
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023 స్కీమ్ ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బాలికలు, మహిళల ఆర్థిక భద్రత లక్ష్యంగా 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకం పోస్టాఫీసుల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!)
ఈ పథకం కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని కలిగి ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీని కలుపుకుంటే 7.7శాతం వడ్డీ వరకూ ప్రయోజనం లభిస్తుంది. కనిష్టంగా రూ. 1,000 గరిష్టంగా రూ.2,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. (హెచ్‌డీఎఫ్‌సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం)
కాగా శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది.
మరిన్ని బిజినెస్‌వార్తలు, అప్‌డేట్స్ కోసంచదవండి: సాక్షిబిజినెస్