మహిళ మెడలో గొలుసు అపహరణ
Published Tue, Jul 26 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
భీమిలి:ఇంట్లో ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని ఆగంతకుడు అపహరించుకుపోయాడు. భీమిలిలోని సుభాష్‌రోడ్డులో పెంటపల్లి లక్ష్మీకాంతం(65) అనే విశ్రాంత ఉపాధ్యాయురాలు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తలుపులు తీసి ఇంట్లో కూర్చుని ఉండగా వెనుకవైపు గోడదూకి వచ్చిన ఆగంతకుడు ఒక్కసారిగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించకుని పరారయ్యాడు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారు వేరే చోట ఉంటున్నారు.
Advertisement
Advertisement