జూన్‌లో ఏకంగా రూ.84.51 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నడూ లేనట్లుగా ఒక్క జూన్‌లోనే రూ.84.51 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. ఇది కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని నష్టాలు తగ్గించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించిన తర్వాతి నెలలోనే కావడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఈ లెక్కలు తేలడంతో అధికారులు కంగుతిన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ సాంకేతికంగా విడిపోలేదు.
అయితే చిట్టాపద్దులను మాత్రం వేరు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో డిపోల ఖాతాలు ఆ రాష్ట్రానికి.. తెలంగాణ పరిధిలోని డిపోల లెక్కలు ఈ రాష్ట్రానికి పరిమితం చేశారు. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌లో టీఎస్ ఆర్టీసీ రూ.7.5 కోట్ల లాభాలు ఆర్జించింది. దాంతో తెలంగాణ ఆర్టీసీ లాభా ల బాట పట్టిందని భావించారు. గతేడాది జూన్‌లో రూ.36.93 కోట్ల నష్టం వచ్చింది. ఈసారి జూన్‌లో ఏకంగా రూ.85 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే నష్టాలు ఏకంగా రూ.127.56 కోట్లకు చేరాయి.
నష్టాల్లో ఆర్టీసీ రికార్డు!
Published Fri, Jul 29 2016 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement