Lashkar Bonalu
-
ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు
-
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ.. పోటెత్తిన భక్తులు..
-
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, ఈటల..
-
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సిఎం రేవంత్ రెడ్డి
-
ఘనంగా ప్రారంభమైన లష్కర్ బోనాలు..
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి
-
వైభవంగా లష్కర్ బోనాలు...రంగం భవిష్యవాణి !
-
లష్కర్ బోనాలు షురూ...
-
Ujjaini Mahankali Bonalu: జంటనగర వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... కర్బల మైదాన్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్ మీదుగా, ఎస్పీ రోడ్‌లోని బేగంపేట హెచ్‌పీఎస్ వద్ద యూటర్న్ తీసుకుని సీటీవో, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల మీదుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి. ► సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తాడ్బంద్, బేగంపేట వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా లేదా క్లాక్ టవర్, వైఎంసీఏ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే సాధారణ ట్రాఫిక్ గాస్మండి చౌరస్తా, సజ్జన్‌లాల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా వెళ్లాలి. ► ప్యాట్నీ ఎస్బీఐ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ ప్యాట్నీ చౌరస్తా నుంచి మినిష్టర్ రోడ్, ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా చిలకలగూడ వైపు నుంచి వెళ్లాలి. ► ప్యారడైజ్ వైపు నుంచి బైబిల్ హౌస్ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్బీఐ, క్లాక్‌టవర్ మీదుగా వెళ్లాలి. ► క్లాక్ టవర్ నుంచి ఆర్పీరోడ్ వెళ్లే వాహనదారులు ప్యారడైజ్, మినిష్టర్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► సీటీవో, ప్యారడైజ్ నుంచి ఎంజీరోడ్ వెళ్లే వాహనాలు సింధీకాలనీ, మినిష్టర్ రోడ్, కర్బల మైదాన్గా వెళ్లాలి. ► పంజగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, ఐమాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ చౌరస్తా, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు ఓల్డ్ గాంధీ, మోండా మార్కెట్, బైబిల్ హౌస్, కర్బల మైదాన్ మీదుగా వెళ్లాలి. ► ఉప్పల్ నుంచి పంజగుట్ట వెళ్లే వాహనదారులు రామంతాపూర్, అంబర్పేట్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ రోడ్డును వినియోగించుకోవాలి. ► సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వైపు రెండు వైపుల రోడ్డు మూసి ఉంటుంది ఈ రోడ్డు వైపు రావద్దు. ► మహంకాళి ఆలయానికి వెళ్లే టొబాకోబజార్, హిల్‌స్ట్రీట్, సుభాష్‌రోడ్‌లో బాటా నుంచి రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వరకు, ఆదయ్యనగర్ నుంచి దేవాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిషేధించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే... ► బోనాల జాతరకు వచ్చే వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు 8 ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ► సెయింట్ జాన్సన్ రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీఐ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్‌తో పాటు బెల్సన్ తాజ్ హోటల్, మహబూబ్ కళాశాల, ఎస్వీఐటీలో పార్కింగ్ చేసుకోవచ్చు. ► సుభాష్‌రోడ్, రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్‌ఖానా వద్ద, కర్బల మైదాన్, బైబిల్ హౌస్, గాస్మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా స్కూల్, రాణిగంజ్, ఆదయ్యనగర్ చౌరస్తా నుంచి వచ్చే వాహనాలు ఆదయ్య మెమోరియల్ స్కూల్లో, సీటీవో, బాలంరాయి, రసూల్‌పురా నుంచి వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం వద్ద, మంజు థియేటర్ వైపు వచ్చే వాహనాలు అంజలి థియేటర్ వద్ద పార్కింగ్ చేసికోవచ్చు. ► ‘సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు 10వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు ఉన్న రహదారిని ఉపయోగించుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. (క్లిక్: హైదరాబాద్ ఐఐటీ అదుర్స్) -
ప్రముఖులకే ప్రాధాన్యం
సనత్‌నగర్: సామాన్య భక్తుల విషయంలో అధికారులు ఎప్పటిలాగే వ్యవహరించారు. వీవీఐపీలు, వీఐపీల సేవలో దేవాదాయ శాఖ అధికారులు మునిగి తేలడంతో ఎంతకీ క్యూలైన్ కదలక సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి తోడు జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బంది పలుకుబడితో తమ కుటుంబసభ్యులు, బంధువులను వీఐపీ గేటు ద్వారానే పంపించడంతో సామాన్య భక్తుల దర్శనం మరింత ఆలస్యమైందనే చెప్పాలి. వీఐపీ గేటు వద్ద పైరవీకారుల హడావుడి ఎక్కువ కావడంతో ఒకానొక దశలో వారిని కట్టడి చేయ డం పోలీసుల తరం కాలేదు. కేవలం ప్రముఖుల సేవలో మునిగితేలిన అధికారులు సామాన్య భక్తుల దర్శనం ఏవిధంగా జరుగుతుందనే దానిపై దృష్టిసారించలేదు. దీంతో క్యూలైన్లలో పిల్లాపాపలతో పాటు బోనాలను ఎత్తుకుని వచ్చిన మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గతేడాది తలెత్తిన సమస్యను దృష్టిలో ఉంచుకొని బోనంతో వచ్చిన జోగినిలకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించారు. అటు వీఐపీలు, ఇటు జోగినిల ప్రవేశంతో సామాన్య భక్తుల క్యూలైన్ నత్తనడకను తలపించింది. ఇదీ పరిస్థితి... ♦ భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని చెబుతున్న పోలీసు అధికారులు కేవలం వీఐపీల సేవలోనే తరించినట్లు కనిపించింది. ఎవరికి వారు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రావడంతో పోలీసులు వారికి వీఐపీ దర్శనం కల్పించారు. ♦ సీఎం, మంత్రులు, ప్రముఖులు వచ్చిన ప్రతిసారీ 10–15 నిమిషాల పాటు సామాన్య భక్తుల దర్శనం ఆగిపోయింది. ♦ చిన్నారులు, బోనాలతో వచ్చిన మహిళల కోసం సెపరేట్ లైన్లు కేటాయించాలని ఆలయ అధికారులు మైక్‌లో పదే పదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా గర్భ గుడి ప్రాంగణంలో నాలుగైదు లైన్లలో భక్తులను పంపించడంతో తోపులాటకు దారితీసింది. ♦ తొలిబోనం సమర్పణ సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యుల కుటుంబాలను అనుమతించలేదు. ♦ మహంకాళి పోలీస్‌స్టేషన్ సమీపంలో వాటర్ ప్యాకెట్ల బస్తాలను నిల్వ ఉంచగా భక్తులకు వాటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. ♦ లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరవుతారని తెలిసి కూడా బయో టాయ్లెట్లు, మరుగుదొడ్లను సరిపడా ఏర్పాటు చేయలేదు. ♦ ప్రముఖులకు ప్రాధాన్యమిచ్చిన పోలీసులు ప్రజాప్రతినిధులను విస్మరించారు. బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణి కుటుంబసభ్యులతో కలిసి దర్శనం కోసం రాగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాదాపు అరగంట రోడ్డుపైనే నిలుచోగా.. కేవలం ఆమెను మాత్రమే లోపలికి పంపించారు. ♦ దర్శనం దారి తెలియక చాలామంది అవస్థలు పడ్డారు. సాధారణ భక్తులు, పాస్ ఉన్నవారు, దివ్యాంగులు, బోనం ఎత్తుకొని వచ్చిన మహిళలు ఏ దారి గుండా ఏ లైన్లో వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అక్కడ వారికి దిశా నిర్దేశం చెప్పేవారు కరువయ్యారు. -
భక్తుల చెంతకే మహాకాళి
బన్సీలాల్‌పేట్: లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతరాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకు వస్తాయి.కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైంది. పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంలో పూలతో అందంగా తీర్చిదిద్ది అందులో అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడుతూ భక్తులను ఆశ్చర్యానందాలకు లోను చేస్తుంటారు. సుమారు 60 కిలోల బరువున్న ఘటాన్ని కేవలం పసుపు ముద్ద తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఎదుర్కోళ్ల నుంచి జాతర ముగిసే వరకూ.. ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 7న సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో దర్శనమివనుంది. సోమ సుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజీనగర్‌లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్‌క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు సందులో ఉన్న మహంకాళి అనే దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత ఈ నెల 20న శనివారం రాత్రి వరకు ఆయా బస్తీలు, కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలందుకుంటాయి. 21న ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయినీ మహాకాళి మినహా ఇతర ఘ టాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 22న రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మ వారి ఘటం వీడ్కోలు ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర పరి సమాప్తమవుతుంది. ఘటం ఎందుకు మొదలైందంటే..? తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించే వారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలారా వ్యాధి తగ్గితే సికింద్రాబాద్‌లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. ఆ తరువాత సికింద్రాబాద్‌లో ఆలయాన్ని నిర్మించారు. అయితే దివ్యాంగులు, వృద్ధులు ఆలయానికి రాలేని వారికి ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఘటాన్ని తయారు చేశారు. ఘటం అధిరోహకుల వేషధారణ ఘట అధిరోహకులు పసుపులో తడిపిన పంచె ధరించి, ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటుక, కాళ్లకు గజ్జెలు ధరించి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. అమ్మవారి ఘటాన్ని అధిరోహించే వీరి పట్ల ప్రజలు భక్తి భావాన్ని చాటుకుంటారు. అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించే ఎంతోమంది వైపాకులతో కూడిన చన్నీళ్ల సాకను పెడుతుంటారు. రేపు గోల్కొండ అమ్మవారికి పాతబస్తీ జోడు బోనం చార్మినార్: ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఈ నెల 4న, గొల్కొండ జగదాంబికా అమ్మవారికి జోడు బోనాలను సమర్పించనున్నారు. నగరంలోని అమ్మవారి దేవాలయాలతో పాటు విజయవాడలోని కనక దుర్గ అమ్మవార్లకు జోడు బోనాలను సమర్పించనున్నామనీ ఇందులో భాగంగా మొదటి జోడు బోనాన్ని గురువారం జరిగే గొల్కొండ బోనాల జాతర సందర్బంగా అమ్మవారికి సమర్పించనున్నామని కమిటి అధ్యక్షుడు పొటేల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ అధ్యక్షుడు గాజుల అంజయ్య తెలిపారు. ఈ సారి బంగారు బోనంతో పాటు వెండి బో నాన్ని కూడా సమర్పించనున్నామన్నారు. గు రువారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ బే లాలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోడు బోనాలతో అంగరంగ వైభవంగా గొల్కొండ కోటకు బయలు దేరుతామన్నారు. సప్త మాతృకలకు జోడు బోనాలు.. సప్త మాతృకలకు జోడు బోనాలను నగరంలోని గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహినీ దేవాలయం అమ్మవార్లకు బంగారు, వెండి పాత్రలలో సమర్పించనున్నామన్నారు. ఈ నెల 4న, గోల్కోండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే బంగారు,వెండి బోనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 9న బల్కంపేట ఎల్లమ్మ, 12న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14 విజయవాడ కనకదుర్గ అమ్మవారు, 17న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయం అమ్మవారు, 23న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, 25న లాల్ దర్వాజ సింహవాహినీ దేవాలయం అమ్మవారికి బంగారు, వెండి పాత్రల్లో జోడు బోనాలను సమర్పించనున్నామన్నారు. -
జోగిని శ్యామల తాజా డిమాండ్స్
సాక్షి, హైదరాబాద్: సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఆర్చిగేటు, దేవాలయం ప్రధాన ద్వారం వద్ద బోనంతో వెళుతున్న తనతో పాటు తన బృందాన్ని అడ్డుకోవడంతో మనస్థాపం చేందానని, అందుకే అలా మాట్లాడానని జోగిని శ్యామల వివరణ ఇచ్చారు. తాను ప్రభుత్వాన్ని నిందించాలనేది తన ఉద్దేశం కాదని, అక్కడున్న అధికారుల తీరుతో వారిని ఉద్దేశించి మాట్లాడానన్నారు. మంగళవారం ఆమె దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలపై బోనాలు పెట్టుకుని శివసత్తులు డ్యాన్సులు చేస్తూ భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాల సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతారన్నారు. తాను అనని మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించి ముఖ్యమంత్రి తదితరులను ఉద్దేశించి అన్నట్లు చూపిస్తుండడం బాధకలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో శివసత్తులందరికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడంతో పాటు, శివసత్తులు ఏ దేవాలయానికి వెళ్లినా అమ్మవారి సన్నిధికి వెళ్లేలా ప్రత్యేక జీఓ చేయాలని ఆమె కోరారు. శివసత్తులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి తప్పు జరగలేదు: ఈఓ అన్నపూర్ణ జోగిని శ్యామల విషయంలో దేవాలయం నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఈఓ అన్నపూర్ణ తెలిపారు. శ్యామలతో పాటు వచ్చిన వీఐపీలు అందరికి దేవాలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేయించి పంపించామన్నారు. ఈ సంవత్సరం 1008 బోనాలతో కలిసి వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ప్రపంచ రికార్డుగా వివరించారు. ఇంత పెద్ద జాతరలో చిన్నచిన్న తప్పులు జరిగి ఉండవచ్చని, భక్తులు పూర్తిగా సహకరించారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్ అరుణగౌడ్ ప్రత్యేక శ్రద్ధతో అన్ని శాఖల అధికారులను సమన్వయంతో ఏర్పాట్లు చేశారన్నారు. సంబంధిత కథనాలు: తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
బోన‘భాగ్యం’
ఘనంగా లష్కర్ బోనాలు - ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు - ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ప్రముఖులు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహిమాన్విత శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళిని దర్శించుకునేందుకు నగరం నలువైపుల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి వరకూ భక్తులు బోనాలు సమర్పించారు. సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు బోనాలు సమర్పించినట్లు అంచనా. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఉదయం 4.05 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించి వేడుకలను ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు సాయంత్రం ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ కె.మధుసూదనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి పద్మారావుగౌడ్ దంపతులు, ఎంపీ కవిత, మల్లారెడ్డి, కె.కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, సాయన్న, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, నంది ఎల్లయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చి పూజలు చేసే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈసారి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన సతీమణి శోభ, కుమార్తె కవితలు మంత్రి పద్మారావు ఇంటి వద్ద నుంచి అమ్మవారి దేవాలయానికి వచ్చారు. అనంతరం మంత్రి ఇంటికి వెళ్లి బోనాల విందులో పాల్గొన్నారు. ఘనంగా ఏర్పాట్లు... తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్స వాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది బోనాల కోసం రూ.10 కోట్లు వెచ్చించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. నేడు రంగం... బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. అవివాహిత మహిళ స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని దేశ భవిష్యత్‌కు సంబంధించి భవిష్యవాణి వినిపిస్తారు. దత్తాత్రేయకు చేదు అనుభవం అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయమే కేంద్ర మంత్రి దత్తాత్రేయ సికింద్రాబాద్‌కు వచ్చారు. అయితే అప్పటికే భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఆయన కాన్వాయ్‌ను ఆలయం వద్దకు వెళ్లకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీంతో రాంగోపాల్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆలయం వరకు ఆయన సతీమణితో కలసి నడుచుకుంటూ వచ్చారు. పోలీసుల తీరు పట్ల దత్తాత్రేయ అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
బోనమెత్తిన లష్కర్
ఘనంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. డప్పుల దరువులు మధ్య ఆదివారం లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు వేలాది మంది తరలివచ్చి భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు. హైదరాబాద్: పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. డప్పుల దరువుల మధ్య ఆదివారం లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేలాది మంది తరలి వచ్చి భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చారిత్రకఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డి.శ్రీనివాస్, కే కేశవరావు, ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి ఉన్నారు. అప్పటికే దేవాలయం వద్ద ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు సీఎంకు ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, ఎంపీలు కవిత, మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, జి.సాయన్న, ఏనుగు రవీందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్, ఎన్వీవీఎస్ ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉదయం 4 గంటలకు కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి పూజ చేశారు. కాగా, తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాలు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు. పద్మారావు ఇంట సీఎం బోనాల విందు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ టకారా బస్తీలోని మంత్రి పద్మారావు స్వగృహంలో బోనాల విందుకు హాజరయ్యా రు. మధ్యాహ్నం 12.30కి మంత్రి ఇంటికి వచ్చిన సీఎం 1.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. -
ఉజ్జయిని జాతరకు పోటెత్తిన భక్తజనం
- అంబారీపై అమ్మవారి ఊరేగింపు - భవిష్యవాణి వినిపించిన అమ్మవారు - ముగిసిన లష్కర్ బోనాలు రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు చివరి రోజైన సోమవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా రంగం నిర్వహించారు. ఇందులో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారి నోటి నుంచి ఏమి వస్తుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. పోతరాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి ఊరేగిం పు ఆద్యంతం కనుల పండువగా సా గింది. ఆదివారం తెల్లవారు జామున మొదలైన అమ్మవారి దర్శనం సోమవా రం ఉదయం వరకు కొనసాగింది. భక్తుల రద్దీతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రెండో రోజు కూడా ఫలహారం బండ్ల కోలాహలం కనిపించింది. అంబారీపై ఊరేగింపు.. రంగంలో భాగంగా అమ్మవారిని అం బారీపై అత్యంత వైభవంగా ఊరేగించా రు. ఉజ్జయినీ మహంకాళమ్మ, మాణిక్యాలమ్మ చిత్రపటాలను అంబారీ (ఏనుగు)పై అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఇందులో ఒంటెలు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి ముందు మహిళలు, భక్తుల కోలాటాలు, గిరిజ నుల నృత్యాలతో దేవాలయ ప్రాంగ ణం కోలాహలంగా మారింది. కళాకారులు పలు వేషధారణల్లో చేసిన నృత్యా లు కనువిందు చేశాయి. ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లు స్టెప్పులేసి అందరిని ఉత్సాహ పరిచారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత సికింద్రాబాద్‌లోని పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. దారి వెంట భక్తు లు అంబారీపై ఉన్న అమ్మవారిని ద ర్శించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్మయి, దేవాలయ ఈఓ అశోక్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కృష్ణ, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున్‌గౌడ్, శీలం ప్రభాకర్, పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఘటానికి సాగనంపు... అంబారీతోపాటు ఘటాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి ఘటా న్ని తాకేందుకు, పూజలు చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంబారీకి ముం దు అమ్మవారి ఘటాన్ని సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల మీదుగా ఊరేగించి మెట్టుగూడ వరకు సాగనంపారు. గావుతో శాంతి.. బోనాలు, సాక పెట్టడంతోపాటు ఏటా అమ్మవారికి సొరకాయ, గుమ్మడికాయలతో గావు పట్టి శాంతి చేయడం ఆనవాయితీ. రంగం కార్యక్రమం అనంతరం గావుతో అమ్మవారికి బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జంతువులను బలిచ్చి శాంతి చేసేవారు. జంతు బలి నిషేధంలోకి రావడంతో ఆనంకాయ, గుమ్మడికాయలతో అమ్మవారికి బలిచ్చారు. పోతరాజుల నృత్యాలు.. గావు అనంతరం పోతరాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒంటికి పసుపు... కాళ్లకు గజ్జెలు.. జులుపాల జుట్టు, భారీ శరీరంతో, భయంకర రూపంతో పోతరాజులు చేతిలో కొరడా పట్టుకుని భక్తులను పరుగులు పెట్టిస్తూ వీరంగం చేశారు. అనంతరం పోతరాజుల కొరడాతో భక్తులు ఆశీర్వాదం, కుంకుమ తీసుకుంటూ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు. -
వైభవంగా లష్కర్ బోనాలు
-
ఇయ్యాల రేపంట.. లష్కర్ బోనాలంట
- నేడు బోనాలు, రేపు రంగం - విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న ఆలయం - పూర్తయిన ఏర్పాట్లు భారీ బందోబస్తు రాంగోపాల్‌పేట్:లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర జరగనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పది లక్షలకుపైగా భక్తుల పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మొదటి పూజ... ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారు జామున 4గంటలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మొదటి పూజ చేయనుంది. ఆపై మిగతా భక్తులను అనుమతిస్తారు. అంతకుముందు అభిషేకాలు, మహా మంగళహారతి పూజలు మొదలవుతాయి. బోనాలకు ప్రత్యేక క్యూలైన్.. అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్ (బాటా వైపు నుంచి) ఏర్పాటు చేశారు. వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ బోనాలతో వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీఐపీలకు (ఎరుపు రంగు పాస్), సాధారణ భక్తులకు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి రెండు వేర్వేరు క్యూ లైన్లు, టొబాకో బజార్ నుంచి ప్రత్యేక దర్శనం కోసం (నీలం రంగు పాస్) మరో క్యూలైన్, అంజలీ థియేటర్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం ఓ క్యూలైన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర ప్రొటోకాల్ అధికారులకు మహంకాళి పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉండే ఆర్చ్‌గేట్ నుంచి నేరుగా అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు ఇక్కడి నుంచే నేరుగా లోపలికి పంపిస్తారు. క్యూలైన్లలో ఉండే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా వాటర్ ప్రూఫ్‌తో కొల్కత్తా డెకోరేషన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు బిగించారు. నిరంతం విద్యుత్ సరఫరా దేవాలయంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్ సరఫరాకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మొబైల్ ట్రా న్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. దేవాలయానికి చెందిన జనరేటర్‌ను సిద్ధంగా ఉంచారు. జలమండలి... జాతర కోసం జలమండలి మంచినీటి సరఫరా చేస్తుంది. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, బాటా, దేవాలయం వెనుక టెంట్లు వేసి డ్రమ్ములతోపాటు వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందిస్తారు. 15 వందల మంది వలంటీర్లు.. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వివిధ శాఖలు, సంస్థలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పనిచేయనున్నారు. దక్కన్ మానవసేవా సమితి, వాసవి క్లబ్ సికింద్రాబాద్, మున్నూరు కాపు సంఘం, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నల్లగుట్ట అభివృద్ధి సంఘం తదితర సంఘాల వారు అమ్మవారి సేవలో పాలుపంచుకోనున్నారు. బందోబస్తు ఏర్పాట్లు భారీగా.. ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి ఆధ్వర్యంలో జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయం లోపల 16, బయట 16 సీసీ కెమెరాలను దేవాలయ అధికారులు బిగిం చారు. మరో 10 సీసీ కెమెరాలను పోలీసులు క్యూలైన్లలో ఏర్పాటు చేసి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు పెద్ద పెద్ద ఎల్సీడీలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 72 మంది ఎస్ఐలు, 66 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 296 మంది కానిస్టేబుళ్లు, 242 మంది హోం గార్డులు, 12 ప్లటూన్ల సాయుధ బలగాలను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఇందులో 132 మంది మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. పార్కింగ్ ప్రదేశాలు... రాణిగంజ్‌లోని అడివయ్య చౌరస్తాలోని మైదానం, ఆర్పీ రోడ్‌లోని మహబూబ్ కళాశాల, ప్యారడైజ్ ప్రాంతంలోని పీజీ కళాశాల, ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.