New twist
-
వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత నిఘా విభాగం ‘రా’మాజీ అధికారి అని అమెరికా ఆరోపిస్తున్న వికాస్ యాదవ్(39) వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను అమెరికా గడ్డపై హత్య చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్‌పై అమెరికా దర్యాప్తు అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్‌ను సహ కుట్రదారుడిగా చేర్చారు. అయితే, ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో గత ఏడాది డిసెంబర్ 18న వికాస్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడికి బెయిల్ లభించిందని వెల్లడించాయి. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారిని అపహరించి, డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట వికాస్ బెదిరించాడని వివరించాయి. స్పెషల్ సెల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో 2023 డిసెంబర్ 11న తనను కలవాలని వ్యాపారవేత్తకు వికాస్ సూచించాడు. కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దాంతో బాధితుడు తన మిత్రుడితో కలిసి వికాస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వికాస్ వెంట అబ్దుల్లా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వికాస్, అబ్దుల్లా కలిసి వ్యాపారవేత్తను ఓ కారులోకి బలవంతంగా ఎక్కించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులమని చెప్పారు. ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నారు. తర్వాత వదిలేశారు. ఈ విషయం బయట చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉంచిన రూ.50 వేల నగదును వికాస్, అబ్దుల్లా తీసుకున్నట్లు బాధితుడు గుర్తించాడు. సీసీటీవీ రికార్డింగ్‌లు సైతం తొలగించినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వికాస్ యాదవ్, అబ్దుల్లాపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 13న వికాస్‌పై చార్జిïÙట్ దాఖలు చేశారు. కోర్టు అతడికి మార్చి 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 22న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. వికాస్ యాదవ్ మాజీ ప్రభుత్వ అధికారి అని బెయిల్ ఆర్డర్లో కోర్టు పేర్కొంది. అయితే, అమెరికా దర్యాప్తు అధికారులు తమ అభియోగాల్లో వికాస్‌ను భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసే అధికారిగా ప్రస్తావించారు. వికాస్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. కానీ, అతడు ప్రభుత్వ అధికారి కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ స్పష్టంచేశారు. ఖలిస్తాన్ ఉద్యమం ఆగదు: పన్నూ వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపడంపై గురు పత్వంత్‌సింగ్ పన్నూ తాజాగా ‘ఎక్స్’వేదికగా స్పందించాడు. అమెరికా పౌరుడి జీవితాన్ని, స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాలన్న ప్రాథమిక రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో అమెరికా ప్రభుత్వం మరోసారి అంకితభావం చూపిందని ప్రశంసించాడు. స్వదేశంలో గానీ, విదేశాల్లో గానీ అమెరికా పౌరుడి ప్రాణాలను అమెరికా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పాడు. వికాస్ యాదవ్ ఒక మధ్యశ్రేణి సైనికుడు అని వెల్లడించాడు. పన్నూను హత్య చేయాలంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు ‘రా’చీఫ్ సామంత్ గోయెల్ నుంచి వికాస్ యాదవ్‌కు ఆదేశాలు అందాయని ఆరోపించాడు. ఖలిస్తాన్ రెఫరెండమ్ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందులో భాగంగానే తనను అంతం చేయాలని కుట్ర పన్నారని విమర్శించాడు. తనపై ఎన్ని హత్యాయత్నాలు జరిగినా ఖలిస్తాన్ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పాడు. భారత్‌లో ప్రత్యేక సిక్కు దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతానని, ఇందులో భాగంగా నవంబర్ 17న న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు. భారత్‌కు ఇబ్బందులేనా? ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే కెనడా, భారత్ మధ్య దూరం పెరుగుతోంది. తమ దేశ పౌరుడైన నిజ్జర్‌ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. మరో ఉగ్రవాది పన్నూ హత్యకు జరిగిన కుట్ర కేసులో భారతీయుడైన వికాస్ యాదవ్‌పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం మున్ముందు భారత ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వికాస్ యాదవ్‌న తమకు అప్పగించాలని అమెరికా అధికారులు ఇంకా భారత్‌ను కోరలేదు. తమ భూభాగంలో తమ పౌరుడిని(పన్నూ) హత్య చేయడానికి కుట్ర చేసిన వారిని వదిలిపెట్టబోమని అమెరికా అత్యున్నత స్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. -
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
లావణ్య-రాజ్ తరుణ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్
-
హిమాచల్ రాజకీయ సంక్షోభంలో కీలక ట్విస్ట్
-
సీసీటీవీ ఫుటేజ్ మాయం..డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
మంచింగ్ కోసం బోటులో ఉప్పు చేప ఫ్రై చేయడం కారణంగానే మంటలు
-
