
అయ్యన్నపాత్రుడు మాట్లాడుతుండగా తలపట్టుకున్న టీడీపీ మహిళా నేతలు
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్‌గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు.
పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment