
'గోవా తరహాలో విశాఖ బీచ్'
హైదరాబాద్: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని చెప్పారు. అచ్యుతాపురంలో ఎయిర్‌పోర్ట్ వద్దని నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని చెప్పారు.
ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు. విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.