Mahila
-
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
చెల్లెమ్మా.. టీ స్టాల్ ఎలా నడుస్తోంది?
ఖమ్మం: మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో ఆర్థికంగా రాణించేలా ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట బస్టాప్ వద్ద ఇందిరా మహిళాశక్తి సహకారంతో ఏర్పాటుచేసిన ‘స్త్రీ టీ స్టాల్’ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలితో మాట్లాడిన ఆయన ‘చెల్లెమ్మా చాయ్ సెంటర్ ఎలా నడుస్తోంది, వ్యాపారం అనుకూలంగా ఉందా’ అని ఆరా తీయడంతో పాటు టీ చేయించుకుని తాగారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్ధికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా అని తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కుటుంబాల ఆర్థికాభివృది్ధకి అండగా నిలుస్తుందని, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. -
మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకలి్పంచారని, మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్, థర్డ్‌ఫ్లోర్‌లో మహిళాశక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళాశక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లోనూ.... మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళాశక్తి కాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళాసంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయ, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, అధికారులు నర్సింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ‘తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉన్నదో’గమనించాలని సూచించా రు. ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె ధర్మపురి, పెగడపల్లి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రావాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం ఆమె ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. తర్వాత స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో మహిళలతో మాట్లాడారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో లేదని సాకులు చెబుతూ ఏ పనీ చేయ ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు ఓటు వేయడం వృథా అన్నారు. మంథని అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం ప్రకటించారని, మంథనిని కేసీఆర్ దత్తత తీసుకుంటారేమో అనిపిస్తోందన్నారు. -
నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? ఆమె సేవలకు గుర్తుగా రైల్వే ఏం చేసింది?
ఒక వీధికి లేదా రహదారికి లేదా ఏదైనా ప్రదేశానికి ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని మనం చూసేవుంటాం. ఇటువంటి గౌరవం అధికంగా మహనీయులైన పురుషులకే దక్కింది. భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో మహాత్మా గాంధీ పేరు మీద ఏదో ఒక రహదారి తప్పకుండా ఉంటుంది. ఈ విషయంలో మహనీయులైన మహిళామణులకు అటువంటి గౌరవం దక్కడం తక్కువేనని చెప్పవచ్చు. తూర్పు రైల్వే కూడా చాలా కాలం పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే, 1958లో ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలు దేశానికి చెందిన ఒక మహనీయురాలికి ఘన నివాళులర్పించాలని నిర్ణయించాయి. ఆ మహనీయురాలి పేరు మీద పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక స్టేషన్‌కు ‘బేలా నగర్ రైల్వే స్టేషన్’ అనే పేరు పెట్టారు. భారత చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన తొలి మహిళగా బేలా మిత్ర నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కొడలియాలోని సంపన్న కుటుంబంలో 1920లో జన్మించిన బేలా మిత్రను అమిత లేదా బేలా బోస్ అని కూడా పిలుస్తారు. ఆమె తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య. అంటే బేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ‘నేతాజీ’కి మేనకోడలు. 1941లో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం జరుగుతున్న సమయంలో నేతాజీని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు, అక్కడి నుంచి ఆయన తప్పించుకునేందుకు బేలా ప్రధాన పాత్ర పోషించారు. చాలా చిన్న వయస్సులోనే బేలా స్వాతంత్ర్య పోరాటానికి అంకితమయ్యారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ఏర్పడినప్పుడు ఆమె ‘ఝాన్సీ రాణి’ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. ఆమె భర్త హరిదాస్ మిశ్రా కూడా ఆమె మాదిరిగానే విప్లవకారుడు. ఐఎన్ఏ ప్రత్యేక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బేలాను అధికారులు కలకత్తాకు పంపారు. అక్కడ ఉంటూనే ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బేలా భర్త జైలు నుండి విడుదలయ్యారు. అతనితో పాటు అనేక మంది విప్లవకారులు విడుదలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని బేలా నిర్ణయించుకున్నారు. విభజన వల్ల జరిగిన హింసాకాండలో నష్టపోయిన వారికి సహాయం చేయాలని బేలా నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులకు సహాయం చేయడానికి ఆమె 1947లో ‘ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, బాధితులకు సేవలు అందించారు. 1952, జూలైలో ఆమె తన చివరి శ్వాస వరకు బాధితులకు సేవ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో విశేష సేవలు అందించినప్పటికీ బేలా పేరు చరిత్ర పుటలలో అంతగా కనిపించకపోవడం శోచనీయం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి? -
టీడీపీ వ్యాఖ్యలపై రజక సంఘాల నిరసన
తెనాలి: మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ బెంగళూరులో టీడీపీ ఆధ్వర్యాన ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో ఓ మహిళ ‘రజకులు వెధవలు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై రజక సంఘాల నేతలు మండిపడ్డారు. సదరు మహిళ వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ పదేపదే ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ధర్నా చేశారు. టైర్లను దహనం చేసి, ఆ మంటల్లో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను పడేశారు. ఐటీ ఉద్యోగుల ముసు గులో టీడీపీ కార్యకర్తలే రజకులను కించపరి చేలా మాట్లాడారని, తక్షణమే క్షమాపణ చెప్పా లని రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు డిమాండ్ చేశారు. -
గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023 స్కీమ్ ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బాలికలు, మహిళల ఆర్థిక భద్రత లక్ష్యంగా 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకం పోస్టాఫీసుల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!) ఈ పథకం కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని కలిగి ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీని కలుపుకుంటే 7.7శాతం వడ్డీ వరకూ ప్రయోజనం లభిస్తుంది. కనిష్టంగా రూ. 1,000 గరిష్టంగా రూ.2,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. (హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం) కాగా శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసంచదవండి: సాక్షిబిజినెస్ -
Mahila Samman Scheme: గుడ్‌న్యూస్: మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్లో మహిళా సమ్మాన్ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తాజాగా స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! అదే సమయంలో రాబడిపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) అమలు చేయరని పేర్కొంది. సీబీడీటీ ఆదేశాల ప్రకారం మహిళా సమ్మాన్ సర్టిఫికెట్లో వచ్చే వడ్డీ ఆదాయం రూ.40వేలు మించకపోతే టీడీఎస్ వర్తించదని స్పష్టమవుతోందని నాంజియా అండర్సన్ ఇండియా పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై ఒక ఏడాదిలో 7.5 శాతం మేరకు రాబడి రూ.15,000గానే ఉంటుందని, కనుక టీడీఎస్ వర్తించదన్నారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
బలహీన వర్గాలకే ప్రాధాన్యం
‘ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధికారత సాధించినపుడే వారి నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. అట్టడుగున ఉన్న వర్గాల మహిళలను ఈ రంగాల్లో ప్రోత్సహించినపుడు సమాజానికి మేలు జరుగుతుంది. ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలు కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టీకరించారు. ఈ కేవలోనే మహిళా అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. సాక్షి, అమరావతి: మహిళా దినోత్సవ సందేశాన్ని నిజం చేస్తూ ఆయన ప్రకటించిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో బలహీన, బీసీ వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఈ జాబితాలో నలుగురు లోక్‌సభ, 15 మంది శాసనసభ అభ్యర్థులున్నారు. మహిళాభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పుకొనే టీడీపీ ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లే అయినా... దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకునే టీడీపీకి దీటుగా వైఎస్ జగన్ మహిళా అభ్యర్థులను.. అందులోనూ బీసీ, బలహీన వర్గాలకు చెందినవారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. తాను భవిష్యత్తులో వారి పట్ల ఎలా ఉండబోతున్నారో సంకేతాలిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యం కల్పించడానికి వెనుకాడబోనని ఆయన ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేశారు. అసెంబ్లీ బరిలోని నారీమణులు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థుల్లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు కాపులు, ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గంవారు. కురుబ వర్గానికి చెందిన కళ్యాణదుర్గం అభ్యర్థి ఉషాచరణ్ సాధారణ మహిళ. దళిత కుటుంబానికి చెందిన పద్మావతి విద్యావంతురాలు. తాడికొండ (ఎస్సీ) అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి మంచి డాక్టర్. జనరల్ సీటైన చిలకలూరి పేట నుంచి బరిలో ఉన్న విడదల రజని బీసీ మహిళ. ప్రత్తిపాడు (ఎస్సీ) అభ్యర్థి మేకతోటి సుచరిత రెండుసార్లు ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ) అభ్యర్థి తానేటి వనితకు రాజకీయ నేపథ్యం ఉంది. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ సాధ్యమైనంత మేర మహిళలకే సీట్లు కేటాయించారు. పాడేరు (ఎస్టీ) అభ్యర్థి గొట్టుకుళ్ల భాగ్యలక్ష్మిది సాదాసీదా నేపథ్యమే. కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి రెండోసారి పోటీ చేస్తున్నారు. పాతపట్నం అభ్యర్థి రెడ్డి శాంతి తూర్పు కాపు. రంప చోడవరం అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గృహిణి. ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పెద్దాపురం అభ్యర్థి తోట వాణి కాపు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత తోట నరసింహం సతీమణి. పరిచయం అక్కర లేని రోజా ఇక మహిళలకు జరిగే అన్యాయాలు, అణచివేతపై నిప్పులు చెరుగుతూ పోరాడే ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆర్.కె.రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, రిషితేశ్వరి మరణం, ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దౌర్జన్యాలతో సహా పలు మహిళా సమస్యలపై ఆమె గత ఐదేళ్లుగా పోరాడిన తీరు ప్రజలకు విదితమే. టీడీపీలో అధినేతల అత్మీయులకే సీట్లు టీడీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న వారంతా సీనియర్ నేతల ఆత్మీయులే. రాజమండ్రి అభ్యర్థి మాగంటి రూప ప్రస్తుత ఎంపీ మురళీమోహన్ కోడలు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. రాజంపేట అభ్యర్థి డి.కె.సత్యప్రభ దివంగత పారిశ్రామికవేత్త డి.కె.ఆదికేశవులు సతీమణి, ఆమె ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే. ఇక తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా, పలుమార్లు నెల్లూరు, బాపట్ల ఎంపీగా ఉన్నారు. ఏనాడూ టీడీపీలో లేని ఈమెకు... ఢిల్లీలో ఉన్నత స్థాయిలో జరిగిన రాజకీయ ఒప్పందాల కారణంగా టిక్కెట్ వచ్చిందన్న ప్రచారం ఉంది. అభ్యర్థులంతా..ఆర్థిక వనరులు ఉన్నవారే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులంతా గట్టి రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారే. వీరిలో నలుగురు రెడ్డి సామాజికవర్గం, ఒకరు క్షత్రియ, నలుగురు ఎస్సీలు. ఇద్దరు ఎస్టీ అభ్యర్థులున్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అలూరులో కోట్ల సుజాతమ్మ, పుంగనూరులో అనూషారెడ్డి, పాణ్యంలో గౌరు చరిత వీరంతా రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులు కావడం విశేషం. గౌతు శిరీష (పలాస), గుండా లక్ష్మీదేవి (శ్రీకాకుళం), కోళ్ల లలితకుమారి(ఎస్.కోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ రూరల్) వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. -
బెంగాల్: లేడీస్ దంగల్
సాక్షి, కోల్‌కతా: 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 60 మంది మహిళా సభ్యులు గెలుపొందగా, అందులో 12 మంది అంటే 20 శాతం మంది పశ్చిమ బెంగాల్ నుంచే కావడం గమనార్హం. దేశంలో బెంగాలీల జనాభా శాతానికి ఇది రెట్టింపు కన్నా అధికం. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థుల్లో 30 శాతానికి పైగా మంది గెలుపొందారు. తృణమూల్‌కు చెందిన ఉమా సోరెన్ అత్యంత పేద సభ్యురాలు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.5 లక్షల కన్నా తక్కువే. గతంలో కన్నా 2014లోనే అత్యధిక సంఖ్యలో మహిళా సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ 41 శాతం సీట్లను మహిళలకే కేటాయించిన సంగతి తెలిసిందే. -
వీడని మిస్టరీ
కోమాలోనే మహిళ ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు రాజమహేంద్రవరం క్రైం : అపస్మారకస్థితిలో ఉన్న మహిళ సంఘటనకు సంబంధించిన మిస్టరీ వీడలేదు. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30న బాకీలు వసూలు చేసుకువస్తానని చెప్పి మండపేట Ðð ళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. ఆమెను మండపేట నుంచి కిడ్నాప్ చేసి రాజమహేంద్రవరం తీసుకువచ్చి ఉంటారని, ఆమెకు సన్నిహితులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే క్వార్టర్స్ గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ సంఘటన కు పాల్పడి ఉంటారన్నారు. ఆ క్వార్టర్లలో ఖాళీగా ఉన్న పోర్షన్ గురించి బయట వారికి తెలిసే అవకాశం లేదన్నారు. ముమ్మరంగా దర్యాప్తు ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. బంధువులను, ఆమె వద్ద అప్పులు తీసుకున్న వారిని, గతంలో ఆమె పని చేసిన జ్యోతిషుడిని కూడా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జ్యోతిషుడు ఇప్పటికే సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కోమా నుంచి బయటకు వస్తేనే.. పోలీసులు ఇప్పటి వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. మహిళను మండపేట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఉంటారా? లేక రాజమహేంద్రవరం వచ్చిన తరువాత ఇక్కడే కిడ్నాప్ చేసి రైల్వే క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువరోజులు కాళ్లూ చేతులూ కట్టేయడంతో ఆమె అవయవాల పనితీరు క్షిణించిందని వైద్యులు చెబుతున్నారు. దాని కారణంగా బ్రెయి¯Œæలో నరాలు దెబ్బతిని ఆ మహిళ కోమాలోనే ఉందన్నారు. కోమా నుంచి బయటకు వస్తేనే వివరాలు తెలుస్తాయన్నారు. -
బావిలో పడి మహిళ ఆత్మహత్య
భూపాలపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ బావిలోపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూపాలపల్లి నగర పంచాయతీలోని జంగేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానిక సీఐ సీహెచ్ రఘునందన్‌రావు కథనం ప్రకారం.. జంగేడు గ్రామానికి చెందిన మేదరి రాజ్‌కుమార్ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య సులోచన(35) గత రెండేళ్లుగా కడుపునొప్పి, నడుము నొప్పితో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. అయినా ఆరోగ్యం బాగుపడలేదు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఆమెకు భరించలేని కడుపునొప్పి రావడంతో గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్తున్నానని కూతురు కళ్యాణికి చెప్పి బయల్దేరింది. అనంతరం కొద్దిసేపటికి కళ్యాణి తన తాతయ్య లింగయ్యకు ఫోన్ చేసి ‘అమ్మ వచ్చిందా’ అని ఆరా తీయగా సులోచన ఇక్కడికి రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకసాగారు. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో తన తండ్రి లింగయ్య ఇంటి సమీపంలోని ఓ బావిలో సులోచన శవమై కనిపించింది. మృతురాలికి కుమార్తె కల్యాణి, కుమారుడు పవన్ ఉన్నారు. -
భర్త దాడిలో గాయపడిన మహిళ మృతి
చెన్నారావుపేట : భర్త చేతిలో దెబ్బలు తిని తీవ్రగాయాలపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని అక్కల్చెడ శివారు లచ్చినాయక్ తండాలో శుక్రవారం జరిగింది. ఎస్సై జగదీష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు చంద్రు చిన్న కుమారుడు రవికి కొత్తగూడెం మండలం ఓటాయి తండాకు చెందిన భూక్య జామ్‌ల–పాక్రిల కూతురు రమ(32)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి సంసార జీవితంలో కుమార్తెలు అశ్విని, మధుమతి, కుమారుడు నవీ¯ŒS జన్మించారు. సోమవారం రవి తన భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. రమ మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతురాలి తండ్రి జామ్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మార్పుల పేరిట కార్మిక చట్టాల నిర్వీర్యం
ఏయూక్యాంపస్: కార్మిక చట్టాల్లో మార్పుల పేరిట చట్టాలను నిర్వీర్యం చేస్తూ పరిశ్రమలను చట్టపరిధిలోనికి రానీయకుండా చేస్తున్నారని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ అఖిల భారత కన్వీనర్ డాక్టర్ కె.హేమలత ఆరోపించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ) ఎనిమిదవ రాష్ట్ర సదస్సులో మాట్లాడారు. కార్మికులను బానిసలుగా మారుస్తూ, యజమానులకు లాభాలు పెంచే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. సామాజిక, భద్రత, సరైన వేతనాలు లేకుండా కార్మికులు జీవనం సాగిస్తున్నా, వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. శ్రామిక మహిళలల్లో 96 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నా, వీరికి ఎలాంటిæ చట్టాలూ వర్తించడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యాజమాన్యాలకు సేవ చేస్తోందని ఆక్షేపించారు. కేంద్ర కార్మిక శాఖమంత్రి ప్రసూతి సెలవును 26 వారాలకు పెంచాలని ప్రకటించడం ఆహ్వానించదగినదన్నారు. అదే సమయంలో చిన్న ఫ్యాక్టరీల చట్ట సవరణ వల్ల 40 మంది కంటే తక్కువ కార్మికులనున్న పరిశ్రమలకు ఈ చట్టం వర్తించదన్నారు. ఈ నిర్ణయం వల్ల 70 శాతం పరిశ్రమలు ఏ చట్టమూ వర్తించకుండా లాభ పడతాయన్నారు. మహిళలు నిత్యం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వాటిని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నాయని ఆరోపించారు. బ్రాండెక్స్, అంగన్వాడీ, ఆశ, మున్సిపల్ పోరాటాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న జరిగే సమ్మె, ఆగస్టు 9న జరిపే జైల్ భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఈజెడ్) ఆధునిక జైళ్లుగా నిలుస్తున్నాయన్నారు. 24 గంటలు దుకాణాలు తెరవవచ్చనే వెసులుబాటు మహిళల రక్షణను ప్రశ్నార్ధకంగా మారుస్తుందన్నారు. శ్రామిక మహిళల §lష్టికోణంలో చట్టాలు, పని పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షత వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ నాయకురాలు పి.రోజా పతావిష్కరణ చేశారు. రెండు రోజుల సదస్సులో ఎం.కామేశ్వరి, కె.స్వరూపారాణి, బేబిరాణి, రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ నగర, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, ఎస్.రమేష్‌లు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి 220 మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
మహిళ మెడలో గొలుసు అపహరణ
భీమిలి:ఇంట్లో ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని ఆగంతకుడు అపహరించుకుపోయాడు. భీమిలిలోని సుభాష్‌రోడ్డులో పెంటపల్లి లక్ష్మీకాంతం(65) అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తలుపులు తీసి ఇంట్లో కూర్చుని ఉండగా వెనుకవైపు గోడదూకి వచ్చిన ఆగంతకుడు ఒక్కసారిగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించకుని పరారయ్యాడు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం ఎస్ఐ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారు వేరే చోట ఉంటున్నారు. -
ఓటర్ల జాబితాలో భారీ తేడాలు!
సాక్షి, ముంబై: ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్ర జనాభాతోపాటు ఓటర్ల జాబితా పెరిగింది. దీంతోపాటు పురుషులు, మహిళా ఓటర్ల సంఖ్యలో వ్యత్యాసం కూడా పెరగడం విశేషం. ముఖ్యంగా రాష్ట్ర జనాభాను పరిశీలించినట్టయితే ప్రతి 1000 మంది పురుషులకుగాను 925 మంది మహిళలున్నట్టు తెలుస్తోంది. అయితే ఓటర్ల జాబితాలో మాత్రం ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు కేవలం 884 మహిళ ఓటర్లు ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబరు ఒకటో తేదీ వరకు నిర్వహించిన విషయం విదితమే. దీంతో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7.62 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడయింది. అయితే అనేక మంది నకిలీపత్రాలు, చిరునామాలు, పేర్లతో ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేసుకున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో 36.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.62 కోట్లుగా తేలింది. అయితే ఈ ఓటర్లలో పురుష, మహిళా ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.05 కోట్ల మంది పురుష, 3.57 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తేలింది. ప్రతి 1000 మంది పురుషులకుగాను 884 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ సంఖ్య గతంలో కంటే కూడా తక్కువ కావడం విశేషం. ఐదేళ్ల కిందటి ఓటరు జాబితాను పరిశీలించినట్టయితే ప్రతి 1000 మంది పురుషులకు గాను 891 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఆడపిల్లలు వద్దనుకునేవారు ఇంకా ఉండడంతోపాటు, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోకపోవడం తదితర కారణాల వల్ల సంఖ్య తగ్గిఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలించినట్టయితే భోసరీలో అత్యధిక వ్యత్యాసం ఉంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే చాలా తక్కువగా ఉంది. మరోవైపు పురుషులు, మహిళ ఓటర్లలో అత్యల్ప వ్యత్యాసం చంద్రాపూర్ జిల్లా వరోరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. -
మంత్రి శైలజానాథ్‌ను అడ్డగించిన మహిళలు
ఒంగోలు టౌన్,న్యూస్‌లైన్: ‘నాలుగు రోజులుగా నీళ్లలోనే ఉన్నాం. ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. ఉన్నదంతా వరదలో కొట్టుకుపోయింది. మీరే మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా?’ అంటూ ఒంగోలు నగరంలోని ముంపు ప్రాంత కాలనీ వాసులు జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్‌ను నిలదీశారు. శనివారం బలరాం కాలనీ, బిలాల్‌నగర్ కాలనీల్లో పర్యటించిన మంత్రికి మహిళలను నుంచి నిరసన ఎదురైంది. తమ కాలనీల్లోని వీధుల దుస్థితి చూడాలంటూ పట్టుబట్టారు. రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి పద్మావతి ఫంక్షన్ హాలులో వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 10,200 మందికి బియ్యం అందించనున్నట్లు వివరించారు. జిల్లాలో అధికంగా వర్షాలు కురవడంతో నష్టం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి దాదాపు రూ.127 కోట్ల నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా అందిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల నష్టం జరిగి నట్లు తెలుస్తోందన్నారు. నగరంలోని పోతురాజుకాలువను అభివృద్ధి చేసేందు కు కొన్ని సమస్యలున్నా.. త్వరలోనే పరిష్కరించి ఆధునికీకరిస్తామన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పోతురాజు కాల్వ ఆక్రమణలకు గురవడంతో సమస్యకు త్వరితగతిన పరి ష్కారం లభించడంలేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయ్‌కుమార్, ఆర్డీఓ మురళి, కమిషనర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీనాయకులు జడా బాలనాగేంద్రయాదవ్, ఘనశ్యాం, ఈదర మోహన్, వేమా శ్రీనివాసరావు, కండె శ్రీనివాసులు, నాళం నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మహిళపై అఘాయిత్యం
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మండలంలోని మన్నూర్‌కు చెందిన కేంద్రే రంజనాబాయి(42) భర్త సుభాష్ మూడేళ్ల క్రితం చనిపోయూడు. దీం తో రంజనాబారుు వ్యవసాయ కూలీగా పని చే స్తూ కుమారులు రతన్హరి(18), జ్ఞానేశ్వర్ (16)ను పోషిస్తోంది. ఆదివారం ఉదయం వం ట చెరకు తెస్తానని సంచిలో తాడు తీసుకుని బ యల్దేరింది. సాయంత్రం దాటినా ఇంటికి చేరలే దు. దీంతో కుమారులు, స్థానికులు గ్రామ పరి సర ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోరుుంది. సోమవారం ఉదయం స్థానికుడొకరు వాగు పక్క నుంచి వెళ్తుండగా చెట్టు పక్కన పొదల్లో సంచి కనిపించింది. అక్కడికెళ్లి చూడగా మహిళ శవం కనిపించడంతో గ్రా మస్తులకు సమాచారం అందించాడు. సమాచా రం అందుకున్న ఎస్సై ఎల్.వెంకటరమణ చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం రంజనాబాయిదిగా గుర్తించారు. కట్టేసి.. హింసించి.. రంజనాబారుుని కట్టేసి.. హింసించి చంపినట్లు ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది. మృతదేహం కాళ్లూచేతులు తాడుతో కట్టేసి ఉన్నారుు. అదే తాడు మెడలో ఉచ్చు వేసి ఉంది. తల, కంటి భాగంలో గాయాలై రక్తస్రావం అరుుంది. ఆమె లోదుస్తులు మృతదేహం పక్కన పడేసి ఉన్నా యి. మృతురాలి ఛాతి భాగంలో పంటిగాట్లు, జననాంగం నుంచి రక్తస్రావం జరిగినట్లు ఆనవాళ్లున్నాయి. మృతురాలిని తాడుతో కట్టేసి, లైంగికదాడి జరిపి, ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ రాంగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధురి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు. జాగిలా లు మృతదేహం నుంచి గ్రామంలోకి వెళ్లి ఆగిపోవడంతో స్థానికులపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ హత్య లో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు లభించకపోవడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. పోస్టుమార్టం నివేదిక ఆధారం గా కేసు దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, గతంలో తండ్రి మరణం.. తాజాగా తల్లి హత్యకు గురవడంతో కుమారులు ఒంటరి వారయ్యారు. మృతదేహం వద్ద వారి రోదన స్థానికులను కలచివేసింది. -
లైంగికదాడులకు పాల్పడితే కఠిన చర్యలు
జనగామ క్రైం,న్యూస్‌లైన్ : మహిళలపై లైగింకదాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రూరల్ ఎస్పీ పాలరాజు హెచ్చరించారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బచ్చన్నపేట మం డలం తమ్మడపల్లి గ్రామం వద్ద శనివారం లైం గికదాడికి గురైన మహిళను ఎస్పీ పాలరాజుతో పాటు రూరల్ అడిషినల్ ఎస్పీ కె. శ్రీకాంత్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లైంగికదాడికి గురైన మహిళ హైదరాబాద్‌లోని శావాలి దర్గా ప్రాంతానికి చెందినదని, పేరు ఇ.లక్ష్మీ అని రా సి చూపించడంతోపాటు ఆమె బంధువుల ద్వా రా తెలిసిందన్నారు. బాధితురాలు మహిళ మూగ, చెవిటి అని తమ ప్రాథమిక దర్యాప్తు లో తేలిందన్నారు.లైంగికదాడికి పాల్పడ్డ నిం దితులపై నిర్భయ చట్టం సెక్షన్ 376 (డి) కిం ద కేసు నమోదు చేసి లారీని సీజ్ చేయనున్న ట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి మెదక్ జిల్లా రామాయంపేటకు ఎందుకు వెళ్లింది? ఆమె వెంట ఎవరెవరు ఉన్నారో వారి బంధువుల ద్వారా వివరాలు తెలుకుంటామని, బాధితురాలే లారీని ఆశ్రయించిందా? లేక లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగం ఎదుర్కొంటున్న లారీ డ్రైవర్లు ఆమెను నమ్మించారా అనే విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఉదయం మరోసారి పరీక్షించిన వైద్యులు బాధిత మహిళకు ఆదివారం ఉదయం జనగామ ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, సూపరింటెండెంట్ డాక్టర్ పద్మ, అడిషినల్ ఎస్పీ కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఆమె బంధువుల సమక్షంలో మరోసారి వైద్యపరీక్షలను నిర్వహించారు. వైద్యులు చికిత్స అందిస్తుండడంతో ఆమె క్రమంగా కోలుకుంటోంది. మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా డివిజన్ కార్యదర్శి ఇర్రి ఆహల్య ఓ ప్రకటనలో డిమాండ్ చేస్తూ జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. -
సమంజసమైన తీర్పు!
మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న అఘాయిత్యాల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక అత్యాచారం కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ తరహా నేరాల నియంత్రణకు, నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది. అత్యాచారం కేసుల్లో రాజీ కుదిరినంతమాత్రాన నేరస్తుడి శిక్ష తగ్గించడానికి అది ప్రాతిపదిక కారాదని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నేరతీవ్రతనుబట్టి శిక్ష ఉండాలన్న సూత్రానికి ఇలాంటి ధోరణి గండికొడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీ వీధుల్లో ఒక యువతిపై మానవాకార మృగాలు దాడిచేసి బలిగొన్న ఉదంతం, తర్వాత దేశమంతా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అటు తర్వాత మహిళలపై సాగుతున్న నేరాలను అరికట్టడానికి శరవేగంతో ఒక ఆర్డినెన్స్, దాని స్థానంలో చట్టం వచ్చాయి. కానీ, అత్యాచారం ఉదంతాలు ఏమాత్రం తగ్గలేదు. ఈమధ్యే ముంబై మహానగరంలో ఒక ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళలపై సాగుతున్న నేరాలకు కేవలం చట్టాల్లోనే పరిష్కారాలు వెతికితే సరిపోదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. సమాజాన్ని దట్టంగా ఆవరించివున్న పితృస్వామిక భావజాలమూ... దాని ప్రభావంతో మహిళల సమస్యలపై ఏర్పడివున్న ఉదాసీనత ఇలాంటి ఘటనలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. అత్యాచారంగానీ, ఇతర లైంగిక నేరాలుగానీ జరిగిన సందర్భాల్లో పోలీసులవరకూ వెళ్లే కేసులే తక్కువగా ఉంటాయి. ఆ కేసుల్లో సైతం దర్యాప్తు జరిగే తీరువల్లనైతేనేమి, ఆ సమయంలో రాజీ కుదర్చడానికి పోలీసులు చేసే ప్రయత్నాలవల్లనైతేనేమి బాధితురాలికి న్యాయం లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దర్యాప్తు పూర్తయి, న్యాయస్థానాల్లో కేసు విచారణకు వచ్చిన దశలో సైతం బాధితురాలిపై వచ్చే ఒత్తిళ్లు చివరకు నిందితులు తప్పించుకోవడానికి లేదా తక్కువ శిక్షతో బయటపడటానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులో రాజీ పడ్డారన్న కారణాన్ని చూపి న్యాయస్థానాలు నిందితులపై మెతక ధోరణి అవలంబించడం తగదని కింది కోర్టులకు సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఈ విషయంలో భారత శిక్షాస్మృతి ఇస్తున్న విచక్షణాయుత అధికారాలను అలవోకగా ఉపయోగించడం తగదని స్పష్టం చేసింది. అసలు అత్యాచారాన్ని మహిళకు వ్యతిరేకంగా జరిగిన నేరంగా మాత్రమే కాక, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా పరిగణిస్తే ఇలాంటి రాజీలకు ఆస్కారం ఉండదు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోమని ఎన్నడో 1996లోనే సుప్రీంకోర్టు చెప్పినా మన ప్రభుత్వాలు కదలలేదు. కులం, డబ్బు, రాజకీయ పలుకుబడి వగైరా కారణాలతో అత్యాచారం కేసుల్లో దర్యాప్తు దశనుంచి విచారణ వరకూ బాధిత కుటుంబాలపై ఒత్తిళ్లు వస్తూనే ఉంటాయి. గ్రామసీమల్లో ఉండే కులపంచాయతీలు, పోలీస్స్టేషన్లు ఇలాంటి రాజీలకు వేదికలుగా మారుతున్నాయి. అందరికందరూ ఒత్తిళ్లు తెస్తుంటే, తమనే దోషులుగా చూస్తుంటే ఆ కుటుంబాలు కుమిలిపోతూ చివరకు గత్యంతరంలేక రాజీకి ఒప్పుకుంటున్నాయి. ఎడతెగకుండా సాగుతున్న దర్యాప్తులు, న్యాయస్థానాల్లో అడుగుముందుకు కదలని విచారణలు దోషులకే దన్నుగా నిలుస్తున్నాయి. నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారం కేసుల్లో అన్ని వ్యవస్థలూ చురుగ్గా కదులుతున్నాయని అందరూ అనుకుంటుంటే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇటీవల కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాలు గమనిస్తే గుండె చెరువైపోతుంది. గత ఏడాది దేశం మొత్తంమీద అత్యాచారానికి సంబంధించి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 14,700 కేసులు (14.5 శాతం)మాత్రమే న్యాయస్థానాల్లో పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో 3,563 మందికి శిక్షలు పడగా, 11,500 మంది నిర్దోషులుగా బయటపడ్డారు. నిజానికి నిర్భయ ఉదంతానికి ముందే అత్యాచారం కేసులకు సంబంధించి నేర విచారణ చట్టానికి పలు సవరణలు వచ్చాయి. ఉదాహరణకు ఆ చట్టంలోని సెక్షన్ 309కి 2009లో చేసిన సవరణ... అత్యాచారం కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశిస్తోంది. అందుకోసం అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప కేసుల విచారణ వాయిదా వేయరాదని, వీలైతే రోజువారీ విచారణ చేపట్టాలని కూడా స్పష్టం చేసింది. కానీ, పాటిస్తున్నదెక్కడ? 2008లో ఇదే చట్టానికి చేసిన సవరణ ప్రకారం అటు బాధితురాలి నుంచి, ఇటు నిందితుడి నుంచి ఆడియో-వీడియో వాంగ్మూలాలు తీసుకోవాలి. బాధితురాలు సురక్షితమని భావించినచోటనే ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేయాలని, ఆ సమయంలో ఆమెవద్ద మహిళా పోలీసు అధికారి లేదా ఆమె కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఉండాలని ఆ సవరణ చెబుతోంది. ఇంకా వెనక్కువెళ్తే 2006లో వచ్చిన సవరణ ప్రకారం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేటప్పుడు డీఎన్ఏ నమూనాలు సేకరించాలంటోంది. అత్యాచారం కేసుల్లో వీటన్నిటినీ పాటిస్తున్నారనడం కంటే తరచుగా ఉల్లంఘిస్తున్నా రంటేనే వాస్తవికంగా ఉంటుంది. వీటికితోడు అత్యాచారం కేసుల్లో నిందితుడు, బాధితురాలు ఒకే కులం అయిన పక్షంలో పెళ్లిని పరిష్కారంగా చూపడం, వేర్వేరు కులాలైన పక్షంలో జరిమానా కింద కొంత డబ్బు ఇప్పించడం సాధారణమైపోయింది. నిజానికి అలాంటి నేరం చేసిన వ్యక్తికే ఆ యువతిని కట్టబెట్టడమంటే ఆ నేరగాడిని మరింత ప్రోత్సహించడం. అలాంటి చర్య ఆమెకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోగా, ఆ అన్యాయాన్ని జీవితాంతం కొనసాగింపజేస్తుంది. ఆడపిల్ల జీవించే హక్కును మాత్రమే కాదు... హుందాగా జీవించే హక్కును సైతం ఇలాంటి రాజీలు కాలరాస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తాజా తీర్పు ఈ పెడధోరణులకు అడ్డుకట్ట వేస్తుంది. అత్యాచారం కేసుల్లో మందకొడి దర్యాప్తు, విచారణ రాజీకి తావిస్తున్నాయి గనుక వాటి విషయంలోనూ గట్టిగా చర్యలు తీసుకుంటే బాధితులకు నిజమైన న్యాయం కలుగుతుంది. అమానుష ఘటనలకు తెరపడుతుంది. -
మహిళలతో ఎలా వ్యవహరించాలంటే..
సాక్షి, ముంబై: ఫిర్యాదు చేయడానికి స్టేషన్లకు వచ్చే మహిళలతో మర్యాదగా వ్యవహరించేందుకు నగర పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళలు, చిన్న పిల్లల కేసుల్లో ఎలా నడచుకోవాలనే విషయమై కొన్ని స్వచ్ఛందసంస్థలు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నాయి. ఎవరైనా ఒక మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆమెతో ఎలా ప్రవర్తించాలనే విషయమై కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఎన్జీఓ నేహా ప్రోగ్రామ్ డెరైక్టర్ నైరీన్ దారువాలా తెలిపారు. అంతేగాకుండా పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళ పరిస్థితిని అర్థం చేసుకొని సౌమ్యంగా స్పందించాలని పోలీసులకు సూచించారు. వి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనంజయ్ కులకర్ణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించే ప్రతి ఒక్క మహిళకూ న్యాయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం నిజమేనని అంగీకరించారు. ఈ విషయమై తమకు ఫిర్యాదులు కూడా అందాయని ధనుంజయ్ తెలిపారు. శిక్షణలో భాగంగా పోలీసులకు సెప్టెంబర్ మొదటివారంలో ప్రత్యేక సుహృద్భావ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పౌరులు పాల్గొననున్నారు. అంతేగాక జోన్ 3, 4, 5, 6కు చెందిన పోలీసుల కోసం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోలీసులను బృందాల వారీగా విభజించి శిక్షణ ఇస్తారు. ఒక్కో బృందంలో 50 మంది కానిస్టేబుళ్లతోపాటు అధికారులు ఉంటారని దారువాలా తెలిపారు. ‘మహిళల కేసులను దర్యాప్తు చేస్తున్నప్పుడు నియమనిబంధనలను తప్పకుండా పాటించాలి. వారికి సంబంధిత చట్టాల గురించి తెలియజేయడం ద్వారా కూడా వారికి హింస నుంచి రక్షణ కల్పించవచ్చు’ అని ఆమె తెలిపారు. ఈ శిక్షణలో చిన్న చిన్న నాటకాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ శిక్షణలో పోలీసులు పాల్గొన్న తరువాత.. వివిధ సందర్భాల్లో ఇక నుంచి వారు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా చేసి చూపించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, ముంబై పోలీసులు మహిళల కోసం నగరవ్యాప్తంగా నాలుగువేల ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 150 మంది సిబ్బంది కన్నా తక్కువగా ఉన్న పోలీస్టేషన్లలో ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు లేదా పోలీసు అధికారులను నియమించనున్నారు. ఇందుకోసం ఇటీవల 140 మంది మహిళా పోలీసులకు శిక్షణ కూడా ఇచ్చి గుర్తింపుకార్డులు జారీ చేశారు. మహిళలపై నేరాలు నిరోధించడానికి వీళ్లు పనిచేస్తారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు 300 నంబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని కులకర్ణి సూచించారు. -
శ్రావణం.. శుభప్రదం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : హిందువులకు అతి నియమ నిష్టలతో కూడిన మాసం శ్రావణం. శ్రావ ణ మాసం ముగిసే వరక మహిళలు, భక్తులు సంప్రదాయాలు ఆచరిస్తారు. కఠిన ఉపవాసాలు ఆచరిస్తూ దైవనామస్మరణలో గడుపుతారు. మరి ఆ శ్రావణ మాసం రానే వచ్చింది. బుధవారం నుంచి ఈ మాసం ప్రారంభమైంది. కైలాసనాధుడైన శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసాలలో శ్రావణమాసం ప్రధానమైంది. మహిళలు ఆయురారోగ్యాల కోసం, కుటుంబ, భర్త శ్రేయస్సుల కో సం వ్రతాలు, నోములను ఆచరిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్రతాలు ఆచరిస్తూ రాత్రి జాగరణ చేయడం ఆనవాయితీ. మైసమ్మ, పోచమ్మ ఆలయా లు మూత వేసి, శివకేశవుల ఆలయాలు ఈ మాసంలో నుంచి తెరుచుకుంటా యి. ఈ మాసంలో మహిళలు నక్తవ్రతా లు, ఏకవృత్తవ్రతాలు ఆచరిస్తారు. మంగళగౌరీ, గౌరీ వ్రతాలు, అన్నపానీ యాలు లేకుండా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ మాసంలో సోమవారం శివాలయాలకు వెళ్లి శివుడి తలపై పత్రదళం పెట్టి, నీళ్లతో అభిషేకాలు చేస్తారు. ఇలా చేస్తే జపతపాలు, యాగాలు చేసిన ప్రతిఫలం చేకూరుతుందని, శివలోకప్రాప్తి చేకూరుతుందని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు శివాలయాల్లో బిల్వపూజ, పత్రదళ పూజలు ఆచరిస్తారు. మహిళలు పత్రదళాలలో భోజనాలు చే స్తారు. ఐదు సోమవారాలు ఒక్కో ధ్యా నంతో శివుడికి శివముక్తి పూజలు చేస్తా రు. ఇలాచేస్తే జన్మజన్మంతరాల పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. మాంసాహారాలు మానీ.. హిందువుల పవిత్ర మాసమైన శ్రావణ మాసంలో కఠిన నియమాలు ఆచరిస్తుం టారు. ఉదయం నుంచి రాత్రి వరకు దే వాలయాల్లో గడపడమే కాకుండా.. నెల రోజులు మాంసాహారాలు మానేస్తుం టారు. పురుషులు క్షవరం తీసుకోరు. శైవక్షేత్రాల దర్శనం.. మునులు, రుషిలు, సన్యాసులు, భక్తులు పెద్దసంఖ్యలో ఈ మాసంలో శైవ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. పాదయాత్రలతో వెళ్తారు. పుణ్యక్షేత్రాలైన కాశీ విశ్వనాధుడు, శ్రీశైలం మల్లికార్జునుడును దర్శించుకుంటారు. ప్రతి దేవాలయాల్లో విశేష పూజలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే పాపాలు దూరమై శివలోకప్రాప్తి చేకూరుతుందని నమ్మకం. శుభ ముహూర్తాలెన్నో.. శ్రావణ మాసంలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రెండు మూడు నెలలుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈసారి పెళ్లి సందడి ఎక్కువగానే ఉండనుంది. ఈనెలలో 9, 15, 19, 22, 23, 24, 25, 28, 30 తేదీలలో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఫంక్షన్‌హాళ్లు, దుకాణాలు కళకళలాడనున్నాయి. వరలక్ష్మీ వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (16న) వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్ర తం చేస్తారు. సౌభాగ్యంతో వర్ధిల్లాలని కుంకుమార్చనలు చేస్తారు. పుత్రైకాదశి శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి (17)న భక్తులు పుత్రైకాదశిని జరుపుకుంటారు. సంతానం లేనివారు, మగ సంతానం కోరుకునేవారు ఈ రోజున పుత్రైకాదశి వ్రతం ఆచరిస్తారు. శివకేశవులను ఆరాధిస్తారు. రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి(21న) రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. మహిళలు సోదరులకు రాఖీ కడతారు. సోదరసోదరీమణుల బంధానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమినీ జరుపుకుంటారు. అర్హులైనవారు ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి(ఈనెల 11వ తేదీ)న నాగుల పంచమి జరుపుకుంటారు. సర్పదోషాలు తొలగిపోవడానికి నాగదేవత అనుగ్రహాన్ని కోరుతూ మహిళలు పుట్టలో పాలుపోసి, పూజలు చేస్తారు. వెండితో నాగ ప్రతిమలు చేయించి పుట్టలో వదులుతారు. మంగళగౌరి వ్రతం నిండు నూరేళ్ల సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం, ధర్మ సంతానం కోసం నూతన వధువులు మంగళగౌరి వత్రం ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేళ్లలో శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఈ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. భక్తులు ఈనెల 29న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నా రు. కృష్ణుడి అనుగ్రహం కోసం ఈ రో జంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ భగవంతుడికి వివిధ ఉపచారాలు చేస్తా రు. ఇలా చేస్తే కోటి ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుందన్నది విశ్వాసం. -
పల్లె పీఠంపై నారీమణులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ సమరంలో మహిళ లే పైచేయి సాధించారు. పంచాయతీ రాజ్ ప్రాతినిథ్య చట్ట సవరణతో తొలి సారిగా 50 శాతం స్థానాల్లో పోటీచేసే అవకాశం మహిళలకు దక్కింది. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పంచాయతీల్లో ఓటర్లు పెద్ద పీట వేశారు. జిల్లాలో 1,066 పంచాయతీలకు గాను 533 సర్పంచ్ పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడటంతో 1,064 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ కోటా కంటే అదనంగా మరో 35 పంచాయతీల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. సాధారణంగా రిజర్వుడు స్థానాల్లో చక్రం తిప్పేందుకు చోటా మోటా నేతలు ఉప సర్పంచ్ పదవిపై కన్నేస్తూ వుంటారు. అయితే సుమారు 27 శాతం పంచాయతీ ల్లో మహిళలే ఉప సర్పంచ్ పదవులు చేపట్టారు. 10,444 వార్డుల్లోనూ సగానికి పైగా స్థానాల్లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కింది. సుమారు 50 పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల్లో మహిళలే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో పాలన ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అందరూ మహిళలే.. నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఎనిమిది వార్డులకు గాను నాలుగుచోట్ల మహిళలకు కేటాయించారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డుల్లోనూ మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా క్యాస సంధ్యారాణి, ఉప సర్పంచ్‌గా మాదారం పద్మమ్మ, వార్డు సభ్యులు పల్లె సునీత, ఎండీ ఇస్మాయిల్ బీ, గొట్టపు లక్ష్మి, బేలూరు నర్సమ్మ, పొట్పల్లి బసమ్మ, మూలిగె బసమ్మ, అశ్విని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఇద్దరు పురుషులు ముందుకు వచ్చినా గ్రామస్థులు నచ్చజెప్పారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం లక్ష్యంగా పనిచేస్తామంటూ పంచాయతీ పాలకమండలి ముక్తకంఠంతో చెప్తోంది. పురుషుల చేతుల్లోనే? సంఖ్యాపరంగా పంచాయతీల్లో మహిళల ప్రాతినిథ్యం సగానికిపైగా ఉన్నప్పటికీ పాలనలో పురుషుల జోక్యం తప్పేలా లేదు. చాలాచోట్ల భర్తలు, కుమారులు, సోదరులు చక్రం తిప్పుతుండటంతో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్ల పాలనపై ఆసక్తి నెలకొంది. పంచాయతీ పాలన, నిధులు, విధులు తదితరాలపై అవగాహన లేకపోవడం కొత్త సమస్యలకు దారితీసేలా ఉంది. శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పాలనపై అవగాహన కలిగించేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. పాలన, విధులు, చట్టాలు తదితరాలపై రూపొందించిన ప్రత్యేక మెటీరియల్‌ను అందజేస్తాం. మహిళలు సర్పంచ్‌గా వున్న చోట స్వయం నిర్ణయాధికారం అలవడేలా శాయశక్తులా ప్రయత్నిస్తాం. - డీపీఓ అరుణ