తండ్రిని మరిచిపోలేక
తయారుచేయించిన కుమారుడు
సింగరేణి (కొత్తగూడెం): ఇంటిపెద్ద మృతి చెందితే చాలామంది ఇంట్లో ఫొటో ఏర్పాటుచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు రూ.లక్షలు వెచ్చించి తన తండ్రి ప్రతిమ చేయించి సోదరి వివాహ రిసెప్షన్ వేదికపై ఏర్పాటుచేసి మమకారాన్ని చాటుకున్నాడు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన పెరికం బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతి చెందారు.
ఆ తర్వాత ఆయన కుమార్తె స్నేహకు యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగావకాశం కల్పించింది. ఆమెకు శ్రీరాంపూర్ ఏరియాలో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ తో పెళ్లి కాగా.. కొత్తగూడెంలో శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఈమేరకు ముంబైలో రూ.4 లక్షల వ్యయంతో వీల్‌చైర్‌లో కూర్చున్న రూపంలో చేయించిన బాలరాజు విగ్రహాన్ని వేదికపై ఏర్పాటుచేయగా.. స్నేహ దంపతులతో పాటు ఆమె సోదరుడు, తల్లి ఫొటోలు దిగారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని తయారుచేయించినట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment