న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) సహా వివిధ చిన్న పొదుపు పథకాలపై 2025 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే నాలుగో త్రైమాసికానికి (జనవరి–మార్చి) వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాపూర్వం కొనసాగించింది. వడ్డీ రేట్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి కొన్ని పథకాలలో ప్రభుత్వం చివరిసారి మార్పులు చేసింది.
2024–25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు) కోసం నోటిఫై చేసిన రేట్లను మార్చకుండా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ పేర్కొంది. పోస్టాఫీసులు, బ్యాంకులు(Banks) నిర్వహించే స్మాల్ సేవింగ్స్ పథకాలనుపై వడ్డీ రేట్లను ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి త్రైమాసికం ఆర్థికశాఖ నోటిఫై చేసే సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ‘బీ-రెడీ’లో మంచి స్కోర్ రావాలంటే కష్టమే..
తాజా నోటిఫికేషన్ ప్రకారం జనవరి-మార్చి 2025 వరకు వడ్డీరేట్లు..
పథకం-రేటు(%)
సుకన్య సమృద్ధి 8.2
మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7.1
పీపీఎఫ్ 7.1
పోస్టాఫీ సేవింగ్స్ డిపాజిట్ 4.0
కిసాన్ వికాస్ పత్ర 7.5
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4
Comments
Please login to add a commentAdd a comment