సాక్షి, విశాఖపట్నం: మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు దిగారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుపోయాయా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.
ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బూతు పదం వాడుతూ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో నేను స్పీకర్‌ను అవుతున్నాను. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకొద్దీ నిలబెడతానంటూ హెచ్చరించారు. అయ్యన్న తీరుతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment