బీచ్‌కు వచ్చేది ఎంజాయ్మెంట్ కోసం
బీచ్‌లో హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు ఇవ్వాలి
మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకురావాలి
స్పీకర్ అయ్యన్న పాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్‌కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్‌కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్‌లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్‌ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు.
టూరిస్ట్‌కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు.
గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్‌లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment