
( ఫైల్ ఫోటో )
సాక్షి, మేడ్చల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు.
చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?
తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment