rangam programme
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు
-
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బోనాల పండగ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డా తనకు మొక్కులు చెల్లించారని మాతాంగి స్వర్ణలత మహంకాళి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. సోమవారం స్వర్ణలత ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తూ.. ఎన్ని కష్టాలు పడ్డా నాకు మొక్కులు చెల్లించారని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
కేసీఆర్ చాలా సేవ చేశారు
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం వైభవంగా ముగిసింది. మాతాంగి ఆలయం ఎదురుగా స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని అమ్మవారు ఆవహించగా భవిష్యవాణి వినిపించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నాకు చాలా సేవ చేశారు. వారికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా చూస్తాను. కోట్లకు పడగలెత్తేలా చేస్తా. నాకు సేవ చేసినా.. చేయకపోయినా అందరూ నా భక్తులే. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా అందరినీ సమానంగా చూస్తా’ అని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. రంగంలో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారి పలుకులు ప్రత్యక్షంగా వినేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగాయి. -
వైభవంగా ‘రంగం’ ముగిసిన లష్కర్ బోనాలు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ‘రంగం’తో వైభవంగా ముగిసింది. బోనాల లో భాగంగా రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. రంగంలో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారు ఏం చెబుతారోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన అమ్మవారి దర్శనం సోమవారం ఉదయం వరకు కొనసాగింది. స్వార్థం పెరిగిపోయింది: భవిష్యవాణిలో అమ్మవారు దేవాలయంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతాంగేశ్వరి అమ్మవారి ఆలయం ముందు స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని అమ్మవారు ఆవహించగా భవిష్యవాణిని వినిపిం చింది. ‘నా గురించి పట్టించుకోవడం లేదు.. ప్రజల్లో స్వా ర్థం పెరిగిపోయింది.. దోపిడీ పెరిగిపోయింది.. భయం లేకుండా పోయింది.. నా ప్రజలను నేనే చల్లంగ చూసుకుంటా.. వర్షాలు కురిపిస్తా.. కరువు కాటకాలు రాకుండా చూస్తా.. శిక్షించేదాన్ని నేనే.. ఆశీర్వదించి కష్టాలు తీర్చేదాన్ని నేనే..’ అంటూ బోనాల జాతర కీలక ఘట్టమైన రంగంలో స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు.