Tea Hub
-
చెల్లెమ్మా.. టీ స్టాల్ ఎలా నడుస్తోంది?
ఖమ్మం: మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో ఆర్థికంగా రాణించేలా ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట బస్టాప్ వద్ద ఇందిరా మహిళాశక్తి సహకారంతో ఏర్పాటుచేసిన ‘స్త్రీ టీ స్టాల్’ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలితో మాట్లాడిన ఆయన ‘చెల్లెమ్మా చాయ్ సెంటర్ ఎలా నడుస్తోంది, వ్యాపారం అనుకూలంగా ఉందా’ అని ఆరా తీయడంతో పాటు టీ చేయించుకుని తాగారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్ధికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా అని తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కుటుంబాల ఆర్థికాభివృది్ధకి అండగా నిలుస్తుందని, స్వయం సహాయక గ్రూపుల సభ్యులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్‌ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్‌లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్!
ప్రమాదంలో కాలు పోగొట్టుకొని, తల్లిదండ్రులకు భారమై, లోకమంతా శూన్యంలా అనిపించిన రోజుల నుంచి తేరుకొని, అహ్మదాబాద్‌లో ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నేహ. మోటివేషనల్ స్పీకర్‌గానూ తన జీవన అనుభవాలను చెబుతోంది. ఆంప్ టీ కి దేశవ్యాప్త గుర్తింపు తేవడానికి కృషి చేస్తోంది. ఓడిపోయిన రోజుల నుంచి ఒంటికాలితో గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వివరిస్తుంది నేహ. ‘‘మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ,నాన్న, ఇద్దరు అన్నదమ్ములు. నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. గుజరాత్‌లోని భవానీ నగర్లో పుట్టి పెరిగాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఓ చిన్న ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వెతుక్కొని, కొన్నాళ్లు గడిపాను. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలక్రమంలో అన్ని ఇష్టాలను వదులుకుంటూ రావాల్సి వచ్చింది. ఇలాగే ఉంటే నా కలల రెక్కలు విప్పుకోలేననిపించింది. ఉద్యోగంతో పాటు కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాను. ఉదయం టీచర్‌గా చేస్తూ, సాయంత్రం కాలేజీలో చదువుకునేదాన్ని. స్కూల్లో పాఠాలు చెబుతూనే నా బలహీనతల గురించి కూడా తెలుసుకున్నాను. నేను ముందుకు వెళ్లాలంటే నా బలహీనతలపై పనిచేయడం నేర్చుకోవాలి అని అనుకున్నాను. కొంత కాలం అంతా బాగానే జరిగింది. కానీ, కాలంతో పాటు డబ్బు అవసరం కూడా పెరగడం మొదలైంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అహ్మదాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 2012లో అహ్మదాబాద్ వచ్చి, కాల్సెంటర్లో పనిచేశాను. ఎన్నో ప్రయత్నాల తర్వాత మళ్లీ టీచర్ జాబ్ సంపాదించుకున్నాను. ఎక్కువ మొత్తంలోనే నెల జీతం వచ్చేది. కల చెరిపిన ప్రమాదం అంతా బాగుంది అనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. ట్రీట్మెంట్ తీసుకోవడంలో జాప్యం కావడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. దాంతో తీవ్ర నిరాశతో డిప్రెషన్‌కు గురయ్యాను. దీని నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కృత్రిమ కాలు ఏర్పాటయ్యాక నాలో మళ్లీ ఆశలు చిగురించాయి. స్నేహితుల సహకారంతో.. ధైర్యం తెచ్చుకొని, ముందున్న జీవితం గురించి ఆలోచించాను. టీ అంటే నాకు చాలా ఇష్టం. దీంతో మా ఇంట్లో వాళ్లకి ఓ కేఫ్ తెరుస్తానని చెప్పాను. కానీ, నా ట్రీట్మెంట్కి అప్పటికే చాలా ఖర్చయింది. షాప్ అద్దెకు తీసుకునేంత డబ్బు నా దగ్గర లేదు. మా బంధువులు ఎవరూ సపోర్ట్ ఇచ్చేవారు లేరు. కానీ, నా స్నేహితుల సహకారంతో టీ స్టాల్ ప్రారంభించాను. టీ స్టాల్‌కు షార్ట్ మీదనే వెళ్లేదాన్ని. చాలా మంది నా డ్రెస్ గురించి కూడా తిట్టేవారు. ‘కాలు లేదు, పైగా నలుగురు తిరిగే చోట ఇలా షార్ట్స్ వేసుకొని తిరుగుతావా? బుద్ధిలేదా’ అనేవారు. ఈ వెక్కిరింపులు బాధ కలిగించేవి. కానీ, నాకు నేను బలంగా ఉన్నాను అని తెలుసు. వాస్తవికతను అంగీకరించాను. నేను ధరించిన డ్రెస్ నాకేమీ ఎబ్బెట్టుగా లేదు. పైగా అందరూ అంతగా తిట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నా పని ద్వారానే సమాధానం చెబుతాను అనుకునేదాన్ని. టీ స్టాల్ వైరల్ ‘కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయి’ అని నాకు నేనే చెప్పుకుంటూ ‘ఆంప్ టీ నేహా’ పేరుతో టీ స్టాల్ నడపడం మొదలుపెట్టాను. విజయం సాధిస్తానని కచ్చితంగా తెలుసు. కానీ, ప్రజల నుండి ఇంత ప్రేమను పొందుతానని తెలియదు. కేవలం పది రోజులలో నా టీ స్టాల్ వద్ద జనం గుమిగూడటం ప్రారంభించారు. ఫుడ్ బ్లాగర్లు నా గురించి రాసి, ప్రచారం చేశారు. నా టీ స్టాల్‌ను బ్రాండ్‌గా మార్చాలని పోరాడుతున్న వీడియో ఒకటి తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కొందరు అధికారులు నా స్టాల్ దగ్గరకు వచ్చి, ఇది అక్రమమని, తొలగిస్తామన్నారు. నేను వారితో చాలా పోరాడాను. ఎవరో తీసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతోమంది తమ ప్రేమతో నాకు మద్దతు తెలిపారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ‘ఆంప్ టీ నేహా’ని మంచి బ్రాండ్‌గా మార్చి నాలాంటివారికి ఓ మార్గం చూపాలన్న నా కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’ అని చెబుతోంది నేహా. (చదవండి: ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!) -
టీ కొట్టు నడుపుతూ.. రోజూ రూ.300 దాచిపెట్టి.. ఏకంగా 25 దేశాలు..
కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు. యాత్ర ఇలా ప్రారంభమైంది కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్‌తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
టీ హబ్‌లో స్టార్టప్‌ల జోరు
♦ 140 స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు షురూ ♦ నెల రోజుల్లో రంగంలోకి మరో 60 స్టార్టప్‌లు ♦ పని వాతావరణం బాగుందని నిపుణుల కితాబు ♦ ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో నూత న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు వేదికగా నిలిచేందుకు ఏర్పడిన టీ హబ్ క్యాటలిస్ట్ భవనంలో స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నవంబర్ 5న ప్రారంభమైన టీ హబ్‌లో సాఫ్ట్వేర్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఈ-కామర్స్, అడ్వర్టైజింగ్, సర్వీస్ ప్రొవైడర్స్ వంటి వినూత్న సేవలందించే స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ హంగులతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఐదంతస్తుల్లో నెలకొల్పిన ఈ భవనంలో ప్రతీదీ విశేషమే. సుమారు 200 స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతానికి 140 కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. మరో నెల రోజుల్లో 60 స్టార్టప్‌లు సేవలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో టీ హబ్‌లో స్టార్టప్‌ల పనితీరు గురించి తెలుసుకునేందుకు స్టార్టప్‌ల యజమానులు, ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించింది. ఇక్కడి పని వాతావరణం, సాంకేతిక నిపుణులకు అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకుంది. త్వరలో రెండో దశ..? మొదటి దశ టీ-హబ్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే స్ఫూర్తితో రెండో దశ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాయదుర్గం ఇనార్బిట్ మాల్ సమీపంలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న భవనంలో టీహబ్ రెండో దశను ప్రారంభించనున్నట్లుఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపా రు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెల 28న టీ-హబ్‌ను సందర్శించే అవకాశం ఉందన్నా రు. కాగా, స్టార్టప్‌లు పెట్టాలనుకునేవారికి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ నుంచి పనులు మొదలుపెట్టే వరకు వారి వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నామని టీ హబ్ ఇన్చార్జి శ్రీనివాస్ కొల్లిపర వివరించారు. ఏం జరుగుతోంది..? ► నూతన ఆలోచనలతో స్టార్టప్‌లు పెట్టేలా ప్రోత్సహించడం ► సదస్సులు, చర్చల ద్వారా స్టార్టప్‌ల పరిధి విస్తరించడం ► ఇతర దేశాల స్టార్టప్‌లనూ ఆకర్షించడం ► ఐటీ, వివిధ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాల సాధన ► అనుమతులు,పేటెంట్లు పొందేందుకు సహకారం ► స్టార్టప్‌లకు అవసరమైన వనరులన్నీ ఒకేచోట అందుబాటులో ఉంచడం మరికొన్ని ప్రత్యేకతలు... విద్యుత్, నీరు పొదుపుగా వినియోగించేలా ఇందులో ఏర్పాట్లున్నాయి. ఉద్యోగులు లోనికి వచ్చేటప్పుడు లైట్లు వెలగడం.. బయటకు వెళ్లగానే ఆరిపోయేలా సెన్సార్లున్నాయి. భవనం వెలుపలి అద్దాలు 95 శాతం వేడిని బయటే నిరోధిస్తాయి. బల్లలు, కుర్చీలు అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. సిలికాన్ వ్యాలీని తలపిస్తోంది టీ-హబ్ సిలికాన్ వ్యా లీని తలపిస్తోంది. వస తులు అంతర్జాతీయ ప్ర మాణాలతో ఉన్నాయి. ప్రస్తుతం మా స్టార్టప్‌లో 18 మంది ఉన్నారు. వివాహాది శుభకార్యాల నిర్వాహకులకు సకల సేవలను ఒకే గవాక్షం ద్వారా అందించే ప్రోగ్రామ్ సిద్ధం చేస్తున్నాం. - ప్రణవ్ (గుజరాత్), ఫ్లాట్ పెబుల్ స్టార్టప్ టీ హబ్ గురించి యజమానులు, ఉద్యోగులు ఏం చెప్పారంటే.. చక్కని పని వాతావరణం టీ-హబ్‌లో సృజనాత్మకంగా పనిచేసుకునేం దుకు అనువైన వాతావరణముంది. నూతన సాఫ్ట్వేర్ సృష్టించే పనిలో నిమగ్నమయ్యాం. మా ఆలోచనలను ఆవిష్కరించేందుకు సరైన మార్గదర్శకులు, నిపుణులు అందుబాటులో ఉన్నారు. - వెంకీ (చెన్నై), అక్యూరా స్టార్టప్ అవకాశాల స్వర్గం నేను సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. మెంటర్లు, ఇన్వెస్టర్లు ఇక్కడే ఉండటంతో మా ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా భావిస్తున్నా. - విశాల్(అహ్మదాబాద్), క్యూ8 సాఫ్ట్వేర్ స్టార్టప్ సహకారం బాగుంది టీ-హబ్‌లో పనిచేసుకునేందుకు అందరి సహా య సహకారాలు లభిస్తున్నాయి. ఆరుగురున్న బృందం ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చే సంస్థలకు నూతన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాము. మా సంస్థకు అమెరికా నుంచి బెస్ట్ సెర్చ్ అవార్డు దక్కింది. - గీతాంజలి(యూపీ), ఆప్టిమైజర్ స్టార్టప్ ఉత్సాహం నింపుతోంది... మా స్టార్టప్‌లో 13 మంది పనిచేస్తున్నారు. మా సంస్థ 30 దేశాల్లో సేవలందిస్తోంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూ పొందిస్తున్నాం. ఇక్కడి వాతావరణం ఉత్సాహంగా ఉంది. - మెహర్(అమెరికా), స్కిల్ఓ సాఫ్ట్వేర్