జనం సుఖసంతోషాలతో ఉంటారు
Published Mon, Jul 10 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం వైభవంగా ముగిసింది. మాతాంగి ఆలయం ఎదురుగా స్వర్ణలత పచ్చికుండపై నిల్చొని అమ్మవారు ఆవహించగా భవిష్యవాణి వినిపించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నాకు చాలా సేవ చేశారు. వారికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా చూస్తాను.
కోట్లకు పడగలెత్తేలా చేస్తా. నాకు సేవ చేసినా.. చేయకపోయినా అందరూ నా భక్తులే. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా అందరినీ సమానంగా చూస్తా’ అని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. రంగంలో ప్రధాన ఘట్టమైన భవిష్యవాణిలో అమ్మవారి పలుకులు ప్రత్యక్షంగా వినేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగాయి.
Advertisement
Advertisement