ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మార్చి క్వార్టర్‌లో రూ.178 కోట్ల నష్టం పొందింది. 2013-14 క్యూ4లో రూ.310కోట్ల లాభాన్ని ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.99 శాతం నుంచి 5.18 శాతానికి పెరిగాయి. నష్టాలు వచ్చినప్పటికీ, 33 శాతం డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. కాగా ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,139 కోట్ల నుంచి 56 శాతం క్షీణించి రూ.497 కోట్లకు తగ్గిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.20,963 కోట్ల నుంచి రూ.22,083 కోట్లకు పెరిగిందని వివరించింది.