ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరంలో కొన్ని రోజులుగా ‘అల’జడి కొనసాగుతోంది. పర్యాటకానికి మణిహారంగా నిలిచిన ఆర్కే బీచ్‌తో (RK Beach) పాటు పలు ప్రదేశాలు.. ఇప్పుడు తీవ్ర కోతకు గురవుతున్నాయి.
తుపాన్లకు తోడు ఇటీవల వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విశాఖ తీరంలో జరుగుతున్న మార్పులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పార్కులో గోడ కూలిపోవడం, నేల కుంగిపోవడం, అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురు కోత పెరగడం వంటివి విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి. తీరంలో కోతను నివారించే ప్రయత్నాలు చేపట్టాలని.. నిపుణుల సూచనలతో తీరాన్ని అభివృద్ధి చేసి విశాఖను సంరక్షించాలని అధికారులను విశాఖ వాసులు కోరుతున్నారు.
– ఏయూ క్యాంపస్
ఎలుగుబంటి కాదు.. మానుపిల్లి
గూడెంకొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జడుమూరు వద్ద కాఫీతోటల్లో (Coffee Fields) గురువారం ఎలుగుబంటి (Bear) హల్‌చల్ చేసిందంటూ జరిగిన ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు.
తోటల్లో కాఫీపండ్లను తింటున్నది ఎలుగుబంటి కాదని, అది అడవిలో సంచరించే మానుపిల్లి అని తెలిపారు. ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉన్నా.. ఇది సాధుజంతువని, మనుషులపై దాడిచేయదని పేర్కొన్నారు.
చదవండి: నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ
Comments
Please login to add a commentAdd a comment