bhimili
-
తీరంలో ఘోరం
నదులు, వాగుల్లోని ఇసుకనే కాదు.. అధికార టీడీపీ కూటమి ‘తిమింగలాలు’ ఇప్పుడు సముద్ర తీరంలోని ఇసుకనూ కొల్లగొట్టేస్తున్నారు. ఖనిజాన్వేషణ కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఫలితంగా సముద్ర తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి. ఇలా సాగరతీరాన్ని చెరువులుగా మార్చేస్తూ.. మత్స్యసంపదకు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలోని భీమిలి తీరం ఈ అరాచకానికి కేంద్రంగా మారింది.సాక్షి, విశాఖపట్నం: భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలుండటంతో అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక్కడ బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు లారీలు, మినీ వ్యాన్ల ద్వారా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతూ తీరప్రాంత భద్రతని కలవరపెడుతోంది. ఇప్పటికే తుపాను సమయాల్లో రుషికొండ, ఐటీ జంక్షన్, సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్దఎత్తున కోతకు గురవుతోంది. ఇప్పుడు కూటమి నేతల ఇసుక దందాతో 2–3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. మాకేం తెలీదు.. మేమేం చూడలేదు?ఇక కూటమి నేతలు సముద్ర తీరాన్ని విధ్వంసం చేస్తూ.. భారీ గుంతలు తవ్వుతూ ఇసుకను దోచేస్తున్నా అధికారులు మాత్రం అలాంటివేమీ జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడంలేదు. సీఆర్‌జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా.. టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుండటంతో మత్స్య సంపదకు విఘాతం కలుగుతోందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అవన్నీ తీరంలోనే కప్పేస్తున్నారు తప్ప.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకెయ్యడంలేదు. పైగా.. కూటమి నేతల ఇసుక దాహాన్ని కప్పిపుచ్చే విషయంలో మాత్రం జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎంతో సమన్వయం పాటిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలే కారణం..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. దీంతో.. సముద్రంలో దొరుకుతున్న ఇసుకని ఇంటి నిర్మాణ పనులకు వాడుతున్నామంటూ తప్పుదోవ పట్టించి విచ్చలవిడిగా తోడేస్తూ రాత్రికి రాత్రి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. నిజానికి.. సముద్రపు ఇసుక ఇంటి నిర్మాణానికి వినియోగించేది చాలా అరుదు. కానీ.. ఇందులో అపారమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉండడంతో వీటి కోసమే ఈ తవ్వకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో 24 రకాల ఖనిజ నిక్షేపాలతో కూడిన బ్లాకులున్నాయని గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇటీవల తీరంలో ఇసుక నల్లగా కనిపించడం కూడా దీనిని బలపరుస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి నేతల పాలిట వరంగా మారింది. ఇక్కడి ఇసుకలో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినైట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనోజైట్ వంటి మినరల్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భీమిలిలోని 24 బ్లాకుల్లో సుమారు 4.302 మిలియన్ టన్నుల భారలోహాలున్నాయి. సీ బెడ్‌కు కేవలం ఒక మీటరు లోతు నుంచే ఈ ఖనిజ నిక్షేపాలున్నాయని తెలుస్తోంది. అందుకే.. ఖనిజ నిక్షేపాల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతూ రూ.కోట్ల లావాదేవీలు చేతులు మారుతున్నట్లు సమాచారం.అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలివి..భీమునిపట్నం తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదైనవని జీఎస్ఐ భావిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే గార్నెట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కటింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తారు. ఇలిమినేట్, రూటిల్, లికాక్సిన్ వంటి మినరల్స్‌ను సింథటిక్ రూటిల్స్, టైటానియం డైయాక్సిడ్ పిగ్మెంట్, టైటానియం స్పాంజ్, టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారు. అత్యంత అరుదుగా లభించే టైటానియం మెటల్స్ను ఎయిర్క్రాప్ట్సŠ, స్పేస్ షెటిల్స్, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇందుకోసమే ఎక్కువ లోతులో ఇసుకని తవ్వి చెన్నై, కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.పెద్దపెద్ద లారీల ద్వారా తరలిస్తున్నారు..తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఇది తీరప్రాంత భద్రతకు ముప్పు కలిగించడమే. ఈ గోతులు చూస్తుంటే సముద్రం ఎప్పుడు ముందుకొచ్చేస్తుందోనని మా ప్రాంత ప్రజలంతా భయపడుతున్నాం. పెద్ద పెద్ద లారీల ద్వారా ప్రతిరోజూ ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.– వేముల ఈశ్వర్‌రెడ్డి, కాపులుప్పాడచేపలు దొరకడంలేదు..ఇప్పటికే గంగమ్మ తల్లి ముందుకొచ్చేస్తూ భయపెడుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఇసుక దోచేస్తుండటం మాకు భయం కలిగిస్తోంది. ఇసుక లేకపోతే అలల రాకపోకల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల.. ఇటువైపు చేపల రాక ఆగిపోతుంది. ఈ అక్రమ తవ్వకాలు జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో వేటకు వెళ్తుంటే చేపలు సరిగా దొరకడంలేదు. ఇదే రీతిలో అక్రమ రవాణా కొనసాగితే చిన్న చేప కూడా పట్టుకోలేం. – మేరుగు చిన్నారావు, మత్స్యకారుడు, మంగమారిపేటభవిష్యత్తులో తీర భద్రతకు పెనుముప్పు..సముద్రపు ఇసుకను అక్రమంగా తరలించడం తీర ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ప్రమాదకరం. బీచ్ రోడ్డు ప్రధాన రహదారి వెంబడి యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ అనేక సీసీ కెమెరాలున్నాయి. ఇసుక తరలింపుపై దృష్టిపెట్టి అధికారులు చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యొచ్చు. – దౌలపల్లి కొండబాబు, 4వ వార్డు కార్పొరేటర్ -
ఎన్ఆర్ఐకు వలపు వల..
తగరపువలస: విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి..మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
ఇసుక ధర పెంపు.. కొనుగోలుదారుల నిరసన
భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధవారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్నుకు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది. అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది. ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్ చేశారు.ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలసఉచితమని ప్రకటించడం ఎందుకు?ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం -
గంటా కుమారుడిపై కేసు నమోదు
మధురవాడ : భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, టీడీపీ నాయకులు నమ్మి శ్రీను, జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు తదితరులపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా గురువారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో శివశక్తినగర్ రోడ్డులోని సద్గురు సాయినాథకాలనీలోలో ఉన్న మసీద్–ఇ– ఫిర్ధౌస్లో పార్టీ కండువాలు ధరించి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ల ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించి స్వీట్స్బాక్స్లు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా గంటా కుమారుడు రవితేజ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను తదితరులు పంపిణీ చేశారు. దీనిపై‘సాక్షి’ దినపత్రికలో ‘టిడీపీ బరితెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. భీమిలి హారి్టకల్చర్ ఆఫీసర్, నియోజకవర్గ ఎంసీసీ టీమ్–4 ఇన్చార్జ్ ఆర్పీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గంటా బావమరిదిపై చర్యలు తీసుకోవాలి ఈ పంపిణీ వ్యవహారంలో గంటా బావమరిది జీవన్ కుమార్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరు పేర్లు ఫొటోలు కూడా పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేసి కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
Bheemili: భీమిలి భూములపై కన్నేసిన గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : భీమిలి భయపడుతోంది.. 2014 నుంచి ఐదేళ్ల పాటు వారి చెరలో చిక్కుకున్న భూమాత మళ్లీ.. చిగురుటాకులా వణికిపోతోంది. భూచోళ్లు అంతా కలిసి వస్తున్నారని సంకేతాలతో జనం గుండెలు అదురుతున్నాయి. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన అక్రమార్కులు అధికారం అండ ఉన్న బంధువులు కుమ్మక్కై కనిపించిన జాగాలన్నీ కబ్జా చేసిన ఘనులకు సూత్రధారిగా నిలిచిన గంటా శ్రీనివాసరావు కన్ను ఇప్పుడు భీమిలిలో మిగిలిన భూములపైనా పడింది. అందుకే పట్టుబట్టి మరీ భీమిలి టికెట్ సాధించి ఇప్పుడు భూ కబ్జారాయుళ్లనంతా పోగేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశంలోనే రెండోదిగా, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి పురాతన మున్సిపాలిటీగా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత భీమిలికి 2014–19 కాలంలో కొత్త పేరుని తీసుకొచ్చారు గంటా అండ్ కో. కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ, భీమిలికి ఉన్న మంచి పేరుని కాస్తా చెరిపేసి.. భూకబ్జాల భీమిలిగా మార్చేసి.. నియోజకవర్గ పరువుని బంగాళాఖాతంలో కలిపేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు భీమిలి నియోజకవర్గంలో పాగా వేసిన గంటా ఆక్రమించిన భూముల లెక్క రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సహజంగా ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా నిజమైనా... అనిపిస్తుంది.. కానీ ఆయన అల్లుడుతో పాటు బినామీలు, టీడీపీ తోడేళ్లు ఐదేళ్ల పాటు ఇదే పనిలో ఉండి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేశారనేది ఆ ప్రాంతంలో ఎవరిని కదిపినా బయటకు వచ్చే వాస్తవం. వాటిలో కొన్ని మచ్చుకు పరిశీలిద్దాం.. సీలింగ్ భూముల కథ ఇదీ.. నిరుపేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ భూములను చుట్టేసేలా గంటా అండతో అతని అల్లుడు, బినామీలు కలిసి భూదందా చేశారు. ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి చెందిన కోరాడ వెంకటస్వామినాయుడు 1973 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం తమ కుటుంబం పేరిట ఉన్న 45.59ఎకరాల మిగులు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. 1975వ సంవత్సరంలో ఆయన ఇచ్చిన భూ వివరాలను పరిశీలించిన ల్యాండ్ సీలింగ్ అథారిటీ ఆ భూముల అప్పగింతపై ట్రిబ్యునల్ తీర్పు (ఎల్సీసీ 230బై75) ఇచ్చింది. ఈ మేరకు విశాఖ రూరల్ మండలం మధురవాడలో సర్వే నంబర్ 262/4, 263/æ2, 276/1, 278, 276/2, 277/2, 329, 262/3, 277/1కి సంబంధించి 28.84ఎకరాలు, ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో 1.66ఎకరాలు, ఆనందపురం గ్రామంలో 6.81ఎకరాలు, వెల్లంకి గ్రామంలో 8.28ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఇక్కడ వరకు అంతా సాఫీగానే జరిగినా కోరాడ వెంకటస్వామినాయుడు మృతి తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన కుటుంబీకుల్లో కొందరు ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను సైతం అడ్డగోలుగా విక్రయించేశారు. మధురవాడ పంచాయతీ పరిధిలో ఇచ్చిన 28.84ఎకరాల భూమిని కోరాడ వారసులు కృష్ణా కో–ఆపరేటివ్ సొసైటీకి విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పటి చినగదిలి ఎమ్మార్వో ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. దీంతో సదరు కోరాడ వారసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఆ భూములను విక్రయించేశామని, అందుకు బదులుగా తమకు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ బంటుపల్లి వారి కల్లాలు గ్రామంలో ఉన్న 28.80ఎకరాల (సర్వే నంబర్లు 39/1, 39/2) భూమిని అప్పజెబుతామని కోర్టును అభ్యరి్థంచారు. ఈమేరకు కోర్టు అంగీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేసి ఆ భూమిని స్వా«దీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు తాత్సారం చేశారు. దీంతో ఆ వారసులు మరోసారి ఆ భూముల్లో కొన్ని ఎకరాలను 2006లో విక్రయించేశారు. సర్వే నంబర్ 39/1, 39/5ఏలో 11.8ఎకరాల భూమిని విక్రయించేశారు. అదేవిధంగా వెల్లంకి గ్రామంలో ప్రభుత్వానికి ఇచ్చేసిన 1.14ఎకరాల భూమిని తిరిగి గారిపేట వాస్తవ్యుడు కోరాడ అప్పలస్వామి, రాములకు విక్రయించేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా, ఆ భూమికి బదులు సర్వే నంబర్ 263/2, 264/16లోని 1.14 ఎకరాలు అప్పగించారు. మళ్లీ 263/æ2 లోని 0.34ఎకరాల భూమిని అమ్మేశారు. మొత్తంగా 30 ఎకరాల పంపిణీకి సంబంధించిన పక్కా వివరాలు లేకున్నా కోరాడ కుటుంబీకులు మాత్రం ఇప్పటికే తాము 34.45ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి అప్పగించామని లెక్క కట్టేశారు. ఇంకా తాము 11.14ఎకరాల భూమి మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని తేల్చేశారు. ఆ 11.14ఎకరాల భూపంపిణీకీ ఇంకో మతలబు పెట్టారు. గతంలో తాము ఆనందపురం గ్రామంలో అప్పజెప్పిన 4.15ఎకరాలు రెండుపంటలు పండే భూమి అని పేర్కొన్నారు. పంటలు పండే భూమి, మిగులు భూముల నిష్పత్తి 1:2 ప్రకారం.. 11.14 ఎకరాల్లో 4.15 ఎకరాలను మినహాయించాలని ప్రతిపాదించారు. ఈ లెక్కన తాము కేవలం 6.63ఎకరాల భూమి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఆ భూమి కూడా నర్సీపట్నం పరిసరాల్లోని భూములను ఇస్తామని ప్రతిపాదించారు. ఈ లెక్కన కల్లాలు గ్రామంలోని 11.14ఎకరాల భూమిని తమకు మినహాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తూ జిల్లాకోర్టులో కేసు వేశారు. అల్లుడు రంగప్రవేశంతో.. కోర్టు విచారణ పూర్తికాకున్నా ఈలోగా గంటా అల్లుడు రంగంలోకి దిగారు. కోరాడ వారసులకు, అల్లుడికి మధ్య టీడీపీ నాయకులు కోరాడ నాగభూషణం, గాడు వెంకటప్పడు, ఇతర నేతలు మధ్యవర్తిత్వం నెరిపారు. అధికారికంగా పేర్కొంటున్న 11.14ఎకరాలతో సహా తొక్కిపెట్టిన 30ఎకరాలపైగా భూమికి సంబంధించి ఒక్క గజం కూడా ఎవ్వరికీ పంపిణీ చేయకుండా వీళ్లే పంచేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. అంతే కాదు.. గంటా భీమిలి ఎమ్మెల్యేగా.. మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ వెలగబెట్టకపోయినా.. అడ్డగోలు సంపాదనకు మాత్రం తెరతీశారు. అనుచరగణంతో కలిసి భూ దందాలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను సైతం బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.కోట్ల రుణాలు పొందినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. వెలుగులోకి రాని భూబాగోతాలెన్నో.. మళ్లీ.. అదే గ్యాంగ్‌తో హల్ చల్.! భీమిలిలో గంటా గ్యాంగ్ చేసిన అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని భూ కబ్జాల కేంద్రంగా మార్చిన గంటాకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రజలంతా డిసైడైపోయారు. విషయం తెలుసుకున్న గంటా.. నియోజకవర్గం నుంచి పారిపోయి ఉత్తరం పంచన చేరారు. ఆయన అనుచరగణం.. చెట్టుకొకరు.. పుట్టకొకరుగా వేరైపోయారు. ఐదేళ్లు గడిచిన తర్వాత ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని భావించిన గంటా.. తిరిగి భీమిలికి చేరుకున్నారు. వచ్చిందే తడవుగా.. తన కబ్జాల అనుచరగణాన్ని చేరదీసుకుంటున్నారు. టీడీపీలో సస్పెండ్‌కు గురైన కబ్జా గ్యాంగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసేస్తూ.. మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. గాడు వెంకటప్పడు, కోరాడ నాగభూషణరావు తదితర బ్యాచ్‌ను పోగేసుకుంటున్నారు. గంటా బాబా.. అరడజను దొంగల మాదిరిగా.. దొంగల ముఠా అంతా ఒక చోట చేరుతుండటంపై భీమిలి ప్రజలు మళ్లీ అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇంక ఆక్రమించేందుకు ఏమున్నాయని వాపోతున్నారు. అయినా డబ్బులు ఎరవేసి, భయపెట్టి.. బెదిరించి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్న గంటా.. గెలిస్తే భీమిలిలో ఉన్న కొద్ది పాటి భూములను సైతం తన గ్యాంగ్‌తో కలిసి కాజేయ్యాలన్న కుట్రతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అందలం ఇస్తే.. భీమిలిని సర్వనాశనం చేస్తారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. -
ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం ఆయన స్పెషల్
ప్రజల విశ్వాసం పొందిన రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుంటారు. కొందరు నాయకులు అయితే ప్రతి ఎన్నికకు నియోజకర్గాన్ని మారుస్తుంటారు. గెలిచిన చోట ప్రజలకు ఏమీచేయని వారు భయపడి మరో నియోజకవర్గం వెతుక్కుంటారు. టీడీపీలో ఓ నేత ఉన్నాడు. దక్షిణ కోస్తా నుంచి విశాఖకు వలస వచ్చి ఇక్కడ తిష్ట వేశాడు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం, అధికారం కోసం పార్టీల మార్పిడి ఆయన నైజం. ప్రకాశం జిల్లా నుంచి విశాఖకు వలసవచ్చిన గంటా శ్రీనివాసరావు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరికి పోర్టు కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తి వేల కోట్లకు పడగలెత్తారు. బాగా సంపాదించాక రాజకీయాలపై ఆసక్తి పెరిగి తెలుగుదేశంలో చేరి 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచాక నియోజకవర్గాన్ని పట్టించుకోని గంటా 2004లో అనకాపల్లి ఎంపీ సీటు వదిలేసి 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీని వదిలేసి..ప్రజారాజ్యంలో చేరి ఈసారి అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పదవి అనుభవించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అదృశ్యం కావడంతో మళ్ళీ టీడీపీ గూటికి చేరి ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. చదవండి: ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? రాజకీయాల్లోకి వచ్చాక జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు చోట్ల నుంచి గంటా పోటీ చేశారు. ఎక్కడైనా, ఎవరినైనా డబ్బు కొట్టి లోబర్చుకోవడం గంటా శ్రీనివాసరావు స్పెషల్ అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. 2014లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి కూడా అనుభవించిన గంటా శ్రీనివాసరావు అసలా నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అన్న విషయమే మర్చిపోయారు. దీంతో భీమిలి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక భీమిలిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని అర్థం చేసుకున్న గంటా 2019లో విశాఖ సిటీలోని నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. 2019లో భీమిలిని వదిలేసి విశాఖ నార్త్‌లో పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న గంటా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. అయినా సరే అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. తనకున్న ఏరుదాటాక తెప్ప తగలేసే అలవాటు ప్రకారం విశాఖ నార్త్ నియోజకవర్గంను మర్చిపోయారు. ఐదేళ్ళ కాలంలో తనను గెలిపించిన ప్రజలకు కనీసం మొహం కూడా చూపించలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభించినపుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గంటా శ్రీనివాసరావు కనిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో గంటా ఈసారి మళ్లీ కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కున్నారు. పదేళ్ళ క్రితం తనను గెలిపించిన భీమిలి నియోజకవర్గంపై మళ్ళీ కన్నేశారు. అక్కడి ప్రజలకు తనపై కోపం పోయింటుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు వందల కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి భీమిలి సీటు సంపాదించుకున్నారు. సీటు కొనుక్కోవడానికి ఎంతైనా పార్టీ ఫండ్ ఇవ్వడం.. గెలవడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడం అలవాటైన గంటా శ్రీనివాసరావు భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు. అధికారం అడ్డం పెట్టుకొని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటా శ్రీనివాసరావుది. తీసుకున్న అప్పు.. వడ్డీతో కలిపి 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో గంటా తనకా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఇటీవల ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు గంటాకు సీటు ఇవ్వడంపై భీమిలిలోని జనసేన, టిడిపిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మొదట ఈ సీటు జనసేనకే అని ప్రకటించారు. దీంతో అక్కడి జనసేన నేతలు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా చంద్రబాబు, పవన్‌లను డబ్బుతో కొట్టి సీటు తన్నుకుపోవడంతో భీమిలి నేతలు బహిరంగంగానే తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. జనసేన సీటు వచ్చిందని భావించి భంగపడ్డ పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఔ పవన్ తీరుతో జనసేన కార్యకర్తలమని చెప్పుకునేందుకే సిగ్గేస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు భీమిలిలో గంటాకు..అటు టీడీపీ నుంచి..ఇటు జనసేన నుంచి సహాయ నిరాకరణ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటాకు సీటు విషయంలో పునరాలోచన చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అక్కడి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. -
ప్రతి ఇంటా ఓ స్టార్ క్యాంపెయినర్
మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు. 10, 15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ, పెద్ద పెద్ద కంపెనీలలో రూ.లక్షల జీతాలు తీసుకునేందుకు బాటలు వేసే ఓటు. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, మంచి భవిష్యత్తు ఉండాలన్నా.. నిర్ణయించే ఓటు. జరిగిన మంచి కొనసాగాలంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది. ఈ రోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చింది మీ బిడ్డే.. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు. కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పింది మాత్రం మీ బిడ్డ జగన్ మాత్రమే. చేయగలిగిందే చెబుతాడు. కానీ ఒకసారి చెప్పిన తర్వాత చేస్తాడంతే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మనందరి ప్రభుత్వ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరే నా సైనికులని, ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అవ్వ, తాత, రైతన్న.. ఇలా మంచి జరిగిన వారంతా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలిచేలా వారందరినీ సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని కోరారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ బిడ్డకు అబద్ధాలు, కుతంత్రాలు, కుట్రలు, మోసాలు తెలియదని స్పష్టం చేశారు. మీ బిడ్డ పొత్తులు, జిత్తులను నమ్ముకోలేదని చెప్పారు. ‘మీ బిడ్డ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ని నమ్ముకోలేదు. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే’ అని అన్నారు. అందరికీ మంచి చేయాలన్న లక్ష్యంతోనే అడుగులు ముందుకు వేశానన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని కోరారు. ‘మీ బిడ్డ తరఫున మీరే సైనికులుగా నిలబడాలని చెప్పండి. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు రావాలని అడగండి’ అని పిలుపునిచ్చారు. ‘రూ.2.53 లక్షల కోట్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వేశాం. ఎవరూ లంచాలు అడగ లేదు. వివక్ష చూప లేదు. మనం బటన్ నొక్కడంతో రాష్ట్రంలో 84 శాతం ఇళ్లకు మంచి జరిగింది. గ్రామాల్లో 92 శాతం ఇళ్లకు మేలు జరుగుతోంది. ఇంత మంచి ప్రతి గ్రామంలో జరిగిందన్న విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కార్యకర్తలను గెలిపించే పార్టీ వైఎస్సార్సీపీ ► వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టులలో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు. వీరితోపాటు ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానికి ఒక విషయం చెబుతున్నా.. ఇది ఒక జగన్ పార్టీ కాదు. ఇది మీ అందరి పార్టీ అని గుర్తుంచుకోండి. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడు మాత్రమే. కార్యకర్తలను, నాయకులను అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో, రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా చేశాం. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లును నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్ యార్డులు, దేవాలయాల బోర్డుల్లో మొత్తంగా నామినేటెడ్ పదవుల భర్తీ చేసే విషయంలో ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు ఇవ్వడం కేవలం మీ బిడ్డకే సాధ్యమైందని చెప్పడానికి గర్వపడుతున్నా. ► 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం కాబట్టే.. వివక్ష, లంచాలు లేని పాలన ఇవ్వగలిగాం కాబట్టే.. ఇవాళ ఎవరైనా మన పార్టీ తరుఫున వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు.. ఏ పదవికి పోటీ చేసినా సాధారణ మెజారీ్టతో కాదు.. గొప్ప మెజారీ్టతో గెలిపించి ఆ స్థానాల్లో కూర్చో బెడతారు. వైఎస్సార్సీపీలో ఉన్న వారు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలో ఇవ్వని అవకాశాలు ఇచ్చామని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబుకు ఓటేస్తామని అనగలరా? ► అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా దేశంతో మనం పోటీ పడుతున్నాం. వారి కోసం ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, లక్షాధికారులను చేయాలని 35 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇలా ఇంటింటికి మేలు చేసింది మీ బిడ్డ ప్రభుత్వం. 2014 ఎన్నికల ప్రణాళికలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. ప్రతి ఏటా సబ్సిడీపై 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేశాడు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తానని మోసం చేసిన చరిత్ర. సున్నా వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేసి దుర్మార్గానికి పాల్పడిన చరిత్ర. ఇళ్ల పట్టాలు ఒక్కటి కూడా పేద కుటుంబానికి ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. అన్నింటిలోను మోసమే. ► ఇవన్నీ చూసినా తర్వాత, నిజాలు తెలిసిన తర్వాత.. ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఓటు వేయకుండా, తోడుగా నిలబడకుండా ఉండగలరా? చంద్రబాబుకు ఓటు వేస్తామని అనగలరా? కులం, మతం, పార్టీ చూడకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి కలిగించాం. అక్కచెల్లెమ్మల గత 10 సంవత్సరాల బ్యాంకు ఖాతాలను చూస్తే ఎవరెంత మేలు చేశారో తెలుస్తుంది. కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా మీ బిడ్డ ఆ పేద వాడి ముఖంలోను, కుటుంబంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడ్డాడు. ఈ విషయాలన్నీ అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు చెప్పండి. ► గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలకే.. అదీ కొద్ది మందికే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ స్థానంలో మనం చదువుకున్న పిల్లలను తీసుకువచ్చి వలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్లి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్నాం. జగనన్న అన్నీ వలంటీర్ల చేతుల్లోనే పెట్టాడని కొందరు అనుకోవచ్చు. ఆ వలంటీర్లు ఎవరో కాదు. వారు కూడా మనల్ని, మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మనవారే. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో చెప్పాలి ∙ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోడానికి మాత్రమే కాదు. పేద కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ప్రతి పేదవాడి భవిష్యత్తు మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే మళ్లీ రావాలని చెప్పండి. విద్య, వైద్యం కోసం అప్పులు చేసే పరిస్థితి రాకూడదంటే మళ్లీ జగనే రావాలని వివరించండి. అక్కచెల్లెమ్మల సాధికారత కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని చెప్పండి. రైతు భరోసా, ఉచితంగా ఇన్సురెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకే వ్యవస్థ కొనసాగింపు.. ఇలా ఏది జరగాలన్నా జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని విడమరచి చెప్పండి. ►ఈ రోజు 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీం కొనసాగాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, డీబీటీ స్కీంల మంచి జరగాలన్న మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ప్రతిపక్షాలకు ఓటు వేయడమంటే దాని అర్థం, స్కీంలన్నీ వద్దు, రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే. లంచాలు, వివక్షతో కూడిన జన్మభూమి కమిటీల వ్యవస్థకు ఓటు వేయడమే. ఇలా ఏ మంచి చేయని, పొత్తు లేకపోతే పోటీ చేయలేని, పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగ్‌లు కొడుతుంటే ‘ఓటి కుండకు మోత ఎక్కువ.. ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ. చేతకాని వాడికి మాటలెక్కువ’ అనే సామెతలు గుర్తుకొస్తున్నాయి. మేము సైతం.. ముఖ్యమంత్రి జగన్‌కు జైకొట్టిన పార్టీ శ్రేణులు సాక్షి, విశాఖపట్నం: సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ శ్రేణులు మేము సైతం కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమేనని నినదించాయి. లక్షల గొంతులు ఏకమై తమ సంఘీభావాన్ని తెలిపాయి. సంగివలసలో జరిగిన ‘సిద్ధం’ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం పార్టీ క్యాడర్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు, కులమతాలకతీతంగా జరిగిన మేళ్లను ఆయన సోదాహరణంగా వివరించిన తీరు వారిని మంత్రముగ్ధులను చేసింది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించేవే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్సీపీ పాలనలో కొనసాగేందుకు దోహదపడేవన్న వాస్తవాన్ని అందరికీ చెప్పండి’ అంటూ సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి పార్టీ శ్రేణులను ఎంతగానో ఆలోచింపజేసింది. చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను సభలో కళ్లకు కట్టినట్టు వివరించిన తీరు ఆకట్టుకుంది. 2019కి ముందు, తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాల్లో వ్యత్యాసాలను గుర్తించాలని ప్రజలను కోరాలని సూచించారు. వలంటీర్ల వ్యవస్థతో పాటు నుంచి సచివాలయాల ద్వారా అవినీతి లేని సుపరిపాలన, ఆర్బీకేలు, విలేజి క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, నాడు–నేడు వంటి వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు, హామీలో 99 శాతం అమలు చేసిన తీరును సోదాహరణంగా వివరించడంతో సభికులంతా అచ్చెరువొందారు. సభలో సరిగ్గా గంటా 17 నిమిషాల సేపు జరిగిన సీఎం ప్రసంగం ఆద్యంతం ఎంతో పరిణతితో సాగింది. భావితరాల భవిష్యత్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగడం ఎంత అవసరమో తేటతెల్లం చేసిందని భావిస్తున్నారు. సీఎం మాట్లాడే సమయంలో అప్పుడప్పుడూ ప్రజలు సీఎం.. సీఎం అంటూ అభివాదాలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో, ప్రతిపక్షాల కుట్రలను ఎలా తిప్పికొట్టాలో సవివరంగా వివరించడంతో వైఎస్సార్సీపీ మరోసారి విజయదుందుభి మోగించేందుకు కంకణం కట్టుకుంటామంటూ పార్టీ క్యాడరు, నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. పర్యటన సాగిందిలా..: సీఎం జగన్మోహనరెడ్డి శనివారం మధ్యాహ్నం 3:12 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 3.26 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి సంగివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి సభాస్థలి వద్దకు 3.55 గంటలకు చేరుకున్నారు. సాయంత్రం 4.10 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. అక్కడ నుంచి 10 నిమిషాల పాటు బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ నడిచారు. సభ పూర్తయిన తరువాత హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 6.07 గంటలకు విమానంలో విజయవాడకు తిరుగు పయనమయ్యారు. -
Vizag : భీమిలిలో పోరుకు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖ జిల్లా) : రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక మ.3.30 గంటల నుంచి సా.5 వరకూ ఈ బహిరంగ సభ జరుగుతుంది. కదనరంగంలో ముందడుగు.. ఎన్నికల పరుగు పందెంలో ఎవరి అడుగు ముందుపడితే విజయం వారినే వరిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఓ వైపు పొత్తులో ఎవరు ఏ స్థానాల్లో పోటీచేయాలన్నది తేల్చుకోలేక.. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క, మరోవైపు బీజేపీని జతచేసుకునేందుకు పాకులాడుతూ టీడీపీ–జనసేన సతమతవుతున్నాయి. మరోవైపు.. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. ఎన్నికల శంఖారావాన్ని పూరించడం ద్వారా సీఎం జగన్ కదనరంగంలో దూసుకుపోతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఇంటా విప్లవాత్మక మార్పు.. ఇక ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను గుర్తించి, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను రెండు పేజీలతో మేనిఫెస్టోగా వైఎస్ జగన్ రూపొందించి 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలుచేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలుచేశారు. గత 56 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. పారదర్శకంగా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 కోట్లు వెరసి రూ.4.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వంవల్ల మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలబడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. ఇదే అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి.. ప్రతి ఇంటికీ చేసిన మంచిని చాటిచెప్పి.. మరింత మంచి చేసేందుకు ఆశీర్వదించాలని కోరాలని దిశానిర్దేశం చేయనున్నారు. 2022, మే 11 నుంచే గడప గడపకూ.. నిజానికి.. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట్లో వచ్చిన మార్పును గుర్తుచేసి.. మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని కోరేందుకు 2022, మే 11న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేసిన మంచి కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే, ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80 శాతం ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సుమారు 3 వేలకు పైగా పోలీసులు శుక్రవారం సాయంత్రానికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు ‘సిద్ధం’ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ తదితర ప్రతిపక్ష నేతలు చేస్తున్న దు్రష్పచారాలను తిప్పికొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంగివలస జాతీయ రహదారి వద్ద జరగనున్న సభకు సంబంధించి ఏర్పాట్లను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల దు్రష్పచారాలను తిప్పికొట్టేందుకు సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆదరణ కోల్పోయిన నాయకులు ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలుచేశారని.. ఆ నమ్మకంతోనే మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారే వైఎస్సార్సీపీ క్యాంపెయినర్లన్నారు. ఈ సభకు రెండున్నర లక్షల మంది తరలిరానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. -
భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస(విశాఖ): వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. సంగివలసలో జాతీయరహదారి పక్కన ఎంపిక చేసిన సభా స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి భీమిలి సీఐ డి.రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేలు చొప్పున 2లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పెన్మత్స సురేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, రీజనల్ యూత్ కో–ఆర్డినేటర్ ముత్తంశెట్టి శివనందీష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ శ్రీనివాస్, ఏడీసీపీ జాన్ మనోహర్, ఏసీపీ జి.శ్రీనివాసరావు, భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, ట్రాఫిక్ సీఐ ఎస్.కాంతారావు సభా స్థలాన్ని పరిశీలించారు. -
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది పార్టీ. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో గురువారం కీలక సమావేశం నిర్శహించారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి నియోజవర్గం నుంచి ఆయుదు ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని అయిదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని చెప్పారు. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారని తెలిపారు. ఇది ఒకరకంగా ఎన్నికల శంఖారావం అనుకోవచ్చన్నారు. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా మీటింగులు జరగనున్నాయని బొత్స పేర్కొన్నారు. ‘ఎవరికి ఎమ్మెల్యే..ఎవరికి ఎంపి టికెట్ ఇవ్వాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఈ పార్టీ వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. టికెట్లు ఇవ్వలేదన్న భావం మా నేతల్లో లేదు. కేశినేని నాని ఎందుకు పార్టీ నుంచి వెళ్లి పోయారు. అసలైన ఓటర్లు వుండేలా చూసే భాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఏపీతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మాకు ముఖ్యం. విశాఖలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే. రుషికొండలో ఐటీ సెజ్...అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీలు వైఎస్సార్ హయాంలో వచ్చినవే. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర విశాఖలో ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా చెప్పండి. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ పనులు రద్దు చేయించారు. ‘సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యర్థనపై ఇచ్చాం. పురందేశ్వరి మాట్లాడే ముందు ఆలోచించు. 22వ తేదీన సెలవు కావాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టొచ్చు. ప్రభుత్వం పరిశీలిస్తుంది. విశాఖలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలే. ఆ ప్రాజెక్టుల గురించి ఆ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. చదవండి: గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్ -
గంటా శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటో?
