
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి ఊడపొడిచేది ఏమీలేదన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. లోకేష్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు మంత్రి.
తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. ‘జనసేన తో టీడీపీ కలవడం వల్ల కూడా చాలామంది టీడీపీ నుంచి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు. జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు’ అని ఎద్దేవా చేశారు.
చదవండి: బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారు: మంత్రి జోగి రమేష్
Comments
Please login to add a commentAdd a comment