bhavishyavani
-
మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
-
మహంకాళి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, హైదరాబాద్: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించగలిగాం. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’అని అన్నారు. -
లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో సోమవారం ఉదయం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ.. మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా ఉన్నాను. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నాను. అయిదు వారాల పాటు నన్ను ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి. నైవేద్యాలు సమర్పించాలి. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాది. 5 వారాలు నాకు సాక పోయండి నాయన. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. నేను మీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల మంది భక్తులు పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. చదవండి: చేసే పనీ.. చేటు చేయొచ్చు.. ఉద్యోగాలతో అనారోగ్యాలు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బోనాల పండగ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డా తనకు మొక్కులు చెల్లించారని మాతాంగి స్వర్ణలత మహంకాళి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. సోమవారం స్వర్ణలత ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తూ.. ఎన్ని కష్టాలు పడ్డా నాకు మొక్కులు చెల్లించారని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ‘‘నాకు జరుగుతున్న పూజలతో నేను సం తోషంగా లేను...ఎవరు చేసుకున్న దాన్ని వారు అనుభవిస్తున్నారు...కాపాడేదాన్ని నేనే అయినా అంతకు ఎక్కువగా చేసుకుంటున్నారు...భక్తి భావంతో కాకుండా విపరీతమైన కోరికలు, కోపతాపాలతో నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని నేనే...నా బిడ్డలను నేను కాపాడుకుంటాను...రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు వస్తాయి...ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ముందుగా హెచ్చరిస్తున్నా...నా భక్తులు లేకుండా జరిగిన బోనాలతో నేను సంతోషంగా లేను...యజ్ఞ, హోమాలు చేసి ఐదు వారాల పాటు నాకు సాక పెట్టి , నా వారం రోజు పప్పు బెల్లంతో ఫలహారం గడపగడప నుంచి రావాలి’’అంటూ రంగంలో అమ్మవారు సోమవారం భవిష్య వాణి వినిపించారు. తంబూర చేతపట్టుకుని మాతంగేశ్వరి అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని ఆవహించగా భవిష్యవాణిని వినిపించారు. కరోనాతో దేశ ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని తన ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు చేసుకున్న దాంతో వారు అనుభవిస్తున్నారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు. ఎవరికి వారు తమ సొంత కోరికలు కోరుకుంటూ ఎలాంటి భక్తి భావం లేకుండా కోపతాపాలతో తనకు పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తిశ్రద్ధలతో కొలిస్తే తన బిడ్డలను తాను కాపాడతానని కొండంత ధైర్యాన్ని అందించారు. ఇటీవల పూర్తయిన కాళేశ్వరం గురించి వేదపండితుడు వేణుమాధవశర్మ అమ్మవారిని అడుగగా గంగమ్మకు యజ్ఞయాగాలు, హోమాలు చేస్తే ఆమె సంతోషించి అందరు కోరుకున్నట్లు జరుగుతుందని తెలిపారు. -
భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
భవిష్యవాణి
-
మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
రంగం చెబుతున్న స్వర్ణలత
-
రంగంలో అనురాధ భవిష్యవాణి
-
లాల్‌దర్వాజలో ఘనంగా రంగం కార్యక్రమం
-
‘నాకు రక్త తర్పణం చేయటం లేదు’
హైదరాబాద్: ‘మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు.. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను నిలదీసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యవాణిని స్వర్ణలత వినిపించింది.‘ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం ఘనంగా నిర్వహించటం సంతోషకరం. కోరినన్ని వానలు కురిపిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి.. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.. నేనేమీ వెజిటేరియన్‌ను కాదు కదా..’ అని స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. భవిష్య వాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమం నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించడంతో.. అప్రమత్తమైన పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉజ్జయిని జాతరకు పోటెత్తిన భక్తజనం
- అంబారీపై అమ్మవారి ఊరేగింపు - భవిష్యవాణి వినిపించిన అమ్మవారు - ముగిసిన లష్కర్ బోనాలు రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు చివరి రోజైన సోమవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా రంగం నిర్వహించారు. ఇందులో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారి నోటి నుంచి ఏమి వస్తుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. పోతరాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి ఊరేగిం పు ఆద్యంతం కనుల పండువగా సా గింది. ఆదివారం తెల్లవారు జామున మొదలైన అమ్మవారి దర్శనం సోమవా రం ఉదయం వరకు కొనసాగింది. భక్తుల రద్దీతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రెండో రోజు కూడా ఫలహారం బండ్ల కోలాహలం కనిపించింది. అంబారీపై ఊరేగింపు.. రంగంలో భాగంగా అమ్మవారిని అం బారీపై అత్యంత వైభవంగా ఊరేగించా రు. ఉజ్జయినీ మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ చిత్రపటాలను అంబారీ (ఏనుగు)పై అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఇందులో ఒంటెలు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి ముందు మహిళలు, భక్తుల కోలాటాలు, గిరిజ నుల నృత్యాలతో దేవాలయ ప్రాంగ ణం కోలాహలంగా మారింది. కళాకారులు పలు వేషధారణల్లో చేసిన నృత్యా లు కనువిందు చేశాయి. ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లు స్టెప్పులేసి అందరిని ఉత్సాహ పరిచారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత సికింద్రాబాద్‌లోని పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. దారి వెంట భక్తు లు అంబారీపై ఉన్న అమ్మవారిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్మయి, దేవాలయ ఈఓ అశోక్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున్‌గౌడ్, శీలం ప్రభాకర్, పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఘటానికి సాగనంపు... అంబారీతోపాటు ఘటాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి ఘటా న్ని తాకేందుకు, పూజలు చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంబారీకి ముం దు అమ్మవారి ఘటాన్ని సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా ఊరేగించి మెట్టుగూడ వరకు సాగనంపారు. గావుతో శాంతి.. బోనాలు, సాక పెట్టడంతోపాటు ఏటా అమ్మవారికి సొరకాయ, గుమ్మడికాయలతో గావు పట్టి శాంతి చేయడం ఆనవాయితీ. రంగం కార్యక్రమం అనంతరం గావుతో అమ్మవారికి బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జంతువులను బలిచ్చి శాంతి చేసేవారు. జంతు బలి నిషేధంలోకి రావడంతో ఆనంకాయ, గుమ్మడికాయలతో అమ్మవారికి బలిచ్చారు. పోతరాజుల నృత్యాలు.. గావు అనంతరం పోతరాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒంటికి పసుపు... కాళ్లకు గజ్జెలు.. జులుపాల జుట్టు, భారీ శరీరంతో, భయంకర రూపంతో పోతరాజులు చేతిలో కొరడా పట్టుకుని భక్తులను పరుగులు పెట్టిస్తూ వీరంగం చేశారు. అనంతరం పోతరాజుల కొరడాతో భక్తులు ఆశీర్వాదం, కుంకుమ తీసుకుంటూ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు.