chintakayala ayyanna patrudu
-
వైజాగ్‌కి వైన్ కోసం వస్తారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్‌కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్‌కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్‌లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్‌ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. టూరిస్ట్‌కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్‌లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు. -
సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుని టార్గెట్ చేసిన చింతకాయల విజయ్
-
ఐఏఎస్ కృష్ణబాబును టార్గెట్ చేసిన అయ్యన్నపాత్రుడు కుమారుడు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టార్గెట్ చేశారు. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టిన విజయ్.. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేశారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో కృష్ణబాబు పని చేశారంటూ పోస్ట్ పెట్టారు. విజయ్ బహిరంగ ఆరోపణలతో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత బిల్లులు చెల్లించలేదంటున్న కృష్ణబాబు.. ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఫలితాల ముందు రూ. 125 కోట్లు చెల్లించామని.. అందులో పులివెందుల కాలేజీకి రూ.25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విజయ్ తప్పుడు ఆరోపణలపై కృష్ణబాబు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
దుశ్శాసన పర్వం.. అయ్యన్న అనుచరుల అరాచకం
రాత్రి వేళ జుత్తు పట్టుకొని లాక్కొచ్చారు.. కాళ్లతో తన్నుకుంటూ.. తాకరాని చోట తాకుతూ.. దుస్తులు చింపేశారు. అడ్డు వచ్చిన వారిని గాయపరిచారు. ఫోన్లు, ఒంటిపైనున్న బంగారు వస్తువులు లాక్కెళ్లారు. నర్సీపట్నంలో ఒంటరి మహిళపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచరులు జరిపిన దాష్టీకమిది. వలంటీర్‌గా సేవలందించడమే ఆమె చేసిన పాపమట.. వలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడంతో రాజీనామా చేయడమే ఆమె తప్పట.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పనిచేయడమే ఆమె దోషమట.. అందుకే దుశ్శాశనుల్లా ఆమెను ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేశారు. ఈ ఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. గాంధీ గారి దేశంలో గజానికో గాంధారి కొడుకు తయారయ్యాడని.. వారికి అడ్డుకట్ట వేసేందుకు దశ ‘దిశ’ నిర్దేశించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా.. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నవారన్నా ఎందుకంత కక్ష, కార్పణ్యం అని ప్రశ్నిస్తోంది.విశాఖ సిటీ : వలంటీర్లంటే వారికి ఒళ్లు మంట. సేవలతో ప్రజలకు దగ్గరవుతున్నారని, సీఎం జగన్ ప్రతినిధులుగా ప్రజలు వారిని ప్రేమిస్తున్నారని ద్వేషం. వారి వల్ల రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని కడుపు మంట. అందులో మహిళా వలంటీరంటే మరింత చులకన. అందుకే నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో పూర్వ వలంటీర్ పొలమూరి రాజకుమారిపై మంగళవారం రాత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు కీచకపర్వానికి తెగబడ్డారు. రాజకుమారికి భర్త లేడు. 13 ఏళ్ల కుమారుడితో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్‌గా చేరారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా మనసారా సేవలందించారు. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టమన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనస్తాపం చెంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. పోలింగ్ రోజున ఓటర్లకు స్లిప్‌లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ అనుచరులు రెడ్డి రాజేష్, రెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి శివ, సుకల రాజే‹Ùతో పాటు మరికొందరు రాజకుమారిని టార్గెట్ చేశారు. తప్పిన ప్రాణాపాయం పోలింగ్ మరుసటి రోజు మంగళవారం రాత్రి రాజకుమారి పడుకునేందుకు తన 13 ఏళ్ల కుమారుడిని వెంట పెట్టుకొని అదే గ్రామంలో ఉన్న అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ మూకలు రెడ్డి రాజేష్ రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్ పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు వారి ఇంటి మీదకు ఎగబడ్డారు. రాజకుమారిపై దాడి చేశారు. వారి చర్యలను ఆమె సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయతి్నంచడంతో ఆమె చేతిలో ఉన్న మొబైల్‌ను లొక్కొని జుట్టు పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. ఛాతి మీద చేయి వేసి విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఆమె ఒంటి మీద బట్టలను చించేసి వివస్త్రను చేశారు. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. రాజకుమారిపై దాడిని అడ్డుకోవడానికి స్థానిక యువకులు, మహిళలు ప్రయత్నించారు. టీడీపీ నేతలు వారిపై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో ఒమ్మి గోవింద, గజ్జల గోపీచంద్, వియ్యపు వరహాలు, గుమ్మిడి సీతమ్మలకు కూడా గాయాలయ్యాయి. రాజకుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై గట్టిగా కొట్టి ఆమె బంగారు చెవి దుద్దులు లాక్కొని వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటే చంపేసే వారని, అమ్మ వాళ్ల ఇంటి వద్ద ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డానని రాజకుమారి చెప్పారు. ఈ ఘటనపై ఆమె నర్సీపట్నం రూరల్ పోసులకు ఫిర్యాదు చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
Visakhapatnam: నాన్ లోకల్ నాడు వద్దు.. నేడు ముద్దు
విశాఖ సిటీ: నాన్ లోకల్ అంశం అనకాపల్లి తెలుగుదేశానికి శరాఘాతంగా మారింది. స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపే.. ఇపుడు ఆ పార్టీని భస్మాసుర హస్తంలా వెంటాడుతోంది. కూటమి తరపున ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలను స్థానికేతరులకే కేటాయించడం టీడీపీ శ్రేణులకు మింగుపడడం లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన స్థానిక నేతలకు మొండిచెయ్యి చూపించి.. ఆర్థిక నేరగాళ్లు, జనామోదం లేని నాన్‌లోకల్స్‌కు టికెట్లు కట్టబెట్టడంతో ఆ పార్టీ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్యాకేజీలు పుచ్చుకొని, తమ స్వార్థానికి పార్టీ ప్రయోజనాలను బలి చేస్తున్నారని, కింది స్థాయి క్యాడర్‌కు అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయ్యన్న నాన్ లోకల్ బాణం తిరిగి తిరిగి తమ పార్టీకే తగులుతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. బైరాపై స్థానికేతర ముద్ర అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. చంద్రబాబు కూడా ప్రారంభంలో బైరా వైపే మొగ్గు చూపారు. అయితే ఈ స్థానం తన కుమారుడికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబట్టారు. చంద్రబాబు సమక్షంలో జరిగిన బహిరంగ సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తన కుమారుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బైరా దిలీప్ స్థానికేతరుడని, అతడిని అనకాపల్లి జిల్లావాసులు ఆదరించరని బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపిచ్చారు.పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం బీజేపీ వశమైంది. బీజేపీ నుంచి కడప జిల్లా వాసి సి.ఎం.రమేష్ ఎన్నికల బరిలో దిగారు. స్థానికేతరుడన్న నెపంతో బైరాను వ్యతిరేకించిన అయ్యన్న.. నాన్ లోకల్ అయిన సి.ఎం.రమేష్‌తో రాసుకు పూసుకొని తిరగడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఆర్థిక నేరగాడిగా ముద్ర పడిన సి.ఎం.రమేష్ తో సన్నిహితంగా మెలుగుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఈ దోస్తీ వెనుక ‘భారీ’ వ్యవహారమే నడిచిందన్న చర్చ ఆ పారీ్టలో జరుగుతోంది. రెండు అసెంబ్లీ స్థానాల్లో స్థానికేతరులే.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి స్థానికేతర అంశం ప్రజల్లోకి వెళ్లకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కిందామీద పడుతున్న టీడీపీ నాయకులకు.. మరో రెండు అసెంబ్లీ స్థానాలను సైతం స్థానికేతరులకే కేటాయించడం మరింత తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పెందుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ చేతుల్లో ఓడిపోయిన బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి కూడా ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలంగా రిపోర్టు రావడంతో చంద్రబాబు అతడికి టికెట్ నిరాకరించారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో బండారు అలకపాన్పు ఎక్కారు.ఈ క్రమంలో సి.ఎం.రమేష్ బండారుతో చర్చలు జరిపి చంద్రబాబుతో రహస్య భేటీ ఏర్పాటు చేయించి మాడుగుల టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు. దీంతో స్థానికులైన గడిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్‌లను పక్కనపెట్టి పెందుర్తిలో తరిమేసిన మరో స్థానికేతరుడిని మాడుగులకు తీసుకువచ్చారు. అలాగే పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబు కూడా మచిలీపట్నానికి చెందిన నేత. ఇలా మరో రెండు స్థానాలను కూడా నాన్‌లోకల్స్‌కు టికెట్లు కేటాయించడం ఆ పార్టీ ఆశావహులకు మింగుడుపడడం లేదు. నోరు మెదపని అయ్యన్న.. బైరా విషయంలో స్థానికేతరుడని ఘాటు విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడు ఇపుడు మాడుగుల, పెందుర్తి టికెట్లు నాన్‌లోకల్స్‌కు కేటాయించినా నోరు మెదపకపోవడం గమనార్హం. నాన్‌లోకల్స్‌ను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్న ఇచ్చిన పిలుపు.. ఇపుడు ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్థానికేతర ముద్ర పడకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. తన కొడుకు టికెట్ కోసం అయ్యన్న వేసిన ఎరకు టీడీపీ అభ్యర్థులే చిక్కారంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నాన్‌లోకల్ అంశం ప్రజల్లోకి వెళితే ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్నారు. -
Ayyanna Patrudu: అధికారం కోసం ఆబగా...!
సాక్షి, అనకాపల్లి: ఎంపీ సీటు ఆశించిన ఒక కుమారుడు... ఎమ్మెల్యే సీటు ఆశించిన మరో కుమారుడు... మున్సిపాలిటీలో ఇప్పటికే కౌన్సిలర్‌గా ఉన్న సతీమణి... ఎమ్మెల్యే బరిలో ఉన్న అయ్యన్న ఇలా నలుగురూ అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నలుగురూ చెరోవైపు ప్రచారం నిర్వహిస్తుండగా... ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెత్తనాన్ని కూడా నలుగురూ పంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి ఒక సీటే అని చంద్రబాబు తమకు ఇప్పటికే దెబ్బ వేశారనే కసితో ఉన్న సదరు కుటుంబం... నర్సీపట్నం నియోజకవర్గాన్ని నాలుగువైపులా పంచుకుని అధికారం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అయ్యన్న వ్యవహారం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న, ఆయన కుమారుడు చక్రం తిప్పి నర్సీపట్నంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు లేటరైట్‌ను అక్రమంగా తవ్వి అక్రమ సంపాదన ఆర్జించారు. అంతేకాకుండా మూడు ఆక్రమణలు... నాలుగు రంగురాళ్లు అన్న చందంగా రంగురాళ్ల వెలికితీత కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో కొడుకు విజయ్, భార్య పద్మావతి జోక్యం విపరీతంగా ఉండేదన్న విమర్శలున్నాయి. వీరికితోడు ఇప్పు డు సకుటుంబ సపరివార సమేతం అనే రీతిలో అధికారం చెలాయించేందుకు ఆబగా ఎదురుచూస్తు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయ్యన్నకు ఓటు వేస్తే నలుగురు ఎమ్మె ల్యేలు.... తనకు ఓటు వేస్తే ఒక్కరే ఎమ్మెల్యే అని... తన కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ ఆకాంక్షలు లేవని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా ప్రకటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీట్లను ఆశించి....! వాస్తవానికి ఎంపీగా తన కొడుకుకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు సాక్షిగా అయ్యన్న కోరారు. తనకు ఎమ్మెల్యేగా, కొడుకుకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని... స్థానిక అభ్యర్థులను కాదని బయటివారికి ఎలా ఇస్తారంటూ పార్టీ సమావేశాల్లో ప్రశ్నించారు. తీరా బీజేపీ కోటాలో బాబు శిష్యుడు సీఎం రమేష్ అనకాపల్లి సీటును కొట్టేశారు. నాన్ లోకల్ అయినప్పటికీ సీఎం రమేష్‌ను మాత్రం అయ్యన్న ఒక్క మాట కూడా అనలేదు. మరోవైపు అన్న కోసం ఎంపీ సీటు కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు తనకు ఇవ్వాలని కోరాలంటూ చిన్న కుమారుడు పోరు పెట్టారు. రాజకీయ వారసత్వం కోసం కొడుక్కి సీటు ఇప్పించాల్సిందేనని ఇంటిపోరు కూడా అయ్యన్నకు ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్క ఎమ్మెల్యే సీటును నలుగురూ పంచుకుని అధికారం చెలాయిద్దామనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏ ఒక్క పదవినీ వదలరు మొదట్లో అయ్యన్నపాత్రుడు, సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు సమన్వయంతో రాజకీయాలు నడిపేవారు. ఈ సమయంలో పెద్ద కొడుకు విజయ్ జోక్యం పెరిగింది. సన్యాసిపాత్రుడు కదిలికలను తెలుసుకునేందుకు కారులో వాయిస్ రికార్డర్ అమర్చారు. ఈ వ్యవహారం కుటుంబ కలహాలకు దారి తీసింది. ఈ సంఘటనతో అయ్యన్నపాత్రుడి వద్ద ఇమడలేక సన్యాసిపాత్రుడు, మిగిలిన సోదరుల కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. ఏ ఒక్క పదవీని అయ్యన్నపాత్రుడు కుటుంబం వదలేదు. పురపాలిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కౌన్సిలర్‌గా ఎన్నికై 26వ వార్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిన్న కుమారుడు రాజేష్ 25వ వార్డుకు కౌన్సిలర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆఖరి మొత్తం పదవులన్నీ వారి కుటుంబంలో ఉంచుకున్నారు. ఎమ్మెల్యేగా గణేష్ గెలిస్తే ప్రజలు నేరుగా వెళ్లి పనులు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుందనీ, టీడీపీ గెలిస్తే ముగ్గురిని దాటుకుని అయ్యన్నపాత్రుడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే గణేష్ ఐదేళ్ల కాలంలో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని, ప్రశాంతంగా ఉందని, కొరివితో తల గోక్కున్నట్టు అయ్యన్నను మళ్లీ తెచ్చుకుంటామా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
అధినేత దెబ్బ.. అయ్యన్న అబ్బా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు అధినేత అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కొట్టిన దెబ్బకు కోలుకోలేక మధనపడుతున్న అయ్యన్నకు.. ఇంటి పోరు మరింత తలపోటుగా మారుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వారసత్వంగా కొడుకును నర్సీపట్నం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించాలంటూ ఒత్తిడి అధికం కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రానున్న ఎన్నికల్లో కొడుకును బరిలోకి దించకపోతే తన రాజకీయ వారసత్వం కష్టమనే భావనలో అయ్యన్న ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక అయ్యన్న నోటికి తాళం పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కోసం అయ్యన్న తీవ్రంగా కష్టపడ్డారు. నోటికి వచ్చినట్టు ఇష్టారీతిన అధికార వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పించారు. అధినేత దృష్టిలో ఉంటూ అనకాపల్లి ఎంపీ సీటును కొడుకుకు వచ్చేలా యత్నించారు. అయితే, ఎన్నికలు వచ్చేసరికి వ్యాపారవేత్తలు, పైసలు ఉన్నవారికే సీటు ఇచ్చే అలవాటున్న చంద్రబాబు ఈసారి మారారనే భావనలో అయ్యన్న ఉన్నారు. తీరా ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి యథావిధిగా అనకాపల్లి ఎంపీ సీటును బాగా ఖర్చు చేయగలిగిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ వారసత్వం కోసం నర్సీపట్నం నుంచి కొడుకును బరిలోకి దించాలంటూ ఇంటి పోరు రోజురోజుకీ ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. కొడుకు పోరుతో విలవిల వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోతే కుమారుడిని నర్సీపట్నం నుంచి బరిలోకి దించాలంటూ ఇంటి పోరు అధికమైనట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడిన అయ్యన్న ఓటమి తర్వాతైనా గుణపాఠం నేర్చుకుంటారని అందరూ భావించారు. అయితే, అయ్యన్న బుద్ధి మాత్రం మారలేదు. సరికదా ఓటమి బాధలో మరింతగా దిగజారి మాట్లాడటం ప్రారంభించారు. ఫలితంగా నియోజకవర్గంలో అయ్యన్నకు ఏ మాత్రమూ పట్టుపెరగడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వివాదరహితుడు కావడం... తాజాగా జరిగిన సాధికార యాత్ర విజయవంతం కావడం వల్ల మరోసారి వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా 2024 ఎన్నికల్లోనే కుమారుడిని బరిలోకి నిలిపేలా ఇంటి పోరు ఎక్కువవుతోందని సమాచారం. 2029 ఎన్నికల వరకూ వేచిచూడటం కష్టమంటూ కుమారుడికి మద్దతుగా అయ్యన్న సతీమణి కూడా గొంతు కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా అధినేత వైఖరితో తలబొప్పి కట్టిన అయ్యన్నకు... ఇంటి పోరు మరింత తలపోటుగా మారింది. కొడుకును బరిలోకి దింపి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకుంటారా లేదా అనేది త్వరలో తేలనుంది. రాజకీయ వారసత్వం కష్టమే.. వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా తనకు ఆరోగ్యం, వయస్సు సహకరించిన సమయంలోనే తన వారసత్వాన్ని రాజకీయాల్లో దించటం సహజ పరిణామం. తీరా వయస్సు అయిపోయిన తర్వాత వారసత్వాన్ని రంగంలోకి దించితే గెలిపించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది రాజకీయ నాయకులు తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు. అయితే అయ్యన్న నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు దీనిపై దాటవేస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల ముందు భారీగా ఖర్చు చేసే అభ్యర్థి దొరకడంతో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దీంతో పార్టీ కోసం కష్టపడితే ఇదేనా నాకిచ్చే గౌరవమంటూ ఆయన లోలోపల మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే పరిస్థితుల్లో నర్సీపట్నం నుంచి తాను రంగంలోకి దిగితే వచ్చే ఎన్నికల వరకు అంటే 2029 వరకూ రాజకీయ వారసత్వం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈసారి ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపించనప్పటికీ కొడుకును బరిలో నిలపడం ద్వారా రాజకీయ వారసత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది. -
అనకాపల్లి బరిలో బైరా దిలీప్ .. డిపాజిట్లు కూడా రావు: అయ్యన్న పాత్రుడు
స్కిల్ స్కాం కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో టిడిపి శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్టీయార్ హయాంలో టిడిపికి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరుగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా నియోజక వర్గాల్లో టిడిపికి అభ్యర్ధులు కూడ లేని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అక అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా లోకల్ లో ఎవరూ లేకపోవడంతో దిలీప్ చక్రవర్తి అనే క్యాండిడేట్ ను దిగుమతి చేసుకుంది టిడిపి. దీనిపై పార్టీలోని మాజీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు పార్లమెంటు నియోజక వర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధించి టిడిపిని తుడిచి పెట్టేసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతయ్యింది. నాలుగున్నరేళ్లుగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టేవారే కరవయ్యారు. చోడవరం, మాడుగుల, ఎలమంచిలి వంటి నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా లేరు. ఈ నేపథ్యంలో అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం నుంచి బరిలో దింపడానికి పార్టీ నాయకత్వం కోట్లకు పడగలెత్తిన దిలీప్ చక్రవర్తి అనే సంపన్నుణ్ని దిగుమతి చేసుకుంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారంతో పార్టీ సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. మాజీ మంత్రులు చింత కాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణలు అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు. తాము లేదా తమ తనయులను బరిలో దింపాలని వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ఆకాశంలోంచి ఊడిపడ్డట్లు దిలీప్ చక్రవర్తి పేరు బయటకు రావడంతో పార్టీ నేతలు మండి పడుతున్నారు. తమలో ఎవరికి సీటు ఇచ్చినా గెలవకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు వస్తాయని ..అదే దిలీప్ వంటి బయటి వ్యక్తులను దింపితే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికే తీసుకెళ్తున్నారు. ఒక పక్క స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడి కారణంగా పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిపోయిందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. స్కిల్ స్కాంతో పాటు మరో డజనుకు పైగా అవినీతి కేసుల్లో చంద్రబాబు ఉన్నట్లు సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తుండడంతో టిడిపి నేతల్లో ఒక విధమైన నిరాశ నిస్సృహ ఆవరించేసిందని అంటున్నారు. -
బరితెగించి అయ్యన్న బూతు పురాణం
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్‌గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యన్న ఇలాకాలో అసమ్మతి ‘గంట’
సాక్షి, అనకాపల్లి: ‘భవిష్యత్తు గ్యారెంటీ’ అనే పేరుతో జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర చప్పగా సాగుతోంది. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం నియోజవర్గాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేక అడుగడుగునా యాత్ర డీలా పడింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని దూషించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యాత్రకు జనాదరణ లేకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆశలన్నీ నీరుగారాయి. ఇక యాత్రలో సెల్ఫీచాలెంజ్ కార్యక్రమమైతే మొదటిరోజే తుస్సుమంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితల వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులు ఈ యాత్రను పట్టించుకోలేదు. జిల్లాలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే యాత్రకు ఆది నుంచి దూరంగా ఉంటున్నారు. యాత్ర ప్రారంభంలోనే పాయకరావుపేటలో వంగలపూడి అనిత వ్యతిరేక వర్గం ఈ యాత్రలో పాల్గొనడం లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు సీనియర్ టీడీపీ నాయకులంతా పాల్గొంటారని తెలుగు తమ్ముళ్లు ఆశించినా...పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా డుమ్మాకొట్టారు. జిల్లాలో యాత్రను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నాయకత్వంలో సాగడం ఇష్టంలేకనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు డుమ్మాకొట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులందరిని ఆహ్వానించి తమ సత్తా నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే విఫలమయ్యాయి. అయ్యన్న ఇలాకాలో అసమ్మతి ‘గంట’ బస్సు యాత్ర పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి నర్సీపట్నం వరకూ అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. గత ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ పాతాళంలోకి కూరుకుపోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు తిరుగులేదని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో సాగిన మూడోరోజు యాత్రలో సొంత నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప, యర్రాపాత్రుడు పాల్గొనలేదు. ఏడాదిగా అయ్యన్నపై గుర్రుగా ఉంటున్న వీరిపై గంటా వర్గంగా కూడా ముద్ర ఉంది. గతంలో మాజీ మంత్రి గంటాపై అయ్యన్న నోరు జారినప్పటి నుంచి వీరు పూర్తిగా అయ్యన్నకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు కాస్త ఈ యాత్రతో మరింత బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత రుత్తల యర్రాపాత్రుడు తన గ్రామంలో ఒక ఉత్సవానికి నియోజకవర్గంలో టీడీపీ నాయకులందరినీ పిలిచారు గానీ..అయ్యన్నను, ఆయన వర్గీయులను పిలవలేదు.తాజా పరిణామమంతో విభేదాలు తేటతెల్లమయ్యాయి. అసహనంగా తెలుగు తమ్ముళ్లు.. ఈ యాత్రతో జిల్లాలో పార్టీ భవిష్యత్తు కనుమరుగవుతుందేమోనని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్లంతా వస్తారేమో అన్న వారి ఆశ నిరాశైంది. నేతల్లో విభేదాలు ఈ యాత్రలో స్పష్టంగా కనిపించాయి. షెడ్యూల్ ప్రకారం యాత్ర జరగకపోవడంతో కార్యకర్తల్లో అసహనం మొదలైంది. ఏ సమయంలో యాత్ర వస్తుందో...రూట్ మ్యాప్ ఎలాగో కూడా తెలియక సతమతమైపోతున్నారు. తమ ప్రాంతానికి ఎప్పుడోస్తారో..యాత్రలో ఏ నాయకుడు మాట్లాడతాడో కూడా వచ్చే వరకూ కూడా కార్యకర్తలు తెలియడంలేదు. ఒక్క మొదటి రోజు మినహాయిస్తే ఏ రోజూ కూడా యాత్ర సక్రమంగా సాగలేదని టీడీపీ కార్యకర్తలు చిరాకుకు లోనవుతున్నారు. -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
అయ్యయ్యో అయ్యన్న...ఎంత కర్మ వచ్చింది...!
-
విశాఖ టీడీపీలో గంటా శ్రీనివాసరావు రచ్చ.. అయ్యన్నపాత్రుడి ఆగ్రహం!
విశాఖ తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు రచ్చ రచ్చ చేస్తున్నారు. గంటాకు ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని అయ్యన్నపాత్రుడు తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పాలని డిసైడ్ అయ్యారట అయ్యన్న. గంటా విషయంలో బాబుతో తాడో పేడో తేల్చుకుంటానంటున్న అయ్యన్న ఏం చేయబోతున్నారు? వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా వారిమధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గంటా కొద్ది రోజుల క్రితం వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలను అయ్యన్నపాత్రుడే నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికీ గంటా హాజరు కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు కూడా పార్టీలో గంటాకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇదే అయ్యన్న వర్గీయులకు మింగుడుపడటం లేదు. నాలుగేళ్ల పాటు పార్టీకి దూరంగా ఉండి.. ఇప్పుడు హడావుడి చేస్తున్న గంటాకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిసిన వేపాడ చిరంజీవి విజయాన్ని కూడా గంటా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అయినట్లు గంటా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ అయ్యన్న వర్గీయులకు రుచించడం లేదు. నాలుగేళ్లగా తాము పార్టీ కోసం కష్టపడుతున్నామని.. గంటా మాత్రం తన వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణకు ఇబ్బందులు వస్తాయని ఇంట్లోనుంచి బయటకే రాలేదని అయ్యన్న టీమ్ సెటైర్లు వేస్తోంది. చదవండి: తిరుపతిలో సుగుణమ్మకు పరపతి కరువైందా? టికెట్ వేటలో ఆమెకు పోటీగా నలుగురు! పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం మీడియాకు లీకులు ఇచ్చుచుకుంటూ నాలుగేళ్ల పాటు కాలాక్షేపం చేసిన గంటాకు పార్టీ అధినేత ప్రాధాన్యత ఇవ్వడాన్ని అయ్యన్న వర్గీయులు తప్పు పడుతున్నారు. ఆయన లాంటి నాయకులు పార్టీకి అవసరం లేదని, కులం పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన చరిత్ర గంటాదని, తామెప్పుడు పదవుల ఆశించి రాజకీయాలు చేయలేదని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. చంద్రబాబు విశాఖ టూర్ సందర్భంగా అయ్యన్న వర్గీయులు అందరూ చంద్రబాబుతో అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారు. అయ్యన్నపాత్రుడు అయితే చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందు విశాఖలో జరిగిన టీడీపీ బీసీ సదస్సుకు కూడా డుమ్మా కొట్టారు. నర్సీపట్నంలో అందుబాటులో ఉండి కూడా సదస్సుకు హాజరు కాలేదు. చంద్రబాబు విశాఖ పర్యటన ఏర్పాట్లను కూడా అయ్యన్న పర్యవేక్షించలేదు. ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశంలో కూడా అయ్యన్న చంద్రబాబుతో దూరం పాటిస్తూ వచ్చారు. చంద్రబాబు సమావేశంలో పదే పదే కల్పించుకొని అయ్యన్న పేరు ప్రస్తావించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే..అయ్యన్న అలకను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని గంటా వర్గీయులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అయ్యన్నకు నర్సీపట్నం ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఈ రెండు సీట్లపై ఇప్పటివరకు చంద్రబాబు నుంచి అయ్యన్నకు స్పష్టమైన హామీ లభించలేదు. తన కుమారునికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాకపోయినా మాడుగుల అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న కోరుతున్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! ఈ రెండు సీట్లును సాధించుకోవడం కోసమే అయ్యన్నపాత్రుడు వ్యూహాత్మకంగా చంద్రబాబు పర్యటన సందర్భంగా అలక అస్త్రాన్ని తెరపైకి తెచ్చారని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం అయ్యన్నకు ఇదేమి తొలిసారి కాదని, తన కోర్కెలు నెరవేర్చుకునేందుకు వివిధ రూపాల్లో అసంతృప్తిని వ్యక్తపరుస్తారని కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి అయ్యన్న, గంటా మధ్య విభేదాలు రచ్చకెక్కడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని.. గ్రూపు రాజకీయాలు ఎటువైపుకు తీసుకువెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
విశాఖ: ఉత్తరాంధ్ర టీడీపీలో ముసలం!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయల నడుమ చిచ్చు ఒక్కసారిగా భగ్గుమంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారు. ఈ క్రమంలోనే అలిగిన అయ్యన్న.. చంద్రబాబు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న బీసీ కార్యక్రమానికి సైతం అయ్యన్న డుమ్మా కొట్టారు. అలాగే తన తనయుడు విజయ్‌కి ఎంపీ టికెట్.. తమ ఎమ్మెల్యే టికెట్‌పైనా స్పష్టత ఇవ్వాలని అయ్యన్న అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న గంటాకు ఉన్నపళంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంపైనా అయ్యన్న వర్గీయులు టీడీపీని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాయకరావుపేట టీడీపీలోనూ వర్గ విభేదాలు బయటపడ్డాయి. వంగలపూడి అనితకు వ్యతిరేకంగా పార్టీలో ఓ వర్గం సమావేశం అయినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో ఇద్దరు నేతలపై వేటు పడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
ఇంగితంలేని మాటలు.. అయ్యన్నా.. ఇక ఆపన్నా! టీడీపీ నేతల హితవు
తాగి వాగే అయ్యన్న మాటలు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదా..? అయ్యన్న రోజూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారా..? అయ్యన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇంతకీ టీడీపీలో అయ్యన్న పాత్ర ఎలా ఉంది?. కొంతకాలం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది బడితే అది వాగడం వల్ల పార్టీకి నష్టం జరుతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రిని, మహిళలను, ఉద్యోగులను, పోలీసులను పట్టుకొని ఏది బడితే అది మాట్లాడటం వల్ల పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా అయ్యన్న తీరును కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో వ్యవహరించే నాయకులు పార్టీకి మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ట్విట్టర్ వేదికగా అయ్యన్నను ప్రశ్నించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు సహనం కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం ద్వారా అయ్యన్న తన ఉనికిని చాటుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తన కుమారుడికి పార్టీ అధినేత అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారనే ఆశతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పోలీసులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసులను కాల్చి పారేస్తానంటు బహిరంగ వేదిక పైనుంచి మాట్లాడారు. హోం మంత్రి పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పదవి కట్టబెడితే పోలీసుల సంగతి తేలుస్తానంటూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించింది. అయ్యన్న వ్యాఖ్యలపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగుల మనోభావాలు కించిపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించింది. గతంలో కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలూడదీసి కొడతానంటూ దుర్భాషలాడి విమర్శల పాలయ్యారు.. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? గ్రాఫిక్స్ చరిత్రలు సైకిల్ పార్టీవే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణమంతా గ్రాఫిక్స్ అంటూ అయ్యన్న చేసిన విమర్శలపై అనకాపల్లి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడని స్థానిక ప్రజలు అయ్యన్నకు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడుతో సహా టిడిపి నేతలు వస్తే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అయ్యన్న నోటికి తాళం వేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమంటునన్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్‌గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
అనకాపల్లి.. ఇదేం లొల్లి..?
అనకాపల్లి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై జిల్లా నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఒక పార్టీలో వర్గాలను సృష్టించడం పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి తెలుగుదేశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడైనా మంటలు రేగవచ్చంటున్నారు. ఇంతకీ అనకాపల్లిలో అయ్యన్న ఏం చేశారు? చింతకాయల మంత్రాంగం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని తొక్కి పెట్టడంపై ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులుగా ముద్రపడిన వారికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కాపు వర్గం నేతలను తొక్కిపెట్టి తన వర్గం వారికి సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంపై టీడీపీలోని కాపు వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కొనసాగుతున్నారు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబు స్థానంలో తన శిష్యుడైన కేఎస్ఎన్ రాజుకు సీటు ఇప్పించాలని పార్టీ నాయకత్వం వద్ద పావులు కదుపుతున్నారని అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు కాపువర్గం నాయకులు.. డబ్బులుంటేనే టికెట్ ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ.. ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని పోటీకి దించాలంటూ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి చాలామంది కాపు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కాపు వర్గం నేతలే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీ స్థానంలో కూడా కాపులు పోటీ చేయకుండా అడ్డుకోవాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే అయ్యన్న ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కాపువర్గం నేతలు భావిస్తున్నారు. చదవండి: (టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు) కలిసిన వాళ్లందరికీ హామీలు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. చోడవరం సీటు కెఎస్ఎన్ రాజుకు, మాడుగుల సీటు గరివిరెడ్డి రామానాయుడుకు ఇప్పించే బాధ్యత తనదే అంటూ తిరుపతిలో అయ్యన్నపాత్రుడు వారిద్దరికీ మాట ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు పీల గోవిందకు మద్దతునిస్తున్నారు. మన కుర్చీకింద తడి, పక్క కుర్చీ కోసం ప్లాన్ పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు నారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా విశాఖ సౌత్ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జిని పెందుర్తిలో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. తన నియోజకవర్గ పరిస్థితిని చక్క బెట్టుకోలేని అయ్యన్న జిల్లా అంతటా పెత్తనం చేయాలని భావిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మండిపడుతున్నారు. ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇతరుల సలహాలు పాటిస్తే ఆయన అయ్యన్న ఎందుకవుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్ ఏంటి బాబు?
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శ్రీరాముడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు. ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? అని నిలదీశారు.చంద్రబాబు ఆరాటం లోక కళ్యాణం కోసం కాదని, లోకేష్ కళ్యాణార్థం అని అందరికీ తెలుసని ఎంపీ జీవీఎల్ ట్వీట్ చేశారు. భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు @ncbnతో పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు. — GVL Narasimha Rao (@GVLNRAO) November 20, 2022 -
అయ్యన్నపాత్రుడిని సీఐడీ విచారించుకోవచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి చుక్కెదురైంది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణ కేసును కొట్టేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. 41ఏ నోటీసు ఇవ్వాలని సంబంధిత విచారణ సంస్థకు సూచించింది. అంతేకాదు.. అయ్యన్నపాత్రుడిని, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ విచారించుకోవచ్చని తెలుపుతూ.. విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. -
లబ్ధి కోసమే ఎన్వోసీ!
సాక్షి, అమరావతి: సీఐడీ నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 467 (వాల్యుబుల్ సెక్యూరిటీ ఫోర్జరీ) తమకు ఎంతమాత్రం వర్తించదన్న టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ వాదనను హైకోర్టు ప్రాథమికంగా తోసిపుచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సెక్షన్ వారికి వర్తిస్తుందని అభిప్రాయపడింది. ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతోనే జల వనరుల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందారని, అందువల్ల అది వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయస్థానం ప్రాథమికంగా ఏకీభవించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌పై సీఐడీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ తెలుసుకునేందుకు ఆ కేసు డైరీని తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. నర్సీపట్నంలో పంట కాలువకు చెందిన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు జల వనరుల శాఖ ఎన్వోసీని ఫోర్జరీ చేశారంటూ ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లపై సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అయ్యన్నపాత్రుడు, రాజేష్ అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. అరెస్ట్ చేయొద్దంటే ఎలా...? సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఎన్వోసీని ఫోర్జరీ చేశారని, అందువల్ల అది ఐపీసీ సెక్షన్ 467 కింద వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఐపీసీ సెక్షన్ 30 చదివి వినిపించారు. దీని ప్రకారం న్యాయపరమైన హక్కు కల్పించేది ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీయే అవుతుందన్నారు. ఈ సెక్షన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఉదహరిస్తూ దాని ప్రకారం ప్రస్తుతం పిటిషనర్లు పొందినట్లు చెబుతున్న ఎన్వోసీ వాల్యు బుల్ సెక్యూరిటీ కిందకే వస్తుందని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపించడం సరికాదని పొన్నవోలు పేర్కొన్నారు. లేని డాక్యుమెంట్ ఆధారంగా భవనం కట్టారని, ఇందుకోసం ఫోర్జరీ ఎన్వోసీ సృష్టించారన్నారు. అసిస్టెంట్ ఈఈని బెదిరించి ఎన్వోసీపై సంతకం చేయించి ముద్ర వేయించారని తెలిపారు. నిందితులను ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకే వారిని అరెస్ట్ చేశామని నివేదించారు. కేసు నమోదు తరువాత వాస్తవాలను రాబట్టేందుకు నిందితులను అరెస్ట్ చేసే హక్కు దర్యాప్తు అధికారులకు ఉందన్నారు. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని, అరెస్ట్ చేయవద్దంటే సంబంధిత సెక్షన్‌ను చట్టం నుంచి తొలగించడమే మేలన్నారు. నిందితుల అరెస్ట్‌పై ఏ చట్టంలో కూడా ఎలాంటి నిషేధం లేదన్నారు. అయ్యన్న లాంటి వారి వల్ల దోపిడీ రాజ్యం తయారైందని, అలాంటి వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తే అది రామరాజ్యం అవుతుందన్నారు. కక్ష సాధింపు... అంతకు ముందు అయ్యన్న, రాజేష్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. గతంలో తాము ఎన్వోసీ పొందామని, వాటి కాపీలను ఓ కేసులో హైకోర్టు ముందుంచామన్నారు. వాటిని జారీ చేసిన తేదీకి, ఫోర్జరీ తేదీకి పొంతన లేదన్నారు. ఏ రకంగానూ తమకు 467 సెక్షన్ వర్తించదన్నారు. మిగిలినవన్నీ సాధారణ సెక్షన్లేనని, వాటికి సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
‘అయ్యన్న’ అరెస్టు
నర్సీపట్నం/ఆరిలోవ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ఫోర్జరీ కేసులో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన నివాసానికి సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు, స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇద్దరు కుమారుల పేరుపై ఐదేళ్ల కిందట ఇళ్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు గతంలో దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేందుకు సిద్ధంకాగా అయ్యన్న కుటుంబం, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో.. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు తప్పుడు ఎన్ఓసీ సర్టిఫికెట్ సృష్టించి ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తీయకపోవడంతో కొద్దిసేపు పోలీసులు నిరీక్షించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో అయ్యన్న తనయుడు రాజేష్ బయటకు రావడం.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను ముందుగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఇంతలో అయ్యన్నపాత్రుడు బయటకొచ్చి.. నన్ను అరెస్టుచేసేందుకు ఇంతమంది రావటం అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టుగల కారణాలు తెలియజేస్తూ నోటీసును అయ్యన్నపాత్రుడికి పోలీసులు అందజేశారు. దీనిపై అయ్యన్న, సీఐడీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు నోటిసుపై సంతకం చేశారు. అరెస్టుచేసి ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తుండగా నోటీసును తన చేతికిస్తేనే వస్తానని అయ్యన్నపాత్రుడు మెలిక పెట్టారు. పోలీసులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి విశాఖకు తరలించారు. మరోవైపు.. శాంతియాత్ర పేరుతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా ఇక నర్సీపట్నంలో అరెస్టుచేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను పైనాపిల్ కాలనీలో ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని కొంతసేపు హైడ్రామా నడిపారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక మధ్యాహ్నం వరకు అక్కడే విచారించిన సీఐడీ అధికారులు 2.30 గంటలకు అయ్యన్నతో పాటు కుమారుడు రాజేష్‌ను వైద్య పరీక్షలు నిమిత్తం సింహాచలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సా.4.30 గంటలకు విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించిన కోర్టు సా.5.40 గంటలకు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వారిని పోలీసులు హాజరుపరిచారు. అయ్యన్న, అతని కుమారుడు రాజేష్‌లపై రిమాండ్ రిపోర్టును ఏపీపీ ఆదినారాయణ ద్వారా సీడీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన కేసుతో పొంతనలేదని జడ్జి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41ఎ నోటీసులు అందజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈఈ ఫిర్యాదుతో ‘ఫోర్జరీ’ వెలుగులోకి.. ఇక చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబీకులు 2017లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి కోసం అదే ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో (సెటిల్మెంట్ డీడ్ నెం–3660 ఆఫ్ 2017) సర్వే నెంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరారు. దక్షిణం, పశ్చిమం వైపునకు పంట కాలువ ఉన్నట్లు ప్లాన్‌లో చూపించారు. అయితే, నిర్మాణ సమయంలో ఈ కాలువను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్ఓసీని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్జికార్జునరావు సంతకంతో ఇచ్చినట్లుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన సదరు ఈఈ.. ఎన్ఓసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాక.. దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదన్న సంగతి ఆయనకు స్పష్టమైంది. అదే విధంగా కోర్టుకు సమర్పించిన ఎన్ఓసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాకపోవడంతో ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఈఈ మల్జికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు. ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనే అని తెలిపారు. మరోవైపు.. కార్యాలయం సీల్ కూడా తమది కాదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెప్టెంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్ఓసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. ఫోర్జరీ కారణంగానే అరెస్టు చేశాం : సీఐడీ డీఐజీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి నకిలీ ఎన్ఓసీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం అరెస్టుచేసినట్లు సీఐడీ విభాగం డీఐజీ సునీల్‌నాయక్ వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ స్థలం కబ్జా, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్‌లపై నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.మల్లికార్జునరావు ఫిర్యాదు చేశారని చెప్పారు. దాంతో సెక్షన్లు 464, 467, 471, 474, 120 (బి), 34 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఫోర్జరీ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సునీల్‌నాయక్ తెలిపారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్టుచేశామన్నారు. మిగిలిన నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. -
సీఎం సతీమణిపై తప్పుడు ప్రచారం ఐటీడీపీ పనే
సాక్షి, అమరావతి/బంజారాహిల్స్ (హైదరాబాద్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక పాత్రధారులు, సూత్రధారులను సీఐడీ గుర్తించింది. ‘భారతీపే’ అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నది ఐటీడీపీ పనేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారించింది. చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో క్రైం నెంబర్ 14/2022 ఐపీసీ సెక్షన్ 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్–2000 సెక్షన్ 66(సి) ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలంటూ చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు సెక్షన్ 41–ఎ నోటీసు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని ట్రెండ్‌సెట్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం సీఐడీ అధికారులు నోటీసును అందజేశారు. విజయ్ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారు : అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం: నా మీద 14 కేసులు పెట్టి ఏం పీకారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తన కుమారుడు విజయ్ ఇంటికి సీఐడీ అధికారులు మఫ్టీలో వెళ్లి దౌర్జన్యం చేయటం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పారు. ఆ వీడియోలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సీఎం ఆలోచన మారాలన్నారు. ఏదో ఒక కేసు పెట్టి తమను జైల్లో పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. -
సీఐడీ కేసును కొట్టేయండి
సాక్షి, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్‌లో వ్యాప్తి చేసి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవానికి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఫోన్ నంబర్ సాయంతో ఆ వీడియోను ఐ టీడీపీ గ్రూప్‌లో అప్లోడ్ చేశారని, దాంతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో విజయ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్ధించారు. -
అయ్యన్నకు మతిభ్రమించింది
నర్సీపట్నం: టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నర్సీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ప్రభుత్వం రూ.166.89 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. అయితే టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టును తెచ్చామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు వచ్చి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిలదీశారు. అయ్యన్నపాత్రుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నర్సీపట్నానికి చేసిందేమీ లేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు రూ.56 కోట్ల ప్యాకేజీ–2కి టెండర్లు పిలిచారన్నారు. ఏలేరు నీటిని తీసుకునేందుకు అనుమతులు రాకపోయినా.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో కేవలం పైపులకు టెండర్లు పిలిచారని మండిపడ్డారు. -
నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే ప్రజలే నాలుక చీరేస్తారు
సాక్షి, అనకాపల్లి: స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ప్రజలే నీ నాలుక చీరేస్తారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా హెచ్చరించారు. చోడవరం వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ ఇటీవల టీడీపీ మినీమహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుల మాట తీరుపై తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు ఏక వచనంతో తన బ్యాండ్ బాజా అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా తిడుతుంటే పక్కనే ఉన్న 14ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు వారించకపోవడం సిగ్గుచేటన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అమర్నాథ్ నిప్పులు చెరిగారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు) -
అర్ధరాత్రి పూట స్టేలు అవసరం ఏముంది: సన్యాసి పాత్రుడు
సాక్షి, అనకాపల్లి: వందల ఎకరాలు దానం చేశామని చెప్పుకుంటున్న అయ్యన్న రెండు సెంట్లు స్థలం కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. ఈ మేరకు నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆక్రమించిన రెండు సెంట్లు స్థలం రావనపల్లి రిజర్వాయర్ కాలువకు సంబంధించింది. అయ్యన్న ఆక్రమించిన స్థలంపై రిజర్వాయర్ కమిటీ మొదట్లోనే అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం తెలిపిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వారివి కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రెండు సెంట్లు స్థలం మీదే అయినప్పుడు ఎందుకు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పూట స్టేలు తెచ్చుకోవలసిన అవసరం ఏముంది. కోస్తా టైగర్ అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు దాక్కున్నారు. 276 సర్వేనెంబర్లో ఆక్రమించారని అధికారులు చెబుతుంటే మీరు 277 సర్వేనెంబర్ చూపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీకి అయ్యన్న కుటుంబం భూములు ఇవ్వలేదు. మా తాత ముత్తాతలు ఇచ్చారు, దానిని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయ్యన్న భార్య మహానటి సావిత్రిని మించి నటించింది. మేము పార్టీ మారినప్పుడు నన్ను నా కొడుకుని పంపించడానికి రౌడీలను పంపారని' చింతకాయల సన్యాసిపాత్రుడు అన్నారు. చదవండి: (పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ అయిన నీలంపేట చానల్‌కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్మెంట్ నిర్మించారు. ఈ చానల్ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. ఈనెల 2న నోటీసులు జారీ అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్ అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్ సీఐ మోహన్‌రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు. అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేసినట్లు సమాచారం. కాలువను కబ్జాచేసి కట్టేశారు ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ నీలంపేట చానల్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు. -
ఆ పిచ్చి మాటలు విని జనం నవ్వుతున్నారు: మంత్రి కారుమూరి
సాక్షి, తాడేపల్లి: అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఆయన బాటలోనే పార్టీ నేతలు నడుస్తున్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటి?. బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా?. అయ్యన్నపాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశాం. బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడు. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిది. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారు. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోంది. కానీ చంద్రబాబు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. చదవండి: (అయ్యన్న బాగోతం.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారంటే?) ఆ పిచ్చి మాటలకు జనం నవ్వుతున్నారు 'చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదంట. ప్రపంచమంతా కూడా రాకుండా ఆపేవారేమో?. తుపానులు ఆపుతానంటాడు. ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు. ఇలాంటి పిచ్చిమాటలు విని జనం నవ్వుతున్నారు. విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారు. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారు. అయ్యన్నపాత్రుడు ఓ తాగుబోతు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారు. జగన్‌పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదు. ఇక ఇంటికొకరు ఏం వస్తారు?. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్‌ని విమర్శిస్తున్నారంటూ' మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబుపై మండిపడ్డారు. చదవండి: (Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు) -
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు. అయ్యన్న ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. రోజు నీతులు చెప్పే అయ్యన్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మార్వో జయ మాట్లాడుతూ.. మాజీ మంత్రి అయ్యన్న కుటంబం అక్రమ నిర్మాణాన్ని గుర్తించాము. అక్రమ నిర్మాణంపై నోటిసులు జారీ చేశాము. నిబంధనలు ప్రకారం అక్రమ నిర్మాణాన్ని తొలగించామని అన్నారు. చెరువు కాలువకు చెందిన రెండు సెంట్లు స్థలాన్ని ఆక్రమించి అయ్యన్నపాత్రుడు అక్రమ నిర్మాణం చేపట్టారని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు అన్నారు. రెండు సెంట్లు స్థలంలో నిర్మించిన ఆక్రమణ నిర్మాణాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే అయ్యన్నపాత్రుడు ఇంటిని తొలగించలేదని అన్నారు. అక్రమ నిర్మాణంపై ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. చదవండి: (పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు) -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
టీడీపీలో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు కలకలం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విశాఖలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. 'మూడేళ్లు పుట్టల్లో దాక్కున్న బురద పాములు మళ్లీ బయటకు వస్తున్నాయి. ఆ పాములు ఎవరో మీకు తెలుసు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పాములు పుట్టలో దాక్కున్నాయి. కార్యకర్తల మీద, పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు నోరు మెదపలేదు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫోటోలుకు పోజులు ఇస్తున్నారు. ఇటువంటి వారిని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించొద్దు. బురద పాములను పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. పార్టీ కోసం కష్టపడిన నాయకులు చాలామంది ఉన్నారు వారిని గుర్తుపెట్టుకోవాలి' అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఆ పార్టీలో అలజడి రేపుతున్నాయి. చదవండి: (మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు) -
అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని, కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు. చదవండి: తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదు: జోగి రమేష్ రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు. చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు. -
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఆక్షేపణీయం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి అయి ఉండి కూడా ‘ఎస్పీ నా కొడుకులు’ అని సంబోధించడం ఆక్షేపణీయమని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గర్హించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు. -
చంద్రబాబుపై అయ్యన్న తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: ‘పార్టీ ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోతే ఎలా? ప్రజలు ఏమనుకుంటారు? కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరు’ అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు 4 రోజులక్రితం ఉండవల్లి చేరుకుని పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అయ్యన్నపార్టీ కార్యకలాపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ► చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండిపోవడం, ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోవడం సరికాదని అయ్యన్న్న కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కొందరు ప్రచారం కోసం పనిచేస్తున్నారని, వారివల్ల ఉపయోగం లేదని అయ్యన్న పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్‌లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని అయ్యన్న ప్రశ్నించినట్లు సమాచారం. ► ఇలాగైతే పార్టీని ఎవరూ రక్షించలేరని అయ్యన్న వ్యాఖ్యానించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కంగుతిన్న చంద్రబాబు హైదరాబాద్ వెళ్లాక లోకేష్‌ని ఏపీకి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.\ చదవండి: రథం చుట్టూ రాజకీయం! -
‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అయ్యనపాత్రుడి చేతుల్లో డాక్టర్ సుధాకర్ కీలు బొమ్మలా మారాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. టీడీపీ నేతల పథకం ప్రకారమే డాక్టర్ సుధాకర్ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయం ముందుగానే ఓ లేఖ తయారుచేసిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే సుధాకర్ విషయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కులాన్ని లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : ‘బాబును దళిత సమాజం ఏనాడు క్షమించదు’) 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పాయకరావుపేట సీటు కోసం సుధాకర్ ప్రయత్నం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే సీటు కోసం సుధాకార్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆ లేఖను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సమర్పించారని చెప్పారు. ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో వైద్య విధాన పరిషత్ కమిషన్ ఆ లేఖను ఆమోదించలేదని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రోజే ఉద్యోగానికి రాజీనామా లేఖ సమర్పించిన సుధాకర్.. సీటు లభించకపోవడంతో తిరిగి ఉద్యోగంలో చేరాడని విమర్శించారు. (చదవండి : చంద్రబాబు డైరెక్షన్లో.. డాక్టర్ సుధాకర్) -
డాక్టర్ డ్రామా : అయ్యన్నపై సోదరుడి ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కూడా టీడీపీ నాయకులు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఓ వైద్యుడితో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి అడ్డంగా బుక్కయ్యారు. అయితే అయ్యన్న చేసినపనిపై ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెధవ రాజకీయాలు చేయడంపై మండిపడ్డారు. మొదటి నుంచి అయ్యన్నకు కుట్ర పూరితమైన రాజకీయాలు చేయడం అలవాటేనని ఆయన సోదరుడు తెలిపారు. అయ్యన్న వ్యవహార శైలి ఎప్పుడు వివాదస్పదమేనని గుర్తుచేశారు. ఓడిన ప్రతిసారి అయ్యన్న తీరుమారిపోతుందని అన్నారు. అయ్యన్నను కలవడానికి వెళ్లానని ఒప్పకున్న డాక్టర్‌ను విచారించి అసలు దోషులను శిక్షించాలని పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. అసలేం జరిగిందంటే.. ఓ వైపు కరోనా రక్కసి విజృంభిస్తుంటే.. మరోవైపు దాన్ని మించి పచ్చ కరోనా వైరస్ విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మరకలు అంటిండానికి కుట్రలు, కుతంత్రాలతో పెచ్చరిల్లుతోంది. నర్సీపట్నంలో జరిగిన మత్తు డాక్టర్ ఎపిసోడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తమిళనాడు నుంచి నర్సీపట్నం వచ్చి బస చేసిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధికారులతో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ సమీక్ష జరుగుతుంటే.. అనస్థీషియా డాక్టర్ సుధాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి రంకెలు వేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆయన రాజకీయాలను ప్రస్తావిస్తూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా బాగుండేదని చేసిన వ్యాఖ్యలతోనే ఇదంతా డ్రామా అని స్పష్టమైంది. ఆ తర్వాత బయటికొచ్చిన వీడియోలతో మొత్తం కుట్ర బట్టబయలైంది. సమావేశానికి ముందు సదరు డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్ళి గంటన్నర సేపు ఉండటం.. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించడంతో మొత్తం స్క్రీన్‌ప్లే అయ్యన్న ఇంటి నుంచే నడిచిందని అర్ధమైంది. డాక్టర్ నిజ స్వరూపమూ బయటపడింది. వివాదాస్పద ట్రాక్ రికార్డ్ సస్పెన్షన్లు, షోకాజ్‌లు, నిత్యం వివాదాలు.. ఇదే డాక్టర్ సుధాకర్ ట్రాక్ రికార్డ్‌గా కనిపిస్తోంది.. విధులకు ఆలస్యంగా వస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ సంగతి తేలుస్తానంటూ బెదిరించడం, నానాయాగీ చేయడం అతనికి పరిపాటిగా మారింది. గతంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యారు. ఇటీవల నర్సీపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో వివాదం కూడా పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. కరోనా వేళ... సెలవులు కావాలని ఒత్తిడి చేయడం, విధులకు ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా పనిచేయడం.. బరితెగించి టీడీపీ నేతలతో కలిసి కుట్రలకు దిగడం ద్వారా సుధాకర్ వివాదాస్పద తీరు పరాకాష్టకు చేరిందన్న వ్యాఖ్యలు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. చదవండి : డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు -
రాజకీయాలు చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఏపీ స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు ఎవరిపై ప్రేమలుండవని చట్ట ప్రకారం మా విధులు మేము చేసుకుంటామన్నారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చదవండి: స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్ టీచర్‌గా! తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవ చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతుంటాయి.. కానీ తామెప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. దేశంలోనే అతి ఉత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. చదవండి: సారూ.. ఆమె మా బిడ్డనే.. -
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్
సాక్షి, విశాఖపట్నం: పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఈనెల 3న కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విభేదాల కారణంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడి కుమారుడు గత నెల 12న తన ఇంటిపై జెండా కట్టేందుకు సన్నద్ధమయ్యాడు. జెండా కట్టవద్దంటూ దివంగత లచ్చాపాత్రుడి కుమార్తెలు అడ్డు తగలడంతో వివాదం రాజుకుంది. తనకు మాజీ మంత్రి కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వరుణ్ మీద లచ్చాపాత్రుడు కుమార్తె లక్ష్మి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అయ్యన్న నివాసం వద్ద ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశా రు. దీనిపై ఆగ్రహించిన మాజీ మంత్రి అయ్యన్న అనుమతి లేకుండా నాఇంటికి ఎలా వచ్చారంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించి, విదులకు ఆటంకం కలిగించారని గత నెల 20న పోలీసులు ... అయ్యన్నపై 353, 506, 504, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జిల్లాకు రాకుండా తన చిన్న కుమారుడి పెళ్లి పనుల పేరుతో అయ్యన్న ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. చదవండి: మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు ఇదే సందర్భంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీని కలిసి అయ్యన్నపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయ్యన్న జిల్లాకు ఎప్పుడొచ్చినా అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారనే సమాచారం తెలియడంతో ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 3న అయ్యన్నకు బెయిల్ మంజూరు చేసింది. అయ్యన్నపాత్రుడు సోమవారం నర్సీపట్నం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. -
మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు
నర్సీపట్నం: పరుష పదజాలంతో పోలీసులను దూషించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ స్వామినాయుడు శనివారం చెప్పారు .ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన నివాసముంటున్న ఇంటిపైన వైఎస్సార్సీపీ జెండా కట్టడంతో ఈ నెల 12న ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయ్యన్న నివాసం వద్దపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసుల విధులకు భంగం కలిగించి, అసభ్యకరంగా దూషించిన అయ్యన్నపై ఈ నెల 20న కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
తాగుబోతులకు మద్దతుగా అయ్యన్న!
సాక్షి, విశాఖపట్నం: నర్సీపట్నంలో అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో బండిపై అధిక స్పీడుతో వెళ్తూ హల్చల్ చేశారు. మితిమీరిన వేగంతో బండిపై వెళ్తున్న వారిని ఎస్సై రమేష్ అపి, అధిక మొత్తంలో మద్యం సేవించినట్లు గుర్తించి సతీష్, రౌడీషీటర్ పప్పల నాయుడులపై కేసు నమోదు చేశారు. దీంతో కక్ష్య పెంచుకొన్న నిందితులు పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, రాళ్లతో దాడి చేస్తూ ఎస్సైపై హత్యా ప్రయత్నం చేయబోయారు. రాళ్ల దాడి నుంచి ఎస్సై రమేష్ తృటిలో తప్పించుకున్నారు. దీంతో నిందితులను విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు శుక్రవారం పిలిపించారు. సతీష్‌పై గతంలో కేసులున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా స్టేషన్ మేడ మీద నుంచి సతీష్ దూకాడు. దీంతో అతని కాలుకు గాయం కావడంతో విశాఖ కెజీహెచ్‌కు పోలీసులు తరలించారు. అర్ధరాత్రి సమయంలో నిందితుడు సతీష్‌ను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. మీడియా హైప్ కోసం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలసి మరోసారి కేజీహెచ్‌కు అయ్యన్న వెళ్లారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సోమవారంలోపు చర్యలు తీసుకోకుంటే నర్సీపట్నం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామంటూ అయ్యన్న బెదిరింపులకు దిగారు. దీంతో తాగుబోతుల వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్న అయ్యన్న పాత్రుడుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చదవండి : పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు -
‘అయ్యన్న దోపిడీ ప్రజలు మర్చిపోలేదు’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శించే ముందు నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్ అన్నారు. రైతులను చంపించి, మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనత నీ తండ్రి చంద్రబాబు నాయుడుకే చెందుతుందని విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే గణేష్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఆరు సంవత్సరాలపాటు రాజకీయ అనర్హుడిగా లోకాయుక్త ప్రకటించిన విషయాన్ని మర్చిపోయావా?, నీ రౌడీయిజానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అని మండిపడ్డారు. ‘నీ కార్యకర్తల ముందే అసభ్య పదజాలంతో పోలీసులను బెదిరిస్తున్నావు. అది రౌడీయిజం కాదా’ అని అయ్యన్నను ప్రశ్నించారు. ఆరుసార్లు మంత్రిగా పనిచేసినా.. సక్రమంగా పాలన చేయకపోవడం వల్లే జిల్లాలో గంజాయి మాఫియా విస్తరించిందని విమర్శించారు. ఆసుపత్రి వ్యవహారంలో అయ్యన్న హస్తంతోనే రూ.కోటిన్నర నిధుల దోపిడీ జరిగిందన్న విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎమ్మెల్యే వెల్లడించారు. -
టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా
నర్సీపట్నం: విశాఖ జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఆయన సతీమణి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సీహెచ్ అనిత బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి అయ్యన్నకు షాక్ ఇచ్చారు. నర్సీపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా రెండు సార్లు, కొనసాగారు. ఈ నేపథ్యం లో బుధవారం సన్యాసిపాత్రుడు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన భార్య అనిత, పది మంది మాజీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారన్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. -
పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు
సాక్షి, విశాఖపట్నం: తన పుట్టిన రోజు బైక్ ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చిందులు తొక్కారు. పోలీసులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. హెల్మెట్లు పెట్టుకుని బైక్ ర్యాలీ చేయాలట... బండ్లు నడపకుండా తోసుకుని పోలీసు స్టేషను వరకు వెళ్లాలి అంటూ పోలీసులను ఎద్దేవా చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నాయకులు వస్తారని.. రక్తదాన శిబిరాలు పెడతానంటే అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎవరు ఏం చెప్పినా తాను తగ్గనని.. అనుకున్నది చేసి తీరతానని పేర్కొన్నారు. తన గురించి తెలుసు కాబట్టే కలెక్టర్ తర్వాత పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. మూడేళ్లలో అందరి కళ్ళు దింపుతామంటూ పోలీసులను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా... అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. -
టీడీపీకి అయ్యన్న సోదరుడు రాజీనామా
-
బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్!
సాక్షి, విశాఖ : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి పుట్టినరోజు నాడే ఆయన సోదరుడు ఝలక్ ఇచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన విషయం విదితమే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. అది కూడా విశాఖ జిల్లాలో నారా లోకష్ పర్యటన వేళ టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. కాగా కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చిన విషయం విదితమే. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పడంతో ఇద్దరి మధ్య చాలాకాలంగా మాటలు కూడా లేవు. -
2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ
సాక్షి, నర్సీపట్నం: రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగా, బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగుతోందన్న ఆరోపణలకు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: పవన్ పర్యటనలో టీడీపీ నేతలు) -
లగడపాటిది పనికిమాలిన సర్వే: టీడీపీ మంత్రి
నర్సీపట్నం: ‘ప్రజల నాడి లగడపాటికి ఏమి తెలుసు.. ఆయన సర్వే వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని’ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌లో లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వేపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ వలన అనేకమంది కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కట్టి వీధిన పడ్డారన్నారు. ప్రజల నాడి తెలియని ఇలాంటి పనికిమాలిన సర్వేల వల్ల కోట్లలో బెట్టింగ్‌లు కాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండా ఢిల్లీ వంటి నగరాల్లో కూర్చుని చేసే సర్వేల్లో వాస్తవికత ఉండదన్నారు. ప్రజలనాడి తెలిసిన వారే ఎగ్జిట్‌పోల్స్ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం నవ్వులాటగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కౌటింగ్ కేంద్రంలో అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్ ఉండేందుకు అంగీకరించని ఎన్నికల కమిషన్.. కేంద్ర అబ్జర్వర్‌కు సెల్‌ఫోన్ అనుమతించడంపై అయ్యన్న అనుమానం వ్యక్తం చేశారు. -
పచ్చగడ్డి వేస్తే భగ్గు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిపోరు ముదిరి పాకాన పడింది. కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చింది. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పింది. బాబాయ్, అబ్బాయిలు నర్సీపట్నం పట్టణంలోనూ, నియోజకవర్గంలోను వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయ్యన్న కుమారుడు విజయ్ వ్యవహారశైలితో పార్టీకి నష్టం వాటిల్లుతున్నదంటూ ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబుకు సన్యాసిపాత్రుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటిదాకా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనిపై అయ్యన్నపాత్రుడు మౌనం దాలుస్తూ వచ్చారు. ఈ వివాదం సద్దుమణగక ముందే.. మంత్రి అయ్యన్నను హతమార్చడానికికుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టులు హల్చల్ చేయడం తాజా రగడకు కారణమైంది. ఇటీవల ఒక ముస్లిం కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైనప్పుడు సన్యాసిపాత్రుడు నలుగురితో కలిసి ఈ కుట్రకు శ్రీకారం చుట్టారన్నది ఆ వీడియో సారాంశం. ఇది ఇప్పుడు పార్టీలో చినికిచినికి గాలివానగా మారుతోంది. దీనిపై స్పందించిన సన్యాసిపాత్రుడు ఈ వీడియో క్లిప్‌పై దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీ బాబూజీకి తన కుమారుడు వరుణ్‌తో కలిసి వినతిపత్రం ఇచ్చారు.అనంతరం బుధవారం నర్సీపట్నం ఏఎస్పీకి కూడా మరో వినతి పత్రం ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని మీడియాకు చెప్పారు. తన సోదరుడు అయ్యన్న, తానూ రామలక్ష్మణుల్లా ఉన్నామని సన్యాసిపాత్రుడు చెబుతున్నారు. కొన్నాళ్లుగా మాటల్లేవ్! ఇలావుండగా మంత్రి అయ్యన్నపాత్రుడు, సోదరుడు సన్యాసిపాత్రుడుల మధ్య మాటల్లేవు. అలాగే వారిద్దరి కుమారులకూ అంతే దూరం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ఆ కుటుంబంలో ముదిరిన విభేదాలకు అద్దం పడుతోంది. ప్రస్తుతం అయ్యన్న కాశీ యాత్రలో ఉన్నారు. ఆయన వచ్చాక ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
భగ్గుమన్న ఏపీ మంత్రుల విభేదాలు!
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, ఈవో సూర్య ప్రకాష్‌లను తిరిగి విశాఖలోనే నియమించారని అయ్యన్న పాత్రుడు అలిగినట్లు తెలుస్తోంది. మంత్రి గంటా జోక్యంతోనే వారికి తిరిగి విశాఖలో పోస్టింగ్ ఇచ్చారంటూ మంత్రి అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు నెలల కిందట డీఎల్ఎస్ఏ జిల్లా కమిటీని తనకు తెలియకుండా గంటా అనుచరుడు వెంకటప్పడును నియమించుకొని తనను అవమాన పరిచారంటూ జేడీ, ఈవోలపై ఆయన మండిపడ్డ విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో మంత్రి అయ్యన్న పాత్రుడు అప్పుడే రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సవాల్ విసిరిన మంత్రి అయ్యన్న తాను రాజీనామా చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. కొంతమంది తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోషల్ మీడియా వేదికగా లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పశుసంవర్ధక శాఖు సంబంధించిన విషయం ఎప్పుడో సమసిపోయిందన్నారు. కానీ కావాలనే కొంతమంది ఇలాంటి విషయాలను తెరపైకి తెస్తున్నారని, వారికి దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. -
ఎంతోమంది వార్నింగ్ ఇచ్చారు
విశాఖపట్నం: కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి రిజర్వేషన్ వర్తింపజేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఏపీ రహదారులు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ‘ఇప్పటికి ఐదుసార్లు మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను.. రిజర్వేషన్లు తొలగించాలని 1983 నుంచి చాలాసార్లు చెప్పాను.. దీన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది వార్నింగ్ ఇచ్చార’ని గుర్తుచేశారు. అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆరేటివ్ క్రెడిట్ సొసైటీ శాటిలైట్ బ్రాంచిని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకురావడానికి ఆరోజు అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన వాళ్ళకే మళ్లీమళ్లీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న రూల్ ఎక్కడా లేదన్నారు. ఒక వ్యక్తి రిజర్వేషన్‌పై ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆయన కొడుకు కూడా అదే రిజర్వేషన్‌పై ఐఏఎస్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇలా ఒకే కుటుంబానికి రిజర్వేషన్లు పరిమితం కాకుండా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలన్నారు. రాజులు, బ్రాహ్మణులు, కమ్మ వంటి ఆగ్రకులాల్లో పేదవారు లేరా అని ప్రశ్నిస్తూ పేదరికం చూసి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన సూచించారు. లేని వాడికి ఆర్ధిక సాయం అందించి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. తన కులంలో కూడా కోటీశ్వరులు, పేదవారు ఉన్నారు. కోటీశ్వరుడికి రిజర్వేషన్ కాకుండా పేదవాడికి అందించాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. -
పట్టుకొల్పోతున్న అయ్యన్న పాత్రుడు
-
బాబూ.. మిమ్మల్ని దాటిపోతున్నాడు
అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది కట్టడి చేయకపోతే నష్టపోతాం మంత్రి గంటాపై సీఎంకు అయ్యన్న వర్గం ఫిర్యాదు లోకేష్ దృష్టికి కూడా వ్యవహారం? విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలకు మరోసారి తెరలేచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం శరవేగంగా పావులు కదుపుతోంది. బినామీలు, అనుచరులు, బంధువుల పేరిట అడ్డగోలుగా వందల కోట్ల ఆస్తులు కూడబెడుతున్న గంటా నిర్వాకంతో పార్టీ పరువు భీమిలి సాక్షిగా సముద్రంలో కలిసిపోతోందని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో మంత్రి గంటా బినామీల పేరిట భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లో, మధురవాడ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేశారు.. వివాదాస్పద డీ పట్టా భూములతో పాటు విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారి వెంబడి విలువైన స్థలాల కొనుగోళ్లు చేపట్టారు.. ఆయన ఇలాకాలో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న భూదందాతో పార్టీ పరిస్థితి దిగజారుతోంది.. రానున్న మహావిశాఖ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ పార్టీపై ప్రభావం చూపుతాయి.. అని అయ్యన్న వర్గం బాబుకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి అయ్యన్నతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేత మూడురోజుల కిందట విజయవాడలో బాబుతో భేటీ అయినట్టు సమాచారం. ఇప్పటికే వర్గ సమీకరణల పేరిట మిమ్మల్ని మించిపోయేటట్టు ఉన్నాడు.. పరిస్థితి చేయిదాటిపోకుండా కట్టడి చేయండి.. అని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అన్నీ సావధానంగా విన్న చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటించినట్టు తెలుస్తోంది. బాబుతో పాటు నారా లోకేష్‌తో కూడా గంటా వ్యతిరేకవర్గం భేటీ అయి కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. కాగా, మంగళవారం నుంచి గుంటూరు జిల్లా కె.ఎల్.వర్సిటీలో మొదలైన టీడీపీ మేథోమథనం సదస్సు గురువారం వరకు జరగనుంది. ఈ సదస్సు ముగిసేలోపు మరోమారు బాబుతో భేటీ అయి గంటాపై ఫిర్యాదు చేయాలని అయ్యన్న వర్గం భావిస్తున్నట్టు సమాచారం. -
అధికారులతో చెడుగుడు!
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు తమదైన 'శైలి'లో చెలరేగుతున్నారు. ఏపీ అధికారులతో చెడుగుడు ఆడుతున్నారు. తమ మాట చెల్లించుకునేందుకు 'పవర్' చూపిస్తున్నారు. 'పచ్చ' బాబులకు అనుకూలంగా పనిచేయని అధికారులకు బదిలీ వేటు తప్పదని హెచ్చరించారు. మినీ మహానాడు వేదికగా సాక్షాత్తూ టీడీపీ మంత్రులే ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వడం శోచనీయం. అసలు తమ కార్యకర్తలకు పనులు చేసే పెట్టేందుకే అధికారులు ఉన్నారట్టుగా అమాత్యులు మాట్లాడుతుండడం విస్తుగొల్పుతోంది. అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా గడుసుగా ప్రశ్నించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు తమ్ముళ్లు ఎంతో కష్టపడ్డారని, వారి కోసం పనులు చేస్తే తప్పా అని రెట్టించారు. ఆమాటకొస్తే ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదని అసలు నిజం బయపెట్టారు. తాను ఇలా అన్నానని మీడియా గగ్గోలు పట్టినా పట్టించుకోనని, తన పని తనదేనంటూ విశాఖలో నిర్వహించిన మినీ మహానాడులో అయ్యన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం మినీ మహానాడులో హుకుం జారీ చేశారు. ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని సెలవిచ్చారు. తెలుగు తమ్ముళ్లకు 'రెస్పెక్ట్' ఇవ్వకపోతే రప్ఫాడిస్తామని అధికారులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని కడప మినీ మహానాడులో హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తల మనసు గాయపడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హితబోధ చేశారు. తెలుగు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేస్తే క్షమించనని చెప్పారు. అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం జరిగినా.. వేధించినా రాజీపడే ప్రసక్తి లేదని నెల్లూరు టీడీపీ మినీ మహానాడులో ముక్తాయించారు. మంత్రులు, టీడీపీ నాయకుల వార్నింగులతో అధికారులు బెంబేలెత్తున్నారు. కర్నూలు మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఒక అడుగు ముందుకేసి పోలీసుల సేవలను తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు వాడుకోవాలన్న సూచన చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయిలో సహకరించాలని కూడా ఆయన మనవి చేశారు. డిప్యూటీ సీఎం మాటలకు తగ్గట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు తాళం వేశారు. మాట వినని అధికారుల లిస్ట్ ఇస్తే తానే స్వయంగా సంతకం పెట్టి సీఎం దగ్గరకు పంపుతానంటూ 'పుషింగ్' ఇచ్చారు. మంత్రులే బెదిరింపులకు దిగడంతో అధికారులు హడలిపోతున్నారు. -
ఉత్సవాలను విజయవంతం చేయండి
నర్సీపట్నం టౌన్: పౌర సమాచార ఉత్సవ ఫలితాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక పోలీసు గ్రౌండ్స్‌లో పౌర సమాచార ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. పథకాలపై అవగాహన పొందేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభిస్తారని చెప్పారు. పట్టణంలో రూ.1.5కోట్లతో నిర్మించిన గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవంలో అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. శనివారం నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలను అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసి, నర్సీపట్నానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పీఐబీ అధికారి రెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి నర్సీపట్నం టౌన్: నర్సీపట్నంలో జన సూచన అభియాన్ పౌర సమాచార ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర పౌర సమాచార శాఖ అధికారి రెడ్డి పర్యవేక్షణలో స్టాల్స్ ఏర్పాటుకు అందంగా వేదికను తీర్చిదిద్దారు. శాఖల వారీగా అధికారులు పథకాలకు సంబంధించి నమూనాలను ఏర్పాటుచేశారు. వీటిని మంత్రి అయ్యన్నపాత్రుడు, జేసీ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉత్సవం విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ప్రారంభానికి ముందు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పీఐబీ అధికారి రెడ్డి మంత్రికి వివరించారు. వారి వెంట ఆర్డీవో సూర్యారావు, జిల్లా అధికారులు ఉన్నారు. -
జెడ్పీలో చాంబర్ లొల్లి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా పరిషత్‌లో చాంబర్ లొల్లి కొనసాగుతోంది. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా చాంబర్ ఏర్పాటు చేయలేదన్న ఆవేదనలో వైస్ చైర్మన్ వర్గీయులుండగా, రెండు గదులు చూపించినా వాటిని కాదని తాను కోరుకున్న చోటే చాంబర్ ఏర్పాటు చేయాలంటూ వైస్ చైర్మన్ పట్టుబట్టడం సరికాదంటూ చైర్పర్సన్ వర్గీయులు వాదిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై రసవత్తర చర్చ జరుగుతోంది. టీడీపీలోని ఓ వర్గ ఎమ్మెల్యేలు జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఉండాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో పావులు కదిపారు. దీనిలో భాగంగా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తికి ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును కోరారు. వైఎస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి మంత్రి నేరుగా సూచించారు. ఈ నిర్ణయాన్ని చైర్పర్సన్ జెడ్పీలో చాంబర్ లొల్లి వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడూ లేని విధంగా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏంటని డిఫెన్స్‌లో పడ్డారు. ప్రత్యర్థుల ఎత్తుగడగా భావించినప్పటికీ మంత్రి ఆదేశించిన తర్వాత తప్పదని వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తొలుత జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పాత భవనంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దాన్ని వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుత పరిపాలన భవనంపై ఉన్న ప్రత్యేక రూమ్‌లోనే చాంబర్ ఏర్పాటు చేయాలని పట్టు బట్టారు. చైర్పర్సన్ కోసం కేటాయించిన రూమ్‌ను ఆయనకు కేటాయించాలని కోరడమేంటని చైర్పర్సన్ వర్గీయులు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే చైర్పర్సన్ వాడుతున్నారని, అందులో వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంకేతాలు పంపారు. సమావేశం హాలు పక్కనే ఉన్న రూమ్‌లో చాంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆ ప్రతిపాదనను కూడా వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి తిరస్కరించారు. ప్రస్తుతం పరిపాలన భవనంపైన ఉన్న రూమ్‌లోనే ఏర్పాటు చేయాలని మొండికేసి కూర్చొన్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరక చాంబర్ లొల్లి ఏర్పడింది. మంత్రి ఆదేశించినా పట్టించుకోలేదని వైస్ చైర్మన్, ఆయన అనుకున్న చోటే కేటాయించాలని కోరడం సరికాదని చైర్‌పర్సన వర్గీయుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో ఆ రెండు వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పటికే కొనసాగుతున్న పోరాటంలో ఈ చాంబర్ లొల్లి ఏ మేర ప్రభావం చూపుతుందో, ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
జెడ్పీలో మరో పవర్ సెంటర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. చైర్పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. నిబంధన లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాం బర్ ఏర్పాటు చేయాల ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జెడ్పీలో ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ ఫలితమే ఈ పరిణామనని తెలుస్తోంది. మొన్నటి వరకు డీఈఈ శ్రీనివాస్ కుమార్‌ను అడ్డంపెట్టుకుని ఆటాడుకున్న ప్రత్యర్థులు ఇప్పుడేకంగా వైస్ చైర్మన్ చాంబర్‌ను వేదికగా చేసుకుని పవర్ చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జెడ్పీలో నాట కీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వుడ్ మహిళ చైర్పర్సన్ అయ్యారు కదా, ఇంకేముంది జెడ్పీలో చక్రం తిప్పొచ్చని కొంతమంది టీడీపీ నాయకులు తొలుత భావించారు. ఆమెను కుర్చీకి పరిమితం చేసి పవర్ చెలాయించొచ్చని ఆశపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం చేసేంతవరకు సమష్టిగా ముందుకెళ్లారు. కానీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తనకున్న విద్యా, విషయ పరిజ్ఞానంతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఎవరి అడుగు జాడల్లో కాకుండా స్వతంత్రంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. జెడ్పీలో ఏం జరిగినా తనకు తెలియాలన్న ధోరణితో ముందుకెళ్తున్నారు. పలు విషయా ల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఓవర్ టేక్ చేసి ముందుకెళుతున్న వారికి చెక్ పెడుతున్నారు. అందుకు డీఈఈ శ్రీనివాస్ కుమార్ ఉదంతాన్నే తీసుకోవచ్చు. ఇది మింగుడు పడని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డీఈఈ శ్రీనివాస్‌ను అస్త్రంగా ప్రయోగించారు. ఆయ న ద్వారా వ్యవహారాలు నడిపేందుకు ప్రయత్నించారు. వారు వేసిన ప్రతి ఎత్తుగడలను తిప్పికొడుతూ డీఈఈ దూకుడుకు చైర్పర్సన్ బ్రేకులు వేశారు. జిల్లాలో ఇదొక పెద్ద చర్చనీయాంశమయ్యింది. చెప్పాలంటే గత నెల అంతా జెడ్పీలో హైడ్రామా నడిచింది. చివరికి చైర్పర్సన్ వర్గీయులే పైచేయి సాధించారు. జెడ్పీలో తమ మార్క్ పాలన సాగడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపిన ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని అస్త్రంగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా జెడ్పీలో ఆయనొక చాంబర్ ఏర్పాటయ్యేలా తెరవెనుక పావులు కదిపారని సమాచారం. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లి వారనుకున్నట్టుగా ఆదేశాలిప్పించగలిగారు. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు అందరి మధ్యలో వైస్ చైర్మన్‌కు ప్రత్యేక రూమ్‌లో ఒక కుర్చీ వేయాలని చైర్‌పర్సన్‌కు చెప్పినట్టు తెలిసింది. దీంతో కాదనలేక ఆమె సరే అనేశారు. కాకపోతే, పీఆర్ మంత్రి ఆదేశాలు చైర్పర్సన్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. పరిపాలన సక్రమంగా సాగుతున్న సమయంలో ఈ ఆదేశాలేంటని లోలోపల మథనపడుతున్నట్టు తెలిసింది. నిబంధనల్లో ఎక్కడా వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయాలని లేదని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఏర్పాట్లు చేయలేదని కాసింత అసంతృప్తి చెందినట్టు తెలియవచ్చింది. చాంబర్ ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో వైస్ చైర్మన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో జెడ్పీలో ఉన్న పాత భవనంలో తప్పని పరిస్థితుల్లో చాంబర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, దానికి వైస్ చైర్మన్ అంగీకరించలేదని సమాచారం. పాత భవనంలో కాకుండా జెడ్పీ పరిపాలన భవనంపైన ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో చాంబర్ ను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈ డిమాండ్ చైర్పర్సన్ వర్గీయులను మరింత జీర్ణించుకోలేకుండా చేసింది. ఇదంతా ప్రత్యర్థులు ఆడుతున్న నాటకమని, మరో పవర్ సెంటర్‌గా వైస్ చైర్మన్ చాంబర్ వేదికగా చేసుకునే ఎత్తుగడ అని జెడ్పీలోనే కాకుండా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి టీడీపీ నాయకులు ఎత్తుకు పైఎటత్తులు వేస్తుండడంతో జెడ్పీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఏర్పాటైతే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఎవరి మాట వినాలో, వినకపోతే ఎవరికి ఆగ్రహానికి గురికావలసి వస్తుందో తెలియని పరిస్థితి. -
'గోవా తరహాలో విశాఖ బీచ్'
హైదరాబాద్: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని చెప్పారు. అచ్యుతాపురంలో ఎయిర్పోర్ట్ వద్దని నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని చెప్పారు. ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు. విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. -
గంటా, అయ్యన్నల మధ్య ముదురుతున్న రగడ
మొన్నటిదాకా ఒకరిపై ఒకరు కారాలు..మిరి యాలు నూరుకున్నవారు హఠాత్తుగా చెట్టపట్టాలేసుకుని వేదికపై కనిపించగానే చూసిన వారు నోరెళ్లబెట్టారు. ఈ దోస్తీ కాస్త ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికల ఫలితమేనన్నది పార్టీ వర్గాల భోగట్టా. అయితే ఈ సఖ్యత ఉత్తమాటేనని తాజాగా మరోసారి రుజువైంది. విశాఖపట్నం: జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోవడం ఆ పార్టీవర్గాలకే మింగుడుపడడం లేదు. జిల్లా మం త్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య రగడ ముదురుతోంది. జిల్లా మంత్రులుగా సఖ్యతగా మెలగాలని, వీధినపడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గంటాను రచ్చకీడ్చమే అయ్యన్న లక్ష్యంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం తన ఓటమికి జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు రూ.2 కోట్లు ఖర్చు చేసారంటూ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా గంటాపై ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. తాజాగా ప్రత్యూష ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు లభించిన టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గంటాపై అయ్యన్న బహిరంగ యుద్ధానికి దిగారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎకరా 50 సెంట్లు ఖాళీ స్థలంలో మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గంటాకు చెందిన ప్రత్యూష ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో పాటు, కాశీ ఆసోసియేట్స్కు టెండర్ ఖరారు అయింది. తన ఇలాకా గంటా మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి పొందడమే అయ్యన్న అక్కసుకు కారణంగా కనిపిస్తోంది. ఆదివారం ఈ విషయమై అయ్యన్న బహిరంగంగానే గంటాపై ఆరోపణలు చేశారు. విశాఖలో గ్రంథాలయ సంస్థ స్థలాన్ని స్వాహా చేసేందుకు గంటా చేసిన ప్రయత్నాలు గవర్నర్ జోక్యంతో అడ్డుకట్ట పడ్డాయి. ఇదే విధంగా నర్సీపట్నంలో కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అయ్యన్న ఆరోపిస్తున్నారు. ఈ టెండర్‌ను రద్దు చేయాలని, లేకుంటే నిర్మాణ పనులను కార్యకర్తలతో అడ్డుకుంటామని ప్రకటించారు. కాగా ఇద్దరు క్యాబినెట్ సహచరుల నడుమ వివాదం ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావడం ఖాయమన్న ఆందోళన అటు అయ్యన్న, ఇటు గంటా అనుచరుల్లో వ్యక్తమవుతోంది. -
గంటాకు స్నేహ'పాత్రుడ్ని'
శత్రువులను మిత్రులుగా... మిత్రులను శత్రువులుగా మార్చే మహత్తు ఒక్క కాలానికే ఉంది. అందుకే శాశ్వత శత్రుత్వం, కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండదని అంటారు.విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యనపాత్రుడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికి సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోకి తీసుకున్నారు. దాంతో ఆ ఇద్దరి నేతల మధ్య గొడవలు సద్దుమణిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం తన చిరకాల ప్రత్యర్థి గంటా శ్రీనివారావుతో కలసి పని చేస్తాంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు. దాంతో గతంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒక్కరు దుమ్మొత్తి పోసుకున్న సంగతి గుర్తు చేసుకుంటూ ఇరు నాయకుల అనుచరగణం చెవులు కొరుక్కుంటున్నారు. అసలు కథలోకి వద్దాం ...టీడీపీ స్థాపించిన నాటి నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే కొనసాగారు. నర్సీపట్నం నుంచి పలుమార్లు అసెంబ్లీకి, ఒక్కసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖకు వలస వచ్చారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో కాంట్రాక్ట్ పనులు చేపట్టి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదగారు. 1999లో గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అదే సంవత్సరం అనకాపల్లి నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) స్థాపించారు. దాంతో టీడీపీకి గుడ్ చెప్పి గంటా పీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిరంజీవి కొన్ని షరతులతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దాంతో గంటా వారి స్టార్ గణగణమంటు మోగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల శాఖను గంటా నిర్వహించారు. కాగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మళ్లీ గంటా గాలి టీడీపీ వైపు మళ్లీంది. అందుకోసం గంటా తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. టీడీపీలో చేరేందుకు గంటాకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. అంతలో గంటా పార్టీలోకి తీసుకోవడానికి వీలేదంటూ అయ్యన్నపాత్రడు సైంధవుడిలా బాబు కాళ్లకు అడ్డుపడ్డారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదలి వెళ్లిన వారిని... మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ అయ్యన్నపాత్రుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నిలదీశాడు. గంటా పార్టీలోకి వస్తే తాను పార్టీకి నీళ్లు వదలాల్సి ఉంటుందంటూ చంద్రబాబును అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి అయ్యన్నపాత్రుడ్ని సముదాయించారు. అయినా అయ్యన్నపాత్రుడు మెత్తబడలేదు. సరికద ఎన్నికలు... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గంటా అంటే అయ్యన్నపాత్రుడు తోకతొక్కిన తాచులా అంత ఎత్తు లేచేవాడు. అయితే చంద్రబాబు తన కేబినెట్లోకి గంటాను మాత్రమే తీసుకుంటాడని తనను తీసుకోరని అయ్యన్నపాత్రుడు ఒకానొక దశలో నిరాశకు లోనయ్యారు. అయితే చంద్రబాబు కేబినెట్లో గంటాతోపాటు తనకు చోటు దక్కడంతో అయ్యన్నపాత్రుడు తెగ ఖుషీ అయిపోయాడు. దాంతో రాష్ట్రాభివృద్ధికి గంటాతో కలసి పనిచేస్తాంటూ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. -
పదవులకు క్యూ..
టీడీపీ నేతల తహతహ చంద్రబాబుతో మంతనాలు పైరవీలు ముమ్మరం నామినేటెడ్ పోస్టులపై అసంతృప్త నేతల కన్ను సాక్షి, విశాఖపట్నం: పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు పదవుల కోసం తహతహలాడుతున్నారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో అప్పుడే పార్టీలో పదవుల కోసం పోటీ మొదలైంది. కొత్తగా ఎ న్నికైన ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరులు, పోటీకి దూరంగా ఉన్న సీని యర్ నేతలు, టికెట్ దక్కని ఆశావహులు మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం పైరవీలు ముమ్మరం చేస్తున్నారు. అందుకోసం కొందరు నేతలు నేరుగా చంద్రబాబును కలిసి తమ కోరికలు వినిపిస్తుంటే, మరికొందరు చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ము ఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అటు కిందిస్థాయి నేతలు సైతం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు, యాదవ, వెలమ సామాజిక వర్గాల నేతలంతా మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో నియోజక వర్గాల్లో అప్పుడే హల్చల్ చేస్తున్నారు. వారంతా ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ విజ్ఞప్తులు వినిపించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు , బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇప్పుడు గంటా ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న, బండారు ఇద్దరు సీనియర్ నేతలే కావడం, గతంలో పార్టీలో మంత్రులుగా పనిచేయడంతో ఇప్పుడు ఇద్దరూ మం త్రి పదవులు మళ్లీ ఆశిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికే ఆ చాన్స్ దక్కే అవకాశం ఉండడంలో వీరు పలువురు ముఖ్యనేతలతో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. అటు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించడంతో ఆయన కూడా చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ ఎంపీ హరిబాబు ద్వారా, తన సామాజికవర్గ నేతలతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కన్నబాబురాజు తనకు టికెట్ దక్కకపోవడంతో కనీసం నామినేటెడ్ పోస్టు కావాలంటూ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభతోపాటు మరేదైనా పదవి దక్కించుకోవడానికి చంద్రబాబు కోటరీ నేత అయిన నారాయణ ద్వారా పావులు కదుపుతున్నారు. విశాఖ మహా నగరంలో అత్యంత కీలకమైన వుడా చైర్మన్‌తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నందున అవి తమకు దక్కేలా చేసుకునేందుకు మాజీ వుడా చైర్మన్ రెహమాన్‌తోపాటు మరికొందరు కూడా పక్క జిల్లాల పార్టీ ముఖ్య నేతల ద్వారా బాబుపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కక భంగపడ్డ విశాఖ జిల్లా గాజువాక నేత కోన తాతారావు, యలమంచిలి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయకుమార్ ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం జిల్లా ముఖ్యనేతల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. -
'అవంతి' గెటవుట్... అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం జిల్లా టీడీపీలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న భీమిలీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)కి మంగళవారం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట తీవ్ర అవమానం జరిగింది. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో ఈ రోజు ఉదయం అయ్యన్నపాత్రుడు ఇంటికి అవంతి శ్రీనివాస్ తన అనుచరగణంతో వచ్చారు. తన నివాసానికి వచ్చిన అవంతి, ఆయన అనుచర గణాన్ని చూసి చింతకాయల అయ్యన్నపాత్రుడు అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. నువ్వేందుకు ఇక్కడికి వచ్చావంటూ అవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గెటవుట్ అంటూ అవంతిపై అయ్యన్నపాత్రుడు శివాలెత్తారు. ఉహించని ఆ పరిణామానికి అవంతి శ్రీనివాస్ ఖిన్నడయ్యారు. అవమానంగా భావించిన అవంతి శ్రీనివాస్ అక్కడి నుంచి తన అనుచర గణంతో కలసి వెళ్లిపోయారు. విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు వర్గం, అవంతి వర్గం అంటేనే అయ్యన్నపాత్రుడు మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెవ్విలో ఇల్లుకట్టుకుని అయ్యన్నపాత్రుడు మరీ పోరారు. అయితే ఆ రెండు వర్గాలను పార్టీలో చేర్చుకోవడంతో అయ్యన్నపాత్రుడు ఇప్పటికి చంద్రబాబుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అదికాక పార్టీ పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తున్న తమను కాదని ....... ఇటీవల పార్టీలోకి వచ్చిన ఆ రెండు వర్గాలకు చంద్రబాబు పెద్ద పీట వేయడంపై అయ్యన్నపాత్రుడు మండిపోతున్నారు. -
'అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు నిజమే'
విశాఖపట్టణం: టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడితో మనస్పర్దలు ఉన్న మాట నిజమేనని తాజా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఎన్ని సమస్యలున్నా చంద్రబాబుతోనే ఉంటానని ఆయన చెప్పారు. సహచర ఎమ్మెల్యేలతో తన నివాసంలో గంటా శ్రీనివాసరావు ఈరోజు సమావేశమయ్యారు. చంద్రబాబు సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు తనపై వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన మనస్తాపం చెందినట్టు తెలిసింది. టీడీపీ చేరిన గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, చింతలపూడి వెంకట్రామయ్యలపై అయన్నపాత్రుడు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ఇవాళ టీడీపీలోకి కొందరు వచ్చారు. వాళ్లు ఎంతకాలం ఉంటారో పోతారో తెలియదు. మనం మాత్రం పార్టీలోనే కొనసాగుదాం’’ అంటూ ఎద్దేవా చేశారు. కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా పార్టీలో బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిదంటూ విరుచుకుపడ్డారు. -
చెత్తతో పబ్బం గడుస్తుందా?
* చంద్రబాబు తీరుపై టీడీపీ సీనియర్ల ఆగ్రహం * పార్టీని కాంగ్రెస్ నేతలతో నింపేస్తున్నారు * ప్యాకేజీలిస్తామని మరీ తీసుకొస్తున్నారు.. * ముందు నుంచి ఉన్నవారికీ టికెట్లు దక్కే స్థితి లేదని అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోతుంటే.. ఇతర పార్టీల్లో అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న నేతలందరినీ చేర్చుకోవడం... ఇలా పబ్బం గడుపుకోవచ్చన్న రీతిలో అధినాయకత్వం నడిపిస్తున్న వ్యవహారాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్నాయి. ప్రజల్లో చులకనైన నేతలందరినీ చేర్చుకుని పార్టీని నింపేస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై టీడీపీ నేతల నుంచే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2004, 2009 ఎన్నికల్లో వరుస పరాజయాల నుంచి పార్టీ ఇప్పటికీ కోలుకోకపోగా.. గత ఐదేళ్లలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు, మరెంతో మంది నేతలు టీడీపీని వీడివెళ్లిపోయారు. టీడీపీపై నమ్మకం కోల్పోయిన కారణంగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఆ స్థానాలను భర్తీ చేయడానికన్నట్టు పనికిరాని సరుకును సైతం చేర్పించుకుంటున్నారని పార్టీలోని పాతతరం సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అది కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేసి అక్కడ అవకాశాలు దొరకని కాంగ్రెస్ నేతలందరినీ చేర్చుకుని మొత్తం పార్టీని కాంగ్రెస్ మయం చేస్తున్నారన్న అసంతృప్తి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేకసార్లు పార్టీలు మారిన వారిని సైతం ప్యాకేజీలిస్తామని ఆశలు పెట్టి మరీ పార్టీలోకి తీసుకోవడం.. టీడీపీ దయనీయస్థితిని తెలియజేస్తోందని కోస్తాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తంచేశారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో చేరడానికి తనకు అనేక అవకాశాలొచ్చినా పార్టీ కోసం వదులుకున్నాననీ, కానీ ఇప్పు డు కాంగ్రెస్‌లో పనికిరాని చెత్తగా తయారైన వాళ్లను కూడా చేర్చుకుంటుంటే టీడీపీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా తథ్యమని, టీడీపీ పోరాడేది ప్రతిపక్ష హోదాకేనని.. ఇలాంటి నేతలందరినీ తీసుకుంటే ఆ హోదా కూడా దక్కదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ ఉన్నవారికి మొండిచేయే... రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న చివరి నిమిషం వరకు అధికారంలో కొనసాగిన కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో వెళ్లడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో చేరినా టికెట్ ఇవ్వలేమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న వారిని ఏరికోరి మరీ టీడీపీలో చేర్చుకున్నారని మరో సీనియర్ టీడీపీ నేత రుసరుసలాడారు. పార్టీకేదో బలం ఉంది కాబట్టి నేతలు ఆకర్షితులవుతున్నారన్న ప్రచారం చేసుకోవడానికి ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోటరీలో కీలకపాత్ర పోషించే ఎంపీలు గరికపాటి మోహనరావు, సి.ఎం.రమేష్, సుజనాచౌదరి తదితరులు ఆయా నేతల ఇళ్లకు వెళ్లి గంటల తరబడి చర్చలతో అనేక విధాలుగా ఒప్పించి మరీ చంద్రబాబును కలిపిస్తున్నారని.. దీనివల్ల పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలెవరికీ టికెట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. అయ్యన్న, కోడెల బహిరంగ విమర్శలు... ఎక్కడా దిక్కులేక ఈ రకంగా చేర్పించుకుంటున్న నేతల విషయంలో కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితర పార్టీ సీనియర్లు బహిరంగంగానే చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నారు. టీడీపీ కార్యకర్తల హత్యకు కారకులను, దొంగలను పార్టీలో చేర్చుకోవటం ఎంతవరకూ సబబో ఆలోచించాలని చంద్రబాబు కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే ప్రశ్నించారు. టీడీపీ అంతా కాంగ్రెస్ మయమవుతోందని, ఇది మంచి పరిణామం కాదని, టీడీపీలో కాంగ్రెస్ విలీనమైందని అందరూ భావిస్తున్నారని కోడెల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలోని మరికొందరు సీనియర్లు కొద్ది రోజులుగా ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. -
పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది
* పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది * ఇతరుల తప్పులు ఎలా వేలెత్తి చూపగలం? * టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నవ్యాఖ్య నర్సీపట్నం : క్రమశిక్షణ గల టీడీపీ లోకి గజదొంగల చేరికతో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం అ య్యన్న కాలనీలో ఇంటాంటా టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్థాపించిన పార్టీలోకి దొంగలు రావడం తనను బాధిస్తోందని వ్యాఖ్యానించారు. గజదొంగల చేరికతో ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే ఆస్కారం పార్టీ నాయకులకు ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ముత్యాలపాప తీరును విమర్శిస్తూ, ఆమె అభివృద్ధిని మరిచారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉన్నందున కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన కాంగ్రెస్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, అయ్యన్నయూత్ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. అయ్యన్నను కలిసిన వెలగపూడి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అయ్యన్నపాత్రుడిని శుక్రవారం కలిశారు. అయ్యన్న ఇంటిలో ఇద్దరూ కొద్దిసేపు సంభాషించారు. అయ్యన్నను కలిసినవారిలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్లు పైల ముత్యాలనాయుడు, పట్టాభిరాము, అడవివరం సర్పంచ్ పాసర్ల ప్రసాద్ ఉన్నారు. -
గంటాది ఐరెన్ లెగ్
=టీడీపీలోకి వస్తే పార్టీ చిన్నాభిన్నం =అయ్యన్నపాత్రుడు ధ్వజం విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుది ఐరెన్ లెగ్. ఆయన ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ భూస్థాపితమవుతుంది. టీడీపీలో అడుగుపెట్టగానే పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రజారాజ్యంలోకి వెళ్లాక ఆ పార్టీ కనుమరుగైంది. చివరగా కాంగ్రెస్‌లోకి వెళితే ఇప్పుడు ఆ పార్టీ కూడా ఉనికిని కోల్పోయింద’ంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. కోటవురట్ల మండలం రాజుపేట బీసీ కాలనీ ఓటర్లను రాజుపేట పంచాయితీలో ఉంచాలంటూ కలెక్టర్‌ను కోరేందుకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గంటా మళ్లీ టీడీపీలోకి వస్తే తమ పార్టీ కూడా చిన్నాభిన్నమైపోతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. గంటా టీడీపీలోకి రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, రాజకీయాల్లో విలువలు లేని గంటాలాంటి దొంగలను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆజ్యం పోసిన వ్యక్తి చంద్రబాబని లోగడ గంటా ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్‌ను విమర్శించారని, ఆయన వైఎస్సార్సీపీలో చేరుతుండడాన్ని చూస్తే రాజకీయ నాయకులపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతందని ప్రశ్నించారు. కలెక్టరేట్‌పై గంటా కన్ను.. విశాఖ కలెక్టర్ కార్యాలయం పాతబడి పోయిందని, దానిని విశాలమైన స్థలంలో పునఃనిర్మించాలని గంటా చెబుతుండటాన్ని బట్టి ఆయన కన్ను కలెక్టరేట్‌పై పడినట్లుందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో పోర్టు, కలెక్టరేట్లే అతి పురాతన కట్టడాలన్నారు. వీటిలో పోర్టు ద్వారా ఇప్పటికే అక్రమంగా వందల కోట్లు ఆర్జించిన గంటా ఇప్పుడు కలెక్టరేట్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ, నర్సీపట్నం బస్టాండ్, జీవీఎంసీ క్వార్టర్స్ స్థలాలను లాంగ్లీజ్, పీపీపీ ద్వారా ఇప్పటికే ఆక్రమించారని ఆరోపించారు.