swarna latha
-
కష్టం లేకపోతే సోమరులవుతారు.. భవిష్యవాణిలో స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బోనాల సందర్బంగా నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని తెలిపింది.భవిష్యవాణిలో స్వర్ణలత కామెంట్స్ ఇవే..భక్తుల అందరి పూజలు సంతోషంగా పూజలు అందుకున్నాను.భక్తులకు ఎవరికి ఆటంకాలు లేకుండా చూసుకున్నాను.ఏ బోనం అయిన సంతోషంతో ఆనందంగా అందుకుంటానునా సన్నిధికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆశీర్వదిస్తాను.కోరిన వరాలు ఇస్తాను.పాడి పంటలు సంవృద్ధిగా ఉంటాయి.కష్టం లేకపోతే సోమరి పోతులుగా తయారువతారు.నా వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టపడాలి కదా.ఎటువంటి ఆపద, వ్యాధులు రాకుండా చూసుకునే భాధ్యత నాదిఎవరు అడ్డుపడిన, రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను.ఐదు వారాలు పప్పు బెల్లం శాకాలు పెట్టాలి.ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.కోరినన్ని వర్షాలు ఉన్నాయి.ఔషధాలు తగ్గించుకొని.. పాడి పంటలు సమృద్ధిగా చేసుకుంటే వ్యాధులు ఉండవు.బలి కార్యక్రమం మీకు తోచినట్టు చేస్తున్నారు సంతోషిస్తున్నాను.బాలింతలకు, గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దర్శించుకున్న భక్తుల్ని ఇబ్బందులు రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. -
బోనాలు: మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
తెలంగాణలో ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు(సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు. -
భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
భవిష్యవాణి
-
రాజకీయాలు చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలని, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని ఏపీ స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణలత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు ఎవరిపై ప్రేమలుండవని చట్ట ప్రకారం మా విధులు మేము చేసుకుంటామన్నారు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చదవండి: స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్ టీచర్‌గా! తాము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయిందని ఎద్దేవ చేశారు. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కింద పనిచేసేది కాదని.. నిరంతరం ప్రజలకు రక్షణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతుంటాయి.. కానీ తామెప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల రక్షణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. దేశంలోనే అతి ఉత్తమంగా పని చేస్తున్న ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమె హెచ్చరించారు. చదవండి: సారూ.. ఆమె మా బిడ్డనే.. -
బస్సు ఢీకొని మహిళ మృతి
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. పట్టణంలోని కడపరోడ్డులో నివాసం ఉంటున్న స్వర్ణలత(40) స్థానిక నాలుగురోడ్ల కూడలిలో నిల్చుని ఉండగా చిత్తూరు వెళ్లే పీలేరు డిపో బస్సు ఢీకొంది. బస్సు ముందు టైరు ఆమె తలపైకి వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
పర్యాటక కేంద్రంగా ‘కందకుర్తి’
కందకుర్తి(రెంజల్), న్యూస్‌లైన్: కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నాయక్ అన్నారు. శనివారం సీఎంఓ స్వర్ణలతతో కలిసి ఆయన రెంజల్ మండలంలోని కందకుర్తిని సందర్శించారు. ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పుష్కర క్షేత్రాన్ని పరిశీలించారని అన్నారు. మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పర్యాటక స్థలాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు గోదావరి నదిలో నెల రోజుల్లో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. నదీ స్నానాలకు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వంట గదులు, విశ్రాంతి గదులు, మూత్ర శాలులు, తాగు నీటి ట్యాంకులు నిర్మాణం చేపడతామని వివరించారు. వంటలపై అసంతృప్తి కందకుర్తి నుంచి రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యలో బాలికలు వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలను సొంత కుటుంబ సభ్యులుగా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అలీసాగర్,అశోక్‌సాగర్ సందర్శన ఎడపల్లి(ఠాణాకలాన్): మండలంలోని అలీసాగర్ ఉద్యానవనాన్ని శనివారం జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నా యక్ సందర్శించారు. గుట్ట పైభాగాన సుమారు 52 ఎకరాల స్థ లంలో నిర్మించనున్న పెలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, స రిహద్దులను అడిగి తెలుసుకున్నారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డు లను పరిశీలించారు. అనంతరం అశోక్‌సాగర్ ఉద్యానవనాన్ని ఆయన సందర్శించారు. ఉద్యాన వనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత