
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విమర్శించే ముందు నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్ అన్నారు. రైతులను చంపించి, మహిళలను గుర్రాలతో తొక్కించిన ఘనత నీ తండ్రి చంద్రబాబు నాయుడుకే చెందుతుందని విమర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే గణేష్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.
ఆరు సంవత్సరాలపాటు రాజకీయ అనర్హుడిగా లోకాయుక్త ప్రకటించిన విషయాన్ని మర్చిపోయావా?, నీ రౌడీయిజానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అని మండిపడ్డారు. ‘నీ కార్యకర్తల ముందే అసభ్య పదజాలంతో పోలీసులను బెదిరిస్తున్నావు. అది రౌడీయిజం కాదా’ అని అయ్యన్నను ప్రశ్నించారు. ఆరుసార్లు మంత్రిగా పనిచేసినా.. సక్రమంగా పాలన చేయకపోవడం వల్లే జిల్లాలో గంజాయి మాఫియా విస్తరించిందని విమర్శించారు. ఆసుపత్రి వ్యవహారంలో అయ్యన్న హస్తంతోనే రూ.కోటిన్నర నిధుల దోపిడీ జరిగిందన్న విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఎమ్మెల్యే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment