
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బోనాల పండగ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డా తనకు మొక్కులు చెల్లించారని మాతాంగి స్వర్ణలత మహంకాళి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. సోమవారం స్వర్ణలత ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తూ.. ఎన్ని కష్టాలు పడ్డా నాకు మొక్కులు చెల్లించారని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment