money exchange scam
-
కస్టడీలో ఆర్ఐ స్వర్ణలత.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ ఆర్ఐ సీఐ స్వర్ణలత, ఆమె ముఠా కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే కరెన్సీ ఎక్చేంజ్ డ్రామా ఆడినట్లు తేలింది. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకుంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంప ముంచిందని కన్నీళ్లు పెట్టుకుది. 2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న స్వర్ణలతకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో స్వర్ణలతతోపాటు మరో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్లో విచారించారు. ముందుగా సీనిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను స్వర్ణలత మభ్య పెట్టే ప్రయత్నం చేసింది. అయితే డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండంటూ సీనియర్ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో స్వర్ణలత, ఆమె గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో అధికారులు షాక్ అయ్యారు. చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మాయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నగరంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు స్వర్ణలత గ్యాంగ్ తెలిపింది. నేవీ ఉద్యోగులు రూ. 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ నగదు మార్పిడికి సంబంధించి తన వాహనంలో ఎలాంటి రూ. వేల నోట్లు తీసుకెళ్ల లేదని వెల్లడించింది. సినిమా షూటింగ్ సమయంలో ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయం అయ్యారని స్వర్ణలత తెలిపారు. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నోట్ల మార్పిడి దందాకు సిద్ధపడినట్టు అంగీకారించారు. అయితే సీజ్ చేసిన ఫోన్లలో డేటాను చూడొద్దని, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నాయని స్వర్ణలత ప్రాధేయపడ్డారు. అయినా ఆమె అభ్యర్థనలు అధికారులు పట్టించుకోలేదు. జాలిపడితే తమ జీవితాలు కాలిపోతాయని ఉన్నతాధికారులు కఠినంగా చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా స్వర్ణలత జైలులో ఉన్నా.. ఆమె భర్త అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో స్వర్ణలత భర్త పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు విశాఖలో చదువుతుండగా.. అతడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. -
ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ కాగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
నోట్ల మార్పిడి దందా కేసు: రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఇటీవల ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. కాగా, నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
నోట్ల మార్పిడి కేసు.. ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు బలవంతంగా వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురికి కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిని శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతోపాటు స్వర్ణలతను బ్యారెక్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆర్ఐతో పాటు కానిస్టేబుల్‌పై సీపీ చర్యలకు ఉపక్రమించారు. హోం గార్డు శ్రీనుదే కీలకపాత్ర ఎబ్బీ-2లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గతంలో గాజువాక, 2వ పట్టణ పోలీసు స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై పలు ఆరోపణలు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంగార్డుల ఆర్ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకొని విధులకు కూడా సరిగా హాజరుకాపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓ నేతలకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. రెండో భార్యతో కలిసి దోపిడికి ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్యామూల్ ప్రసాద్ ఇంట్లో దోపిడీకి ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప పక్కా పథక రచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటిరకు ఈ కేసులో చింతలపూడి సురేంద్రబాబు, పాత నేరస్థుడు శ్రీశైలం, దుగ్గిపోగె ఆశీర్వాదంను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు సూరి అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల నోట్లు మార్పిడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా రూ. 90 లక్షలకు సరిపడా రూ. 500 నోట్లు ఇస్తే కోటి రూపాయలకు సరిపడా 2 వేల నోట్లు ఇస్తామని చెప్పి ఇద్దరు రిటైర్డ్ నేవల్ అధికారులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లను ఓ ముఠా మోసం చేసింది. అయితే ఈ ముఠాకు ఏఆర్ ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ ఏఆర్ సీఐగా పనిచేస్తున్న స్వర్ణలత.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే బాధితులు అందించిన రూ. 90 లక్షల్లో స్వర్ణలత రూ. 15 లక్షలు నొక్కేసినట్లు తేలింది. అంతేగాక తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. తాము మోసపోయామని గ్రహించిన రిటైర్డ్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నలుగురి అరెస్ట్: విశాఖ నోట్ల మార్పిడి కేసులో నలుగుర్ని అరెస్టు చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రూ. 90 లక్షల 500 రూపాయల నోట్లకు కోటి రూపాయల రూ. 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మాజీ నేవల్ ఆఫీసర్లు నగదును తీసుకుని సీతంధర వద్ద వెళ్లారని,, ఆర్ఐ స్వర్ణలత సమక్షంలోనే డబ్బుల పంపకాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ క్రమంలో సూరీని హోం గార్డుల చేత కొట్టించి.. 12 లక్షల రూపాయలను బాధితుల వద్ద నుంచి తీసుకొని వదిలేశారని పేర్కొన్నారు. బాధితులు డీసీపీకి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట! -
WazirX: ఇండియా అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌కి ఈడీ నోటీసులు!
న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుమారు 2,790 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్పై ఉల్లంఘనలకు పాల్పడిందని వాజిర్‌ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి. వాజిర్ఎక్స్ కంపెనీ జెన్మయి ల్యాబ్స్ ప్రైవేట్ ల్యాబ్స్ లిమిటెడ్ పేరు మీద రిజిస్ట్రర్ అయ్యి ఉంది. డొమెస్టిక్ క్రిప్టోకరెన్సీ స్టార్టప్‌గా 2017లో దీనికి అనుమతులు లభించాయి. దీంతో ఈ కంపెనీ డైరెక్టర్ల పేరు మీదే ఈడీ నోటీసులు పంపింది. చైనాకు చెందిన ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల మీద అన్ని కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు చైనా నుంచి 57 కోట్ల రూపాయల విలువైన డబ్బు మన కరెన్సీలోకి మార్చేశారని, ఆతర్వాత బినాన్స్ వాలెట్లలోకి పంపించారని తేలింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరపనుంది. అంతేకాదు వజీర్ఎక్స్ సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించకుండానే.. లావాదేవీలు జరిపిందని, ఫెమా మార్గదర్శకాల్ని ఉల్లంఘించిందని ఈడీ పేర్కొంది. అభివృద్ధిలో భాగంగా క్రిప్టోకరెన్సీని ప్రొత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ ఇలాంటి స్కామ్‌లు వెలుగుచూడడం మంచిది కాదని టెక్ నిపుణులు అంటున్నారు. అయితే ఈడీ నుంచి ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని వాజిర్ఎక్స్ సీఈవో నిశ్చల్‌శెట్టి ఒక ట్వీట్ చేశాడు. చదవండి: పోర్న్ క్రిప్టోకరెన్సీ తెలుసా? -
4 వేలకు ఆశ పడితే..
హైదరాబాద్ : నాలుగు వేల రూపాయల అదనపు కమిషన్‌కు ఆశపడిన ఓ ఏజెంట్ రూ.25 లక్షలకు మోసపోయిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 35 వేల అమెరికన్ డాలర్లను తీసుకుని తెల్ల కాగితాలు ఇచ్చి అతడిని బురిడీ కొట్టించాడో ఘరానా మోసగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరాంఘర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మోహిన్ అమెరికా డాలర్లు కావాలంటూ వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని రెండ్రోజుల క్రితం పాతబస్తీకి చెందిన రఫీక్ అనే ఏజెంట్ వద్దకు తీసుకొచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి 2,700 అమెరికా డాలర్లను తీసుకుని నగదు చెల్లించాడు. మార్కెట్ రేటు కంటే అదనంగా కమీషన్ చెల్లించాడు. బుధవారం మరో 35 వేల డాలర్లు కావాలంటూ ఆ వ్యక్తి మోహిన్, రఫీక్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారం ఫోన్లో సాగింది. రఫీక్ వద్ద అంత మొత్తంలో అమెరికన్ డాలర్లు లేకపోవడంతో మరో ఏజెంట్ జాఫర్‌కు సమాచారం ఇచ్చాడు. జాఫర్ 35 వేల డాలర్లు సమకూరుస్తానని గురువారం మధ్యాహ్నం వరకు టైం తీసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి డబ్బు రెడీగా ఉందని డాలర్లు అత్యవసరంగా కావాలంటూ రఫీక్‌కు ఫోన్ చేశాడు. తాను గచ్చిబౌలిలోని కాఫీ డెల్ వద్ద కలుస్తానని సమాచారం ఇచ్చాడు. 4.30 గంటల ప్రాంతంలో రఫీక్, మోహిన్, జాఫర్లు 35 వేల డాలర్లను తీసుకుని హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే హోటల్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి.. వారి నుంచి డాలర్లను తీసుకుని రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగును వీరికి అందించాడు. డబ్బు బండిళ్లలో పైన అసలైన నోట్లు పెట్టి లోపల తెల్లకాగితాలను అమర్చాడు. డబ్బు లెక్కిద్దామని ముగ్గురూ అడగ్గా.. గుర్తుతెలియని వ్యక్తి వారిని తుపాకీతో బెదిరించి కారులో వెళ్లిపోయాడు. ముగ్గురూ కారులో నార్సింగి వచ్చి డబ్బు సరి చూసుకోగా తెల్ల కాగితాలు కనిపించాయి. మోసపోయామని గుర్తించిన జాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జాఫర్ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. మోహిన్, రఫీక్ ఎక్కడికి వెళ్లారనే దానిపై పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు జాఫర్‌ను విచారిస్తున్నారు. బాధితుడి కాల్ డేటా సేకరణ.. జాఫర్ నుంచి నార్సింగి పోలీసులు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జాఫర్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పాతబస్తీ నుంచి ఎప్పుడు వెళ్లాడు, ఎవరెవ్వరితో మాట్లాడాడు అనే విషయాలను సెల్ సిగ్నల్స్ ద్వారా సేకరిస్తున్నారు. ఓఆర్ఆర్పై నుంచి వచ్చామని జాఫర్ తెలపడంతో గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట, హిమాయత్‌సాగర్ తదితర ప్రాంతాలలోని సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాఫీ డెల్ హోటల్ సీసీ ఫుటేజీనీ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాలతోపాటు సీసీ ఫుటేజీలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి పాత నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంగోలులో నోట్ల మార్పిడితో ఘరానా మోసం!
-
ఒంగోలులో నోట్ల మార్పిడితో ఘరానా మోసం!
ఒంగోలు : నోట్ల మార్పిడి చేస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒంగోలు ట్రంక్‌రోడ్డులోని శర్వణా ఫ్యాన్సీ స్టోర్స్‌లో ఈ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే...ఫ్యాన్సీ షాపు యజమాని శ్రీనివాస్‌రావు మధ్యవర్తిగా వ్యవహారిస్తూ నోట్ల మార్పిడి దందాను నడిపిస్తున్నాడు. అందులో భాగంగా రూ.25 లక్షల కొత్త కరెన్సీకి రూ.29 లక్షలు పాత కరెన్సీ ఇప్పించేందుకు ఒప్పందం కుదిర్చాడు. దీంతో నాలుగు లక్షలు వస్తాయన్న ఆశతో కనిగిరికి చెందిన శేషగిరి అనే వ్యక్తి రూ.25 లక్షల కొత్త కరెన్సీని ఫ్యాన్సీ షాపు యాజమాని శ్రీనివాసరావుకు ఇచ్చాడు. అనంతరం రూ.29 లక్షలు ఇస్తానన్న శ్రీనివాస్ అనే వ్యక్తి బ్యాగ్‌లో పాత నోట్లు ఉన్నాయంటూ బ్యాగ్ ఇచ్చి కారులో ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ తెరిచి చూస్తే అందులో న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న శేషగిరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి అంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందనే అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం శేషగిరి, మధ్యవర్తి శ్రీనివాసరావుని పోలీసులు విచారిస్తున్నారు. పరారైన శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.