ప్రతీ ఎన్నికలోనూ పార్టీనీ నియోజక వర్గాన్నీ మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ సారి మారడానికి నియోజక వర్గం దొరకడం లేదు. ఉన్న నియోజక వర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన నియోజక వర్గానికే బదలీ అవుదామని అనుకుంటోన్నా అక్కడి టిడిపి-జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడు అయిన విశాఖ ఉత్తర నియోజక వర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజక వర్గం దొరికేలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజక వర్గాలను సామాజిక సమీకరణలకోసం మారిస్తే.. ఎమ్మెల్యేలను కూడా బదలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతీ ఎన్నికలోనూ కొత్త నియోజక వర్గానికి బదలీ అయ్యే గంటా శ్రీనివాసరావు గుర్తుకు రాలేదు కాబోలు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటి సారి టిడిపి తరపున అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. అయిదేళ్ల కాలంలో నియోజక వర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్ల పాటు నియోజక వర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈ సారి చోడ వరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతే కాదు టిడిపి లోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయిదేళ్లు పాటు నియోజక వర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెందింది. దాంతో 2014 ఎన్నికల్లో మళ్లీ పార్టీ మార్చి టిడిపిలో చేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి తాను చేసిందేమీ లేకపోవడంతో గెలిచే అవకాశాలు శూన్యమని తెలుసుకున్నారు. అంతే మరోసారి తన నియోజక వర్గాన్ని భీమిలికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ అయిదేళ్లు పూర్తయ్యింది. భీమిలిలోనూ గంటా పనితీరుగురించి మాట్లాడుకోడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టిడిపిలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజక వర్గం మార్చారు. భీమిలి నుండి విశాఖ నార్త్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చాయన్న ఆరోపణల నేపథ్యంలో వివాదస్సద విజయాన్ని మూటకట్టుకున్నారు. అయదేళ్లు కాలిమీద కాలేసుకుని కాలక్షేపం చేశారేతప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ^నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈ సారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అది అంత వీజీగా కనపడ్డం లేదు. భీమిలిలో టిడిపి నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీప్ లు ఇద్దరూ కూడా గంటాకు భీమిలి నుండి టికెట్ ఇవ్వద్దని నారా లోకేష్ చెవులు రెండూ కొరికేస్తున్నారట. ఒక వేళ గంటాకే టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజక వర్గమే కనపడ్డం లేదని పార్టీలో గుస గుసలు వినపడుతున్నాయి. భీమిలి నియోజక వర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. మరి నియోజక వర్గంతో పాటు పార్టీకూడా మార్చే అలవాటున్న గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి ట్రాన్స్ పర్ అయ్యి భీమిలి టికెట్ కొనుక్కుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే చాలా కాలంగా భీమిలిలో జనసేన కోసం పనిచేస్తోన్న పంచకర్ల సందీప్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే జనసేనకు గుడ్ బై చెప్పి గంటాను ఓడించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. మరి గంటా ఏం చేస్తారనేది చూడాలి. చదవండి: ఏపీ బీజేపీకి కొత్త టెన్షన్.. డ్యామేజ్ తప్పదా? -
భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం!
విశాఖ జిల్లాలో టిడిపి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్రమాలు ఒక్కొక్కటి బయటపడడంతో ఇప్పటికే పార్టీ బ్రష్టు పట్టింది. ఈ దశలో ఎన్నికలు వస్తున్న పరిస్థితుల్లో పార్టీ నేతల నిర్ణయాలు పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలను కాదని ఎన్నికల ముందే హడావిడి చేసే నేతలను అందలం ఎక్కించాలన్న పార్టీ అధినేత ఆలోచనల పట్ల కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై భీమిలి పార్టీ క్యాడర్ భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచి చంద్రబాబు నాయుడి కేబినెట్ లో మంత్రి పదవి అనుభవించిన గంటా శ్రీనివాస్ అయిదేళ్ల పాలనలో నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి పోటీ చేస్తే ప్రజలు ఓడించడం ఖాయమని గమనించిన గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజక వర్గంపై కన్నేశారు. ఇలా నియోజక వర్గాలు మార్చడం గంటాకు కొత్త కాదు. ప్రతీ ఎన్నికలోనూ నియోజక వర్గాన్నో పార్టీనో మార్చడం ఆయనకు అలవాటే. అయితే గత ఎన్నికల్లో బీమిలిలో పార్టీ ఓటమి అనంతరం అయిదేళ్ల పాటు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నియోజక వర్గ ఇన్ ఛార్జ్ రాజబాబు వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి పోటీ చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటించినపుడు కూడా గంటా హాజరు కాకుండా తన ఇంటికే పరిమితం అయ్యారు. అటువంటి గంటా ఇపుడు భీమిలినియోజక వర్గంపై కర్చీఫ్ వేస్తున్నారు. కొంతకాలం గంటాపై కోపంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా గంటాకు భీమిలి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే రాజబాబుకు మంట తెప్పిస్తోంది. గంటాకు టికెట్ ఇస్తే నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ ఎవ్వరూ కూడా గంటా కోసం పనిచేసే పరిస్థితిలేదని రాజబాబు అధిష్టానానికి సమాచారం పంపారు.ఈ క్రమంలోనే తాజాగా గంటా శ్రీనివాసరావు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమిలి వచ్చారు. ఆ కార్యక్రమ వేదికపై ఉన్న రాజబాబు గంటా రావడంతోనే లేచి వేదిక దిగి వెళ్లిపోయారు. గంటాపై తన నిరసనను ఆ విధంగా వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన గంటా డబ్బులు వెదజల్లి అయినా భీమిలి టికెట్ కొనుక్కోగలరని భావిస్తోన్న రాజబాబు ..పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న తనవంటి వారిని పక్కన పెట్టి అవకాశ వాద రాజకీయాలు చేసే గంటాకు టికెట్ ఇస్తే పార్టీ ఓటమి చెందడం ఖాయమని అంటున్నారు. ► తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు రెండు దశాబ్దాల పాటు భీమిలి నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వెలిగింది. ► 2004 ఎన్నికల్లో దివంగత వై.ఎస్.ఆర్. ప్రభంజనంలో భీమిలి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ► 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగిన అవంతి శ్రీనివాస్ గెలిచారు. ► 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ టిడిపి అభ్యర్ధిగా భీమిలిలో గెలిచారు. గత ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగ పోటీ చేసి విజయం సాధించారు. -
YSRCP Bus Yatra: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. భీమిలో శనివారం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు. తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. లోకేష్, భువనేశ్వరి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. మత్స్యకారులను దూషించిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు.. దొరికిన దొంగ చంద్రబాబు.. దొరికిన దొంగ అని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని ధ్వజమెత్తారు. సైకిల్ పోవాలంటూ చంద్రబాబే స్వయంగా ప్రచారంలో చెప్పారని ప్రస్తావించారు. తాను నిప్పంటూ ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. స్కీమ్‌ల పేరిట అన్ని స్కామ్‌లు చేసి జైల్లో ఉన్నారని దుయ్యబటారు. ‘బాబు ముసలోడు అయిపోయాడు, ఆయన్ను బయటకు తేవాలంటున్నారు. స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్ముతారా?. టీడీపీ నాయకుల్లో ఎవరికైనా దమ్ముంటే.. బాబు తప్పు చేయలేదని బెయిల్ అడగాలి. చట్టంలోని లొసుగుల గురించి మాట్లాడుతున్నారే గానీ.. చంద్రబాబు తప్పు చేయలేదని మాట్లాడటం లేదు’ అని మంత్రి సీదిరి మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స్.. ‘సామాజిక న్యాయం జరిగింది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. నాడు-నేడు కార్యక్రమంంతో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంగ్లీష్ విద్యను ప్రతి పేదవాడకి అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ఓట్ల కోసం కాకుండా.. పేదవాడి చిరునవ్వు కోసం సీఎం జగన్ తపిస్తారు. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. యాదవులకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు బలహీన వర్గాలకు ఏం చేశారు?. నాయి బ్రహ్మణుల తోకలను కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. బలహీన వర్గాలంటే బాబుకు చాలా చులకన భావం. చంద్రబాబు దొరికిన దొంగ. స్కీమ్‌ల పేరిట చంద్రబాబు చేసింది స్కామ్‌లే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు సీఎం జగన్. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్‌లో రాణించాలని నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాజ్యంగ బద్ధంగా పేదలకు హక్కులు కల్పించింది సీఎం జగన్’ అని తెలిపారు. -
మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఇలా..
సాక్షి, తాడేపల్లి: సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. సీఎం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు.ఇక, నేడు మూడో రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో భీమిలి, కోస్తాంధ్రలో బాపట్ల, రాయలసీమలో పొద్దుటూరులలో జరుగనుంది. ఉత్తరాంధ్రలో షెడ్యూల్ ఇలా.. ►మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►12:45 గంటలకు మధురవాడలోని ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►2:30 గంటలకు భోగిపాలెం నుండి ర్యాలీ ప్రారంభం. ►మూడు గంటలకు తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభ. ►సభకు హాజరుకానున్న పార్టీ రీజినల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర ►మంత్రి అంజాద్ భాష, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ యాత్రకు హాజరు ►మధ్యాహ్నం ఒంటి గంటకు వైవీఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ►3:15 గంటలకి బైక్ ర్యాలీ ప్రారంభం, ►సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ కోస్తాంధ్రలో బాపట్లలో బస్సుయాత్ర ►చందోలు నుంచి బైకు ర్యాలీ ప్రారంభం ►కర్లపాలెం మీదగా బాపట్ల చేరుకోనున్న బస్సు యాత్ర ►అంబేద్కర్ బొమ్మ సెంటర్లో జరగనున్న బహిరంగ సభ -
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్
తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం -
భీమిలీ బీచ్ లో విషాదం ..
-
విశాఖలో 7 స్టార్ హోటల్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్ సంస్థ విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. రిసార్ట్‌తో పాటు స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి మండలం అన్నవరం సాగరతీరంలో ఒబెరాయ్ సంస్థకు స్థలాన్ని కేటాయించేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది. పాడేరులోనూ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రముఖ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించేందుకు మొగ్గు చూపుతుండటంతో.. టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా హోటల్స్ రంగంలో దిగ్గజమైన ఒబెరాయ్ హోటల్ విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరామన్ శంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అన్నవరంలో 7 స్టార్ హోటల్ భీమిలి సమీపంలోని అన్నవరం సముద్రతీరంలో తమ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒబెరాయ్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. ఇటీవలే జిల్లా టూరిజం అధికారులతో కలిసి విశాఖపట్నం బీచ్ పరిసరాలను సందర్శించారు. బీచ్ ఒడ్డున టూరిజం శాఖకు ఎక్కడెక్కడ ఎంత మేర భూములున్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. చివరిగా అన్నవరం సాగరతీరం ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు నచ్చడంతో.. ఆ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నవరంలో పర్యాటక శాఖకు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. వీటిలో 40 ఎకరాలను ఒబెరాయ్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. వీటితో పాటు రిసార్టులు కూడా ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది. పాడేరులో టూరిజం సెంటర్ విశాఖతో పాటు ఏజెన్సీ ప్రకృతి అందాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. పాడేరు రీజియన్ పరిధిలో టూరిజం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ మన్యంలోని అందాలను తిలకించేందుకు ఆసక్తిగా వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు.. ఆ ప్రాంతంలో ఏఏ వనరులు, వసతులు కావాలని కోరుకుంటారో.. వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో అందించేలా టూరిజం సెంటర్ ఉండబోతోంది. రిసార్టులు, హోటల్, టూరిజం ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలన్నీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఒబెరాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ పట్నంలో రూ.300కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ సిద్ధమవుతోంది. (క్లిక్: తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు) ఒబెరాయ్ గ్రూప్స్ అంటే.? భారత్‌కు చెందిన ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లను విస్తరించిన సంస్థ. 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది. ఐదు దేశాల్లోని 20కిపైగా నగరాల్లో హోటళ్లను, 2 క్రూయిజ్ షిప్‌లను ఒబెరాయ్ సంస్థ నిర్వహిస్తోంది. 1934 నుంచి హోటల్స్ రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో ముంబయి, గుర్గావ్, చెన్నై, భువనేశ్వర్, కోచ్చి, ఆగ్రా, జైపూర్, ఉదయ్‌పూర్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే హోటళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో మరోసారి ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన కోసం నగరానికి రానున్నట్లు పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. (క్లిక్: ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!) -
అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైరల్
తగరపువలస(భీమిలి)విశాఖపట్నం: భీమిలి మండలం అమనాం పంచాయితీలో పోలమాంబ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3న అశ్లీల నృత్యాల ప్రదర్శన సందర్భంగా ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మందిపై భీమిలి పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలలో అశ్లీల నృత్యాల వీడియోలు వైరల్ కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కానిస్టేబుల్ పి.కృష్ణారావు జరిపిన ప్రాథమిక విచారణ చేపట్టారు. చదవండి: ప్రేమించిన యువతితో పెళ్లి చేయలేదని.. పని చేసిన ప్రదేశానికి వెళ్లి.. ఈ నెల 3న అనుమతి లేకుండా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు 2 గంటల వరకు బుర్రకథ ప్రదర్శించారు. అందులో భాగంగా విజయనగరానికి చెందిన ఇద్దరు మహిళలు అశ్లీలంగా నృత్యాలు చేయడంతోపాటు ప్రైవేట్ పార్టులను ప్రదర్శించారన్నారు. ఆ ఇద్దరు మహిళలతోపాటు అశ్లీల నృత్యప్రదర్శన ఏర్పాటు, వారితో కలిసి నృత్యం చేసిన ఆరుగురు ఉత్సవ కమిటీ సభ్యులు చుక్క చిట్టిబాబు, జీరు మురళి, కాళ్ల గౌరీశంకర్, చుక్క రమణ, చుక్కల పల్లారెడ్డి, వేముల వెంకటేష్‌పై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సువ్వారు సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు టన్నుల బరువు.. వలకు చిక్కిన అరుదైన చేప
మహారాణిపేట (విశాఖ దక్షిణ): భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడికి పులిబొగ్గాల సొర్ర అనే అరుదైన చేప చిక్కింది. సుమారు టన్నున్నర నుంచి రెండు టన్నుల బరువు ఉండే ఈ చేపను తినరు. పులిచారలు పోలి ఉంది. భీమిలి తీరంలో లభ్యమైన ఈ చేపను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ చేప మృతి చెందింది. దీంతో మరో బోటులో తరలించి సముద్రంలో పడేసినట్టు రాష్ట్ర మరపడవల సంఘం కార్యవర్గ సభ్యుడు గణగళ్ల రాజేష్ తెలిపారు. -
భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్
సాక్షి, అమరావతి: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 20 కి.మీ పారిశ్రామిక కారిడార్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసే సంస్థ ఎంపిక కూడా పూర్తయింది. డీపీఆర్ కాంట్రాక్టును నాగపూర్‌కు చెందిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఈ డీపీఆర్ తయారీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) బిడ్లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్ చేసి ఎల్1గా నిలిచిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్ సంస్థను ఎంపిక చేసినట్లు ఇన్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ ఆర్.పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం పోటీపడ్డ నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు.. ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్‌జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్‌లింక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తుది బిడ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో రూ. 41 లక్షల కోట్ చేసిన కేఅండ్‌జే సంస్థ ఎల్1గా నిలిచింది. డీపీఆర్ తయారీలో ప్రధాన అంశాలు.. ► భీమిలి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాన గేటు వరకు ఉన్న 20 కి.మీ రహదారి అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను పరిశీలించాలి. ► మొత్తం 8 లేన్ల రహదారిలో తొలుత ఆరు లేన్లు, రెండు వైపుల సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. ► ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుందన్న అంశాన్ని పరిశీలించాలి. ► రహదారికి ఇరువైపుల తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశాలను పరిశీలించాలి. ► టూరిజం, హెల్త్, విద్య వంటి సేవా రంగాల పెట్టుబడులు, లాజిస్టిక్ హబ్స్ వ్యాపార అవకాశాలపై నివేదిక రూపొందించాలి. ప్రస్తుత ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు అభివృద్ధి అయిన తర్వాత ఎంతమేర ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేయాలి. ► వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి. ► ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది, దీనికి నిధులు ఎలా సేకరించాలి, లాభదాయకత వంటి అంశాలు పరిశీలించాలి. -
‘ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతాం’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశారు. (విశాఖ బీచ్ కోతని అరికట్టేందుకు..) ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ‘పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నాం. ఈ రోజు(శుక్రవారం) రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశాం. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. . రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. విశాఖ నగరం 2019 కి ముందు...ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్...ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం. అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. (13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభం) -
భీమిలి ఉత్సవ్
-
భీమిలి ఉత్సవాలకు వడివడిగా ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కలెక్టరేట్లో ఈ నెల 9న జరిగే భీమిలి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి వివిధ శాఖల మధ్య సమన్వయ ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో విశాఖ నెం.1 జిల్లాలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో విశాఖ రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని కలెక్టర్ వినయ్‌చంద్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతుల్లో ప్రస్తుతం 90 శాతం సమస్యలను అధికార యంత్రాంగం పరిష్కరించిందని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా నీటి పారుదల శాఖ నిర్మాణాలు, గ్రామీణ నీటి సరఫరా ట్యాంకులు బలహీన పడినట్లుగా జిల్లా అధికారులు గుర్తించారని చెప్పారు. సమస్యలపై అధికారులతో పరిశీలించి త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ
భీమునిపట్నం: భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి ఆ పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అవినీతి లేని స్వచ్ఛ పాలన అందిస్తున్నందునే అందరూ పార్టీలోకి వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా చెబుతున్న ఈ నియోజకవర్గం ఇకపై వైఎస్సార్సీపీకి కంచుకోట అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో భీమిలి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటప్పడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బంటుపల్లి మణిశంకర్‌నాయుడుతోపాటు ఆనందపురం మండల టీడీపీ అధ్యక్షుడు బీఆర్బీ నాయుడు, ఆనందపురం టీడీపీ మాజీ అధ్యక్షుడు కాకర రమణ, భీమిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుడాల ఎల్లయ్య, భీమిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు తాతినాయుడుతోపాటు ఆనందపురం, భీమిలి మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు ఉన్నారు.