చంపాపేట్ లో స్వప్న హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్‌ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్‌ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్‌లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్‌పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చేసుకుంది. పెద్దమ్మ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ సంబంధం వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో సహా సంపులో పడి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు బొబ్బిలి నుంచి విశాఖ రాగా, విశాఖ వచ్చిన పెద్దమ్మ పార్వతీ వేధింపులు ఆగలేదు. సంధ్య భర్తను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఆర్ఐ స్వర్ణలత నోట్లు మార్పిడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నోట్ల మార్పిడి పేరుతో రిజర్వు ఇన్స్పెక్టర్ బి.స్వర్ణలత గ్యాంగ్ విశ్రాంత నేవీ అధికారులను బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు 90 లక్షలు ఎవరివి ఎక్కడవి అనే దానిపై స్పష్టత రాలేదు. రిమాండ్ రిపోర్ట్‌లో సైతం 90 లక్షల గురించి ప్రస్తావన లేదు. రూ 12 లక్షలతో కేసు ముగించారు. ఈ రోజు నిందితులను కస్టడీకి పోలీసులు కోరనున్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ కాగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతకు మరో షాక్ తగిలింది. 'ఏపీ 3'లో సీఐ స్వర్ణలత హీరోయిన్ కాదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని..ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లహరి హీరోయిన్గా చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు తమ సినిమాలోనివి కాదన్నారు. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. -
హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే, అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా, ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో.. ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె ఆ బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది.. నిన్నటి వరకు తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా పోలీసులు తేల్చేశారు. అతనితో కలిసి వెళ్లి.. బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్‌లో ఇరువురు ఫొటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద రాగా.. అతనితో కలిసి వెళ్లింది. చదవండి: నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి.. ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అసలు నాటకం అక్కడే మొదలైంది.. ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. తప్పించుకుని వచ్చానని తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ బాలికకు ధైర్యం చెప్పి.. పోలీసులకు సమాచారం అందించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. విచారణలో అసలు నాటకం బయటపడింది. చదవండి: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్! -
HYD: తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. చేతిపై ఏం రాసి ఉంది?
సాక్షి, హైదరాబాద్: తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. గత కొంత కాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్న తల్లి, కూతురు కరోనా సమయం నుంచి బయటికి రావడం లేదు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు అలివేలు.. భర్తనుదూరంగా పంపించింది. భర్త సదానందానికి రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపించింది. కూతురు చేతిపై ‘Do Something That Make You Happy’ అని రాసింది. ‘The Game Is Started’ అని గోరింటాకుతో రాసుకున్న తల్లీకూతుళ్లు.. ఆత్మహత్యకి ముందు.. ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఇదే విషయంపై కొడుకుతో వాగ్వివాదం జరిగింది. ఉద్యోగం మానేసిన భర్త సదానందం.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. చదవండి: ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. రెండేళ్లగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇంటి పక్కన వాళ్లతో కూడా మాట్లాడటం లేదు.. ఆత్మహత్యకి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు.. ఎందుకు అని బాబు అడిగితే.. చిన్న పిల్లాడివి.. నీకేం తెలియదు అంటూ తల్లి మందలించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీఐ వెల్లడించారు. -
రాజేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
-
రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాదం ఘటనలో కొత్త ట్విస్ట్
-
హైదరాబాద్ వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం
-
వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. డైరీలో షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా హవాలా లింక్స్ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా.. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
-
ఢిల్లీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
-
అటు ఈడీ ఇటు సీబీఐ.. జంక్షన్ లో బీఆర్ఎస్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్‌స్టా బయోలో తాను సూపర్‌వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్‌వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ..