సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్‌ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది.
2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్‌లో విచారించారు.
ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్‌మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్ అయ్యారు.
చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు.
ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు. అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు. అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment