సాక్షి, విశాఖపట్నం: ఆర్‌ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్‌స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు.
చదవండి: ఆర్‌ఐ స్వర్ణలతకు మరో షాక్
కాగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్‌ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్‌గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు.
చదవండి: ఆర్‌ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment