ఉజ్జయిని జాతరకు పోటెత్తిన భక్తజనం
- అంబారీపై అమ్మవారి ఊరేగింపు
- భవిష్యవాణి వినిపించిన అమ్మవారు
- ముగిసిన లష్కర్ బోనాలు
రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు చివరి రోజైన సోమవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా రంగం నిర్వహించారు. ఇందులో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారి నోటి నుంచి ఏమి వస్తుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. పోతరాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి ఊరేగిం పు ఆద్యంతం కనుల పండువగా సా గింది. ఆదివారం తెల్లవారు జామున మొదలైన అమ్మవారి దర్శనం సోమవా రం ఉదయం వరకు కొనసాగింది. భక్తుల రద్దీతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రెండో రోజు కూడా ఫలహారం బండ్ల కోలాహలం కనిపించింది.
అంబారీపై ఊరేగింపు..
రంగంలో భాగంగా అమ్మవారిని అం బారీపై అత్యంత వైభవంగా ఊరేగించా రు. ఉజ్జయినీ మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ చిత్రపటాలను అంబారీ (ఏనుగు)పై అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఇందులో ఒంటెలు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి ముందు మహిళలు, భక్తుల కోలాటాలు, గిరిజ నుల నృత్యాలతో దేవాలయ ప్రాంగ ణం కోలాహలంగా మారింది. కళాకారులు పలు వేషధారణల్లో చేసిన నృత్యా లు కనువిందు చేశాయి.
ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లు స్టెప్పులేసి అందరిని ఉత్సాహ పరిచారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత సికింద్రాబాద్‌లోని పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. దారి వెంట భక్తు లు అంబారీపై ఉన్న అమ్మవారిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్మయి, దేవాలయ ఈఓ అశోక్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున్‌గౌడ్, శీలం ప్రభాకర్, పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఘటానికి సాగనంపు...
అంబారీతోపాటు ఘటాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి ఘటా న్ని తాకేందుకు, పూజలు చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంబారీకి ముం దు అమ్మవారి ఘటాన్ని సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా ఊరేగించి మెట్టుగూడ వరకు సాగనంపారు.
గావుతో శాంతి..
బోనాలు, సాక పెట్టడంతోపాటు ఏటా అమ్మవారికి సొరకాయ, గుమ్మడికాయలతో గావు పట్టి శాంతి చేయడం ఆనవాయితీ. రంగం కార్యక్రమం అనంతరం గావుతో అమ్మవారికి బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జంతువులను బలిచ్చి శాంతి చేసేవారు. జంతు బలి నిషేధంలోకి రావడంతో ఆనంకాయ, గుమ్మడికాయలతో అమ్మవారికి బలిచ్చారు.
పోతరాజుల నృత్యాలు..
గావు అనంతరం పోతరాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒంటికి పసుపు... కాళ్లకు గజ్జెలు.. జులుపాల జుట్టు, భారీ శరీరంతో, భయంకర రూపంతో పోతరాజులు చేతిలో కొరడా పట్టుకుని భక్తులను పరుగులు పెట్టిస్తూ వీరంగం చేశారు. అనంతరం పోతరాజుల కొరడాతో భక్తులు ఆశీర్వాదం, కుంకుమ తీసుకుంటూ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు.