న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది.
మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు కూడా ఆర్థిక సేవల విభాగం నుంచి లేఖ అందిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనం కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గింది. 2017లో ఈ బ్యాంక్‌ల సంఖ్య 27గా ఉంది.
బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం
Published Tue, Nov 19 2019 3:53 AM | Last Updated on Tue, Nov 19 2019 3:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment