదని తెలిపారు. ముఖ్యంగా క్లరికల్ ఉద్యోగాల్లో నియమకాలు అసలు ఉండవని, ఆఫీసర్ స్థాయి నియామకాలు ఈ సంవత్సరాంతానికి స్వల్పంగా ఉండనున్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ బ్యాంకులు ప్రధాన సంస్థలో విలీనమయ్యాయి.మీ విలీనం ఫలితంగా, ఎస్బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా క్యూ4లో ఎస్బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఎన్పీఏలు భారీగా తగ్గి, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది. -
వరల్డ్ టాప్-50 బ్యాంకులోకి ఎస్బీఐ
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రపంచంలోనే అతిపెద్ద టాప్-50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. 2017 ఏప్రిల్ 1 తనకు చరిత్రలో నిలిచిపోయే విధంగా అనుబంధ బ్యాంకులు ఐదింటినీ నేడు తనలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించేసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్బీఐ), స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్(ఎస్బీఎం), స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్బీటీ)లను నేటి నుంచి తనలో విలీనం చేసుకుంటున్నట్టు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ మహిళా బ్యాంకు విలీనాన్ని ప్రభుత్వం అంతకముందే చేపట్టింది. ఈ విలీనంతో ఆస్తుల పరంగా టాప్-50 గ్లోబల్ బ్యాంక్స్ లో ఒకటిగా చోటు దక్కించుకోబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియతో 37 కోట్ల కస్టమర్ బేస్ ను, దాదాపు 24వేల బ్రాంచుల నెట్ వర్క్, సుమారు 59వేల ఏటీఎంలు తన సొంతం కానున్నట్టు తెలిపింది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ కంటే 5 రెట్లు పెద్ద బ్యాంకుగా ఎస్బీఐ అవతరిస్తోంది. 2008లో మొదటిసారి ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్రను తనలో విలీనం చేసుకుంది. రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండోర్ ను కలుపుకుంది. పూర్తిగా వ్యవస్థలన్నింటిన్నీ ఏకీకృతం చేయడానికి రెండు నెలలు పడుతుందని ఎస్బీఐ చెబుతోంది. -
తీరనున్న ‘అనుబంధం’
► ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ► రేపటి నుంచి కనుమరుగుకానున్న ఎస్బీహెచ్ ► రెండింటిలో ఖాతా ఉంటే ఒకటే చెల్లుబాటు ► మూడు మాసాల వరకు కొంత వెసులుబాటు ఆసిఫాబాద్ : ఖాతాదారులకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో ఇక అనుబంధం తీరనుంది. ఇప్పటివరకు ఎస్బీఐతో అనుబంధం కలిగి ఉన్న బ్యాంకులన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి ఎస్బీఐలో విలీ నం కానున్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ uమొదటిపేజీ తరువాయి ఇండియా అతి పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఎస్బీఐ అభ్యర్థన మేరకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ బ్యాంకు తన పరిధిలోని అనుబంధ బ్యాంకులను ఏప్రిల్ ఒకటి తర్వాత విలీ నం చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. శనివారం నుంచి జిల్లాలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనే బోర్డులు ఎక్కడా కనిపించవు. ఈ బ్యాంకులన్నీ యథావిధిగా లావాదేవీలు నిర్వహించనున్నప్పటికీ ఎస్బీఐ పేరుతో కొనసాగనున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో అత్యధిక బ్రాంచీలు కలిగి ఉన్న ఎస్బీఐకి విలీనానికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే వచ్చాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో చెస్ట్ బ్రాంచిలున్నాయి. ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బె న, వాంకిడి మండలాల్లోని బ్యాంకులకు ఆసిఫాబాద్ కంట్రోలింగ్ కేంద్రంగా, కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని బ్యాంకులకు కాగజ్‌నగర్ బ్యాంకులు కంట్రోలింగ్ కేంద్రంగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక బ్యాంకుల విలీనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగి ఖాతాదారులకు సేవలందిస్తున్న ప్రభుత్వ జాతీయ బ్యాంకు. ఈ బ్యాంకు కాలానుగుణంగా స్థానికతను దృష్టిలో పెట్టుకొని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్(ఎస్‌బీటీసీ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనూర్అండ్జైపూర్(ఎస్‌బీబీజే) బ్యాంకులను ఏర్పాటు చేసింది. అయితే దేశవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకుగా అవతరించడంతోపాటు ఎస్బీఐ పేరుతోనే చలామణి కావడానికి స్థానిక బ్యాంకులతో విలీనం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కేంద్ర శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)తోపాటు కేంద్ర ప్రభుత్వానికి స్థానిక బ్యాంకుల విలీనంపై అప్పీల్ చేసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత నెల రోజులుగా ఎస్బీహెచ్లో ఖాతా ఉన్న వ్యక్తులకు ఎస్బీఐలో కొత్త ఖాతా తెరిచేందుకు బ్యాంకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో బ్యాంకుల విలీనంతో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనున్నాయోనన్న ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. రేపటి నుంచి ఎస్బీఐ పేరుతోనే దేశవ్యాప్తంగా ఐదు బ్యాంకులను విలీనం చేయాలని భావించిన ఎస్బీఐ ఏప్రిల్ ఒకటి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఎస్‌బీహెచ్‌కు 44 బ్రాంచిలు, ఎస్బీఐకి 14 బ్రాంచిలు ఉన్నాయి. సుమారు 15లక్షల ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకుల విలీనంతో నెట్వర్క్ పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు సేవలు మెరుగుపడే అవకాశాలున్నాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంకులన్నీ యథాతథంగా ఉన్నా, నియంత్రణ మాత్రం ఎస్బీఐ నుంచి మాత్రమే జరగనుంది. ఏదైనా ఒకే అకౌంట్.. రెండు బ్యాంకుల విలీనంతో ఒక వినియోగదారుడికి ఎస్బీహెచ్, ఎస్బీఐ రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే, ఏదైనా ఒకే బ్యాంకు ఖాతా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉండగా..రెండింటిలోనూ లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఇక మీదట ఏదైనా ఒకే అకౌంట్ ఉంచుకోవల్సి వస్తుంది. దీంతో రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా వినియోగదారులు లావాదేవీలు జరిపేందుకు ఏదైనా ఒక ఖాతాను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఎంఐసీఆర్ కోడ్ నంబర్ మూడు మాసాల వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత కొత్త కోడ్ నంబర్ కేటాయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి విలీనం దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఒకే బ్యాంకుగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి విలీన విషయమై అప్పీల్ చేయగా, అంగీకారం వచ్చింది. దీంతో ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలోని ఎస్బీహెచ్ బ్యాంకులన్నీ ఎస్బీఐలో విలీనం కానున్నాయి. అయినా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మెరుగైన సేవలందనున్నాయి. – కృష్ణమాచారి, బ్రాంచి మేనేజర్, ఎస్బీహెచ్, ఆసిఫాబాద్ -
బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఖాతాదారులకు కష్టాలు తప్పవా? ఖాతాదారులకే కాదు ఉద్యోగులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవని బ్యాంకు అధికారులు చెబుతున్నమాట. ముఖ్యంగా విలీనం తరువాత అతిపెద్ద మార్పు ఆన్లైన్ లావాదేవీల్లో ఉండనుంది. విలీనం తరువాత అయిదు అనుబంధ బ్యాంకుల ఆన్లైన్ పోర్టల్ రద్దుఅవుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్లను అధికారులు అనుబంధ బ్యాంకుల ఖాతాదారులకు పంపిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి భారతీయ మహిళా బ్యాంక్ తోపాటు అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, బికానెర్ & జైపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ యొక్క స్టేట్ బ్యాంక్ పాటియాలా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విలీనం తేదీఏప్రిల్ 1 నుంచి నిలిపివేయనున్నారు. ఈ లావాదేవీలను onlinesbi.com ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే యూజర్ నేమ్, పాస్వర్డ్మాత్రం పాతవే చెల్లుబాటులో ఉంటాయి. అలాగే థర్డ్ పార్టీ ఖాతాలు, షెడ్యూల్ బిల్లు చెల్లింపులు కూడా ఎస్బీఐ ఆన్లైన్ ద్వారా చేయాలి. బ్యాంకులు ఐఎఫ్ఎస్డీ కోడ్ ప్రస్తుతానికి మారదు, పాతదే చెల్లుతుంది. జులై తర్వాత ఈ కోడ్ మారే అవకాశం ఉంది. వినియోగదారులకు తాజా చెక్ పుస్తకాలు , పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. అసోసియేట్ బ్యాంకులు అందిస్తున్న స్థిర డిపాజిట్ ఉత్పత్తులు మారవు. అయితే, ఒకసారి విలీనం ప్రక్రియ పూర్తయ్యాక వినియోగదారులు ఎస్బీఐ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోకి మారతాయి. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ చార్జీలు ఎస్బీఐ ప్రకారం ఉంటాయి. ఈ చార్జిలు కొన్ని అనుబంధ బ్యాంకులకు తక్కువగా ఉన్నప్పటికీ, ఆయా ఖాతాదారులు ఎస్బీఐ నిబంధనల ప్రకారం ఈ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అసోసియేట్ బ్యాంకుల నుంచి కొత్త రుణాల ప్రాసెసింగ్ ఇప్పటికే నిలిపివేసినట్టు ఒక సీనియర్ ఎస్‌బీఐఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ విలీనం తప్పనిసరిగా వినియోగదారుల అసౌకర్యానికి కారణం అవుతుందనీ, కానీదీన్ని అధిగమించేందుకు ఏప్రిల్ 15 తర్వాత చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు. అటు ఈ విలీనప్రక్రియ అనుబంధ బ్యాంకులు ఉద్యోగులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది. సొంత ఇంటిని వదిలి మహా సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని ఎస్బీహెచ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ పేర్కొన్నారు. సొంత బ్రాండ్‌ను, కార్యకలాపాలు లో స్వాతంత్ర్యం కోల్పోతామని వ్యాఖ్యానించారు. -
అక్టోబర్ చివరి నుంచి విలీన ప్రక్రియ: ఎస్బీఐ
ముంబై: ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐలో విలీనం చేసే ప్రక్రియ వచ్చే నెల చివరి నాటికి ఆరంభం కానుండగా... మార్చి చివరికి పూర్తి అవుతుందని ఎస్బీఐ భావిస్తోంది. విలీనానికి ఎస్బీఐ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపి షేర్ల మార్పిడి (స్వాప్ రేషియో) నిష్పత్తిని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రేషియోపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆయా బ్యాంకుల వాటాదారులకు ఎస్బీఐ 21 రోజుల గడువు ఇచ్చింది. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని (గ్రీవెన్స్ కమిటీ) కూడా ఏర్పాటు చేసింది. ‘గ్రీవెన్స్ కమిటీ ఈ నెల చివరి నాటికి సానుకూల ప్రతిపాదనతో వస్తుందని భావిస్తున్నాం. కమిటీ సిఫారసులపై ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఆర్బీఐ, ప్రభుత్వం వద్దకు తుది అనుమతి కోసం పంపిస్తాం. ఇందుకు ఓ నెల సమయం తీసుకుంటుంది. విలీన ప్రక్రియ అక్టోబర్ చివరికి ప్రారంభం అవుతుంది’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మనది స్వేచ్ఛాయుత దేశమని న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ కేరళ కోర్టులో ఇప్పటికే ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. -
SBI మెగా విలీనం