
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు.
చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం..
Comments
Please login to add a commentAdd a comment