ముంబై: సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి నెలా ఒకసారి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) వడ్డీ జమ చేయనుంది. ఇప్పటి వరకూ ఆరునెలలకోసారి వడ్డీని జమ చేస్తుండగా ఇకపై దీన్ని నెలరోజులకు కుదిస్తున్నట్లు ఓబీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచీ ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. సేవింగ్స్ అకౌంట్స్ బ్యాలెన్స్‌కు సంబంధించి ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేయాలని ఇటీవలే ఆర్‌బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఓబీసీ ఒక అడుగు ముందుకువేసి... నెలకొకసారి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ జమ అవుతుందని ప్రకటించింది.
2010 ఏప్రిల్ 1 నుంచీ రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ వడ్డీ ఇప్పటి వరకూ ఆరు నెలలకు ఒకసారి జమవుతోంది. ఆర్‌బీఐ వడ్డీ జమ కాల వ్యవధి మూడు నెలలకు తగ్గించడం వల్ల బ్యాంకింగ్‌పై మొత్తంగా రూ.500 అదనపు భారం పడే అవకాశం ఉందన్నది ఈ రంగంలో నిపుణుల విశ్లేషణ. సేవింగ్స్ అకౌంట్లపై ప్రభుత్వ బ్యాంకులు 4% వరకూ వడ్డీ ఇస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు 6 శాతం వరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
ఓబీసీ పొదుపు ఖాతాల్లో ఇక నెలవారీ వడ్డీ
Published Sat, Apr 9 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
Advertisement
Advertisement