Oriental Bank of Commerce
-
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్.. తెరపైకి కొత్త పాలసీ!) ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్‌కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్‌లు పనిచేయవు
మీకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే, ఒక హెచ్చరిక. ఈ రెండు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్‌లు వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. కాబట్టి ఈ బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఓబీసీ, యూబీఐ రెండూ ఏప్రిల్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు విలీనమైనప్పటికీ ఇప్పటి వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లనే కొనసాగించారు. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు వీలైనంత త్వరగా పీఎన్బీ ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ నుంచి వీటిని పొందొచ్చని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. ఏదైనా సాయం లేదా క్వైరీ కొరకు కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-180-2222ని సంప్రదించండి అని కూడా తెలిపింది.(చదవండి: భారీ లాభాలను గడించిన డ్రీమ్-11..! ఏంతంటే..?) -
ఖాతాదారులకు అలర్ట్.. ఇక ఈ బ్యాంకు చెక్‌బుక్‌లు పనిచేయవు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కొత్త చెక్‌బుక్ నిబందనలో మార్పుకు సంబంధించి తన ఖాతాదారులకు ఒక కీలక ప్రకటన చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ)లకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1, 2021 నుంచి పనిచేయవని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులు వారి పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని కోరింది. (చదవండి: చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?) "ప్రియమైన వినియోగదారులరా.. ఈఓబీసీ, ఈయుబీఐ బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు 1-10-2021 నుంచి నిలిపివేస్తున్నాము. దయచేసి ఈఓబీసీ, ఈయుబీఐ పాత చెక్‌బుక్‌ల స్థానంలో ఐఎఫ్ఎస్ సీ, ఎమ్ ఐసీఆర్ తో అప్ డేట్ చేసిన పీఎన్బీ కొత్త కొత్త చెక్‌బుక్‌లు పొందండి. కొత్త చెక్‌బుక్ కోసం ఎటీఎమ్/ఐబీఎస్/పీఎన్బీ వన్ ద్వారా అప్లై చేసుకోండి" అని ఒక ట్వీట్ చేసింది. Take note & apply for your new cheque book through👇 ➡️ ATM ➡️ Internet Banking ➡️ PNB One ➡️ Branch pic.twitter.com/OEmRM1x6j0 — Punjab National Bank (@pnbindia) September 8, 2021 లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్, 2020లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఇండియా(యుబీఐ) పీఎన్బీలో విలీనం అయిన తర్వాత ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ రెండు కాకుండా, మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ మెగా కన్సాలిడేషన్ ప్రణాళిక కింద ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. -
ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. చదవండి: జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు! సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు కూడా ఆర్థిక సేవల విభాగం నుంచి లేఖ అందిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనం కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గింది. 2017లో ఈ బ్యాంక్‌ల సంఖ్య 27గా ఉంది. -
ఓబీసీకి తగ్గిన ‘మొండి’ భారం
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాంలో రూ.126 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.102 కోట్లు)తో పోల్చితే 24 శాతం వృద్ధి సాధించామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,967 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.5,702 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర మొండి బకాయిలు 10.07 శాతం నుంచి 5.94 శాతానికి తగ్గాయని తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడటంతో బీఎస్ఈలో ఓబీసీ షేర్ 1.4 శాతం లాభంతో రూ.50 వద్ద ముగిసింది. -
బ్యాంకుల ఫలితాలు భేష్!!
ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్చి క్వార్టర్‌కు రూ.201 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,650 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బ్యాంకు ఆదాయం రూ.4,689 కోట్ల నుంచి రూ.5,711 కోట్లకు పెరగ్గా ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 17.63% నుంచి 12.66%కి.. నికర ఎన్పీఏలు సైతం 10.48% నుంచి 5.93%కి తగ్గాయి. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.55 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.20,181 కోట్ల నుంచి రూ.20,537 కోట్లకు చేరింది. 2017–18లో రూ.5,872 కోట్లు, 2016–17లో రూ.1,094 కోట్ల మేర బ్యాంకు నష్టాలను చవిచూసింది. టర్న్ అరౌండ్ అయింది... ‘‘గత మూడు త్రైమాసికాలుగా లాభాలను నమోదు చేస్తున్నాం. రానున్న కాలంలోనూ లాభాలను కొనసాగిస్తాం. ముందు సంవత్సరం రూ.12,000 కోట్ల మేర ఎన్పీఏలుగా మారగా, వీటిని 7,000 కోట్లకు కట్టడి చేశాం. రూ.3,161 కోట్లకు వసూళ్లు, రుణాల అప్‌గ్రేడేషన్ రూ.6,597 కోట్లకు చేరాయి. ఇవన్నీ టర్న్ అరౌండ్‌కు కారణమయ్యాయి’’ అని ఓబీసీ ఎండీ, సీఈవో ముకేశ్‌కుమార్ జైన్ తెలిపారు. బ్యాంకు 10– 12 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని విధించుకుంది. క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో తదితర మార్గాల ద్వారా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది. మళ్లీ లాభాల్లోకి యునైటెడ్ బ్యాంకు ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఏడు త్రైమాసికాల నష్టాల తర్వాత మార్చి క్వార్టర్లో తిరిగి లాభాలు నమోదుచేసింది. రూ.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.260 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. ఆదాయం రూ.2,635 కోట్ల నుంచి రూ.2,948 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.540 కోట్లుగా, నికర వడ్డీ మార్జిన్ 2.43 శాతంగా ఉన్నా యి. నికర వడ్డీ ఆదాయం కిందటేడాది ఇదే కాలం లో రూ.1,493 కోట్లుగా ఉండగా, అది రూ.1,975 కోట్లకు పెరిగింది. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 24 శాతం నుంచి 16.48 శాతానికి, నికర ఎన్పీఏలు 16.49 శాతం నుంచి 8.67 శాతానికి తగ్గాయి. మార్చి నాటికి రూ.2 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించినట్టు యునైటెడ్ బ్యాంకు తెలిపింది. క్యూఐపీ ద్వారా రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది. ఆరు రెట్లు పెరిగిన కర్ణాటక బ్యాంకు లాభం మార్చి త్రైమాసికంలో రూ.61 కోట్లు కర్ణాటక బ్యాంకు లాభం మార్చి త్రైమాసికంలో ఆరు రెట్లు పెరిగి రూ.61.73 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.11 కోట్లుగా ఉంది. అయితే, డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ.140 కోట్లతో పోలిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. బ్యాంకు ఆదాయం 5% వృద్ధితో రూ.1,737 కోట్ల నుంచి రూ.1,821 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతానికి పైగా క్షీణించి రూ.480 కోట్లకు పరిమితం అయింది. నికర వడ్డీ మార్జిన్ 3.54 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గింది. స్థూల ఎన్పీఏలు 4.92% నుంచి 4.41%కి, నికర ఎన్పీఏలు 2.96 శాతం నుంచి 2.95 శాతానికి తగ్గినట్టు బ్యాంకు తెలిపింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 46% వృద్ధితో రూ.477 కోట్లకు చేరింది. బ్యాంకు చరిత్రలో ఓ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభం ఇదే. ఒక్కో షేరుకు రూ.3.50 డివిడెండ్‌ను బోర్డు సిఫారు చేసింది. -
ఓరియంటల్ బ్యాంక్ లాభం రూ. 145 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145 కోట్ల నికర లాభం ప్రకటించింది. అసెట్ క్వాలిటీ, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం ఇందుకు తోడ్పడ్డాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఓబీసీ రూ. 1,985 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 4,756 కోట్ల నుంచి రూ. 5,128 కోట్లకు పెరిగింది. త్రైమాసికాలవారీగా నికర వడ్డీ మార్జిన్లు క్రమంగా మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని, 2017–18లో 1.95 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ తాజా మూడో త్రైమాసికంలో 2.80 శాతానికి చేరిందని ఓబీసీ తెలిపింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ. 1,018 కోట్ల నుంచి రూ. 1,419 కోట్లకు పెరిగింది. ఎంప్లాయీ పర్చేజ్ స్కీమ్ (ఈఎస్‌పీఎస్) కింద కొత్తగా 2.61 కోట్ల షేర్లను రూ. 71.76 రేటుకు జారీ చేయనున్నట్లు ఓబీసీ తెలిపింది. జనవరి 31న ప్రకటించే ఈ ఆఫర్ ద్వారా రూ. 187.52 కోట్లు సమీకరించాలని బ్యాంక్ భావిస్తోంది. తగ్గిన ఎన్పీఏలు.. క్యూ3లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 16.95 శాతం నుంచి 15.82 శాతానికి, నికర ఎన్పీఏలు 9.52 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 27,551 కోట్ల నుంచి రూ. 24,353 కోట్లకు, నికర ఎన్పీఏలు రూ. 14,195 కోట్ల నుంచి రూ. 9,973 కోట్లకు తగ్గాయి. అయితే, మొండిబాకీలకు కేటాయింపులు మాత్రం రూ. 2,340 కోట్ల నుంచి రూ. 4,082 కోట్లకు పెరిగాయి. మంగళవారం బీఎస్ఈలో ఓబీసీ షేరు 4% పెరిగి రూ. 94.80 వద్ద క్లోజయ్యింది. -
ఓబీసీకి రూ.102 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) సెప్టెంబర్ క్వార్టర్లో రూ.102 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొండి బకాయిలు (ఎన్పీఏలు) పెరిగినప్పటికీ బ్యాంకు లాభాలను ప్రకటించడం విశేషం. ఈ మొండి బకాయిలకు బ్యాంకు నిధుల కేటాయింపులను తగ్గించడం లాభాలకు కారణంగా తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.1,749.90 కోట్ల నష్టాలను చవిచూసింది. మొత్తం ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.5,511 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గి, రూ.4,967 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్పీఏలు బ్యాంకు మొత్తం రుణాల్లో 17.24 (రూ.25,673 కోట్లు) శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 16.30 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 10.07 శాతంగా (రూ.13,795 కోట్లు) ఉన్నాయి. బ్యాంకు మొత్తం ప్రొవిజన్లు రూ.1,073 కోట్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ప్రొవిజన్లు రూ.3,146 కోట్లుగా ఉండడం గమనార్హం. -
నీరవ్ మోదీ తరహాలో మరో బ్యాంక్‌కు టోకరా!!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ సంస్థలు పీఎన్బీని మోసగించిన తరహాలోనే ఓ టింబర్ కంపెనీ ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను(ఓబీసీ) ఏకంగా రూ.155 కోట్లకు మోసం చేసింది. దీనిపై ఓబీసీ ఫిర్యాదు చేయటంతో... సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. హరియాణాలోని కర్నాల్ కేంద్రంగా పనిచేసే మహేష్ టింబర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు అశోక్ మిట్టల్, ఆయన భార్య నిషా మిట్టల్‌తోపాటు ఓబీసీ నుంచి తొలగింపునకు గురైన సీనియర్ అధికారి సురేందర్‌కుమార్ రంగాపై కేసు కూడా నమోదు చేసింది. మహేష్ టింబర్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు సింగపూర్ కేంద్రంగా మహేష్ టింబర్ (సింగపూర్) లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ ‘స్టాండ్‌బై లెటర్ ఆఫ్ క్రెడిట్’ల ఆధారంగా ఎస్బీఐ, ఓబీసీ, బీఓబీ ఆధ్వర్యంలోని కన్సార్షియం నుంచి 2017 ఏప్రిల్ నాటికి రూ.242 కోట్ల రుణాలను తీసుకుంది. రూ.12 కోట్ల రుణ సదుపాయాన్ని ఈ సంస్థ మోసపూరితంగా రూ.108.11 కోట్లుగా మార్చివేసినట్టు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది సాయంతో ఫారిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్లలో (ఎఫ్ఎల్సీ) మార్పులు చేసి భారీగా రుణాలను పొందారు. కానీ వాటిని తిరిగి చెల్లించలేదు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సందేశాలను ఉపయోగించుకుని, బ్యాంకు పుస్తకాల్లో పేర్కొనకుండా ఈ మోసం జరిగిన తీరు రూ.13,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్‌ను తలపిస్తోంది. మహేష్ టింబర్‌కు బ్యాంకులు ఇచ్చిన రూ.242 కోట్ల అసలు రుణాల్లో, ఓబీసీ ఇచ్చిన మొత్తం రూ.155.21 కోట్లు. మహేష్ టింబర్‌కు జారీ అయిన రుణాలను 2016 సెప్టెంబర్ 26న ఎన్పీఏగా గుర్తించినట్టు ఓబీసీ తన ఫిర్యాదులో తెలిపింది. -
2014లోనే డిఫాల్టర్‌గా ప్రకటించాం!
న్యూఢిల్లీ: ద్వారకాదాస్ ఇంటర్నేషనల్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా 2014లోనే ప్రకటించామని ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించింది. ఇదే విషయాన్ని సీబీఐతోపాటు, ఆర్బీఐకి అప్పుడే నివేదించామని తెలిపింది. రూ.389.85 కోట్ల ఈ స్కామ్ తమ లాభదాయకతపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇందుకు సంబంధించిన కేటాయింపులను ఇప్పటికే పూర్తి చేశామని స్పష్టం చేసింది. ద్వారకాదాస్ ఇంటర్నేషనల్‌కు ఇచ్చిన రుణం నిరర్థకంగా, మొండి బకాయిగా 2014 మార్చి 31న మారిందని, ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఆ కంపెనీని అదే ఏడాది జూన్ 30న ప్రకటించామని ఓబీసీ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. అమల్లో ఉన్న చట్టాల మేరకు ఈ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా సీబీఐ, ఆర్బీఐకి ఫిర్యాదు చేశామని వివరించింది. ఓబీసీ గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ద్వారాకాదాస్ సేఠ్ ఇంటర్నేషనల్, ఆ కంపెనీ డైరెక్టర్లపై రూ.389.85 కోట్ల రుణ మోసానికి సంబంధించి సీబీఐ ఇటీవలే ఫిర్యాదు నమోదు చేయడం గమనార్హం. ద్వారాకాదాస్ కంపెనీ 2007–12 మధ్య కాలంలో ఓబీసీ నుంచి రూ.389 కోట్ల మేర రుణ సదుపాయం పొంది బంగారం, వజ్రాభరణాల కొనుగోలుకు రుణాలిచ్చిన ఇతర సంస్థలకు చెల్లించింది. బంగారం, డబ్బుల్ని కల్పిత లావాదేవీల ద్వారా దేశాన్ని దాటించిందని సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
ఓబీసీ నష్టాలు రూ.1,985 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.130 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.1,985 కోట్లకు పెరిగాయని ఓబీసీ తెలిపింది. మొండి బకాయిలు పెరగడం, వీటికి కేటాయింపులు పెంచడం వల్ల నికర నష్టాలు బాగా పెరిగాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,416 కోట్ల నుంచి రూ.4,699 కోట్లకు తగ్గింది. సీక్వెన్షియల్‌గా తగ్గిన కేటాయింపులు..: గత క్యూ3లో రూ.1,430 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.2,340 కోట్లకు ఎగిశాయి. అయితే సీక్వెన్షియల్‌గా చూసినపుడు మాత్రం ఈ కేటాయింపులు తగ్గాయి. ఈ క్యూ2లో మొండి బకాయిలు కేటాయింపులు రూ.3,147 కోట్లుగా ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.20,492 కోట్ల నుంచి రూ.27,551 కోట్లకు. నికర మొండి బకాయిలు రూ.13,688 కోట్ల నుంచి రూ.14,195 కోట్లకు పెరిగాయని బ్యాంకు తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.80 శాతం నుంచి 16.95 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 9.68 శాతం నుంచి 9.52 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్ఈలో ఓబీసీ షేర్ 2.4 శాతం తగ్గి రూ.117 వద్ద ముగిసింది. -
ఓబీసీ నష్టం రూ.1,750 కోట్లు
ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.153 కోట్ల నికర లాభం సాధించామని, కానీ ఈ క్యూ2లో రూ.1,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం బాగానే పెరిగినప్పటికీ, మొండి బకాయిలకు కేటాయింపులు నాలుగు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని వివరించింది. ఇతర ఆదాయం 82 శాతం వృద్ధితో రూ.1,059 కోట్లకు, నిర్వహణ లాభం 62 శాతం వృద్ధితో రూ.1,551 కోట్లకు పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.775 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.3,281 కోట్లకు చేరాయని, ఈ క్యూ1లోని కేటాయింపులు(రూ.1,470కోట్లు)తో పోల్చితే దాదాపు రెట్టింపయ్యాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు రూ.24,409 కోట్లనుంచి రూ.26,432 కోట్లకు పెరగ్గా, నికర మొండి బకాయిలు రూ.14,809 కోట్ల నుంచి రూ.14,129 కోట్లకు తగ్గాయని ఓబీసీ తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 14.83 శాతం నుంచి 16.3 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 9.56 శాతం నుంచి 9.44 శాతానికి తగ్గాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,316 కోట్ల నుంచి 5 శాతం క్షీణించి రూ.1,252 కోట్లకు తగ్గిందని వివరించింది. రుణాలు 5 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణాలు 0.3 శాతం క్షీణించాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓబీసీ షేర్ 6 శాతం క్షీణించి రూ.128 వద్ద ముగిసింది. -
ఓబీసీ పొదుపు ఖాతాల్లో ఇక నెలవారీ వడ్డీ
ముంబై: సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి నెలా ఒకసారి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వడ్డీ జమ చేయనుంది. ఇప్పటి వరకూ ఆరునెలలకోసారి వడ్డీని జమ చేస్తుండగా ఇకపై దీన్ని నెలరోజులకు కుదిస్తున్నట్లు ఓబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచీ ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేయాలని ఇటీవలే ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఓబీసీ ఒక అడుగు ముందుకువేసి... నెలకొకసారి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ జమ అవుతుందని ప్రకటించింది. 2010 ఏప్రిల్ 1 నుంచీ రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ వడ్డీ ఇప్పటి వరకూ ఆరు నెలలకు ఒకసారి జమవుతోంది. ఆర్బీఐ వడ్డీ జమ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించడం వల్ల బ్యాంకింగ్‌పై మొత్తంగా రూ.500 అదనపు భారం పడే అవకాశం ఉందన్నది ఈ రంగంలో నిపుణుల విశ్లేషణ. సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వ బ్యాంకులు 4% వరకూ వడ్డీ ఇస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు 6 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. -
డిపాజిట్లపై ఓబీసీ వడ్డీరేట్ల తగ్గింపు
♦ పావు నుంచి అరశాతం శ్రేణిలో కోత ♦ సోమవారం నుంచీ అమలు... న్యూఢిల్లీ: కోటి రూపాయలలోపు డిపాజిట్ల విషయంలో పలు కాలపరిమితులకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించినట్లు ప్రభుత్వరంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. మార్చి 28వ తేదీ (సోమవారం) నుంచీ తగ్గించిన డిపాజిట్ రేట్లు అమల్లోకి వస్తాయని బీఎస్బీకి సమర్పించిన ఒక నోట్లో తెలిపింది. పలు మెచ్యూరిటీలపై పావుశాతం నుంచి అరశాతం మేర వడ్డీరేట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై కేంద్రం భారీగా వడ్డీరేట్లు తగ్గించిన నేపథ్యంలో... రేటు కోత నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఓబీసీ నిలవడం గమనార్హం. రేటు కోత తీరును చూస్తే... ఏడాదిలోపు అర... ఆపై పావు.. ♦ 31 రోజుల నుంచి 45 రోజుల మధ్య డిపాజిట్ రేటు 5% నుంచి 5.5%కి దిగింది. ♦ 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య డిపాజిట్ రేటు అరశాతం తగ్గి 6 శాతానికి పడింది. ♦ 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య రేటుఅరశాతం తగ్గి 6.25కు చేరింది. ♦ ఏడాది నుంచి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్ల రేటు 7.75% నుంచి 7.5 శాతానికి తగ్గింది. ♦ 2-10 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ డిపాజిట్లపై రేటు కూడా ఇంతే తగ్గి 7.25%కి చేరింది. -
స్టాక్స్ వ్యూ
నెస్లే ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.6,087 టార్గెట్ ధర: రూ.5,614 ఎందుకంటే: కంపెనీకి చెందిన కీలకమైన బ్రాండ్ మ్యాగీ వివాదంలో చిక్కుకుంది. మ్యాగీలో పరిమితికి మించి సీసం, ఎంఎస్‌జీలు ఉన్నాయంటూ దుమారం రేగుతోంది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే దీనిని నిషేధించింది. మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బిగ్‌బజార్‌ను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ మ్యాగీ అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయించింది. ఈ వివాదం కారణంగా మ్యాగీ అమ్మకాలు తగ్గాయి. నెస్లే ఇండియా మొత్తం ఆదాయంలో మ్యాగీ వంటి ప్రిపేర్డ్ డిషెస్ సెగ్మెంట్ వాటా 30 శాతంగా ఉంది. వీటిల్లోనూ మ్యాగీ వాటానే అధికం. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తాయన్న అంచనాలు ఎఫ్ఎంసీజీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. మ్యాగీ సురక్షితమైనదేనని, ప్రచారం చేయడానికి కంపెనీ భారీ సంఖ్యలో మార్కెటింగ్ వ్యయాలు భరించాల్సి ఉంటుంది. న్యాయ స్థానాల్లో న్యాయపోరాటానికి భారీగానే వ్యయం చేయాల్సి రావచ్చు. ఇవన్నీ కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపవచ్చు. మ్యాగీ వివాదం నెస్లే ఇతర బ్రాండ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటి కారణంగా ఈ కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం చొప్పున తగ్గగలదని అంచనా వేస్తున్నాం. పవర్ గ్రిడ్ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.145 టార్గెట్ ధర: రూ.165 ఎందుకంటే: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రసార కంపెనీల్లో ఒకటి. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,962 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,703 కోట్లకు, నికర లాభం రూ.1,175 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,412 కోట్లకు పెరిగాయి. ఇబిటా 19 శాతం వృద్ధి చెందింది. అలాగే షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.2.25 నుంచి రూ.2.7కు పెరిగింది. షేర్ వారీ ఆర్జన వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11గా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.12గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నాం. కంపెనీకి భారీగా మిగులు నిధులున్నాయి. ఇదే జోరు మరో మూడేళ్ల వరకూ కొనసాగవచ్చు. ప్రభుత్వ రంగ ఈ నవరత్న కంపెనీ పవర్టెల్ పేరుతో టెలికాం వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వింధ్యాచల్ జబల్పూర్ ట్రాన్సిమిషన్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో మెగా సోలార్ పార్క్‌ను రూ.312 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తోంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.174 టార్గెట్ ధర: రూ.287 ఎందుకంటే: పదవ ద్వైపాక్షిక వేతన సెటిల్మెంట్ కారణంగా 2013-14లో రూ.వంద కోట్లుగా ఉన్న వేతన కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.310 కోట్లకు పెరిగాయి. ఇంకా ఇతర కేటాయింపులు మొత్తం 800 కోట్లకు చేరాయి. ఇది స్థూల లాభంలో 87 శాతానికి సమానం. అయితే ట్రెజరీ ఆదాయం 610 కోట్లకు పెరగడం, తక్కువ పన్ను రేటు కొంత ఊరటనిచ్చాయి. 2011-15 మధ్యకాలంలో కొత్తగా 630 బ్రాంచీలను ఏర్పాటు చేసినప్పటికీ, బ్రాంచి వారీ సగటు ఆర్జనలో పెద్దగా మార్పులేదు. వ్యవసాయ రంగంలో మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ మొండి బకాయిలు పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ పనితీరు బాగా లేదు. రిటర్న్ ఆన్ అసెట్ 30 బేసిస్ పాయింట్లు తగ్గింది. రుణ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా పగ్గాలు చేపట్టిన ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం. టైర్-వన్ పెట్టుబడులు సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే లాభపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. -
ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మార్చి క్వార్టర్లో రూ.178 కోట్ల నష్టం పొందింది. 2013-14 క్యూ4లో రూ.310కోట్ల లాభాన్ని ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.99 శాతం నుంచి 5.18 శాతానికి పెరిగాయి. నష్టాలు వచ్చినప్పటికీ, 33 శాతం డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. కాగా ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,139 కోట్ల నుంచి 56 శాతం క్షీణించి రూ.497 కోట్లకు తగ్గిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.20,963 కోట్ల నుంచి రూ.22,083 కోట్లకు పెరిగిందని వివరించింది. -
ఓబీసీ, కెనరా బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకుల బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. కెనరా బ్యాంక్ బేస్ రేటు (కనీస వడ్డీ రేటు)ను 0.20 శాతం మేర తగ్గించడంతో ఇది 10 శాతానికి దిగివచ్చింది. కొత్త రేటు మే 11 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ఓబీసీ బేస్ రేటును పావు శాతం తగ్గించడంతో ఇది 10 శాతానికి తగ్గుతుంది. కొత్త రేటు మే 15 నుంచి అమలవుతుంది. -
ఓబీసీకి మొండిబకాయిల షాక్
- క్యూ3లో లాభం 91 శాతం క్షీణత - రూ.19.56 కోట్లకు పరిమితం - 5.53%కి పెరిగిన స్థూల ఎన్పీఏలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కు మొండి బకాయిల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో నికర లాభం ఏకంగా 91.2 శాతం దిగజారి రూ.19.56 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ.224 కోట్లుగా నమోదైంది. కాగా, డిసెంబర్ చివరినాటికి ఓబీసీ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) 5.43 శాతానికి పెరిగిపోయాయి. 2013 డిసెంబర్ చివరికి స్థూల ఎన్పీఏలు 3.87 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు కూడా2.91 శాతం నుంచి 3.68 శాతానికి ఎగబాకాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 7.8 శాతం వృద్ధితో రూ. 5,064 కోట్ల నుంచి రూ.5,459 కోట్లకు పెరిగింది. నిర్వహణ వ్యయాలు రూ.712 కోట్ల నుంచి రూ.794 కోట్లకు చేరాయి. మొండిబకాయిలకు అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులతోపాటు సాంకేతికపరమైన కొన్ని కారణాలు కూడా క్యూ3లో లాభాలు భారీగా పడిపోయేందుకు కారణమైందని ఓబీసీ ఎండీ, సీఈఓ, అనిమేష్ చౌహాన్ పేర్కొన్నారు. జూన్‌లో కొన్ని మొండి బకాయిలను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని లాభంగా చూపించామని... అయితే, ఆర్బీఐతో సంప్రతింపుల అనంతరం దీన్ని పొరపాటుగా గుర్తించి, రూ.137 కోట్లను లాభాల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. మరోపక్క, డిసెంబర్ క్వార్టర్లో రూ.1,340 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారగా.. రూ.2,050 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించినట్లు చౌహాన్ వివరించారు. ఇక క్యూ3లో మొండిబకాయిల కోసం రూ.885 కోట్లను బ్యాంక్ ప్రొవిజనింగ్గా కేటాయించింది. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.561 కోట్లుగా ఉంది. కాగా, ఇటీవలే(2014 డిసెంబర్ 31న) బ్యాంక్ కొత్త సీఈఓ, ఎండీగా చౌహాన్ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఆఖరి త్రైమాసికం(క్యూ4) కూడా మందకొడిగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. భారీగా పడిన షేరు: ప్రతికూల ఫలితాల కారణంగా ఓబీసీ షేరు ధర కుప్పకూలింది. గురువారం బీఎస్ఈలో ఒకానొక దశలో 11 శాతం పైగా క్షీణించి రూ.279 కనిష్టాన్ని తాకింది. చివరకు 10.81 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది. గురువారం ఒక్కరోజులోనే బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1,182 కోట్లు ఆవిరై.. రూ.8,203 కోట్లకు పడిపోయింది. -
బ్యాంకులో చోరీకి విఫలయత్నం
బ్యాంకు లాకర్ గదికి కన్నం స్థానికుల అప్రమత్తతో దుండగుల పరారీ మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఇద్దరు దుండగులు గేట్ ద్వారా లోనికి ప్రవేశించి లాకర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. గొడ్డలి, స్క్రూడ్రైవర్, బ్లేడ్, గునపం, పోకర్‌తో లాకర్ గదికి రంధ్రం చేశారు. మధ్యలో లాకర్ గదికి ఉన్న ఆర్సీసీ(సిమెంటు కాంక్రిట్ లేయర్) అడ్డు తగిలింది. దానిని పగులగొట్టే క్రమంలో శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు మేల్కోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు లైట్లు వేయడంతో దుండగులు పారిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ వి.సురేశ్, ఎస్సైలు ఎస్కే.లతీఫ్, ఎం.వెంకటేశ్వర్లు పరిశీలించారు. దుండగులు సంఘటన స్థలంలో సారా తాగినట్లు అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్యాంకు సీసీ కెమెరాల్లో నిందితుల కదలికలు రికార్డయ్యాయి. పోలీసు, డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి నష్టం జరగలేదని మేనేజర్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. -
పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను ఆంధ్రాబ్యాంక్ తగ్గించింది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై పావు శాతం నుంచి అరశాతం వరకు వడ్డీరేట్లను తగ్గించింది. 2-3 ఏళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను 9 నుంచి 8.75 శాతానికి తగ్గించింది. ఇదే కాలపరిమితి గల కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి, అదే కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై రేట్లను 8.75 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గించింది. 6వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. అలహాబాద్ బ్యాంక్ కూడా... అలహాబాద్ బ్యాంక్ రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.15 శాతం వరకూ తగ్గించింది. ఏడాది నుంచి ఐదేళ్ల కాల శ్రేణిలో డిపాజిట్లపై 0.15 శాతం రేటు తగ్గించింది. దీని ప్రకారం ఈ రేటు 8.90 శాతానికి తగ్గుతుంది. 10వ తేదీ నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది. -
ఓరియంటల్ బ్యాంక్ లాభం 16% అప్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ (క్యూ2) కాలానికి రూ. 291 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 251 కోట్లతో పోలిస్తే ఇది 16% వృద్ధి. వడ్డీయేతర ఆదాయంతోపాటు, రికవరీలు పెరగడం ప్రధానంగా లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ భూపిందర్ నయ్యర్ చెప్పారు. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.77% నుంచి 4.74%కు ఎగశాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.69% నుంచి 3.29%కు పెరగడంతో బీఎస్ఈలో షేరు 4.3% పతనమై రూ. 267 వద్ద ముగిసింది. కాగా, రుణాల నాణ్యత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలనూ చేపట్టినట్లు నయ్యర్ చెప్పారు. ఈ కాలంలో వడ్డీయేతర ఆదాయం 26% జంప్‌చేసి రూ. 393 కోట్లకు చేరింది. గతంలో రూ. 312 కోట్లుగా ఉంది. ఇక రికవరీలు సైతం రూ. 314 కోట్ల నుంచి రూ. 339 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 5,328 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 4,988 కోట్ల ఆదాయం నమోదైంది. తాజా బకాయిలు ప్రస్తుత సమీక్షా కాలంలో ఎన్పీఏలలో భాగమైన తాజా బకాయిలు(స్లిప్పేజెస్) రూ. 978 కోట్లకు చేరాయి. గతంలో ఇవి రూ. 1,041 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు, కంటింజెన్సీలు రూ. 550 కోట్ల నుంచి రూ. 641 కోట్లకు ఎగశాయి. కాగా, నిర్వహణ లాభం రూ. 825 కోట్ల నుంచి నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. ఇక 2.6% నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) సాధించగా, కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 10.88%గా నమోదైంది. -
రూ. 180కోట్ల కుంభకోణంలో ఆర్థిక నేరస్థుడి ఆరెస్ట్
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ) తరఫున నకిలీ (ఫోర్జరీ) లేఖలను సృష్టించి, ఆ సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయులను ఓరియుంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌నుంచి దొంగచాటుగా బదలారుుంచుకున్న ఆరోపణలపై గుజరాత్‌కు చెందిన ఒక ఆర్థిక నేరస్థుడిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌నుంచి నట్వర్లాల్ బంగావాలాను శనివారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ సోమవారం ప్రకటించింది. జేఎన్‌పీటీకి సంబంధించిన రూ.180కోట్ల నగదును రెండు ఓబీసీ శాఖలనుంచి ఎవరో దొంగచాటుగా బదలాయించుకున్నారన్న సంస్థ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దర్యాప్తు కొలిక్కి వచ్చింది, జేఎన్పీటీ పేరిట జవు అరుున మొత్తం సొవుు్మ, ఏడు బ్యాంకులకు 12వుంది ఖాతాదార్లకు ఫోర్జరీ లేఖల ద్వారా బదిలీ అరుునట్టు తేలింది. ఇలా డబ్బును బదలారుుంచుకుని లబ్ధిపొందినవారిలో నట్వర్లాల్ బంగావాలా ఒకరని సీబీఐ తెలిపింది. -
రెండుగా పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీ పోస్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల్లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) పోస్టును విభజించేందుకు ఆర్థిక శాఖ సమాయత్తమవుతోంది. ఇటీవలి కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల్లో అవినీతి కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా సీఎండీ పోస్టును విడగొట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి జీఎస్ సంధూ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వీలుగా యాజమాన్యాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత వారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ దిశగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భూషణ్ స్టీల్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌ల రుణ పరిమితి పెంచేందుకుగాను రూ.50 లక్షల లంచం తీసుకున్న ఆరోపణలపై సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్కే జైన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), దేనా బ్యాంకుల్లో రూ.436 కోట్ల విలువైన కస్టమర్ల ఫిక్సిడ్ డిపాజిట్ నిధులు దుర్వినియోగమైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌పై ఆర్థిక శాఖ ఫోరెన్సిక్ ఆడిట్‌కు కూడా ఆదేశించింది. ఇదివరకే ఆర్బీఐ సిఫార్సు..: కాగా, సీఎండీ పోస్టును విడగొట్టాల్సిందిగా గతంలోనే ఆర్థిక శాఖకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సూచించడం గమనార్హం. చాలాసందర్భాల్లో డెరైక్టర్ల బోర్డులో సీఎండీలు పెత్తనం చలాయిస్తున్నారని.. బోర్డుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటే ఈ పోస్టును విభజించాల్సిందేనని ఆర్బీఐ అభిప్రాయపడింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా సీఎండీ ఉంటున్నారు. ఇక దేశీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో మాత్రం అత్యున్నత స్థానంలో చైర్మన్ ఉండగా.. మరో నలుగురు ఎండీలు వివిధ ఎగ్జిక్యూటివ్ పాత్రలను పోషిస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం చైర్మన్, ఎండీ పోస్టులు వేర్వేరుగా ఉన్నాయి.