crore loss
-
నష్టాల్లో ఆర్టీసీ రికార్డు!
జూన్‌లో ఏకంగా రూ.84.51 కోట్ల నష్టం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నడూ లేనట్లుగా ఒక్క జూన్‌లోనే రూ.84.51 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. ఇది కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని నష్టాలు తగ్గించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించిన తర్వాతి నెలలోనే కావడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఈ లెక్కలు తేలడంతో అధికారులు కంగుతిన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ సాంకేతికంగా విడిపోలేదు. అయితే చిట్టాపద్దులను మాత్రం వేరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో డిపోల ఖాతాలు ఆ రాష్ట్రానికి.. తెలంగాణ పరిధిలోని డిపోల లెక్కలు ఈ రాష్ట్రానికి పరిమితం చేశారు. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌లో టీఎస్ ఆర్టీసీ రూ.7.5 కోట్ల లాభాలు ఆర్జించింది. దాంతో తెలంగాణ ఆర్టీసీ లాభా ల బాట పట్టిందని భావించారు. గతేడాది జూన్‌లో రూ.36.93 కోట్ల నష్టం వచ్చింది. ఈసారి జూన్‌లో ఏకంగా రూ.85 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే నష్టాలు ఏకంగా రూ.127.56 కోట్లకు చేరాయి. -
ఓబీసీకి రూ.178 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మార్చి క్వార్టర్లో రూ.178 కోట్ల నష్టం పొందింది. 2013-14 క్యూ4లో రూ.310కోట్ల లాభాన్ని ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.99 శాతం నుంచి 5.18 శాతానికి పెరిగాయి. నష్టాలు వచ్చినప్పటికీ, 33 శాతం డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. కాగా ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,139 కోట్ల నుంచి 56 శాతం క్షీణించి రూ.497 కోట్లకు తగ్గిందని, మొత్తం ఆదాయం మాత్రం రూ.20,963 కోట్ల నుంచి రూ.22,083 కోట్లకు పెరిగిందని వివరించింది. -
ఐఓబీ నష్టం రూ. 516 కోట్లు
- అధిక కేటాయింపులే కారణం - ఈ సీజన్లో తొలి నష్టం ఈ బ్యాంకుదే న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ)కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.516 కోట్ల నష్టం వచ్చింది. మొండిబకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల ఈ స్థాయి నష్టాలు వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఇప్పటివరకూ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన బ్యాంకుల్లో మొదటిసారిగా నష్టాలు ప్రకటించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఇదే. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ బ్యాంక్ రూ.75 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా ఆర్థిక ఫలితాలు దారుణంగా ఉండటంతో బ్యాంక్ షేర్ బీఎస్ఈలో గురువారం 10 శాతం క్షీణించి రూ.50.5 వద్ద ముగిసింది. గత క్యూ3లో రూ.9,168 కోట్లు(5.27 శాతం)గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో రూ.14,501(8.12 శాతానికి)కు పెరిగాయని ఐఓబీ పేర్కొంది. నికర మొండి బకాయిలు 3.24 శాతం నుంచి 3.52 శాతానికి పెరిగాయని వివరించింది. ఆదాయపు పన్ను కాకుండా మొత్తం కేటాయింపులు రూ.811 కోట్ల నుంచి రూ.1,183 కోట్లకు పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం రూ.961 కోట్ల నుంచి రూ.726 కోట్లకు తగ్గిందని, అయితే నికర వడ్డీ ఆదాయం రూ.1,344 కోట్ల నుంచి రూ.1,357 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం కూడా రూ.6,190 కోట్ల నుంచి రూ.6,647 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. నికర వడ్డీ మార్జిన్ 2.05 శాతంగా ఉందని తెలిపింది. స్వల్పంగా తగ్గిన యూకో లాభం యూకో బ్యాంక్ ఈ క్యూ3లో రూ.304 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3 నికర లాభం(రూ.315 కోట్లు)తో పోల్చితే 3.5 శాతం తరుగుదల నమోదైందని బ్యాంక్ పేర్కొంది. మొండిబకాయిలకు అధిక కేటాయింపులే లాభం తగ్గుదలకు కారణమని వివరించింది. గత క్యూ3లో మొండి బకాయిల కేటాయింపులు రూ.812 కోట్ల నుంచి రూ.908 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.4,919 కోట్ల నుంచి రూ.5,447 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.2 శాతం నుంచి 6.5 శాతానికి, నికర మొండి బకాయిలు 3.06 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ ధర బీఎస్ఈలో 6 శాతం తగ్గి రూ.68 వద్ద ముగిసింది. -
త్వరలో 80 మంది ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు
వాకాడు, న్యూస్‌లైన్ : నెల్లూరు రీజనల్ పరిధిలో ఆర్టీసీ రూ.51 కోట్ల నష్టంతో నడుస్తుండటంతో దాదాపు 80 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆర్ఎం చింతల రవికుమార్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. డిపోలోని వివిధ సెక్షన్లను పరిశీలించారు. ఆర్ఎం మాట్లాడుతూ నష్టాల్లో నడుస్తున్న 36 ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను త్వరలో రద్దు చేస్తామన్నారు. దీని వల్ల దాదాపు 80 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రతి కూడలిలో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. అలాగే కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి చెయ్యి ఎత్తిన చోట నిలిపి ఎక్కించుకోవాలన్నారు. వాకాడు, సూళ్లూరుపేట, నెల్లూరు-1, ఉదయగిరి డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. వాకాడు డిపో పనితీరు బాగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సగటున కిలోమీటర్‌కు రూ.27 కంటే తక్కువ వచ్చిన సర్వీస్‌లను రద్దు చేయాలని ఆయన డిపో మేనేజర్ రామలింగేశ్వరరావుకు సూచించా రు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎంసీ నారాయణ,ట్రాఫిక్ సూపర్వైజర్ రాధారెడ్డి, సీఆర్సీ రఘురామయ్య ఉన్నారు.