Conspiracy to murder
-
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు..
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ గత వారం అమెరికాకు అప్పగించింది. గుర్తు తెలియని భారతీయ అధికారి ఆదేశాల మేరకు కెనడా, అమెరికా ద్వంద పౌరసత్వమున్న పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు నిఖిల్ గుప్తా కిరాయి హంతకుడికి డబ్బులిచి్చనట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రభుత్వ వినతి మేరకు చెక్ రిపబ్లిక్లో ఉన్న నిఖిల్‌ను అక్కడి ప్రభుత్వం గత ఏడాది అరెస్ట్ చేసింది. అయితే, అమెరికా ఆరోపణలను భారత్ ఖండించింది. నిఖిల్ ప్రస్తుతం అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్
సాక్షి, మేడ్చల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా? తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ప్రమాద ఘటనలో కుట్ర కోణం.. పోలీసులను ప్లాన్ ప్రకారమే చంపేశారా?
సాక్షి, చిత్తూరు జిల్లా: పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్ ప్రకారం డ్రగ్స్ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. చదవండి: అశ్లీల వీడియో తీసి వెబ్‌సైట్‌కు అమ్మాడు.. సమాజంలో... బెంగళూరు శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గంజాయి డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు జిల్లాకు వచ్చిన పోలీసులను ప్లాన్ ప్రకారం హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి మునిరత్నం ఆరా తీశారు. చిత్తూరుకు వచ్చిన మంత్రి.. మృతులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ దీక్షిత్, కానిస్టేబుల్ శరవణ బసవను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక హోం మంత్రి దృష్టికి ఈ విషయాన్ని మునిరత్నం తీసుకెళ్లారు. -
నేతలను చంపేందుకు కుట్ర
న్యూఢిల్లీ/చండీగఢ్: తమ నేతలను చంపేందుకు, ట్రాక్టర్ పరేడ్‌ను భగ్నం చేసేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ రైతులు పట్టుకున్న ఓ వ్యక్తిని హరియాణా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సింఘు సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు సదరు వ్యక్తిని పట్టుకుని శుక్రవారం రాత్రి మీడియాకు చూపారు. రిపబ్లిక్ డే రోజు పోలీసు మాదిరిగా లాఠీ పట్టుకుని రైతు సంఘాలు చేపట్టే ట్రాక్టర్ పరేడ్‌లో లాఠీ చార్జి చేయాలంటూ తోటి వారు తనకు చెప్పారని ఆ యువకుడు మీడియాకు వెల్లడించాడు. ట్రాక్టర్ పరేడ్ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపేందుకు కూడా పథకం వేసినట్లు అతడు చెప్పాడు. శనివారం ఆందోళనల్లో పాల్గొంటున్న నలుగురు రైతు సంఘాల నేతలను కాల్చి చంపాలని పథకం వేసినట్లు తెలిపాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు నేత కుల్వంత్ సింగ్ సంధు ఆరోపించారు. కాగా, ట్రాక్టర్ పరేడ్‌కు భగ్నం కలిగించేందుకు కుట్ర జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని హరియాణా పోలీసులు తెలిపారు. సోనిపట్ ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రన్‌ధావా శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సింఘు వద్ద రైతులు అప్పగించిన వ్యక్తిని సోనిపట్‌కు చెందిన యోగేశ్ రావత్(21)గా గుర్తించామన్నారు. తమను వేధిస్తున్నాడంటూ రైతు వలంటీర్లు తీవ్రంగా కొట్టడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అతడు అబద్ధాలు చెబుతున్నట్లు తేలిందన్నారు. యోగేశ్ వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, మారణాయుధాలు కానీ లభ్యం కాలేదన్నారు. ట్రాక్టర్ పరేడ్‌కు గ్రీన్ సిగ్నల్ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్, సింఘు, తిక్రిల నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారు కావాల్సి ఉందని రైతు నేత అభిమన్యు కొహార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 5 మార్గాల ద్వారా రాజధానిలోకి ప్రవేశించే ట్రాక్టర్ పరేడ్‌లో సుమారు 2 లక్షల మంది పాల్గొంటారని మరో నేత గుర్నామ్ సింగ్ చదుని చెప్పారు. ఇందుకోసం 2,500 మంది వలంటీర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఈ నెల 26వ తేదీన పోలీసులు తొలగించనున్నారు. -
హద్దులు దాటిన హత్యా రాజకీయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవిపై హత్య కుట్ర శుక్రవారం వెలుగుచూడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ నేతల అక్రమాలపై పోరాటం చేస్తున్న నాయకుడిని ప్రత్యర్థులు మట్టుబెట్టాలని పథకం రచించడం, దానిని పోలీసులు సకాలంలో ఛేదించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అక్రమ మైనింగ్ వెలుగులోకి.. మొదలవలస చిరంజీవి వైఎస్సార్ సీపీలో చేరిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు పొందారు. 2018 ఆగస్టు 29న రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో వైఎస్సార్ సీపీ క్యాడర్ తయారు చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. పార్టీలో క్రియాశీలంగా ఉంటూనే మరోవైపు టీడీపీ నేతల అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చారు. పొరుగునే ఉన్న ఎస్ఎంపురం గ్రామానికి చెందిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు ఇదే గ్రామంలోని పెద్దచెరువులో చేసిన అక్రమ మైనింగ్ (కంకర అమ్మకం), చిలకపాలెంలో టీడీపీ నాయకుడు గాడు సన్యాసి అక్రమ మైనింగ్‌పై గనుల శాఖకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేలా పోరాడారు. టీడీపీ పాలనలో కార్పొరేషన్ రుణాలు, రోడ్డు నిర్మాణాలు వంటి అక్రమాలపై సమాచార హక్కు చట్టం ద్వారా పోరాటం చేశారు. మరోవైపు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ సామాజిక ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ పాలనలో చిరంజీవిపై వ్యక్తిగత కక్షలు కొనసాగాయి. రౌడీ షీట్ ప్రారంభం, పీడీ యాక్టు ప్రయోగం చేశారు. అయితే స్వతహాగా న్యాయవాది అయిన చిరంజీవి చట్టపరంగా వాటిని ఎదుర్కొన్నారు. పీడీ యాక్టు కమిటీ ముందు యాక్టు ప్రయోగ నిబంధనలు, వ్యక్తిగత కక్ష కోణాన్ని పక్కాగా ఆవిష్కరించటంతో సమీక్ష కమిటీ నెల రోజుల్లో విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు వ్యూహరచన.. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు కొన్నినెలలుగా ఫరీదుపేట బయట ఉంటూనే చిరంజీవి హత్యకు వ్యూహరచన చేశారు. దీనిని గుర్తించిన చిరంజీవి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ కొత్తకోట అమ్మినాయుడు, సువ్వారి తేజేశ్వరరావు, పక్క గ్రామమైన ఇబ్రహీంబాద్‌కు చెందిన కిల్లి ప్రకాష్ తదితరులపై ఎచ్చెర్ల పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉన్న చిరంజీవిని చివరకు ఇంటి వద్దే హత్యచేసేందుకు ప్రత్యర్థులు వ్యూహరచన సిద్ధం చేశారు. ఈ ప్రణాళికంతా విశాఖపట్నం కేంద్రంగా జరగటం, కాశీబుగ్గకు చెంది రౌడీషీటర్ సహకారం తీసుకోవటం, హత్యా నేరంలో పాల్గొనేందుకు రెక్కీ నిర్వహించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొందరు పోలీస్స్టేషన్లకు వచ్చి సకాలంలో సంతకాలు చేయకపోవటం, తరచూ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రాకపోకలు సాగించడం వంటి అంశాలు గుర్తించారు. ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో హత్యాప్రయత్నం కోణం బయటకు వచ్చింది. ప్రస్తుతం జరిగిన దాడి కుట్రకు సంబంధించి ఫరీదుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు పట్టుబడితే పోలీసుల విచారణలో పూర్తి వాస్తవాలు బయటపడే అవకాశముంది. పలాసలో కలకలం కాశీబుగ్గ: వైఎస్సార్ సీపీ నేత మొదలవలస చిరంజీవిపై హత్యకు కుట్ర పన్నిన వారిలో పలాసకు చెందిన రౌడీషీటర్ బోనెల పరమేష్‌ను విశాఖ పోలీసులు అరెస్టు చేయడంతో పలాసలో కలకలం రేగింది. నేరచరిత్ర కలిగిన పరమేష్‌ను పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా వారి బంధువులను, స్నేహితులను విచారించినట్లు తెలిసింది. ఇప్పటికే అంబుసోలి గ్రామంలో ఇంటెలిజెన్సీ ఎస్ఐ, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పూర్తి సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. పరమేష్ గతంలో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడ్ని నాటుతుపాకీతో బెదిరించిన కేసులు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన పరమేష్ పలాస పరిసర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాపట్నం జిల్లాల్లో ఆర్థిక నేరాలకు కూడా పాల్పడినట్లు తెలిసింది. ఇదే విషయమై కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు వద్ద ప్రస్తావించగా పరమేష్‌పై కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో 2002లో రౌడీషీట్ తెరిచి ఉందన్నారు. రెండు హత్యాయత్నం, ఒక చోరీకి, రెండు దాడి కేసులున్నాయని చెప్పారు. పరమేష్ తమ్ముడు బోనెల గోపిపై కూడా రౌడీషీట్ తెరచి ఉందని తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేత చిరంజీవి హత్యకు కుట్ర
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ నాయకుడు చిరంజీవి హత్య కుట్రను విశాఖ పోలీసులు ఛేదించారు. ఈ హత్య కుట్రలో టీడీపీ ఎంపీటీసీ అమ్మినాయుడు ప్రధాన నిందితుడిగా తేలింది. తనకి రాజకీయంగా అడ్డు వస్తున్నాడనే కక్షతో చిరంజీవి హత్యకు అమ్మినాయుడు కుట్ర పన్నినట్లు బయటపడింది. ఇందులో భాగంగా విశాఖకు చెందిన రౌడీషీటర్ కన్నబాబుకు సుపారీ ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో కన్నబాబు గ్యాంగ్ పై గతంలో అనేక కేసులున్న వైనం బయటపడింది. రాజకీయ ప్రత్యర్ధిని అంతమొందించాలనే కుట్రతో టీడీపీ నేత అమ్మినాయుడు సుపారీ గ్యాంగ్ తో 50 లక్షలకి డీల్ కుదుర్చుకున్నారని.. అడ్వాన్స్ గా 4 లక్షలు చెల్లించారని విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కత్తులు, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రెండు సార్లు రెక్కీ నిర్వహించడంతో పాటు చిరంజీవి హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇదే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు అమ్మి నాయుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. -
నా హత్యకు కీలకమంత్రి కుట్ర
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి నా హత్యకు కుట్ర పన్నారు..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విజయవాడకు చెందిన రౌడీషీటర్‌తో హత్యచేయించేందుకు పథకం రచించారు.. ఇందుకోసం రూ.5 కోట్లతో మంత్రి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ముందడుగు ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది జె.శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శ్రవణ్‌కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఐటీ కంపెనీల్లో రూ.25 వేల కోట్ల అవినీతి జరిగిందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యక్తిగత ఆస్తుల మీద సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తాను హైకోర్టులో గత నెలలో పిల్ వేశామని చెప్పారు. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు అసాంఘిక శక్తులతో కలిసి ప్రభుత్వం కుట్రపన్నినట్లు సమాచారముందన్నారు. ఈ విషయమై బుధవారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. విచారణ జరిపించి, తనకు రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్ అదనపు డెప్యూటీ జనరల్‌ను కోరానన్నారు. తనకు ఏదైనా హాని జరిగితే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాగా, న్యాయపోరాటంలో భాగంగా భవిష్యత్‌లో చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పూర్తి ఆధారాలు సేకరించి, హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. -
దీదీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోల్‌కతా : తనను హతమార్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ‘ నన్ను చంపేందుకు ఓ రాజకీయ పార్టీ సుపారీ ఇచ్చింది..వారు నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు..వేరే ఇంటిలోకి మారాలని పోలీసులు నాకు సూచించా’రని మమత చెప్పారు. గతంలోనూ తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆమె పేర్కొన్నారు. తాను విశ్వసనీయ సమాచారమే వెల్లడిస్తున్నానని, సదరు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తక్షణమే తనను ప్రభుత్వ బంగళాలోకి మారాలని కోరారన్నారు. మమతా బెనర్జీ ఇప్పటికీ ఒకే అంతస్తు కలిగిన ఇంటిలో నివసిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ప్రధాన సమస్యలను విస్మరించి తనను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా 12,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మత ఘర్షణలు పెచ్చుమీరుతున్నాయని వీటిపై కాంగ్రెస్, సీపీఎంలు కనీసం నిరసన కూడా తెలపడం లేదని విమర్శించారు. బీజేపీ దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోందని, సీపీఎం, కాంగ్రెస్ సైతం హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు గతంలోనూ రామనవమిని జరుపుకున్నా ఆయుధాలు చేతబట్టలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా ప్రాంతీయ పార్టీలు సైతం బలీయమైన శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా ఉంటాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. -
డోన్ మండలంలో బాంబుల కలకలం
డోన్: కర్నూలు జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత మహానందిరెడ్డి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మహానందిరెడ్డి గతంలో గ్రామంలో జరిగిన ఒక హత్య కేసు నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను హతమార్చేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బాంబులతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
జైలులో నా భర్త హత్యకు కుట్ర
డీయూ ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత సాక్షి, న్యూఢిల్లీ:‘‘ నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉన్న నా భర్తను హత్య చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఆయనకు పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదు. మందులు, వైద్యసేవలు అందించడం లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి’’ అని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత విన్నవించారు. సాయిబాబాను జైలు నుంచి విడిపించడానికి మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులతో కలసి వసంత గురువారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యహింసలో భాగంగా జుడీషియల్ కస్టడీలో ఉన్న తన భర్తను భౌతికంగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాను సంఘవిద్రోహకుడిగా చిత్రీకరించి ఏడాది క్రితం అరెస్టు చేసి నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకూడదని సీఆర్పీసీ సెక్షన్ చెబుతోందని కానీ, దానిని ఉల్లంఘించి సాయిబాబాను జైలు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన మానవ హక్కుల కమిషన్లు అధికారపక్షం చేతిలో పతనమయ్యాని విమర్శించారు. సాయిబాబా బెయిలుపై విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సాయిబాబా తల్లి సూర్యావతి మాట్లాడుతూ ఆదివాసీల బాగుకోసం పనిచేసిన తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. సామాజికవేత్త అరుంధతిరాయ్, డీయూ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాపై ప్రభుత్వం కక్షకట్టిందని చెప్పారు. ఊచకోతలు, హత్యలు, కరుడుకట్టిన నేరస్తులు దర్జాగా బెయిల్‌పై బయట తిరుగుతుండగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాకు బెయిల్ ఇవ్వకపోవడం మానవహక్కులను కాలరాయడమేనని విమర్శించారు.