మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్‌ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం!
వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్‌లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు.
ఇవి కూడా చదవండి: పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment