ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న | TDP Leader Ayyanna Patrudu Controversial comments on Police Dept | Sakshi
Sakshi News home page

షూట్‌ అండ్‌ సైట్‌ అధికారాలు అప్పగించాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న

Published Thu, Jan 19 2023 11:00 AM | Last Updated on Thu, Jan 19 2023 11:12 AM

TDP Leader Ayyanna Patrudu Controversial comments on Police Dept - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 

'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్‌ ఆర్డర్‌ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్‌ అండ్‌ సైట్‌ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు.

చదవండి: (బెంచ్‌ మార్క్‌గా సీఎం జగన్‌ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement