బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు | SBI - associate banks merger won't be pain-free for customers; here's why | Sakshi
Sakshi News home page

బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు

Published Wed, Mar 29 2017 12:38 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు

బ్యాంకుల విలీనం - ఖాతాదారుల కష్టాలు

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఖాతాదారులకు కష్టాలు తప్పవా? ఖాతాదారులకే కాదు ఉద్యోగులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవని బ్యాంకు అధికారులు చెబుతున్నమాట. ముఖ్యంగా  విలీనం తరువాత అతిపెద్ద మార్పు ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఉండనుంది.  విలీనం తరువాత అయిదు అనుబంధ బ్యాంకుల ఆన్‌లైన్‌​ పోర్టల్‌ రద్దుఅవుతుంది. దీనికి సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లను  అధికారులు అనుబంధ బ్యాంకుల ఖాతాదారులకు పంపిస్తున్నారు.   

ఏప్రిల్ 1 నుంచి భారతీయ మహిళా బ్యాంక్ తోపాటు అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియ ప్రారంభంకానుంది.  దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్, బికానెర్ & జైపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ యొక్క స్టేట్ బ్యాంక్ పాటియాలా  ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విలీనం తేదీఏప్రిల్‌ 1 నుంచి నిలిపివేయనున్నారు.  ఈ లావాదేవీలను  onlinesbi.com ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అయితే   యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌మాత్రం పాతవే చెల్లుబాటులో ఉంటాయి. అలాగే థర్డ్‌ పార్టీ ఖాతాలు, షెడ్యూల్ బిల్లు చెల్లింపులు  కూడా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ ద్వారా  చేయాలి.  

బ్యాంకులు ఐఎఫ్‌ఎస్‌డీ కోడ్‌  ప్రస్తుతానికి మారదు, పాతదే చెల్లుతుంది. జులై తర్వాత ఈ కోడ్‌ మారే అవకాశం ఉంది. వినియోగదారులకు తాజా చెక్ పుస్తకాలు , పాస్‌ పుస్తకాలు  జారీ  చేస్తారు. అసోసియేట్ బ్యాంకులు అందిస్తున్న స్థిర డిపాజిట్ ఉత్పత్తులు మారవు. అయితే, ఒకసారి విలీనం  ప్రక్రియ పూర్తయ్యాక  వినియోగదారులు ఎస్‌బీఐ ప్రొడక్ట్‌ పోర్ట్ఫోలియోకి  మారతాయి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ చార్జీలు ఎస్‌బీఐ  ప్రకారం ఉంటాయి. ఈ చార్జిలు కొన్ని అనుబంధ బ్యాంకులకు తక్కువగా ఉన్నప్పటికీ,  ఆయా ఖాతాదారులు ఎస్‌బీఐ నిబంధనల ప్రకారం ఈ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.  

అసోసియేట్ బ్యాంకుల నుంచి కొత్త రుణాల ప్రాసెసింగ్ ఇప్పటికే నిలిపివేసినట్టు ఒక సీనియర్ ఎస్‌బీఐఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ విలీనం తప్పనిసరిగా వినియోగదారుల అసౌకర్యానికి కారణం అవుతుందనీ,  కానీదీన్ని అధిగమించేందుకు   ఏప్రిల్ 15 తర్వాత చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు. అటు ఈ విలీనప్రక్రియ అనుబంధ బ్యాంకులు ఉద్యోగులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది.  సొంత ఇంటిని వదిలి   మహా సముద్రంలోకి  ప్రవేశిస్తున్నట్టుగా ఉందని ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌ చీఫ్ మేనేజర్‌ పేర్కొన్నారు.  సొంత బ్రాండ్‌ను, కార్యకలాపాలు లో స్వాతంత్ర్యం కోల్పోతామని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement