సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఏపీ స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు ఎవరిపై ప్రేమలుండవని చట్ట ప్రకారం మా విధులు మేము చేసుకుంటామన్నారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చదవండి: స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్ టీచర్‌గా!
తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవ చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతుంటాయి.. కానీ తామెప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు.
నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్‌పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. దేశంలోనే అతి ఉత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. చదవండి: సారూ.. ఆమె మా బిడ్డనే..
Comments
Please login to add a commentAdd a comment