న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.130 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.1,985 కోట్లకు పెరిగాయని ఓబీసీ తెలిపింది. మొండి బకాయిలు పెరగడం, వీటికి కేటాయింపులు పెంచడం వల్ల నికర నష్టాలు బాగా పెరిగాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,416 కోట్ల నుంచి రూ.4,699 కోట్లకు తగ్గింది.
సీక్వెన్షియల్‌గా తగ్గిన కేటాయింపులు..: గత క్యూ3లో రూ.1,430 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.2,340 కోట్లకు ఎగిశాయి. అయితే సీక్వెన్షియల్‌గా చూసినపుడు మాత్రం ఈ కేటాయింపులు తగ్గాయి. ఈ క్యూ2లో మొండి బకాయిలు కేటాయింపులు రూ.3,147 కోట్లుగా ఉన్నాయి.
స్థూల మొండి బకాయిలు రూ.20,492 కోట్ల నుంచి రూ.27,551 కోట్లకు. నికర మొండి బకాయిలు రూ.13,688 కోట్ల నుంచి రూ.14,195 కోట్లకు పెరిగాయని బ్యాంకు తెలిపింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 13.80 శాతం నుంచి 16.95 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 9.68 శాతం నుంచి 9.52 శాతానికి తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్ 2.4 శాతం తగ్గి రూ.117 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment