
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment