![Tribal Groups Protest Against Ayyanna Patrudu Comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Ayyanna-Patrudu.jpg.webp?itok=pZnc7_5t)
సాక్షి, అల్లూరి జిల్లా: పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్‌ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనలకు దిగాయి. అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/01_46.jpg)
ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్‌లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్‌ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.
![మన్యం బంద్ .. పాల్గొన్న YSRCP MLA విశ్వేశ్వర రాజు](https://www.sakshi.com/s3fs-public/inline-images/b_1.jpg)
1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment