Savings Scheme
-
గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023 స్కీమ్ ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బాలికలు, మహిళల ఆర్థిక భద్రత లక్ష్యంగా 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకం పోస్టాఫీసుల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!) ఈ పథకం కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని కలిగి ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీని కలుపుకుంటే 7.7శాతం వడ్డీ వరకూ ప్రయోజనం లభిస్తుంది. కనిష్టంగా రూ. 1,000 గరిష్టంగా రూ.2,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. (హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం) కాగా శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసంచదవండి: సాక్షిబిజినెస్ -
పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. జూలై 1 నుంచి మొదలయ్యే మూడు నెలల కాలానికి తాజా రేట్లను ప్రకటించింది. కొన్నింటి పథకాల రేట్లను 0.3 శాతం వరకు పెంచగా, చాలా పథకాల్లో రేట్లను యథాతథంగా కొనసాగించింది. ♦ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న రేటు పెంపు అనంతరం 6.5 శాతంగా మారింది. ♦ ఏడాది కాల టర్మ్ డిపాజిట్‌పై 0.1 శాతం పెరిగి 6.9 శాతానికి, రెండేళ్ల టైమ్ డిపాజిట్ రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి చేరింది ♦ మూడేళ్ల టర్మ్ డిపాజిట్ (7శాతం), ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ (7.5శాతం) రేట్లలో మార్పు చేయలేదు. ♦ అలాగే పీపీఎఫ్ వడ్డీ రేటు సైతం ఎలాంటి మార్పుల్లేకుండా 7.1 శాతంగా, సేవింగ్స్ డిపాజిట్ రేటు 4 శాతంగా కొనసాగనుంది. ♦ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) రేటు 7.7 శాతం, సుకన్య సమృద్ధి యోజన రేటు 8 శాతంలోనూ మార్పు చేయలేదు. ♦ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2శాతం, కిసా న్ వికాస్ పత్రం రేటు 7.5 శాతం కొనసాగనుంది. ♦ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) రేటు 7.4 శాతంగా కొనసాగుతుంది. పెంపు ఆగినట్టేనా? జనవరి-మార్చి, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పొదుపు పథకాలపై రేట్లను పెంచింది. దీంతో ఈ విడత కేవలం 3 పథకాలు మినహా మిగిలిన వాటి రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ సైతం గత సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను మార్చలేదు. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!
సీనియర్ సిటిజన్ల పొదుపునకు సంబంధించి ఓ అద్భుతమైన పథకం ఉంది. దాని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. మదుపు సొమ్ము 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు . అయితే దీనిపై అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు వడ్డీ కింద నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఒక వేళ భార్యాభర్తలిద్దరూ కలిపి డిపాజిట్ చేస్తే నెలకు రూ. 40,000 వరకు రాబడి లభిస్తుంది. వడ్డీ రేటు మరింత పెరిగేనా? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచవచ్చని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జరగనున్న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల తదుపరి సవరణను దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే డిసెంబర్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం లేదని ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా చెబుతున్నారు. మై ఫండ్ బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో వినిత్ ఖండారే కూడా ఈ వడ్డీ రేటు మరింత పెంచే అవకాశం లేదన్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ దిగుబడిలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వల్పకాలిక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచవచ్చని భావిస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ఇటీవలే సవరించిన నేపథ్యంలో మరో సారి సవరణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఈక్విటీ ఫండ్లే ఎందుకు...?
నేను గతంలో ప్రారంభించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖాతా గడువు తీరింది. దీనిని పొడిగించుకోవచ్చా? ఈ ఖాతా గడువు తీరినందును తాజాగా మరో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా తెరవవచ్చా?- ప్రవీణ్, విజయవాడ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఖాతా కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఐదేళ్లు పూర్తయిన తర్వాత ఈ ఖాతాను మూసేయవచ్చు. లేదా మరో మూడేళ్ల పాటు కొనసాగించవచ్చు. పాస్‌బుక్‌ను, దరఖాస్తు ఈ ను సమర్పించి ఈ ఖాతా నుంచి సొమ్ములన్నింటినీ తీసేసుకొని ఈ ఖాతాను మూసేయవచ్చు. ఈ ఖాతా గడువు పూర్తయిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు బి ను సమర్పించి ఈ ఖాతాను మరో మూడేళ్లపాటు కొనసాగించుకోవచ్చు. ఈ పొడిగింపు మీరు దరఖాస్తు చేసినప్పటి నుంచి కాకుండా, మీ ఖాతా గడువు పూర్తయిన తేదీ నుంచి వర్తిస్తుంది. ఈ ఖాతా గడువు పూర్తయిన తర్వాత ఖాతాను మూసేయకపోయినా, పొడిగింపు కోసం దరఖాస్తు చేయకపోయినా, ఈ ఖాతాను మూసేసినట్లుగానే పరిగణిస్తారు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై ఎంత అయితే వడ్డీ వస్తుందో అంతే వడ్డీ గడువు తీరిన ఖాతాకు వస్తుంది. మీరు ప్రారంభించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాకు ఎనిమిదేళ్లు పూర్తయిన తర్వాత మరో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రారంభించవచ్చు నా వయస్సు 31 సంవత్సరాలు. నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయమని తెగ చెబుతుంటారు కదా ! పైగా ఈ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. ఒక ఏడాదికి మించిన కాలానికి వేరే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి, మరో వైపు సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. కదా ! మరలాంటప్పుడు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? - హిమబిందు, హైదరాబాద్ మరే ఇతర మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందలేరు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మీరు సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పన్ను ఆదా అయ్యే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్ ఇన్ పీరియడ్ తప్పనిసరిగా ఉంటుంది. సెక్షన్ 80 సీ కింద తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఈఎల్ఎస్ఎస్ ఒకటి. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని తరచూ సలహాలిస్తుంటాము. నా వయస్సు 52 సంవత్సరాలు. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. గత ఎనిమిదేళ్లుగా పలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎఫ్టీ బిల్డ్ ఇండియా, ఎఫ్టీ ప్రైమా, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐడీఎఫ్సీ ప్రీమియర్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ, యూటీఐ ఆపర్చునిటీస్, రిలయన్స్ విజన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం విలువ ఇప్పుడు రూ.16 లక్షలకు పెరిగింది. నాకు ఎలాంటి పెన్షన్ రాదు. నేను మరో ఎనిమిదేళ్లలో రిటైరవుతున్నాను. నేను రిటైరైన తర్వాత నాకు నెలకు రూ.40,000 పెన్షన్ అవసరం. ఈ మొత్తం పొందడానికి నేను ఏ పెన్షన్ ఫండ్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఎన్పీఎస్, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ పర్సనల్ పెన్షన్ ఫండ్.. వీటిని షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సాయి సుధీర్, విశాఖపట్టణం మీరు రిటైరైన తర్వాత 20 ఏళ్ల కాలానికి నెలకు 40వేల చొప్పున పెన్షన్ కావాలంటే మీకు రూ.96 లక్షల కార్పస్ అవసరం. మనుష్యుల సగటు జీవిత కాలం 80 ఏళ్లు, దవ్యోల్బణం 8 శాతంగా తీసుకొని ఈ లెక్కలు వేశాము. నెలకు రూ.25,500 చొప్పున ఎనిమిదేళ్లపాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, ప్రస్తుతం మీ దగ్గరున్న రూ.16 లక్షల మొత్తంపై 12 శాతం రాబడి వస్తుందని లెక్కిస్తే మీరు ఆశించినట్లుగా నెలకు రూ.40,000 చొప్పున పెన్షన్ పొందగలరు. మీ రిటైర్మెంట్ నిధి కోసం మీకు టైలర్ మేడ్ పెన్షన్ ప్లాన్ ఏదీ అవసరం లేదని భావిస్తున్నాం. పన్ను మినహాయింపులు కావాలని కోరుకుంటే తప్ప. ఏదైనా రెండు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన నియంత్రణ ఉంటుంది. సాధారణంగా జీవిత బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈ ప్లాన్లు బీమాను, ఇన్వెస్ట్మెంట్స్ కలగలిపి ఉంటాయి. ఇవి ఖరీదైనవే కాకుండా, తగిన బీమాను, రాబడులను అందించలేవు. కొత్తగా హెచ్డీఎఫ్సీ సంస్థ హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో మూడు విభిన్నమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లున్నాయి. అయితే దీర్ఘకాలిక పనితీరు చరిత్ర లేని ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత తెలివైన పనికాదు. పన్ను రాయితీలు ఇచ్చే ప్రభుత్వ పెన్షన్ పథకం కావాలనుకుంటే, నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)ను పరిశీలించవచ్చు. అయితే ఎన్పీఎస్కు రెండు పరిమితులున్నాయి. ఎన్పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఈక్విటీ కేటాయింపులు 50 శాతం కంటే మించకూడదు. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వంద శాతం వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రాబడులస్తాయి. రెండోది.., రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ కార్పస్‌లో మీరు 40 శాతంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ 40 శాతంపైననే మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్