Swarnalatha
-
మహంకాళి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
-
మహంకాళి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, హైదరాబాద్: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించగలిగాం. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’అని అన్నారు. -
పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!
సినీ ఇండస్ట్రీలో సింగర్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. రచయిత రాసిన పాటను మధురమైన స్వరాలను అందించండం వారికి మాత్రమే సొంతం. అలా సినీరంగంలో ఎంతోమంది ప్రముఖ గాయకులు ఉన్నారు. చిన్న వయస్సులోనే విజయం సాధించి ఈ రంగంలో కీర్తిని పొందినవారిని ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తమ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను మైమరపించిన ఎందరో తారలు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటివారిలో ముఖ్యంగా దివ్యభారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరిలాగే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వర్ణలత సైతం చిన్న వయసులోనే మరణించారు. ఈ స్టోరీలో ఆమె గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) స్వర్ణలత.. ఈ పేరు హిందీతో పాటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సుపరిచితం. 1973లో కేరళలో జన్మించిన ఆమె సెప్టెంబర్ 12, 2010న ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె తన కెరీర్లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీతో సహా దాదాపు 10 భాషలలో ఏకంగా పదివేల పాటలకు పైగా ఆలపించింది. ముఖ్యంగా స్వర్ణలత దక్షిణాది చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ.. ఆమె హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నీతిక్కు తందానైలో కేజే యేసుదాస్‌తో కలిసి 'చిన్నచిరు కిలియే' అనే పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధించింది. కరుత్తమ్మ చిత్రంలోని "పోరాలే పొన్నుతాయి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆయన సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా స్వర్ణలతనే. స్వర్ణలత తన ఫేవరెట్ సింగర్ అని గతంలోనే ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. కేరళలోనే పుట్టి పెరిగిన ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు. (ఇది చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?) -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్‌పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్‌పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది. 2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్లో విచారించారు. ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్ అయ్యారు. చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు. అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు. అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. -
ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ కాగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
నోట్ల మార్పిడి దందా కేసు: రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఇటీవల ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. కాగా, నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో సోమవారం ఉదయం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ.. మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా ఉన్నాను. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నాను. అయిదు వారాల పాటు నన్ను ముత్తైదులందరూ భక్తిశ్రద్ధలతో కొలుచుకోవాలి. నైవేద్యాలు సమర్పించాలి. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చుసుకునే బాధ్యత నాది. 5 వారాలు నాకు సాక పోయండి నాయన. ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మరిచిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. నేను మీతోనే ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా, రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షల మంది భక్తులు పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. చదవండి: చేసే పనీ.. చేటు చేయొచ్చు.. ఉద్యోగాలతో అనారోగ్యాలు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలకు అన్ని శాఖలు సహకరించాయని, వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోస్తవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కాగా, స్వర్ణలత జీవితంలో మరో కోణం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. స్వర్ణలత సొంత జిల్లా విజయనగరంలో ఆమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ ఫౌండేషన్(www.swarnafoundationgroup.com) పేరుతో పేద విద్యార్థులకు, మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే, తాజాగా స్వర్ణలతపై ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ స్వర్ణలత ఫౌండేషన్ కార్యకలాపాలు బయటకు వచ్చాయి. కాగా, స్వర్ణ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజల ఆరోగ్యం, విద్య కోసం పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్యకున్న ప్రాముఖ్యత గురించి అవగాహాన కల్పిస్తోంది. ఈ ఫౌండేషన్ అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యల కోసం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పడింది. ఇది కూడా చదవండి: జీడిపై చీడ రాతలు! అప్పుడు కిమ్మనని రామోజీ ఇప్పుడు మాత్రం గుండెలు బాదుకుంటున్నాడు -
అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల
‘‘నేనెక్కడ ఉంటే మా అమ్మకు అదే ఫేవరెట్ ప్లేస్. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఇంటిని బాగా చూసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయం అమ్మకు ఇష్టం. మా అమ్మ బెస్ట్ పర్సన్’’ అన్నారు శ్రీలీల. ‘పెళ్లి సందడి’తో తెలుగుకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం చేతిలో అరడజనకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు ‘మాతృదినోత్సవం’ సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా శ్రీలీల షేర్ చేసుకున్న విషయాలు ఈ విధంగా.. ► మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అలానే ఆమెకి చాలా ఓర్పు ఎక్కువ. నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఇవ్వాలో.. ఇవ్వకూడదో ఆమెకు బాగా తెలుసు. అలాగే ఏ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలో.. ఉండకూడదో కూడా బాగా తెలుసు. ► నా స్కూల్ డేస్‌లో చాలా బిజీగా ఉండేదాన్ని. స్కూల్ అవ్వగానే డ్యాన్స్ క్లాస్, స్విమ్మింగ్.. ఇలా గడిచిపోయేది. కానీ నాకేమో అల్లరి చేయాలని ఉండేది. అయితే దానికి చాన్స్ ఉండేది కాదు. ఎందుకంటే మా అమ్మ కళ్లన్నీ నా మీదే ఉండేవి. ► తిండి విషయంలో చిన్నప్పుడు నేను చాలా నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. స్కూల్‌కి వెళ్లేటప్పుడు అమ్మ ఇచ్చిన లంచ్ బాంక్స్ ఇంట్లో సోఫా వెనకాలో, కారు సీటులోనో దాచేసేదాన్ని. తినడానికి ఇష్టపడక అలా చేసేదాన్ని. ► ఇక నా విషయాలను నేను హ్యాండిల్ చేయగలననే నమ్మకం కుదిరాక మా అమ్మ నాకు స్వేచ్ఛ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మా అమ్మ నాకు మంచి ఫ్రెండ్‌లా అయిపోయారు. ఎప్పుడైతే మా అమ్మ నాకు ఫ్రెండ్‌లా అయ్యారో అప్పట్నుంచి అన్నీ ఆమెతో షేర్ చేసుకుంటున్నాను. రాత్రిపూట జోక్స్ చెప్పుకోవడం, రిలాక్స్ అవ్వడం.. డ్యాన్స్ చేయడం... వాట్ నాట్.. మేం చాలా బాగా టైమ్ స్పెండ్ చేస్తాం. తన కూతురు కావడం నా లక్. ► మా అమ్మగారు మల్టీ టాస్కర్. అందుకే తనకి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటుంటాను. అదే విషయం ఆమెతో చెబితే ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అమ్మకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో పని పెట్టుకుని, ఆ పని పూర్తి చేసేంతవరకూ ప్రశాంతంగా ఉండరు. ► మా అమ్మగారు డాక్టర్. షేషెంట్లతో ఎప్పుడూ ఫుల్ బిజీ. కొన్నేళ్ల పాటు అవిడ డాక్టర్‌గా సర్వీస్ చేశారు. పైగా శ్రద్ధగా చేయడంతో ఎందరో పేషెంట్స్ ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేవారు. చాలా గౌరవించేవారు. ఇవన్నీ స్వయంగా చూసిన నాకు మా అమ్మంటే చాలా గౌరవం.. గర్వం.. స్ఫూర్తి కూడా. నేను ఆవిడ్ని ‘సూపర్ ఉమన్’ అంటాను. ఆవిడ సెమినార్స్‌లో పాల్గొన్నప్పుడు నేను చాలా ఆరాధనగా చూసేదాన్ని. ఆవిడకున్న నాలెడ్జ్ సూపర్. ► మా అమ్మ నాలో భాగం. నా కెరీర్లోనూ ఆమె సగ భాగం. చాలా అర్థం చేసుకుంటారు. నా కెరీర్‌కి ఎంత హెల్ప్ చేయాలో అంతా చేస్తారు. నేనివాళ ఇంత బిజీగా సినిమాలు చేయగలుగుతున్నానంటే ఆమె సపోర్ట్ కారణం. ► ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ‘వాట్ నెక్ట్స్’ అంటారామె. కొంచెం కూడా బాధపడరు. నేనేమో ‘సెన్సిటివ్’. చిన్న విషయాలకు కూడా బాధపడిపోతుంటాను. నేను ఆ బాధ మరచి పోయేలా ఆమె కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మ స్పిరిచ్యువాల్టీ పర్సన్. ప్రతిరోజూ దేవుడిని పూజిస్తుంటారు. ఆ పూజలు నాకు ధైర్యాన్నిస్తాయి. ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నా ధైర్యం రెట్టింపు అవుతుంది. ∙‘మదర్స్ డే’కి మా అమ్మ కోసం స్పెషల్‌గా ఒకటి ప్లాన్ చేశాను. అది సీక్రెట్. -
‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు
‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల తల్లిపై పోలీసుల కేసు నమోదైంది. తొలి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె వరస ఆఫర్లు అందుకుంటోంది. మూవీ ప్లాప్ అయినప్పటికు ఆమె మాత్రం వరస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండ ప్రాజెక్ట్స్‌తో తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తల్లి స్వర్ణలతపై తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివరాలు.. సుభాకర్రావు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న స్వర్ణలత మనస్పర్థలు రావడంతో 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె తన కూతురు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి విడిగా జీవిస్తోంది. అయితే స్వర్ణలత-సుభాకర్ విడాకుల పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత ఈ నేపథ్యంలో అక్టోబరు 3న కొరమంగళలో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకి స్వర్ణలత తాళం పగలగొట్టి వెళ్లిందని సుభాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన తాజాగా అడుగుడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఇప్పటికే స్వర్ణలతపై ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఏ2గా కేసు నమోదైంది. ప్రస్తుతం స్వర్ణలత బెయిల్‌పై ఉంది. ఈ క్రమంలో ఆమెపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా చేస్తున్న ‘స్టూడెంట్’లో చిత్రాలతో బిజీగా ఉంది. -
స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!
చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు. మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్ డిజార్డర్ వల్ల వీల్‌చైర్‌కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది. జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది. దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్‌చైర్‌కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు. స్వర్ణలత– మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్ స్పీకర్. ‘చూడండి... నేను వీల్‌చైర్‌లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్స్పైర్ అవుతారు. కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్‌లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది. జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది. తనలాంటి వారిని గుర్తించి వెంటనే మల్టిపుల్ స్ల్కెర్లోసిస్ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్‌చైర్‌లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్ చూస్తుంది. అంతే కాదు పబ్లిక్ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్ ప్లేసుల్లో ర్యాంప్‌లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం. ‘సారథి’లాంటి వాహనం స్వర్ణలత తన ఫౌండేషన్ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్‌చైర్‌తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత. -
వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారు: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది బోనాల పండగ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డా తనకు మొక్కులు చెల్లించారని మాతాంగి స్వర్ణలత మహంకాళి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. సోమవారం స్వర్ణలత ఉజ్జయిని మహంకాళి ఆలయంలోని రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తూ.. ఎన్ని కష్టాలు పడ్డా నాకు మొక్కులు చెల్లించారని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు కొంత ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ‘‘నాకు జరుగుతున్న పూజలతో నేను సం తోషంగా లేను...ఎవరు చేసుకున్న దాన్ని వారు అనుభవిస్తున్నారు...కాపాడేదాన్ని నేనే అయినా అంతకు ఎక్కువగా చేసుకుంటున్నారు...భక్తి భావంతో కాకుండా విపరీతమైన కోరికలు, కోపతాపాలతో నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని నేనే...నా బిడ్డలను నేను కాపాడుకుంటాను...రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు వస్తాయి...ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ముందుగా హెచ్చరిస్తున్నా...నా భక్తులు లేకుండా జరిగిన బోనాలతో నేను సంతోషంగా లేను...యజ్ఞ, హోమాలు చేసి ఐదు వారాల పాటు నాకు సాక పెట్టి , నా వారం రోజు పప్పు బెల్లంతో ఫలహారం గడపగడప నుంచి రావాలి’’అంటూ రంగంలో అమ్మవారు సోమవారం భవిష్య వాణి వినిపించారు. తంబూర చేతపట్టుకుని మాతంగేశ్వరి అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని ఆవహించగా భవిష్యవాణిని వినిపించారు. కరోనాతో దేశ ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని తన ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు చేసుకున్న దాంతో వారు అనుభవిస్తున్నారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు. ఎవరికి వారు తమ సొంత కోరికలు కోరుకుంటూ ఎలాంటి భక్తి భావం లేకుండా కోపతాపాలతో తనకు పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తిశ్రద్ధలతో కొలిస్తే తన బిడ్డలను తాను కాపాడతానని కొండంత ధైర్యాన్ని అందించారు. ఇటీవల పూర్తయిన కాళేశ్వరం గురించి వేదపండితుడు వేణుమాధవశర్మ అమ్మవారిని అడుగగా గంగమ్మకు యజ్ఞయాగాలు, హోమాలు చేస్తే ఆమె సంతోషించి అందరు కోరుకున్నట్లు జరుగుతుందని తెలిపారు. -
మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రంగం కార్యక్రమంలో స్వర్ణలత ‘భవిష్యవాణి’ వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బోనాల జాతర జరిపినందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది బోనాల ఏర్పాట్లపై పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరారు. మారు బోనం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ‘ఈ ఏడాది ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. ప్రజలందరినీ సంతోషంగా ఉంచుతాను. నా చెల్లెలు గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోర్కెలు నెరవేరుతున్నాయి. రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. నా అక్కాచెల్లెళ్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. రైతులను సుఖ సంతోషాలతో ఉంచే బాధ్యత నాదేన’ని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం
-
ఉజ్జయిని మహంకాళి: స్వర్ణలత భవిష్యవాణి
-
ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు. ‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు. నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
రంగం చెబుతున్న స్వర్ణలత
-
ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది!
ఆమె ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది.సంవత్సరంలో ఒకరోజు ఆమె వైపు భక్తజనమంతా చూస్తుంది.కాని మిగిలిన అన్ని రోజులు ఆమె ఒక సాధారణ టైలర్లా జీవితం గడుపుతుంది. మాతంగి స్వర్ణలత జీవన పరిచయం ఇది. ఆ క్షణాలు ఉద్వేగభరితం. కోట్లాది జనసందోహం ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తుంటుంది. ఏడాదికోసారి వినిపించే ఆ మాటల కోసం ఆ క్షణంలో అంతా ఊపిరి బిగపట్టి ఆలకిస్తారు. ఎందుకంటే ఆ మాటలు ఉజ్జయిని మహంకాళి మధుర వాక్కులు. అవి అందరినీ కాపాడే ఆ చల్లని తల్లి దీవెనలు. ప్రజలంతా సుఖశాంతులతో బతకాలనే ఆకాంక్షలు. అమ్మవారికి ఆగ్రహం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె మాటల్లోనే వెల్లడిస్తుంది. పాలించేవారికి దిశానిర్దేశం చేస్తుంది. పాలితులకు మార్గదర్శనం చేస్తుంది. ఆ క్షణాల్లో అమ్మవారు పచ్చికుండతో చేసిన రంగంపైకి ఎక్కి భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ అపురూప క్షణాల్లోనే అమ్మవారు మాతంగి స్వర్ణలత అవుతుంది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత అప్పుడు ఉజ్జయిని మహాంకాళి ఆవాహనమవుతుంది. రెండు దశాబ్దాలకు పైగా రంగం ఎక్కి భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత ఒక విశిష్టమైన సాంసృతిక ఆవిష్కరణ అవుతుంది. రెండువందల ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు ఆమె ఒక కొనసాగింపు. నగరమంతా ఆషాఢమాసపు ఆ«ధ్యాత్మికతను సంతరించుకుంటున్న వేళ మాతంగి స్వర్ణలత ప్రస్థానం పై ’సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. తరతరాలుగా.. వారసత్వంగా.. ముఖం నిండా పసుపు. పెద్ద పెద్ద కళ్లు. నుదుటిపై నిండుగా ఉన్న కుంకుమ బొట్టు. పసుపు కుంకుమలతో అలంకరించుకొన్న నిండైన దేహం. పచ్చికుండపై నిలిచిన పాదాలు. చేతిలో కిన్నెర. భవిష్యత్తులోకి తొంగి చూసే సునిశితమైన చూపులు. ఆ సమయంలో అమ్మవారిని ఆవాహనం చేసుకున్న స్వర్ణలత రూపం, మాటలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు చెప్పే దైవానికి ఆమె ప్రతిరూపమే అవుతుంది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అవతరించిన తరువాత భవిష్యవాణి వినిపించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. అమ్మాయిలంతా అమ్మవారికే ‘ఏర్పుల’ వంశానికి చెందిన మహిళలు ఆ సాంప్రదాయానికి ప్రతీకలు. మొట్టమొదట ఏర్పుల జోగమ్మతో ఇది మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయంలో భాగస్వాములయ్యారు. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించింది. 1997 నుంచి ఇప్పటి వరకు స్వర్ణలత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ‘మా కుటుంబంలో పుట్టే అమ్మాయిలంతా అమ్మవారికే అంకితం. ప్రతి అమ్మాయి మాతంగి కావలసిందే. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను తాము మహంకాళికి సమర్పించుకున్న వాళ్లే. మా కుటుంబంలో మా తమ్ముడు దినేష్‌కు ఆడపిల్ల పుడితే తప్పకుండా నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది...’ అని చెబుతోంది స్వర్ణ. సంక్షేమమే చెబుతుంది పదోతరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నవయస్సులోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో వైభవంగా ఆ పెళ్లి జరిగింది. ఆ తరువాత ఆమె జీవితం అమ్మవారి సేవకే అంకితమైంది. అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తోంది. ఆమె వినిపించే భవిష్యవాణిని ప్రజలే కాదు ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. భవిష్యవాణిలో చెప్పే సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది. ఆ భవిష్యవాణిలో ప్రజలందరి సంక్షేమం నిక్షిప్తమై ఉంటుంది. జీవిక కోసం టైలరింగ్ ఏడాదికోసారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి లక్షలాది మంది భక్తులు, అధికారగణాలు, అతిర«థమహార«థులు కొలువుదీరి ఉండే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి జంకు లేకుండా, అమ్మవారికి ప్రతిరూపమై భవిష్యవాణి వినిపించే స్వర్ణలత సాధారణ జీవితంలో ఒక టైలర్. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద. ఆమె కుటుంబం తుకారాంగేట్‌లోని ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తుంది. ‘మా నాయిన ఏర్పుల నర్సింహ మొదటి నుంచి గుడి దగ్గర పంబజోడు వాయించేవాడు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికి వచ్చి జేగంట మోగించేది. తరతరాలుగా ఇది మా వృత్తి. అమ్మా, నాయిన ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను, మా తమ్ముడు దినేష్, పిన్ని, వదిన ఉంటున్నాం. దినేష్ ఎలక్ట్రీషియన్. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. బతకాలంటే కష్టపడాల్సిందే కదా’ అంటూ నవ్వేస్తుంది. స్వర్ణ మంచి లేడీస్ టైలర్. అన్ని రకాల డిజైన్లలో బ్లౌజులు, ఇతర దుస్తులు కుట్టేస్తుంది. ఏడాది పాటు రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినా ఏడాదికోసారి వచ్చే ఆషాఢమాసం కోసం మాత్రం ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటుంది. ‘‘ఏర్పుల బాగమ్మ మాకు నాయినమ్మ వరుస అవుతుంది. ఆమె ప్రభావం మాపై కొంతవరకు ఉంది. కానీ ఆ తరువాత రంగం ఎక్కిన మా అక్క స్వరూపారాణితో కలిసి నేను గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే నేను వచ్చాను’ అంటూ గలగలా నవ్వేసే స్వర్ణకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుంది. రంగం’ ఒక ఆ«ధ్యాత్మిక వేదిక ఆషాఢమాసం అమావాస్య తరువాత వచ్చే ఆదివారంతో ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఆరంభమవుతాయి. గర్భాలయంలోని అమ్మవారి ఆభరణాలు, ముఖాకృతిని అందంగా అలంకరించిన ఘటంతో తీసుకొని రాణిగంజ్‌లోని కర్బలా మైదానానికి ఎదుర్కోలుకు వెళుతారు. ఈ నెల 15వ తేదీన ఆ వేడుక మొదలవుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఘటంతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా తన తోటి 18 మంది అక్కచెల్లెళ్లను ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత ఈ నెల 29వ తేదీన బోనాల ఉత్సవాలు. 30న ’రంగం’నిర్వహిస్తారు. ఈ ఆ«ధ్యాత్మిక వేదికను స్వర్ణలత తమ్ముడు దినేష్ అలంకరిస్తాడు. పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు...’ అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో 15 నిమిషాల పాటు భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి కోసం ఎదురు చూద్దాం. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ -
పనికి రాని టైర్లతో కోట్ల వ్యాపారం
మహిళా వ్యాపారవేత్త స్వర్ణలత విజయం సీఎం చేతులమీదుగా పురస్కారం ఏయూ క్యాంపస్: ‘కలలు కనండి..నిద్రపోయేటప్పుడు కాదు..లక్ష్యం సాధించేవరకూ..అప్పుడే విజయం వరిస్తుంది. ఏ పని చేసినా పట్టుదలతో ఇష్టపడి చేయాలి. అప్పుడే సక్సస్ రుచి చూస్తాం’ అంటున్నారు ఔత్సాహిక పారిశ్రామిక వేత స్వర్ణలత. పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ తన నీడలో మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యర్థాలే ముడిసరుకుగా అర్థవంతమైన వ్యాపారం చేస్తూ లాభాలబాటలో పయనిస్తున్నారు. మదిలో మెదిలిన ఆలోచనను ఆచరణలో పెట్టి విజయకటాక్షం అందుకున్నారు. కష్ణాపుష్కరాల్లో భాగంగా ఉత్తమ దళిత మహిళా వ్యాపారవేత్త పురస్కారాన్ని సీఎం చేతులమీదుగా స్వర్ణలత అందుకున్నారు. వ్యాపారం ఏంటంటే... వాహనాలకు వినియోగించిన రబ్బరు టైర్లను నిరుపయోగంగా వదిలేస్తారు. వీటిని కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితం జరుగుతుంది. వీటిని పునర్విణియోగం చేసే దిశగా స్వర్ణలత పరిశ్రమను స్థాపించారు. గంభీరంలోని కేఎస్ ప్రిన్స్టన్ రబ్బర్ ఇండస్ట్రీస్ పేరుతో క్రంబ్ రబ్బర్ పరిశ్రమకు 2012లో ప్రారంభించారు. పరిశ్రమ పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించడానికి రెండేళ్ల సమయం పట్టింది. సంవత్సరానికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరుకుంది. ముడిపదార్థంగా సరఫరా... పాత పనికి రాని టైర్లను కొనుగోలు చేసి వీటిని మెత్తటి పొడిగా మారుస్తారు. దీనిని హెచ్‌పీసీఎల్‌కు అనుబంధంగా తారు తయారు చేసే పరిశ్రమలో వినియోగిస్తారు. తారులో 20శాతం ఈ రబ్బరు పొడిని వినియోగిస్తారు. విమానాల రన్‌వే, రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అదే విధంగా కేరళలో వివిధ వస్తువులు తయారుచేసే పరిశ్రమలకు ఈ పొడిని వినియోగిస్తారు. కొత్తగా రబ్బరు కొనుగోలు చేసే ధర కంటే క్రంబ్ రబ్బర్(రబ్బరు పొడి) తక్కువగా లభిస్తుండటంతో దీనికి కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో మ్యాట్లు ఇతర వస్తువులను తయారుచేస్తున్నారు. అదే విధంగా టీవీఎస్ సుందర్ సంస్థకు ఈ పొడిని సరఫరా చేస్తున్నారు. వాల్కనైజేషన్ జరిపి రీ టైరింగ్ చేయడానికి ఈ పొడిని ఉపయోగిస్తున్నారు. గృహిణి నుంచి పారిశ్రామిక వేత్తగా.. గృహిణిగా ఇద్దరు పిల్లలను తీర్చిదిద్దుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ సెంటర్ సహకారంతో గంభీరంలో పరిశ్రమ స్థాపించారు. దీనికోసం ఎస్బీఐ నుంచి కోటి రూపాయలు రుణం తీసుకున్నారు. ప్రస్తుతం 20 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అదే విధంగా వీరు నివాసం ఉండటానికి వసతిని సైతం కల్పిస్తున్నారు. భర్త కరుణ కుమార్ శ్రీకాకుళంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఏయూలో న్యాయవిద్యను పూర్తిచేసిన స్వర్ణలత భర్త పోత్సాహంతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. సొంతంగానే మార్కెటింగ్ పరిశ్రమ ప్రారంభించిన కొత్తలో ఏడాదిన్నర కాలం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సొంతంగా మార్కెటింగ్‌ను సష్టించుకున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిశ్రమలకు వివరించడం, ఆన్లైన్ టెండర్లు వేసి సరుకు సరఫరా చేయడం వంటి నైపుణ్యాలను సాధించారు. ఇటు ఉత్పత్తి, మరోవైపు మార్కటింగ్లను సమర్థవంతంగా నిర్వహించారు. హుద్‌హుద్‌లో రూ. 20 లక్షలు నష్టం హుద్‌హుద్ సమయంలో సంస్థకు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనిలో రూ.15 లక్షల వరకు బీమా రూపంలో తిరిగి వచ్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల వరకు రాయితీలు లభించడంతో పరిశ్రమ నిలదొక్కుకుంది. రెండో యూనిట్ ప్రారంభిస్తున్నాం ప్రస్తుతం మా పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్న రబ్బరు పొడిని ఇతర సంస్థలకు సరఫరా చేయడం జరుగుతుంది. దీనిని నిర్వహిస్తూ క్రంబ్ రబ్బర్‌తో మేట్స్, ఇండస్ట్రియల్మేట్స్ వంటివి తయారు చేసే పరిశ్రమను ప్రారంభిస్తున్నాం. పరిశ్రమలకు ముడి సరుకును అందిస్తూ, వస్తు ఉత్పత్తి చేసే దిశగా పనిచేస్తాం. –స్వర్ణలత, పారిశ్రామిక వేత్త -
‘నాకు రక్త తర్పణం చేయటం లేదు’
హైదరాబాద్: ‘మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు.. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను నిలదీసింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యవాణిని స్వర్ణలత వినిపించింది.‘ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం ఘనంగా నిర్వహించటం సంతోషకరం. కోరినన్ని వానలు కురిపిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి.. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.. నేనేమీ వెజిటేరియన్‌ను కాదు కదా..’ అని స్వర్ణలత భవిష్యవాణి తెలిపింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. భవిష్య వాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమం నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించడంతో.. అప్రమత్తమైన పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నా గురించి ఆలోచించరేందిరా?
-
రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?
హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాల్లో భాగంగా కీలకంగా భావించే 'రంగం' కార్యక్రమం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగింది. మాతంగి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా నా గురించి ఆలోచించరేందిరా?' అని ప్రశ్నించింది. 'నలుగురికీ అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే.. దోచుకునేటోళ్లు తయారయ్యారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటోళ్లను శిక్షించేదీ.. ప్రజలను కాపాడేదీ తానేని ఘంటాపథంగా చెప్పింది. తన దగ్గరికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి భారంగానీ, భయాలుగానీ లేకుండా కాపాడుకుంటానని, ఆ బాధ్యత తనదేనని భక్తులకు భరోసా ఇచ్చింది. కాగా భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగిస్తున్నారు. అంబారీ ఊరేగింపు తర్వాత అమ్మవారి దర్శనం ప్రారంభం కానుంది. -
చిన్నారి కళ్ల నుంచి వస్తున్న రాళ్లు
చెన్నూర్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన నరిగె సమ్మయ్య-సమ్మక్కల కూతరు స్వర్ణలత (8) కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. స్వర్ణలత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం నాటి నుంచి శనివారం సాయంత్రం వరకు సుమారు 30 రాళ్లు పడినట్లు బంధువులు తెలిపారు. బాలికను సమీపంలోని అంగ్రాజ్‌పల్లి పీహెచ్సీలో వైద్య చికిత్సల నిమిత్తం తీసుకువెళ్లగా హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయంఅందించాలని కోరుతున్నారు. -
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
-
ప్రజలకు ఏ కష్టం రానివ్వను....
సికింద్రాబాద్: ప్రజలకు ఏ కష్టం రానివ్వను...ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరికీ ఎలాంటి భారం, భయం లేకుండా చూసుకునే బాధ్యత తనదని ఆమె భవిష్యవాణి ద్వారా తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్వర్ణలత రంగంలో పేర్కొన్నారు. తన ఆజ్ఞ లేకుండా ఏ పనీ చేయవద్దని సూచించారు. భవిష్యవాణి అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు. -
గొలుసు కోసమే స్వర్ణలత హత్య!
పరియస్తుడే ప్రాణం తీశాడు ముగ్గురు నిందితుల అరెస్టు విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడి మచిలీపట్నం క్రైం : సంచలనం కలిగించిన స్వర్ణలత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్వర్ణలతతో పరిచయం ఉన్న వ్యక్తే పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వర్ణలతను అంతమొందించటంలో పరిచయం ఉన్న వ్యక్తితో పాటు మరో ఇరువురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ డాక్టర్ కె.వి. శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి సంఘటన వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంకు చెందిన మరకా శ్రీను, ముచ్చు శ్రీను, కుంభా శ్రీను స్నేహితులు. మొదటి నుంచి వ్యసనాలకు బానిసైన మరకా శ్రీను గతంలో పలు బైక్ దొంగతనాలకు పాల్పడగా అతనిపై మచిలీపట్నంతో పాటు విజయవాడ, ఏలూరుల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముచ్చు శ్రీను ఆటో డ్రైవర్ కాగా, కుంభా శ్రీను కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గతంలో మరకా శ్రీనుకి పట్టణానికి చెందిన కడియాల స్వర్ణలతకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటీవల వేసవి సెలవులకు పుట్టింటికి వచ్చిన స్వర్ణలతను గతంలో ఉన్న పరిచయంతోశ్రీను మాయమాటలు చెప్పి బయటికి వెళదామని కోరాడు. దీంతో స్వర్ణలత అతనితో కలిసి బయటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. శ్రీను అతని స్నేహితులైన ముచ్చు శ్రీను, కుంభా శ్రీనును కలిసి తనకు ఓ మహిళ పరిచయమైనట్లు చెప్పి ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అంతమొందిస్తే పెద్ద మొత్తంలో బంగారం చేతికి వస్తుందని, వచ్చే బంగారాన్ని పంచుకుని దర్జాగా బతకొచ్చని చెప్పడంతో స్వర్ణలతను హత్య చేసేందుకు వారివురు అంగీకరించారు. ఈ నెల 10 వతేదీన శ్రీను స్వర్ణలతకు ఫోన్ చేసి బయటికి రమ్మని కోరాడు. బయటకు వచ్చిన స్వర్ణలతను ముచ్చు శ్రీను, అతని స్నేహితులు ఆటోలో ఎక్కించుకుని బందరు మండల పరిధిలోని చిన్నాపురం మీదుగా భోగిరెడ్డిపల్లి ఐదో నంబరు పంట కాలువ సమీపానికి తీసుకెళ్లారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీను, మరకా శ్రీను తువ్వాలును ఆమె మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేశారు. అలాగే ముందుగా పథకం వేసుకున్న వారు పురుగుమందు బాటిల్‌ను వెంట తీసుకెళ్లి ఆమె గొంతులో బలవంతంగా పోశారు. అయినప్పటికీ స్వర్ణలత చనిపోయిందో లేదోననే అనుమానంతో ఆటోలోని స్టెఫినీ టైరుతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని అక్కడి నుంచి ఆటోలో తిరిగి స్వర్ణలత ఇంటి సమీపానికి చేరుకుని ఆమె మూడేళ్ల కుమారుడిని ఇంటికి సమీప ప్రాంతంలో వదిలేసి ఉడాయించారు. ఈ సంఘటనపై భోగిరెడ్డిపల్లి వీఆర్వో ఈ నెల 11వ తేదీన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు స్వర్ణలతను హత్య చేసింది పై ముగ్గురేనని తేలడంతో గురువారం మధ్యాహ్నం బందరులోని మూడుస్తంభాల సెంటర్లో రూరల్ సీఐ ఎస్ వీ వీ ఎస్ మూర్తి, ఎస్సై ఈశ్వర్, స్టేషన్ సిబ్బంది వారిని అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి అపహరించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆటోతో పాటు వారు ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకేసును ఛేదించండంలో కృషి చేసిన సీఐ మూర్తి, ఎస్సై ఈశ్వర్‌లతో పాటు స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు. రూరల్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, టౌన్ సీఐ బీవి సుబ్బారావు, రూరల్, మచిలీపట్నం ఎస్సైలు ఈశ్వర్‌కుమార్, శ్రీహరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాత పరిచయమే ప్రాణం తీసింది
పథకం ప్రకారమే స్వర్ణలత హత్య పోలీసుల అదుపులో ముగ్గురు వీడిన హత్య కేసు మిస్టరీ మచిలీపట్నం క్రైం : స్వర్ణలత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకూ ఛేదించారు. పరిచయం ఉన్న వ్యక్తే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు. స్వర్ణలతను అంతమొందించడంలో ఆ వ్యక్తితో పాటు మరో ఇరువురు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇప్పటికే హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో నేరచరిత కలిగిన ఓ పాత నేరస్థుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టగా అతనికి ఒక కారు డ్రైవర్‌తో పాటు మరో ఆటో డ్రైవర్ సహకరించినట్లు సమాచారం. విశాఖపట్నంకు చెందిన కడియాల స్వర్ణలత వేసవి సెలవులను పురస్కరించుకుని తన భర్త, కుమారుడితో కలిసి గత నెల మచిలీపట్నంలోని పుట్టింటికి వచ్చింది. కొన్ని రోజుల అనంతరం భర్త తిరిగి విశాఖపట్నం వెళ్లిపోగా స్వర్ణలత ఆమె కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన స్నేహితురాలిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె చీకటిపడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మరుసటి రోజు బందరు మండలంలోని భోగిరెడ్డిపల్లి ఐదో నంబరు పంట కాలువ గట్టుపై గుర్తు తెలియని ఓ మహిళ హత్యకు గురైనట్లు రూరల్ పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు ఆరా తీయగా హత్యకు గురైంది స్వర్ణలతేనని తేలింది. దీంతో స్వర్ణలత హత్యపై రూరల్‌పోలీసులు కేసు నమోదు చేశారు. పథకం ప్రకారమే హత్య... స్వర్ణలత హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆమెను హత్య చేసింది పరిచయం ఉన్న వ్యక్తేనని తేలింది. గతంలో స్వర్ణలత తల్లిదండ్రులు ఇంగ్లీషుపాలెంలో ఉండేవారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ (బైక్ దొంగ) యువకుడు ఆమెతో చనువుగా ఉండేవాడు. అయితే పరిచయం అయిన వ్యక్తి బైక్‌లను అపహరిస్తాడని తెలియడంతో స్వర్ణలత అతన్ని దూరంగా పెట్టింది. స్వర్ణలతకు వివాహమయిన అనంతరం వారి మధ్య ఉన్న పరిచయం శాశ్వితంగా తెగిపోయింది. కాగా వేసవిసెలవులకు ఇటీవల స్వర్ణలత పుట్టింటికి రాగా వారివురూ మరలా కలుసుకున్నారు. దీంతో సదరు బైక్ దొంగ ఏకాంత వాతావరణంలో కలుసుకుందామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి మొహమాటపెట్టాడు. దీంతో స్వర్ణలత బయటకు వెళ్లేందుకు అంగీకరించింది. వెంటనే సుకర్లాబాద్కు చెందిన మరో కారుడ్రైవర్‌ను కలిసి తనకు ఓ యువతి పరిచయమయిందని ఆమెను బయటకు తీసుకెళ్లి అంతమొందిస్తే పెద్ద మొత్తంలో బంగారం చేతికి వస్తుందని చెప్పాడు. అందులో వాటా ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. దీంతో సదరు కారుడ్రైవర్ సైతం ఆమెను హత్య చేసేందుకు అంగీకరించాడు. ఈ పథకంలో వీరద్దరితో పాటు మరో ఆటో డ్రైవర్ కూడా కలిశాడు. అలా పథకం వేసుకున్న వారు అదే రోజు రాత్రి స్వర్ణలతను ఆటోలో ఎక్కించుకుని చల్లపల్లి రోడ్డులోకి తీసుకెళ్లారు. స్వర్ణలతను హత్య చేయాలనుకున్న వారు ముగ్గురు కోనేరుసెంటర్లోని బంగారు దుకాణాల్లో పొటాష్ కొనేందుకు ప్రయత్నించారు. అయితే దుకాణ యజమానులు ఎవరూ పొటాష్‌ను విక్రయించకపోవటంతో పురుగుల మందు సీసాను వెంట తీసుకెళ్లారు. మార్గమధ్యంలో కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు కలిపారు. చల్లపల్లి రోడ్డులో కొంత దూరం వెళ్లాక నమ్మకంగా ఆమెతో తాగించారు. అనంతరం చల్లపల్లి రోడ్డు నుంచి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కారు డ్రైవర్ స్వర్ణలత పట్ల అసభ్యంగా వ్యవహరించి తన కోర్కె తీర్చమని బలవంతం చేశాడు. అందుకు ఆమె ప్రతిఘటించటంతో మెను తీసుకెళ్లిన యువకుడు, ఆటో డ్రైవర్ కలిసి స్వర్ణలత మెడకు కండువా చుట్టి బలవంతంగా నులిమారు. దీంతో స్వర్ణలత సృహ కోల్పోగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా ఒలుచుకున్నారు. అనంతరం వెంట తీసుకెళ్లిన పురుగుల మందును బలవంతంగా గొంతులో పోశారు. అదీ చాలదన్నట్టు ఆఖరి ప్రయత్నంగా ఆటోలో ఉన్న స్టెఫినీతో ఆమె తలపై బలమైన దెబ్బలు కొట్టారు. దీంతో స్వర్ణలత ప్రాణాలు విడిచింది. స్వర్ణలత ప్రాణాలు విడిచిందని నిర్ధారణకు వచ్చిన ఆ ముగ్గురు ఆటోలో తిరిగి భాస్కరపురం చేరుకుని ఆమె కుమారుడిని రోడ్డుపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. పోలీసుల అదుపులో హంతకులు... స్వర్ణలత హత్యలో ప్రధాన పాత్ర పోషిం చిన పాత నేరస్ధుడుని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని లకడీకాపూల్ సమీపంలో అదుపులోకి తీసుకోగా మిగిలిన కారు, ఆటో డ్రైవర్లను మరుసటి రోజు మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణలతను హత్య చేసి బంగారంతో ఉడాయించిన సదరు యువకుడు ఆ నగలు అమ్మిన డబ్బులతో కొత్త ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి దానిపై వైఫ్గిఫ్ట్ అని స్టిక్కరింగ్ చేయించుకుని హైదరాబాద్‌లో తిరుగుతుండగా రూరల్ ఎస్సై ఈశ్వర్ ఇతర సిబ్బంది పట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిపై మచిలీపట్నంతో పాటు భీమవరం ప్రాంతాల్లో సైతం పలు కేసులున్నట్లు తెలుస్తోంది. -
భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య
వరకట్నపు వేధింపులకు మరో అబల బలైంది. రైల్వే ఉద్యోగమని అధిక కట్నం ఇచ్చినా భర్త దాహం తీరలేదు. పిల్లలు పుట్టరని, అదనంగా మరో రూ.5 లక్షల కట్నం తేవాలని లేకుంటే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో మనస్తాపం చెందిన భార్య పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సుల్తానాబాద్ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన పెర్క స్వర్ణలత(28) వివాహం రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైల్వే జీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అంజయ్యతో జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వివాహ సమయంలో భారీగా కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ఏడాది క్రితం వీరికి బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో స్వర్ణతల కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులు ఆమె గర్భసంచి తొలగించారు. అప్పటి నుంచి స్వర్ణలతకు వేధింపులు మొదలయ్యాయి. పిల్లలు పుట్టే అవకాశం లేనందున అదనంగా మరో రూ.5 లక్షల కట్నం తెస్తేనే కాపురం చేస్తానని భర్త అంజయ్య వేధించసాగాడు. దీంతో బాధితురాలు సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఖాజీపేటలో విధులు నిర్వహిస్తున్న భర్తను పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. పుట్టింట్లోనే ఉన్న భార్యను శుక్రవారం కాపురానికి తీసుకెళ్తానని చెప్పిన అంజయ్య గురువారం రాత్రి ఫోన్ చేసి దూషించాడు. రెండో పెళ్లి చేసుకుంటానని తెగేసిచెప్పాడు. అడ్డుకుంటే కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. దీంతో మనస్తాపంచెందిన స్వర్ణలత శుక్రవారం క్రిమిసంహారక మందుతాగింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వైద్యం కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు తండ్రి న్యాతరి రాజయ్య ఫిర్యాదు మేరకు భర్త అంజయ్య, అత్త లక్ష్మి, మామ లింగయ్య, ఆడబిడ్డలు లత, సునీత, మమతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని డీఎస్పీ వేణుగోపాల్‌రావు, సీఐ సత్యనారాయణ, తహశీల్దార్ రమాదేవి పరిశీలించి పంచనామా నిర్వహించారు.