ఆటబొమ్మల ఖరీదు ఎంత ఉంటుంది? పది రూపాయల నుంచి కొన్ని వందల రూపాయల్లో రకరకాల ఆటబొమ్మలు దొరుకుతాయి. మరీ ఖరీదైన ఆటబొమ్మలైనా సరే, కొన్ని వేల రూపాయలకు మించి ఉండవు.
ఇది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మ. ఇది అలాంటిలాంటి ఆటబొమ్మ కాదు, టాయ్ రోబో! పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘గింజా తనాకా’, ఆటబొమ్మల తయారీ సంస్థ ‘బందాయి కంపెనీ’ కలసి ఈ టాయ్ రోబోను రూపొందించాయి. జపానీస్ సూపర్‌హిట్ కార్టూన్ సీరియల్ ‘గండామ్’లో కథానాయక పాత్ర పోషించిన రోబో నమూనాను అచ్చంగా పోలి ఉండేలా దీన్ని తీర్చిదిద్దాయి.
ఈ రోబో ఎత్తు పదమూడు సెంటీమీటర్లు, బరువు 1.400 కిలోలు ఈ టాయ్ రోబో కూడా అసలు సిసలు రోబోల మాదిరిగా కొన్ని పనులు చేయగలదు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ఆటపాటలతో పిల్లలను అలరించగలదు. ఈ టాయ్ రోబో తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు 41,468 డాలర్లు (రూ.34.69 లక్షలు)
ఇవి చదవండి: కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
Comments
Please login to add a commentAdd a comment