విశాఖ డ్రగ్స్‌: డామిట్‌ కథ అడ్డం తిరిగింది! | Visakha Drug Container Linked To Relatives Of TDP And BJP Leaders | Sakshi
Sakshi News home page

విశాఖ డ్రగ్స్‌: డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

Published Fri, Mar 22 2024 9:14 AM | Last Updated on Fri, Mar 22 2024 12:28 PM

Visakha Drug Container Linked To TDP And BJP Leaders Relatives - Sakshi

చంద్రబాబు చెత్త డ్రామా, పవన్‌ ఓవరాక్షన్‌

ప్రభుత్వం మీద బురద జల్లాలన్న కుట్ర

తమ వాళ్లదే అని తెలియగానే మూతబడ్డ నోళ్లు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ కంటైనర్‌పై పనిగట్టుకుని పచ్చ బ్యాచ్‌ మళ్లీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు అండ్‌ కో టీమ్‌ రెడీగా ఉంటుంది కదా. అందులో భాగంగా మరో కొత్త నాటకానికి ప్లాన్‌ చేసింది.కానీ, ఎవరిదీ కంటైనర్‌.. అని విచారణ మొదలుపెట్టగానే.. ఈ స్మగ్లింగ్‌ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే అసలు విషయం బట్టబయలైంది.


ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉండొచ్చు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలి. 
::చంద్రబాబు

ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చింది. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి.
::: పవన్‌

కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ వ్యవహారంలో.. నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లో కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు ఆయా కుటుంబాలకు ఉన్న సత్సంబంధాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబం తోను వీరభద్రరావు కు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలు తో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా  ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయబోయి పచ్చ బ్యాచ్‌ కంగుతింది. దర్యాప్తులో వేళ్లన్నీ తమవైపే చూపిస్తాయని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరు.

భారీగా మాదక ద్రవ్యాలు గుర్తింపు 
విశాఖ తీరానికి చేరిన సదరు కంటైనర్‌ లాసెన్స్‌ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై ­చైన్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.వి.ఎల్‌.ఎన్‌.గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్‌ కుమార్‌ను రప్పించారు. కంటైనర్, సీల్‌ నెంబర్లు చూపించి అందులో ఏముందని సీబీఐ అధికారులు వారిని ప్రశ్నించారు.

కూనం వీరభద్రరావు అసలు చరిత్ర..
సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కునం వీరభద్రరావుకి ఘనమైన చరిత్రే ఉంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఇతను దగ్గుబాటి పురందరేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్‌లో పార్ట్‌నర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్‌ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఆ ఏడాది జూలై 30న లాస్‌ ఏంజెలిస్‌ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరభద్రరావుని ఎఫ్‌బీఐ అరెస్టు చేసి న్యూయార్క్‌ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి బయటపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈయన నేతృత్వంలో రూ.25 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.   

విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో టీడీపీ నేతలకు నేరుగా సంబంధాలున్నట్టు సమాచారం. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయులు, రాయపాటి జీవన్‌లతో నిందితుడు కోటయ్య చౌదరి దగ్గరి సంబంధాలున్నాయి. కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నారా లోకేష్‌కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశముంది.

డ్రగ్స్‌ కంటైనర్‌పై సంధ్యా ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ
రొయ్యల మేతలో వాడే ఈస్ట్‌ను తొలిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్‌లో డబ్బు చెల్లించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయల్దేరి మార్చి 16న విశాఖకు వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ సమక్షంలో కంటైనర్‌లోని డ్రగ్‌ను టెస్ట్ చేశారు. నిషేదిత డ్రగ్‌గా సీబీఐ అనుమానిస్తోంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం అని వివరణ ఇచ్చారు. 

పూర్తి వివరాల కోసం.. విశాఖ పోర్టులో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్‌...'కేరాఫ్‌ కోటయ్య చౌదరి'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement