![Khammam Collector Muzammil Khan About Mahila Shakthi Scheme](/styles/webp/s3/article_images/2024/11/5/tea.jpg.webp?itok=JuY_fFuA)
ఖమ్మం: మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో ఆర్థికంగా రాణించేలా ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట బస్టాప్ వద్ద ఇందిరా మహిళాశక్తి సహకారంతో ఏర్పాటుచేసిన ‘స్త్రీ టీ స్టాల్’ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలితో మాట్లాడిన ఆయన ‘చెల్లెమ్మా చాయ్ సెంటర్ ఎలా నడుస్తోంది, వ్యాపారం అనుకూలంగా ఉందా’ అని ఆరా తీయడంతో పాటు టీ చేయించుకుని తాగారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్ధికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా అని తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కుటుంబాల ఆర్థికాభివృది్ధకి అండగా నిలుస్తుందని, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment