చిత్తూరు జిల్లా పీలేరులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. పట్టణంలోని కడపరోడ్డులో నివాసం ఉంటున్న స్వర్ణలత(40) స్థానిక నాలుగురోడ్ల కూడలిలో నిల్చుని ఉండగా చిత్తూరు వెళ్లే పీలేరు డిపో బస్సు ఢీకొంది. బస్సు ముందు టైరు ఆమె తలపైకి వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.